21, నవంబర్ 2011, సోమవారం

"వనజ వనమాలికి " కి .. ఓ.. సంవత్సరం

సరిగ్గా ఓ.. సంవత్సరం క్రిందట ఇదే రోజు ..నేను ఓ..కొత్త లోకంలో అడుగు పెట్టాను. ఆ లోకం అందమైనదే కాదు..విజ్ఞాన,వినోద,ఆలోచనాహ్లాద భరితమైన లోకం. నేను ఇలా వస్తానని అనుకోలేదు. నా రేడియో ఫ్రెండ్ ఒకరు మా ఇంటికి వచ్చి ఇలా వాకిలి తెరుచుకుని  గూగులమ్మ ఇంట్లో అడుగు పెట్టి తన బ్లాగ్ చెక్ చేసుకుంటున్నారు. ఏమిటది ..ఆసక్తిగా అడిగాను.బ్లాగ్.. అని ..ఓ..లోకం. మీరు ..బ్లాగర్ కావచ్చుగా అంది. దానికేం భాగ్యం !? ఓపెన్ చేయండి..అన్నాను. తన స్వహస్తాలతో.. బ్లాగ్ ఓపెన్ చేసారు.  బ్లాగ్  పేరు కోసం నేను అనుకున్న రెండు పేర్లు లభ్యం కాలేదు. ఇక  ఆలోచించవద్దు,వెనుకాడ వద్దు ..పెట్టేయండి నా పేరు తో..అన్నాను నా ఆర్.జే ఫ్రెండ్ తో..

వెంటనే "వనజ వనమాలి" పేరు ఖరారు అయిపొయింది. ఎంత గట్స్ ఉంటే మాత్రం  మీ పేరు తోనే మీ  బ్లాగ్ నేమ్ + యు ఆర్ ఎల్  పెట్టుకుంటారు. క్లిక్ అవదేమో అన్నారు కొంచెం అనుమానంగా.నేనైతే ఒకసారి ఒక అడుగు ముందుకు వేస్తే..వెనుకడుగు వేసే అలవాటే లేదు కాబట్టి..అసలు పునరాలోచించే పనే  లేదు.ఉండనీ అలాగే ..అన్నాను.  అలా నా బ్లాగ్ పేరు స్థిరపడింది.  ఆమె నాకు బ్లాగ్ లో పోస్ట్  ఎలా వ్రాయాలో చూపి తను వెళ్ళిపోయారు.   ఆ రోజు ఈ రోజు అన్నమాట. 21 -11 -2010 .

ఇక నా ప్రతాపం అంతా చూపిస్తూ.. ముందుగా నా కవితలు వ్రాసుకుని పోస్ట్ చేసాను. నాకు అసలు ఇంటర్నెట్ క్రొత్త.
మా అబ్బాయి తను యుఎస్ వెళ్ళే రోజు  skype ఓపెన్   చేసి  ఇచ్చి ఆన్ లైన్ చాట్ లోకి రామ్మా..నేను కనబడతాను. చక్కగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి వెళ్ళాక ..అది ఒకటి మాత్రం నేర్చుకుని.. అప్పుడప్పుడు సాంగ్స్ ప్లే చేసుకుని వినడమే తెలుసు. కానీ ఇప్పుడు  బ్లాగ్  లోకం లోకి వచ్చానా.. అ .ఆ ..ఇ..ఈ లు కూడా రాని నేను ఏకంగా పోస్ట్లు వ్రాయడం గమ్మత్తుగా అనిపించింది.తెలుగు భాషని చూసి చాలా సంతోషము వేసింది.

మొదటగా "తెలుగు కళ" గారి బ్లాగ్ చూసాను. తర్వాత భూమిక సత్యవతి గారి బ్లాగ్ చూసాను.  నా అదృష్టం అక్కడ నుండే మొదలైంది. అన్నీ  అక్కడ నుండే నేర్చుకోవడం మొదలెట్టాను. హారం,సమూహం,జల్లెడ,కూడలి గురించి తెలుసుకుని .. సంకలినిల  ద్వారా.. బ్లాగర్స్   అందరికి కొంచెం పరిచయం కావడానికి దాదాపు మూడు నెలలు పట్టింది.
మొదట మూడు నెలలు ..నేను వ్రాసిన కవితలు,నాకు నచ్చిన పాటలు ఇవే పోస్ట్ చేసాను. ఇవి బ్లాగర్ల దృష్టికి అందక పోవడం నిరాశ కల్గి.. నాలో ఉన్న మరో కోణం బయటి తీశాను.అలా నా పోస్ట్ లు కొందరైనా చదవడం మొదలైంది.
ఇలా బ్లాగ్ వ్రాయడం లింక్లు ఇవ్వడం ఏమి తెలియని నేను అన్నీ ఎవరు నేర్ప కుండానే స్వయంగా నేర్చుకోవడం కోసం ఆరు నెలలు సమయం పట్టింది. నాకు నేర్చుకోవడం అన్నది చాలా ప్రహసనం అయింది. నాకు ఇంగ్లిష్ అంతగా రాదు.అయినా సరే నాకున్న అతి తక్కువ తీరిక సమయంలో అన్నీ శ్రద్దగా నేర్చుకుని ..ఫిబ్రవరి నెల నుండి లైవ్ ట్రాఫిక్ ఫీడ్,అమేజింగ్ కౌంటర్ సెట్టింగ్స్ అమర్చుకుని ఒక  బ్లాగర్  గా నా బ్లాగ్ ని ఎంత మంది వీక్షిస్తున్నారో సమీక్షించు కుంటున్నాను. . ఫిబ్రవరి నెల నుండి  దాదాపు 15 ,400  పై చిలుకు బ్లాగర్ ఫ్రెండ్స్ నా బ్లాగ్ ని దర్శించి,దగ్గర దగ్గర 30 ,000  పేజీలు  వీక్షించారు. 500  వందలు కామెంట్స్ ఇచ్చారు. ఓన్లీ  కామెంట్స్ మాత్రమే నండీ..! కామెంట్స్ ఇచ్చే చోట చాట్ మాత్రం చేయలేదండీ! నేను కామెంట్స్ ఇచ్చిన వారందరికీ ధన్యవాదములు కూడా చెప్పలేక పోయినా అందరు స్పందించడం మాత్రం మానలేదు. వారందరికీ  .. హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపు కుంటూ..నాకు విలువైన సూచనలను  ఇచ్చిన మిత్రులందరికీ.. నన్ను ప్రోత్శాహించిన మిత్రులందరికీ ..హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ..


అలాగే నాకు ఫాలోయెర్స్ గా  వచ్చిన మిత్రులందరికీ మరీ మరీ ధన్యవాదములు తెలుపుకుంటూ.. ఫాలోయెర్స్ గాడ్జెట్ కనబడకుండా ఉన్నందుకు నేను ఏమి చేయలేను.. ఆ గాడ్జెట్ ను నేను తొలగించలేదు. కొంత మంది బ్లాగరల గాడ్జెట్   ప్రయోగం లో ఉన్నదని  బ్లాగర్స్  నిర్వహణ అధిపతులు తెలియజేయడం జరిగింది.అందుమూలంగా.. ఫాలోయెర్స్  గాడ్జెట్ నా  బ్లాగ్లో కనబడుట లేదు..అని మనవి చేస్తూ..

సంవత్సర కాలంగా..నా ఆలోచనలని మెచ్చి నన్ను ఆదరించిన వారికి, అలాగే.. నా ఆలోచనలు, నా భావాలు నచ్చక పోయినా నా బ్లాగ్ ని దర్శించి సహేతుక విమర్శలు చేసిన వారందరికీ .. నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ.. నా బ్లాగ్ ని వీక్షకుల దరికి చేర్చిన అగ్రిగ్రేటర్స్ కి  మరీ మరీ ధన్యవాదములు తెలుపుతూ..

నాలో ఉన్న నన్ను వెలికి తీసిన నా ప్రియ నేస్తం .. అదేనండీ ..  నా బ్లాగ్.."వనజ వనమాలి" నా లోకం లో.. నాకొక కొత్త నేస్తం అయిన "వనజ వనమాలికి " కి ఓ.. సంవత్సరం నిండిన సందర్భంగా..                                                                      విషెస్ ని చెప్పుకుంటూఇక పై కూడా.. నన్ను  నేను  అనుక్షణం తీర్చి దిద్దుకుంటూ ... ఎన్నో.. చెప్పాల్సినవి మిగిలి ఉన్నాయి ..అలాటి  నా ఆలోచనలని, అభిప్రాయాలని, నా ఇష్టాలని .. మీ అందరితో.. పంచుకుంటూ..  బ్లాగ్ ప్రయాణం  సాగించగలనని ఆశిస్తూ..  బ్లాగ్ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములతో..
                           
                             
                                                                వనజ వనమాలి 

18 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

మీ పాటల అభిరుచి చాల బాగుంటుంది. ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన అభినందనలు, శుభాకాంక్షలు.
రామకృష్ణ

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

మీ బ్లాగ్‌ తొలి జన్మదినం సందర్భంగా నా అభినందనలు :)

మీ బ్లాగ్ ఇంకా ఎన్నెన్నో అలరించే విషయాలు రాయాలని ఆశిస్తున్నాను.

subha చెప్పారు...

మీ బ్లాగుకి జన్మదిన "సుభా" కాంక్షలండీ..ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనీ ఆశిస్తూ...

రాజి చెప్పారు...

మీ బ్లాగ్ కి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు వనజవనమాలి గారు..

జయ చెప్పారు...

వనమాలి గారి ఈ వనం కలకాలం నవనవలాడుతూనే ఉండాలి. హృదయపూర్వక శుభాకాంక్షలండి.

Raj చెప్పారు...

మీ బ్లాగ్ తొలి సంవత్సరం పూర్తి చేసుకున్నండులకు మీకు అభినందనలు.. ఇలాంటి మరెన్నో వసంతాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను..

శిశిర చెప్పారు...

నాకు మీ టపాలు నచ్చుతాయండి. నేను మీ బ్లాగ్ ఫాలోయర్ ని. మీకు అభినందనలు.

అయితగాని జనార్ధన్ చెప్పారు...

మీరు బ్లాగు ప్రపంచంలో తొలి అడుగు తడిమి అప్పుడే కేలండర్ మారిందా.. ఒక సంవత్సరం ఓపికగా బ్లాగ్ నడపడమంటే అంత వీ(ఈ)జీ కాదు.. అదీ తెలుగులో.. నాలాంటి జర్నలిస్టు లంటే ఎలాగూ తెలుగులో టైప్ చేస్తాం కనుక.. యూనీకోడ్.. కాపీ పేస్టు.. పెద్ద కష్టం కాదు.. కానీ కొందరు ఇంగ్లీష్ అక్షరాలతో ఓపికగా టైప్ చేసి తెలుగును రాస్తున్నారు. వాళ్లకు చాలా అభినందనలు.. మరో ముఖ్యవిషయం.. సొంత పేరుతో బ్లాగ్ పెట్టుకోవాలన్న ఆలోచన రావడం ధైర్యం చేయడం.. దాన్ని క్లిక్ చేసుకోవడం ఓ మంచి అనుభూతి.. నేను కూడా janrdhanpen.blogspot.com అని పెడితే నవ్వారు. తరువాత ఇప్పుడు హమ్మనీ అంటున్నారు. రాతల్లో రోత లేకుండా ధమ్ముండాలి కానీ పేరే.. పేరు తెస్తుంది. అన్నట్టు మీ చుక్కల్లో చంద్రుడు బావున్నాడు. ఎనీ వే.. మెనీ మెనీ రిటర్ప్ ఆప్ బ్లాగింగ్ డే.. విత్ మోర్ పోస్టింగ్ విషెస్...

sunita చెప్పారు...

మీ బ్లాగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఫణి చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు....గోదారి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

Many many happy returns of the day.

తెలుగు పాటలు చెప్పారు...

మీ బ్లాగ్‌ తొలి జన్మదినం సందర్భంగా నా అభినందనలు..ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనీ ఆశిస్తూ...

జ్యోతిర్మయి చెప్పారు...

మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు వనజ గారూ..మీకు పాటలంటే ఇష్టం కదా..మీకో చిన్న బహుమతి http://www.youtube.com/watch?v=gN-0XAXJygU.

అజ్ఞాత చెప్పారు...

మీ బ్లాగ్‌ తొలి జన్మదినం సందర్భంగా నా అభినందనలు

Shabbu చెప్పారు...

వనజవనమాలి

పైడి నాయుడు గవిడి చెప్పారు...

మీ బ్లాగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.మీ రేడియో ఫ్రెండ్ కు చాలా చాలా థాంక్స్ .లేక పోతే మేం (మా ఫ్రెండ్స్&బ్లాగర్స్) చాలా మిస్ అయ్యేవాళ్ళం.

ఆత్రేయ చెప్పారు...

మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు !!
మరెన్నో ఇలాగే జరుపుకోవాలని కోరుతూ....

రసజ్ఞ చెప్పారు...

అహో ఒక బ్లాగుకి నేడే పుట్టిన రోజు!
అహో పాఠకులంతా మెచ్చే రోజు!
ఇదే ఇదే వనజ వనమాలి గారి బ్లాగు!
శుభాకాంక్షలు! ఇలాంటివెన్నో జరుపుకొంటూ మమ్మల్ని అలరించాలని ఆశిస్తూ.........................