27, నవంబర్ 2011, ఆదివారం

గౌతమి

వెలిగింది  నా  ప్రాణ  దీపం   పాట       "గౌతమి "  చిత్రం గుర్తుందా? ఒకప్పుడు మనమందరం ప్లాస్టిక్ సర్జరీ గురించి కొత్తగా చెప్పుకునే కాలంలో.. గౌతమి నర్మద గా   మారి తనని చంపి తనపేరిట ఉన్న ఆస్తిపాస్తుల్ని కైవసం చేసుకోవాలనుకున్న వారి భరతం పట్టిన వైనం ఆ చిత్రం లో చూడ వచ్చు.


మనకి ఇప్పుడైతే  సీరియల్స్ లో తెల్లవారేటప్పటికే రూపాలు మారిపోయి కొత్త ముఖాలని ఆమోదిస్తూ.. ప్లాస్టిక్ సర్జరీని జీవితంలో కూడా  అత్యంత ఆమోదయోగ్యం చేసుకుని  చప్పిడి ముక్కులని ,వంకర పెదవులని తీర్చి దిద్దుకోవడం అలవాటు అయిపోయినది కానీ ఆ "గౌతమి " చిత్రం నాకైతే యెంత బాగా నచ్చిందో! కథ కాదు కానీ ఆ చిత్రంలో ఓ..పాట..అంతే! వెలిగింది నా ప్రాణ దీపం అనే పాట. గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ౧౯౮౭ లో వచ్చిన ఈ చిత్రానికి క్రాంతి కుమార్ దర్శకత్వం  వహించారు. .

ఈ పాటని వింటూ సాహిత్యం చూడండి.. యెంత బాగుంటుందో! నినిద భారతిలో.. కృష్ణవేణి రెయిన్ బో ఎఫ్.ఏం లో..నేను తరచూ వింటూ ఉంటాను.. నాకు నచ్చిన పాట ఇది.

వెలిగింది   నా   ప్రాణ   దీపం 

చీకటి కాటుక కాగాలు చెంపలు వాకిట రాసిన కన్నీటి అమవాసలో 
చిగురాశల వేకువ రేఖలు కెంపులు ముగ్గులు వేసిన నీ చూపు కిరణాలలో 
వెలిగింది నా ప్రాణ దీపం 
జన్మంతా  నీపూజ   కోసం 
నీ  నీడ దేవాలయం మది నీకు నీరాజనం 
ప్రతి అణువు పూల హారం (వె)

నలుపైన మేఘాలలోనే ఇలా నిలిపేటి జలధార లేదా? 
వసివాడు అందాలకన్నానీ సుగుణాల సిరి నాకు మిన్న (వ)
తీయని ఊహల తీరం చేరువ చేసిన  స్నేహం
ఏనాటి సౌభాగ్యమో (వె) 

నూరేళ్ళ బ్రతుకీయమంటూ ఆ దైవాన్ని నే కోరుకుంటా (నూ)
ప్రతిరోజు విరిమాల చేసి నీ పదాలు అర్పించుకుంటా (ప్ర)
మాయని మమతల తావులు నిండిన జీవన వాహిని 
ప్రతి రోజు మధుమాసమే (వె) 

youtube లో పాటను చూడవచ్చు . 

4 కామెంట్‌లు:

తెలుగు పాటలు చెప్పారు...

దన్యవాదములు వనజవనమాలి గారు నాకు ఈ పాట చాలా ఇష్టం

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

ఇంత మంచి lyrical Values ఉన్న ఈ గీతాన్ని
వినటం ఇదే ప్రథమం, మీరు embed link mail chesanu adi పై post లోనే paste చేయగలరు
ఒకేసారి వింటూ సాహిహ్యం చూస్తే బాగుంటుంది !!
downloading అంటే అందరకి సాధ్యపడక పోవచ్చేమో కదా !!
మంచి post కు అభినందనలు :)

?!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మంచి సినిమాను గుర్తు చేశారు..
మంచి పాటను పరిచయం చేశారండీ..

సుభ/subha చెప్పారు...

Nice song andii..ippudE vinadam paatani.