12, నవంబర్ 2011, శనివారం

తెల్లవారేసరికి ఇంకో కొత్త ముగ్గు లా .."స్నేహం" !?


A friend is always there to give you a boost

జీవితం  చాలా  చిన్నది   ఎవరో ఎక్కడో..ఏమిటో.. తెలియ కుండానే.. కలసి నాలుగడుగులు వేస్తె చాలు స్నేహం కుదిరే రోజులు. ఓ..గంట కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటే చాలు సన్నిహితులు అయిపోతుంటారు.కలసి ఓ..రోజు గడిచిందంటే పాత బడి పోతుంటారు.

రోజు కొత్తదనం ముంగిట్లోకి వచ్చి కొత్త ముగ్గు వేసి తెల్లవారేసరికి ఇంకో కొత్త ముగ్గు కోసం వేదికినట్లు.. స్నేహం మారిపోవాలి.. వీలయితే నిన్నటి స్నేహం మర్చి పోవాలి.

ఈ స్నేహాల పిచ్చి ముదిరిపోతుంది. "నా" అని చెప్పుకోవడానికి ఓ..నలుగురు  అయినా లేని వందలమంది స్నేహితులు ఉంటున్న రోజులివి. ఏదో ..ఒక నాడు..  మనమంటూ..మనని మనంగా ఏ బేషజాలు లేకుండా బహిర్గతం చేసుకునేది స్నేహితుల వద్ద మాత్రమే.. మనిషి కి,మనసుకి ఆశ్రయం లభిచేంది స్నేహితుని ఇల్లే నట. ఆటువంటి చోటు స్వర్గ ధామమని నానుడి.


ఇటీవల కాలంలో..నేను చూడగానే ..నాకు బాగా నచ్చిన  పోయెం  పిక్చర్ ఇది .. ఇలా మీ అందరితో పంచుకుంటూ ...   (ఈ చిత్రం కూల్ కేటగిరీస్.కాం నుండి సేకరించినది).   If One Day.....

3 వ్యాఖ్యలు:

జ్యోతిర్మయి చెప్పారు...

Thanks for sharing Vanaja garu..

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగుందండీ!
where words fail, action speaks
where action fails, eyes speak
where eyes fail, tears speak and
where everything fails, a friend speaks.

Shabbu చెప్పారు...

ఈ విషయమై ఇప్పటికీ నేను చాలా అదృష్టవంతుడిననే చెప్పుకోవాలి, నన్ను ఇష్టపడి నాతో ఉన్నవాళ్లని ఎన్నో ఎళ్లుగా నేనిప్పటికీ అతుక్కునే ఉంటాను. నా అభిప్రాయంలో స్నేహం మర్రిచెట్టులా ఉండాలనుకుంటాను, అది తన ఉడలను ఎలా పెంచుకుంటూ పోతున్నప్పటికీ, అన్నింటినీ కలుపుకొని పోతుంది.
A friend in deed is a Friend indeed.

always urs Shabbu...