18, నవంబర్ 2011, శుక్రవారం

స్త్రీలను స్త్రీలే ఈర్ష్య పడాలా?

స్త్రీకి స్త్రీ యే ప్రధమ శత్రువట...!? అని  మా ఫ్యామిలీ ..ఫ్రెండ్  ఒకరు  నా ముఖంలోకి చూస్తూ.. ఎగతాళిగా  అంటే కోపం వచ్చినా తమాయించుకుని ఎలానో వివరంగా  చెప్పండి..అన్నాను.కాసేపు ఆలోచన ..నా ప్రశ్నకి దీటుగా వివరణ ఇవాలన్నట్టు మౌనం.

ఎప్పుడు పుట్టిందో..ఈ మాట. ఈర్ష్య కి మరో రూపం స్త్రీ అట.

అందరూ   నిజమే  అనుకుంటారేమో! పురుషులకి స్త్రీ అంటే  ఈర్ష్య ,శత్రుత్వం ఉండదా? పురుషులని పురుషులే ఈర్ష పడాలా? స్త్రీలని స్త్రీలే ఈర్ష్య పడాలా? ఈర్ష్య కి కూడా జెండర్   బేధాలు ఉంటాయా? అడిగాను.
:)))) ... అక్కడ మళ్ళీ నవ్వు.

ఏమిటో..ఈ కాలపు స్త్రీల ఎక్స్ ట్రా ఆర్డినరీ స్కిల్ల్స్ చూసి మగవాళ్ళు ఈర్ష్య పడటం లేదా ఏమిటి? అదే స్త్రీని చూసి స్త్రీ కూడా ఈర్ష్య పడినట్లుగానే!  అన్నాను.

ఇక నా ఫ్రెండ్ వివరణ చూడండి.

ఒక మహిళ ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే.. జాలి చూపేది మాత్రం పురుషుడే! అదే స్త్రీ అయితే ..  పైకి  సానుభూతి కురిపిస్తూనే.. లోలోపల బాగా అయిందిలే .. అలా జరిగి తిక్క కుదరాల్సిందే! అని లోలోపల తలపోస్తారు.
ఇక ఇళ్ళల లో  తోడి  కోడళ్ళ మద్య ,ఆడ బిడ్డల మద్య ,అత్తా కోడళ్ళ మద్య, ఆఖరికి అక్క చెల్లెళ్ళ మద్య కూడా  ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. స్త్రీలకి ఉన్న ఆడంబర శైలి పురుషులకి ఉండదు. చీరలకి ,నగలకి ,అలంకరణ లకి  స్త్రీలు ఇచ్చినంత ప్రాధాన్యం పురుషులు ఇవ్వరు.  పురుషుడు ఒక  డ్రెస్ తో పది పంక్షన్ లకి హాజరైతే పది పంక్షనలకి  పది చీరలు ప్రదర్శించడం ఒక ఎత్తయితే.. ఇంకొక స్త్రీ కట్టిన చీర పెట్టిన నగ చూసి..అవి యెంత బాగున్నా సరే  అకారణంగా ద్వేషం ఒలకబోడం స్త్రీలకి పరి పాటి.


అదే పురుషుడైతే.. ఒక కారు కొనుక్కోగానే.. అతని చుట్టూ ఉన్న అతని స్నేహితులు  చేరి మనఃస్పూర్తిగా సంతోషించి.. నేను అలా ఫైనాన్స్ తీసుకున్నాను.ఇలా పైనాన్స్ తీసుకున్నాను.మీరు తీసుకోండి..అని ఎంకరేజ్ చేస్తారు. తనకి రాకున్న వేరొకరికి ప్రమోషన్ వచ్చినా లోపల బాధ ఉన్నా సరే.అభినందిస్తారు. అదే స్త్రీలయితే లోలోపల రగిలిపోతారు.  అసలు స్త్రీల సమస్యలకి స్త్రీలే కారణం. వర కట్న సమస్యలు కానీయండి..వివాహేతర  సంబంధాలు కానీయండి..ఆస్తి తగాదాలకి కానీయండి అన్నింటికీ స్త్రీయే కారణం. పురుషుడుఅన్నింటా నామమాత్రమే.

వరకట్నాల ముసుగులో..అమ్మాయిలు  భర్త మీద నెపం పెట్టి పుట్టింటినుండి అయినకాడికి సొమ్ము గుంజుకున్దామనే చూస్తారు. ఏమి లేదంటే ఆడవాళ్ళకి అలంకారమైన ఆయుధం ఉండనే ఉంది కదా.. ఆ ఏడుపుని అడ్డు పెట్టుకుంటారు.పురుషులని చవటాయిలని చేసి ఆడుకుంటారు.  ఒక ఆర్యోక్తి చూడండి..

కన్యా వరయతే రూపం
మాతా  విత్తం,పితా శ్రుతం
బాంధవః కులమిచ్చంతి
మృష్టాన్న మిత్రే జనాః

కన్య పెళ్లి కొడుకు రూపాన్ని మాత్రమే చూస్తుందట. తల్లి అతని వెనుక ఉన్న డబ్బుని,తండ్రి విద్యా సంస్కారాలని చూస్తారట. బంధువులు వంశం,సంప్రదాయం చూస్తే  జనులు  విందు భోజనం కోసం ఎదురు చూస్తారట.
తమకి లభించనిది ఇతరలుకు లభించినప్పుడు  మండిపోయే స్త్రీలు ..భగ భగ మండిపోయే చెట్టులాటివారట. ఆ చెట్టు పై ఏ పక్షి వాలదన్నట్టు.. ఈర్ష్యా ద్వేషాలతో మండిపోయే స్త్రీ చెంత ఎవరు దరిచేరరు.

అందుకని నేను చెప్పునది ఏమనగా.. స్త్రీ కి స్త్రీ యే శత్రువు. ఈర్శ్యకి మారు పేరు స్త్రీ.. అని ఉద్ఘాటించాక..సమాధానం చెపుదామనుకునే లోపే..నాకు కోపం రాలేదు కానీ..మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడకి విపరీతమైన కోపం వచ్చి.. స్త్ర్రీలని అన్నేసి మాటలు అంటుంటే.. సమాధానం చెప్పరేమిటండి..అని నన్ను కసురుకుంది.

ఆలోచించుకుని రేపు వన భోజనాలు రోజు నాకు సమాధానం చెప్పండి     తప్పైతే నా వాదన,.నా అభిప్రాయం ..  మార్చుకుంటాను..అని సెలవు తీసుకున్నారు.

నేను, ఆమె కలసి ఒక ఇరవై మంది మా గ్రూప్ మెంబర్స్ తో..సీరియస్ గా చర్చించి ..స్త్ర్రీకి స్త్రీ శత్రువు అన్నవారిని, ఈర్ష్యా అసూయ జీవి అన్న వారిని ,అనేవారిని కూడా.. చీల్చి చెండా డా లను కుంటున్నాం. మాటలతోనే లెండి.!

మళ్ళీ ఆ విషయాలు రెండు మూడు రోజుల తర్వాత మోసుకోస్తాను. అందాక నాకు సెలవు ఇచ్చి.. మీరు ఆలోచించండి.        

4 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

మీ తరువాతి టపా దాకా వేచి చూస్తాను. మొన్న సరిగ్గా ఇదే విషయం మీద నాకు, ఒకబ్బాయికి వాదోపవాదనలు జరిగాయి.

కాయల నాగేంద్ర చెప్పారు...

స్త్రీకి స్త్రీయే శత్రువు అనడానికి రోజూ మన కళ్ళముందు
ఎన్నో సాక్ష్యాలు కనబడుతున్నాయి. అదేవిధంగా
పురుషులేమి తక్కువ కాదు. ఈ విషయంలో ఇద్దరూ
సమానమే. కాకపోతే పురుషులకంటే స్త్రీలు ఓ అడుగు
ముందుంటారు.

Subrahmanya Sarma చెప్పారు...

వనజవనమాలిగారూ నమస్తే..!
పైనున్న వివరణలో "అతి" కనబడుతోంది నాకైతే.., "అతి సర్వత్ర వర్జయేత్‌" అనే చాణుక్యనీతిలాగ..!
మీ తర్వాతి టపాకోసం వేచి చూస్తాను.

రసజ్ఞగారూ.. నమస్తే..!
మీతో వాదించిన అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నా..!

తెలుగు పాటలు చెప్పారు...

ఎవరో మాట్లాడుతుండగా విన్న గుర్తు అండి, పది జుట్లు కలిసి ఉంటాయి కానీ రెండు కొప్పులు కలిసి ఉండవు అని... ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఈ పోస్ట్ కి నేను చెప్పిన దానికి లింక్ ఉందొ లేదో కూడా తెలియదు,తప్పుగా అని ఉంటె క్షమించండి...