యెన్ ఆర్ ఐ నిత్య పెళ్ళి కొడుకుకి దేహ శుద్ధి.. కొత్త మలుపు తిరుగుతున్న యెన్ ఆర్ ఐ కథ.. అంటూ కొన్ని ప్రముఖ చానల్స్ లో వస్తున్న వార్తా కథనాన్ని దేశ విదేశాలలో చాలా మంది చూస్తున్నారు కదా! అలాగే వార్తా పత్రికల్లోన్ని కథనాలు చదివి ఉంటారు.
నిజానికి ఈ కథకి ఇలా చేస్తే బాగుండును అని నేను కోపంగా బాధితులకి సూచన ఇచ్చి నాలుగైదు నెలలు దాటింది.
ఒక యెన్ ఆర్ ఐ ..నాసా లో సైంటిస్ట్ అయిన ఈమని శివశంకర్ రెడ్డి..అతని మొదటి భార్య విద్యాధికురాలైన విజయ లక్ష్మి.వీరి సంతానం ఇద్దరు నిర్మల, సుజాత. ఈమని శివశంకర్ రెడ్డి విజయ లక్ష్మికి విడాకులు ఇచ్చి పొన్నూరుకు చెందిన ఔతు విమలకుమారిని 1994 లో ద్వితీయ వివాహం చేసుకుని కొన్నాళ్ళు ఇక్కడ ఆమెతో గడిపి .. యు .ఎస్ కి వెళ్ళిపోయాడు. వీసా పంపుతానని చెప్పివెళ్ళిన అతను అడ్రెస్స్ లేడు . తరువాత విమల కుమారిని ఇక్కడ వదిలేసి అక్కడనే తృతీయ వివాహం చేసుకున్నాడు. మరలా మూడవ భార్య ద్వారా అతనికి ఇద్దరు పిల్లలు.
సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన విమల కుమారి కన్న కలలు కల్లలై పోయాయి. భర్త నుండి పిలుపు వస్తుంది అనుకున్న ఆమెకి అతని నుండి పిలుపు రాక పోగా ..ఈమని శివశంకర్ రెడ్డి తో ఆమెకి జరిగిన వివాహాన్ని రద్దు చేసుకొవాల్సినదిగా కోరుతూ ఆమె పై ఒత్తిడి తీసుకుని వచ్చారు అతని వైపు బంధువులు . తగిన కారణం లేకుండా వివాహాన్ని ఎందుకు రద్దు చేసుకోవాలో అర్ధం కాక కోర్టు ని ఆశ్రయించిన విమలకుమారి 15 సంవత్సరముల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఈమని శివ శంకర్ రెడ్డి తనకి మారుగా.. కోర్టు వ్యవహారములు చూసుకోనుటకు అతని చెల్లెలి మరిది ఉయ్యూరి ధర్మా రెడ్డి అనే అతని అటార్నీ పవర్ రాసి ఇచ్చి కోర్టు వ్యహారములు నడుపుతూ ఉన్నారు.శివ శంకర్ రెడ్డి తరపు లాయరు ఉయ్యూరు బాపి రెడ్డి స్వయానా అతని చెల్లెలి భర్త. వీరు విమల కుమారిని అమెరికా శివశంకర్ రెడ్డి దగ్గరికి పంపుతామని ఆమెని బయలదేర దీసి మద్రాస్ ఎయిర్ పోర్ట్ వరకు తీసుకు వెళ్లి అక్కడినుండి వీసా రాలేదు అని చెప్పి ఆమె పాస్ పోర్ట్ ని వారు స్వాదీనం చేసుకుని .. ఆమె వెంట ఉన్న లగేజ్ ,బంగారం తో సహా అన్నీ వారే తీసుకుని ఆమెని పుట్టింటికి పంపించి వేసారు. తర్వాత అవి ఏవీ ఆమెకి ఇవ్వలేదు సరి కదా.. ఆమె పై ఎన్నో ఆరోపణలు చేసారు. అతను మీడియా ముందు చూపుతున్న ఆధారాలు నిజమైనవి కాదు.వీరికి సంబందించిన కేసు ఇప్పటికి హై కోర్ట్లులో నడుస్తూ ఉంది. ఈమని శివశంకర్ రెడ్డి తన ద్వితీయ వివాహాన్ని రద్దు చేకోకుండానే మూడవ వివాహం చేసుకుని 14 సంవత్సరాలు అయింది.
ఈ ఈమని శివశంకర్ రెడ్డి చేసిన మోసం ఎలాటిదో చూడండి!. విమల కుమారి విడాకులు ఇవ్వడానికి సిద్దపడక పొతే ఆమెకి అయిదు సంవత్సరముల క్రితం వరకు భరణం చెల్లించమని కోర్ట్ ఆదేశించి నప్పటికీ కోర్ట్ ఆదేశాలను పెడ చెవి పెట్టి..ఈ దేశంలోకి రాకుండా, వచ్చినా ముఖం చాటేసుకుని విమలకుమారికి పరిష్కారం చేయకుండా..వెళ్ళిపోతున్నాడు. విద్యాదికులు వివాహం పేరిట మోసం చేయడం అమాయుకలని మోసగించడం యెంత భాదాకరం. ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ద్వితీయ వివాహమైనా మంచి జీవితం గడుపుతుందని అతనికి ఇచ్చి వివాహం చేస్తే.. ఒక వస్తువుని వాడుకున్నట్లు వాడుకుని వదిలేసాడు.పైగా ఆమె ప్రవర్తన మంచిది కాదంటూ.. అభియోగాలు మోపి అవమానకరంగా మాట్లాడటం భరించలేని విమలకుమారి అతను వచ్చి తన ఎదురుగా నిలబడి వివాహం రద్దు పరచుకోవడానికి సహేతుకమైన కారణాలు చూపి విడాకులు కోరమని అడుగుతున్నారు. బీదరికం,ఎక్కువ చదువుకోలేకపోడం, మోసపూరిత వివాహం వల్ల కోర్టుల చుట్టూ తిరగ వలసి రావడం, లాయర్ల ద్వంద వైఖరి ,బంధువుల సూటి పోటీ మాటలు,మానసిక అశాంతి వీటన్నిటి మద్య వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో నాకు తెలుసు.
విమల కుమారి చెల్లెలు "రమ" నాకు ఫ్రెండ్. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒక టైలరింగ్ షాప్ నడుపుకుంటూ..యెంత కష్ట పడి బ్రతుకుతారో నాకు తెలుసు. ఉన్నఒకే ఒక సోదరుడు కుటుంబ భాద్యతలు వదిలేసి తన దారి తను చూసుకుంటే..తల్లిదండ్రులని తమ రెక్కల కష్టం పై పోషించుకుంటూ.. బ్రతుకు వెళ్లదీస్తున్నారు.
నాలుగైదు నెలల క్రిందట విమల కుమారి మా ఇంటికి వచ్చినప్పుడు తనకి జరిగిన వివాహం గురించి జరిగిన మోసం గురించి నాకు చెప్పినప్పుడు యెన్ ఆర్ ఐ వివాహాలు -మోసాలు గురించి ఒక ప్రత్యెక కోర్ట్ నడుస్తుందని చెప్పాను. భూమిక హెల్ప్ లైన్ కి కాల్ చేయమని సలహా ఇచ్చి వెంటనే నేను నెంబర్ తీసి యెంత ట్రై చేసినా కాల్ కనెక్ట్ కాలేదు.కోర్ట్ ద్వారా సత్వరం పరిష్కారం కాలేదు కనుక మీడియాని ఆశ్రయించ మని చెప్పాను. ఈమని శివశంకర్ రెడ్డి వివరాలు కోసం కూడా నెట్ అంతా గాలించాము కూడా.
ఇప్పుడు ఈమని శివ శంకర్ రెడ్డి సమీప బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు ..అతనిని కలవడానికి వివాహ వేదిక వద్దకు వెళ్ళిన విమలకుమారిని,అతని చెల్లెలిని అడ్డుకుని అతనిని తప్పించ బోతే జరుగుతున్న అన్యాయానికి..ఏళ్ళ తరబడి సాగుతున్న కోర్ట్ కేసుకి సహనం కోల్పోయిన నా ఫ్రెండ్ "రమ" అతనిని విపరీతమైన ఆవేశంలో కాలర్ పట్టుకుని నిలదీసినప్పుడు..అతని బందువులు ఆమె పై దాడి చేసారు. ఆ దృశ్యాలు మీడియాలో వచ్చాయి కూడా. గత పదిహేను ఏళ్ళుగా.. అతని నిర్లక్ష్య వైఖరికి విసిగిపోయిన ఆ కుటుంబం యెంత నలిపోయిందో!
నా ఫ్రెండ్ "రమ " అయితే వివాహం పట్ల విముఖత వచ్చేసి అవివివాహితగా మిగిలిపోయింది. వారికి జీవనాధారం కుట్టుపని మాత్రమే! తల్లి అనార్యోగ్య కారణంగా చాలా డబ్బు ఖర్చు అయితే.. ఫ్రెండ్స్ మేమందరం సహాయం చేసాము.ఇలా చెప్పడం ఆమెని అవమానించడం అవుతుందేమో! కానీ కొన్ని సమయాలలో.. వాస్తవ పరిస్థితులు తెలుపటం కోసం ఈ మాట వ్రాస్తున్నాను. . అభిమాన వంతులు అయిన వారు ఆ డబ్బుని తిరిగి ఇచ్చే ప్రయత్నంలో..రాత్రింబవళ్ళు కష్ట పడుతున్నారు. అటువంటి వారు డబ్బు కోసం ఈమని శివ శంకర్ రెడ్డి పై..అబద్దపు ఆరోపణలు చేయడం లో అర్ధం లేదు.వాళ్లకి జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పమని కోరుతున్నారు. అంతే!
ఈమని శివశంకర్ రెడ్డి ని టై పట్టుకుని లాగి దాడి చేసి ప్రశ్నించిన రమ ఆవేశం చూసి నేను ఆశ్చర్య పోయాను. ఏమిటి రమా! అంత ఆవేశం అంటే .. అది ఆవేశం కాదు.. మా మానసిక బాధ కి వెళ్ళ గ్రక్కిన ఆవేదన. ఇప్పుడు అతను వచ్చాడు..మళ్ళీ తిరిగి వెళతాడు. కోర్టులో కేసు తేలదు. ఎన్నేళ్ళు అని ఈ మానసిక వ్యధ.?జీవితమంతా.. చేయని తప్పుకి బలైపోయింది.. అక్క కి జీవితం ఎలా వస్తుంది చెప్పండి? అంది. "రమ" విశ్వ హిందూ పరిషత్ కార్య కర్తగా.. పద్దెనిమిది సంవత్సరాలుగా సేవలు అందించే భాద్యత గల పౌరురాలు..సామాజిక చైతన్యం కల ఆమె అలా ప్రవర్తించిన దనటానికి కారణం ..వారి ఆవేదనే! మొత్తానికి ఈమని శివశంకర్ రెడ్డ్యికి దేహ శుద్ధి చేసి నాలగవ పెళ్లి చేసింది. అందుకు ఆమెకి అభినందలు చెప్పాలో..చట్టం,న్యాయం అందనందుకు విచార పడాలో చెప్పలేను. నా దృష్టిలో అరబ్ షేక్ లు వచ్చి పెళ్లి పేరిట అమ్మాయిలని వంచించి కొన్నాళ్ళు జాలీగా గడిపి వెళ్ళిన దానికి పెళ్లి పేరిట మోసం చేసిన ఈ ఈమని శివశంకర్ రెడ్డికి ఏమీ తేడా లేదు అనిపించింది.ఏదైనా విదేశి పెళ్లి కొడుకుల విషయంలో.. తగిన జాగ్రత్తలు అవసరం కదా!
నిజానికి ఈ కథకి ఇలా చేస్తే బాగుండును అని నేను కోపంగా బాధితులకి సూచన ఇచ్చి నాలుగైదు నెలలు దాటింది.
ఒక యెన్ ఆర్ ఐ ..నాసా లో సైంటిస్ట్ అయిన ఈమని శివశంకర్ రెడ్డి..అతని మొదటి భార్య విద్యాధికురాలైన విజయ లక్ష్మి.వీరి సంతానం ఇద్దరు నిర్మల, సుజాత. ఈమని శివశంకర్ రెడ్డి విజయ లక్ష్మికి విడాకులు ఇచ్చి పొన్నూరుకు చెందిన ఔతు విమలకుమారిని 1994 లో ద్వితీయ వివాహం చేసుకుని కొన్నాళ్ళు ఇక్కడ ఆమెతో గడిపి .. యు .ఎస్ కి వెళ్ళిపోయాడు. వీసా పంపుతానని చెప్పివెళ్ళిన అతను అడ్రెస్స్ లేడు . తరువాత విమల కుమారిని ఇక్కడ వదిలేసి అక్కడనే తృతీయ వివాహం చేసుకున్నాడు. మరలా మూడవ భార్య ద్వారా అతనికి ఇద్దరు పిల్లలు.
సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన విమల కుమారి కన్న కలలు కల్లలై పోయాయి. భర్త నుండి పిలుపు వస్తుంది అనుకున్న ఆమెకి అతని నుండి పిలుపు రాక పోగా ..ఈమని శివశంకర్ రెడ్డి తో ఆమెకి జరిగిన వివాహాన్ని రద్దు చేసుకొవాల్సినదిగా కోరుతూ ఆమె పై ఒత్తిడి తీసుకుని వచ్చారు అతని వైపు బంధువులు . తగిన కారణం లేకుండా వివాహాన్ని ఎందుకు రద్దు చేసుకోవాలో అర్ధం కాక కోర్టు ని ఆశ్రయించిన విమలకుమారి 15 సంవత్సరముల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఈ ఈమని శివశంకర్ రెడ్డి చేసిన మోసం ఎలాటిదో చూడండి!. విమల కుమారి విడాకులు ఇవ్వడానికి సిద్దపడక పొతే ఆమెకి అయిదు సంవత్సరముల క్రితం వరకు భరణం చెల్లించమని కోర్ట్ ఆదేశించి నప్పటికీ కోర్ట్ ఆదేశాలను పెడ చెవి పెట్టి..ఈ దేశంలోకి రాకుండా, వచ్చినా ముఖం చాటేసుకుని విమలకుమారికి పరిష్కారం చేయకుండా..వెళ్ళిపోతున్నాడు. విద్యాదికులు వివాహం పేరిట మోసం చేయడం అమాయుకలని మోసగించడం యెంత భాదాకరం. ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ద్వితీయ వివాహమైనా మంచి జీవితం గడుపుతుందని అతనికి ఇచ్చి వివాహం చేస్తే.. ఒక వస్తువుని వాడుకున్నట్లు వాడుకుని వదిలేసాడు.పైగా ఆమె ప్రవర్తన మంచిది కాదంటూ.. అభియోగాలు మోపి అవమానకరంగా మాట్లాడటం భరించలేని విమలకుమారి అతను వచ్చి తన ఎదురుగా నిలబడి వివాహం రద్దు పరచుకోవడానికి సహేతుకమైన కారణాలు చూపి విడాకులు కోరమని అడుగుతున్నారు. బీదరికం,ఎక్కువ చదువుకోలేకపోడం, మోసపూరిత వివాహం వల్ల కోర్టుల చుట్టూ తిరగ వలసి రావడం, లాయర్ల ద్వంద వైఖరి ,బంధువుల సూటి పోటీ మాటలు,మానసిక అశాంతి వీటన్నిటి మద్య వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో నాకు తెలుసు.
విమల కుమారి చెల్లెలు "రమ" నాకు ఫ్రెండ్. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒక టైలరింగ్ షాప్ నడుపుకుంటూ..యెంత కష్ట పడి బ్రతుకుతారో నాకు తెలుసు. ఉన్నఒకే ఒక సోదరుడు కుటుంబ భాద్యతలు వదిలేసి తన దారి తను చూసుకుంటే..తల్లిదండ్రులని తమ రెక్కల కష్టం పై పోషించుకుంటూ.. బ్రతుకు వెళ్లదీస్తున్నారు.
నాలుగైదు నెలల క్రిందట విమల కుమారి మా ఇంటికి వచ్చినప్పుడు తనకి జరిగిన వివాహం గురించి జరిగిన మోసం గురించి నాకు చెప్పినప్పుడు యెన్ ఆర్ ఐ వివాహాలు -మోసాలు గురించి ఒక ప్రత్యెక కోర్ట్ నడుస్తుందని చెప్పాను. భూమిక హెల్ప్ లైన్ కి కాల్ చేయమని సలహా ఇచ్చి వెంటనే నేను నెంబర్ తీసి యెంత ట్రై చేసినా కాల్ కనెక్ట్ కాలేదు.కోర్ట్ ద్వారా సత్వరం పరిష్కారం కాలేదు కనుక మీడియాని ఆశ్రయించ మని చెప్పాను. ఈమని శివశంకర్ రెడ్డి వివరాలు కోసం కూడా నెట్ అంతా గాలించాము కూడా.
నా ఫ్రెండ్ "రమ " అయితే వివాహం పట్ల విముఖత వచ్చేసి అవివివాహితగా మిగిలిపోయింది. వారికి జీవనాధారం కుట్టుపని మాత్రమే! తల్లి అనార్యోగ్య కారణంగా చాలా డబ్బు ఖర్చు అయితే.. ఫ్రెండ్స్ మేమందరం సహాయం చేసాము.ఇలా చెప్పడం ఆమెని అవమానించడం అవుతుందేమో! కానీ కొన్ని సమయాలలో.. వాస్తవ పరిస్థితులు తెలుపటం కోసం ఈ మాట వ్రాస్తున్నాను. . అభిమాన వంతులు అయిన వారు ఆ డబ్బుని తిరిగి ఇచ్చే ప్రయత్నంలో..రాత్రింబవళ్ళు కష్ట పడుతున్నారు. అటువంటి వారు డబ్బు కోసం ఈమని శివ శంకర్ రెడ్డి పై..అబద్దపు ఆరోపణలు చేయడం లో అర్ధం లేదు.వాళ్లకి జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పమని కోరుతున్నారు. అంతే!
ఈమని శివశంకర్ రెడ్డి ని టై పట్టుకుని లాగి దాడి చేసి ప్రశ్నించిన రమ ఆవేశం చూసి నేను ఆశ్చర్య పోయాను. ఏమిటి రమా! అంత ఆవేశం అంటే .. అది ఆవేశం కాదు.. మా మానసిక బాధ కి వెళ్ళ గ్రక్కిన ఆవేదన. ఇప్పుడు అతను వచ్చాడు..మళ్ళీ తిరిగి వెళతాడు. కోర్టులో కేసు తేలదు. ఎన్నేళ్ళు అని ఈ మానసిక వ్యధ.?జీవితమంతా.. చేయని తప్పుకి బలైపోయింది.. అక్క కి జీవితం ఎలా వస్తుంది చెప్పండి? అంది. "రమ" విశ్వ హిందూ పరిషత్ కార్య కర్తగా.. పద్దెనిమిది సంవత్సరాలుగా సేవలు అందించే భాద్యత గల పౌరురాలు..సామాజిక చైతన్యం కల ఆమె అలా ప్రవర్తించిన దనటానికి కారణం ..వారి ఆవేదనే! మొత్తానికి ఈమని శివశంకర్ రెడ్డ్యికి దేహ శుద్ధి చేసి నాలగవ పెళ్లి చేసింది. అందుకు ఆమెకి అభినందలు చెప్పాలో..చట్టం,న్యాయం అందనందుకు విచార పడాలో చెప్పలేను. నా దృష్టిలో అరబ్ షేక్ లు వచ్చి పెళ్లి పేరిట అమ్మాయిలని వంచించి కొన్నాళ్ళు జాలీగా గడిపి వెళ్ళిన దానికి పెళ్లి పేరిట మోసం చేసిన ఈ ఈమని శివశంకర్ రెడ్డికి ఏమీ తేడా లేదు అనిపించింది.ఏదైనా విదేశి పెళ్లి కొడుకుల విషయంలో.. తగిన జాగ్రత్తలు అవసరం కదా!
8 కామెంట్‌లు:
వారి ఆవేదన వారి ప్రవర్తనలో కనిపించింది. బాధ ఫ్రస్టేషన్ రూపంలో అలా బయట పడిందని కనిపిస్తూ ఉంది. ఆడపిల్లల తల్లి తండ్రులు ఈ ఎన్నారైల విషయంలో ఒకటికి వేయి సార్లు జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన మరో మారు రుజువు చేసింది.
I feel very sorry for Vimala Kumari. ఈ న్యూస్ నేనూ చూశాను. ఆ శివశంకరరెడ్డి బంధువులు తిరగబడి ఈమెను(విమలకుమారా? రమ?) కొట్టారు. భూమిక ప్రతినిధులు వీరికి అండగా నిలబడి నైతికస్థైర్యాన్ని కల్పించవచ్చుకదా!
బాగా చెప్పారు.. కానీ పై పై మెరుగులను చూసి మోసపోయే వారికి ఎన్ని చెప్పినా దండగే.. కొన్ని విషయాల్లో తొందర పడకుంటే నష్టపోతా... మరికొన్ని విషయాల్లో తొందర పడితే నష్టపోతాం.. ఎంటో ప్రపంచం..
విదేశీ పెళ్ళి కొడుకులే కాదు వనజవనమాలి గారు
ఇక్కడి పెళ్ళికొడుకులైనా...
అమ్మాయిలు చదుకున్న వాళ్ళైనా చదువులేని
వాళ్ళైనా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు తప్పటం లేదు..
"దేహ శుద్ధి చేసి నాలగవ పెళ్లి చేసింది. అందుకు ఆమెకి అభినందలు చెప్పాలో..చట్టం,న్యాయం అందనందుకు విచారపడాలో చెప్పలేను"
నాది కూడా same feeling..
ఈ న్యూస్ చూశాను. ఆమెకి ఇప్పటికైనా న్యాయం జరిగితే బాగుంటుంది.
న్యాయాన్ని ఆలస్యం చేయటం అంటే న్యాయాన్ని తిరస్కరించటమే అనే మౌలిక న్యాయధర్మాన్ని ఎప్పటికి మన నాయస్థానాలు, వ్యవస్థా తెలుసుకుంటాయో?!
స్పందించిన అందరికి ధన్యవాదములు కృష్ణ గారు ,,మీరు చెప్పినది నిజం. వారిలో ఆవేదన కలసిన ఆవేశం ఉంది ఉంది.
@ తేజస్వి గారు.. విమల గారిని, ఆమె చెల్లెలు రమ పై కూడా అతని తరపు బంధువులు దాడి చేసారు. నిజమే.. వారికి తగిన సహాయం చేసేవారి కోసం ఎదురు చూస్తున్నారు.
@ జనార్ధన్ గారు ... ఇప్పటికి చట్టం వారికి సానుకూలంగా స్పందించడం లేదండీ ! మా పరిధి లోది కాదంటే మా పరిధిలోది కాదని కేసు టేక్ అప్ చేయడం లేదు. ఎట్టకేలకు నిన్న అభ్యర్ధన స్వీకరించారు.అంతా డాలర్ ల మహత్యం.
@ రాజీ మీరు చెప్పినది నిజమే! అక్కడ ఇక్కడ అని కాదు అంతటా బహు భార్యాతత్వం పెరిగిపోతుంది. న్యాయ స్థానాలు తీర్పు ఇవ్వడం లో యెంత జాప్యం చేసారో..చూసారు కదా! వారు డబ్బు కోసం పోరాడటం లేదు. ఇలా ఎందుకు చేసారు అని అడిగి ముఖా ముఖి సమాధానం కోరుతున్నారు. వీలయితే మా రమ ఇలా ఇంకెవరు చేయ కుండా ఉండాలని బుడ్డి వచ్చేటట్లు చేయాలని కోరుకుంటున్నారు.
@ శిశిర గారు.. ఆమెకి న్యాయం జరగాలంటే శివశంకర్ రెడ్డి కి చట్ట ప్రకారం శిక్ష పడాలి అండీ!
@ అచంగా..న్యాయం జరగడం ఆలస్యం కాబట్టే వారు అలా ఆవేశంకి లోనయి అతనిని ఆ విధంగా నిలదీయాలసి వచ్చింది.
స్పందించిన అందరికి మరో మారు ధన్యవాదములు.
Very Bad
కామెంట్‌ను పోస్ట్ చేయండి