1, నవంబర్ 2011, మంగళవారం

గీత రచయిత్రి జ్యోతిర్మయి అంటే విద్వాన్ విశ్వం గారు


మన తెలుగు సినీ సాహిత్యకారులలో అందరూ పురుషులే కనబడతారు కాదు పురుషులే రాజ్యం ఏలుతున్నారు. 
నేను గమనించిన ఒక సినీ గేయ రచయిత్రి ఉన్నారు. ఆమె శ్రీమతి జ్యోతిర్మయి. 
ఆమె రచించిన లేత చలి గాలులు అన్న పాట..యెంత రొమాంటిక్ గా ఉంటుందో!ఆమె గురించిన వివరాలు అంతగా తెలియవు కానీ పాట సాహిత్యం మాత్రం లభ్యం . ఇక్కడ చూడండి.
 చిత్రం:మూడు ముళ్ళు 
గానం: ఎస్.పి.బాలు,పి.సుశీల
సంగీతం:రాజన్-నాగేంద్ర
గీత రచన:శ్రీమతి.జ్యోతిర్మయి

లేత చలిగాలులూ..హొయ్ .దోచుకోరాదురా.
చలివెలుగు వెన్నెలలూ నిను తాకగా తగవురా 
లేత చలిగాలులూ ..హొయ్ దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగా లేవులే (లేత)

అందాల నా కురులతో వింజామరలు వీచనా (అందాల)
రాగం,భావం,స్నేహం,మొహం నిన్నే వేడనా
నీ కురుల వీవేనలకు నా హృదయమర్పించనా 
రూపం,దీపం,శిల్పం,నాట్యం నీలో చూడనా 
కనుల భాష్పాలు ఆహా ..కలల భాష్యాలు లా..లా..ఓహో ..ఓ ..
వలపులా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా (లేత)

ఆధారాల కావ్యాలకూ ఆవేశ మందించనా
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా 
మందార ముకులాళతో పాదాలు పూజించనా (మందార )
అలనై,కలనై,విరినై,ఝురినై నిన్నే కోరనా 
హృదయ నాదాల..ఆహా ..మధుర భావాల..ఆహా హ ల ల లా 
చిగురు స్వరసాల నవ వసంతాల విరులెన్నో అందించగా (లేత) 


 పాట  కూడా చూసి లీనమయి పోయారు కదా!
ఇలాటి పాటలు ఏమిటి అవకాశం ఇస్తే చాలా సందర్భాలకి తగినట్లు గీత రచనలు చేయ గల రచయితలు ఉన్నారు. అలా స్త్రీలకి అవకాశం రావాలని కోరుకుందాం.  గీత రచయిత్రి  జ్యోతిర్మయి  ..మన బ్లాగర్ జ్యోతిర్మయి గారే నని నాకనిపిస్తుంది. (శర్కరి..బ్లాగ్ )   వేచి చూద్దాం ..  ఎవరైనా జ్యోతిర్మయి గారి వివరాలు అందిస్తారేమో..!

ఈ పోస్ట్ కి వచ్చిన వ్యాఖ్యలలో వొకరు వివరాలు అందించారు. విద్వాన్ విశ్వం గారు  జ్యోతిర్మయి అనే కలం పేరుతో సినిమా పాటలు వ్రాసారని చెప్పారు. 
ఈ పాటకు సాహిత్యం విద్వాన్ విశ్వం గారు అని చెప్పుకుందాం. 
 

8 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ.. You made my day. నేను ఆ జ్యోతిర్మయిని కాను. మనసుకు తోచినదేదో రాసుకుపోయే సాదా సీదా బ్లాగరుని ఇంకా చెప్పాలంటే కొత్త బ్లాగరుని. 'మన జ్యోతిర్మయి గారు' అన్నారు కదా ఆ మాట చాలు నాకు. మీ అభిమానానికి ధన్యవాదాలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారు మంచి పాటను,
అలాగే మంచి రచయిత్రిని కూడా పరిచయం చేశారు.
నాకు కూడా చాలా చాలా ఇష్టమైన పాట ఇది.

శశి కళ చెప్పారు...

చాల బాగుంది పాట....మీరు చాలా మంచివి
పరిచయం చెస్తారు.

కొత్త పాళీ చెప్పారు...

very interesting.
I often wondered about this - how come there are no women lyricists?

వేణూశ్రీకాంత్ చెప్పారు...

వనజ గారు, ఈ పాటకి చాలామంది వేటూరి గారికి క్రెడిట్స్ ఇచ్చారండీ.. మ్యూజికాలజిస్ట్ రాజా గారితో సహా.. మీరు సినిమా టైటిల్స్ లో చూశారా ఈ పాట రాసింది జ్యోతిర్మయి గారని. కొద్ది రోజుల క్రితమే ఈ పాటల రచయిత్రుల గురించి మా మిత్రుల మధ్య కొంత చర్చ జరిగింది అందుకే ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను. సినిమా నాకు దొరకలేదు చూడడానికి.
http://rajamusicbank.com/lyrics/Singer/Search/Moodu-Mullu/Letha-Chaligalulu/280.html

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వేణు శ్రీకాంత్ గారు.. నేను గమనించాను. అయితే.. చిమట మ్యూజిక్ లోను .సఖియా డాట్ కం ..లోను గీత రచయిత్రి జ్యోతిర్మయి అని ఉదహరించారు.ఆలాగే నేను ఎక్కువగా వినే ఆకాశవాణి లో కూడా.. గీత రచయిత్రి జ్యోతిర్మయి అని చెప్పడం పదిహేను ఏళ్ళుగా వింటున్నాను. మీ స్పందనకి..ధన్యవాదములు.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

Thanks వనజ గారు, ఓ మీరు ఆకాశవాణి లో కూడా విన్నారా ఐతే కరెక్టే ఐ ఉంటుందిలెండి. ఇపుడే చిమటలో వెతికితే మరో రెండు పాటలు వీరు రాసినవే దొరికాయి. మరికొన్ని వివరాలు తెలుస్తాయేమో వేచి చూద్దాం.

కొత్తావకాయ చెప్పారు...

"విద్వాన్ విశ్వం" రాసేవారండీ జ్యోతిర్మయి పేరుతో. "జ్యోతిర్మయి" ఆమె కాదు ఆయనే. "పెన్నేటి పాట" అనే పద్య కావ్యం ఆయనదే. "జ్యోతిర్మయి" ఆయన సినిమా పాటలకి కలం పేరని విన్నాను.