29, నవంబర్ 2011, మంగళవారం

పాతికేళ్ళ నా కల నెరవేరినరోజు

సిరి వెన్నెల .. చందమామ  రావే !జాబిల్లి రావే .. ఈ పాట వింటూ ..ఈ పాట వ్రాసిన గీత రచయితని చూడాలని..వారితో  చాలా  మాట్లాడాలని  పాతికేళ్ళు గా కలలు కన్నాను. ఆ కల నెరవేరిన సందర్భం ..ఏమనగా

నాకు చంద్రుడన్నా వెన్నెలన్నా..అమిత మైన ఇష్టం. (చంద్రుడు వెన్నెల అంటే ఎవరికి ఇష్టం ఉండదు అనకండి..)  అందుకే కూడా మా అబ్బాయికి కూడా "చంద్ర" కలిసేలా పేరు పెట్టడం జరిగింది.

"సిరివెన్నెల"  చిత్రం .. అంటేనే.. ఒక కలికితురాయి. ఆ చిత్రంలో.. ఏం బాగుండదో   ..చెప్పడం చాలా కష్టం. ఆ చిత్రం చూసి పాటలు విపరీతంగా నచ్చి.. "సీతారామశాస్త్రి" గారి అభిమానులుగా మారిన లక్షల   మందిలో..నేనోకరిని.
సీతారామశాస్త్రి గారిని కలసి వారితో..మాట్లాడాలని అనుకున్నాను. ఆయన విజయవాడ చాలా సార్లు వచ్చారు.కానీ ఎప్పుడు ఏదో అవాంతరం వచ్చేది. వారినిదురదృష్టవశాత్తు  కలవడం వీలుపడలేదు. కానీ..

నిన్న "మా ఎక్సెరే  సాహితీ సంస్థ" తెలుగు సినిమా పాట చరిత్ర ..డా:పైడిపాల గారి పరిశోదన గ్రంధం ..తృతీయ ముద్రణ ..ఆవిష్కరణ + డా: పైడిపాల గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది.  ఆ కార్యక్రమానికి పద్మ విభూషణ్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు,సిరివెన్నెల  సీతారామ శాస్త్రి   గారు, నిర్మాత కే.మురారి గారు అతిధిలుగా విచ్చేశారు. సభా కార్యక్రమం ని గేయ రచయిత వెన్నెలకంటి నిర్వహించారు.

సిరివెన్నెల గారికి ఆహ్వానం పలకడం ..వారితో..మాట్లాడటం..వారి ఆటోగ్రాఫ్ తీసుకోవడం .. నాకు చాలా సంతోషం కల్గించింది. నేను  జీవితంలో రెండవసారి ఆటోగ్రాఫ్ తీసుకున్నసందర్భం నిన్ననే.. జరిగింది. మొదటి సారి నాకు పదకొండేళ్ళ  వయసప్పుడు జయసుధ గారి వద్ద ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. వ్యక్తులు యెంత ఉన్నతులైనా నేను ఆటోగ్రాఫ్ తీసుకోవడం..వారిని అనుసరించడం ..వారిని అనుకరించడం .. నాకు ఇష్టం లేని సంగతులు.

నేను ఎంతో స్పూర్తికరం పొందిన రచయితలలో.. సిరివెన్నెల గారికి పూజ్యస్థానం. వారితో..మాట్లాడిన రెండు నిమిషాలు నాకు చాలా అపురూపం. అలాగే "ఎక్సరే "అధ్యక్షులు 'కొల్లూరి గారు"   "సిరివెన్నెల'' గారికి పరిచయం చేస్తూ.. మా నెల నెల వెన్నెల వెలుగు.. ఈ మేడం ..అని చెప్పారు. వారు ఆసక్తిగా చూస్తుంటే.. ముప్పై ఏళ్ళ క్రితం అమలాపురంలో.. మనం ఏర్పరచుకున్న "నెల నెల వెన్నెల "కవిత్వపు వేదిక ఇక్కడ విజయవాడలో మేము నిర్వహిస్తాము...అని ..వివరంగా చెప్పారు. "మళ్ళీ   మాట్లాడదాం అమ్మా.. అన్నారు." ఆయన.
కానీ మా కార్యక్రమం అయ్యే టప్పటికి 10 :36  రాత్రి అయింది. రైలు అందుకోవాల్సిన  సమయం దగ్గర పడుతుందని  అందరు  వెళ్ళిపోయారు.మా సంస్థ సభ్యులందరూ వారితో కలసి ఫోటో దిగాలనుకున్న కోరిక అలాగే మిగిలిపోయింది. సిరివెన్నెల గారితో..మాట్లాడిన విషయాలు మరొక పోస్ట్ లో వ్రాస్తాను. ఎందుకంటే
చాలా ఫోటోలు..  ఇంకా రావాలి . ఆ ఫోటోలు,ఆ కార్యక్రమ వివరాలు మరలా వ్రాస్తాను.


ఇంతకీ ఈ పాట ఎందుకంటే.. చిన్న పాపకి చందమామ చేతికందిన ఫీలింగ్ ఎలా ఉంటుందో.. అలా టి ఫీలింగ్ తోనే.. అక్షర వెన్నెల కురిపించిన "  సిరివెన్నెల  "   చేతికందిన రోజు.నాకు ఇష్టమైన పాట తో..ఈ మాట      

చందమామ  రావే  జాబిల్లి  రావే 
కొండెక్కి  రావే  గోగుపూలు  తేవే 
చందమామ  రావే  జాబిల్లి  రావే 
కొండెక్కి  రావే  గోగుపూలు  తేవే 

చలువ  చందనములు పూయ  చందమామ  రావే 
జాజిపూల  తావినియ్య  జాబిల్లి  రావే 
చలువ  చందనములుపూయ  చందమామ  రావే 
జాజిపూల  తావినియ్య  జాబిల్లి  రావే 
కలువ  చెలువ  కలలు  విరియ  కొండనెక్కి  రావే 
కలువ  చెలువ  కలలు  విరియ  కొండనెక్కి  రావే 
గగనపు  విరితోటలోని  గోగుపూలు  తేవే 

చందమామ  రావే  జాబిల్లి  రావే 
కొండెక్కి  రావే  గోగుపూలు  తేవే 
చందమామ  రావే  జాబిల్లి  రావే 

మునిజన  మానస మోహిని    యోగిని  బృందా వనం     
మురళి రవళికి    ఆడిన  నాగిని  బృందా వనం    || మునిజన  ||

రాధామాధవ  గాథల  రంజిలు  బృందా వనం   
గోపాలుని  మృదుపద  మంజీరము  బృందా వనం  (2)
బృందావనం  బృందావనం 

హే  కృష్ణా , ముకుందా , మురారి !
  కృష్ణా  ముకుందామురారి , కృష్ణా ! ముకుందా ! మురారి !

జయ   జయ  కృష్ణా  ముకుందా  మురారి 
జయ  జయ  కృష్ణా  ముకుందా  మురారి 

చందమామ  రావే  జాబిల్లి  రావే 
కొండెక్కి  రావే  గోగుపూలు  తేవే 
చందమామ  రావే  జాబిల్లి  రావే 

4 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

చాలా సంతోషంగా ఉంది! వ్యక్తులు యెంత ఉన్నతులైనా నేను ఆటోగ్రాఫ్ తీసుకోవడం..వారిని అనుసరించడం ..వారిని అనుక రించడం .. నాకు ఇష్టం లేని సంగతులు. నేను కూడా ఉన్నాను మీతో ఈ విషయంలో. మనమేంటో మనం అంతే. వేరే వారిని అనుకరిస్తే వారికి మనకి తేడా ఏమిటి? కాని నేను ఆటోగ్రాఫ్లు ఇప్పటికి ఒక అయిదుగురి దగ్గర తీసుకున్నాను. వాళ్ళందరూ నోబెల్ గ్రహీతలే. మరిన్ని వివరాలతో మీ తరువాతి టపా కోసం చూస్తూ............

జ్యోతిర్మయి చెప్పారు...

అభినందనలు వనజగారూ..నాకూ చాలా సంతోషంగా ఉంది.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

సంతోషంగా ఉందండీ మీరు సిరివెన్నెల గారిని కలిసినందుకు. కొంత జెలస్ గా కూడా ఉంది! నాకూ ఇష్టమైన సినికవి ఈయన. నేను సిరివెన్నెల గారిని నేటితరం కృష్ణశాస్త్రి అని భావిస్తాను.

మీ రెండో పోస్ట్‌కోసం వయిటింగ్.

Shabbu చెప్పారు...

అబ్బ గట్లెట అయిపాయే, గోరమైపాయె,,,,
ఈ విషయమును గురించి నాకు చెప్పనందులకు నేను చాలా బాధపడ్డాను, ఎందుకుంటే పోయినసారి మిస్సయ్యాను కాబట్టి , తర్వాత జరగబోయె కార్యక్రమమును గురించి చెప్తానన్నారు, మరిచారు.
Shabbu, KNR