20, జనవరి 2012, శుక్రవారం

ఉషా ఉతుప్ ..తెలుగు లో..రెండు దశాబ్దాల తరువాత



ఉషా ఉతుప్ .. ఆమె పేరు వింటేనే.. ఉప్పెత్తున ఎగసి పడే కడలి కెరటం అలా స్థాణువులా నిలిచి పోయినట్లు..

తెలుగు లో..రెండు దశాబ్దాల తరువాత  ఉష ఉతుప్ పాట  పాడారట. కులు మనాలి  అనే చిత్రంలో  మంచు కొండల   జాబిలీ  మనువు నడచిన ఈ వ్యాలీ ..అనే పాట పాడారట.
 ఆమె అంతకు క్రితం పాడిన కీచురాళ్ళ పాట గుర్తుంది కదా!  పాట జ్ఞానం ఉన్న ఎవరు కూడా.. ఆమె ఉత్సాహాన్ని ,గొంతుని మర్చి పోలేరు కదా! అందుకే ఈ పాటని గుర్తు చేసుకుంటూ..
ఆమె ఇంకా కొన్ని హింది చిత్రాలకి తెలుగు   అనువాదం లోకి చేసి నప్పుడు కొన్ని పాటలు పాడారు కూడా.
అయినా మన తెలుగు పాటంటేనే మనకి   మక్కువ కాబట్టి ఈ పాట ..
ఈ పాట కి సాహిత్యం అందించిన వారు: వేటూరి సుందర రామ మూర్తి 
సంగీతం; ఇళయరాజా 

good evening ladies and gentleman
and hi everybody
welcome to the youth panorama
and welcome to all of us here on stage
welcome to keechuraallu

common everybody hip the beat hip the beat



డుం చ    డుం డుం చ 
చ డుం చ     చ డుం చ 

డుం చ    డుం డుం చ 
చ డుం చ     చ డుం చ

కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు 
కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు 
పోద్దుగూకు వేళ పోకిరోళ్ళు 
రాతిరేల సాగే రాక్ రోలు 
ఒళ్ళే మెదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు     : కీచురాళ్ళు  :


షడ్జమోన్నత శృతి సారం  : 2 :
అంగారకమాశ్రయామ్యహం  : 2 :


తారలన్ని పాడుతున్న అర్ధరాత్రి వేళలో 
నెల మీద వింత  వంత పాటలు హే... 
మధ్య రాత్రి మిధ్యలోన మందు వేయు చిందులో 
పుట్టె నిద్ర పట్టభద్ర వేటలు 
పిచ్చి కేక మిగిలి తగులుతుంది చచ్చినాకాపట్టు కాకా వెలిగి రగులుతుంది హస్త రేఖ  
కండలన్ని పోయి గుండె ఉన్న రేయి 
మొరాల కీచు కీచుమన్న కీచురాళ్ళు       : కీచురాళ్ళు :

చంద్ర కౌశిక రాగానందం : 2 :
శరదిందం నామామ్యాహం  : 2 :

సూర్య దృష్టి సోకుతున్న శూన్య మాస వేళలో 
చూరు కింద చందమామ పూవులు 
కోకిలమ్మ మూగపోవు వాన కారు కొమ్మలో  
కొండ వాగు వాగుతున్న అందెలు
కృష్ణ రాయ మృదుల హంపి శిధిల శిల్పరాయా  
హిస్టరీ లో కదులు చాటు ఎదల కీచురాయా 
జ్ఞాపకాలు జారి జాతకాలు మారి 
గతాలు తొవ్వి నవ్వుకున్న                    : కీచురాళ్ళు :  


ఇక్కడ   పాటని  డౌన్లోడ్  చేసి  వినేయండి 

లేదా వినడానికి సదుపాయాన్ని వెదికి పట్టుకొచ్చాను వినేయండి.

ఇక్కడ  వినేయండి అలాగే పాట సాహిత్యాన్ని  http://songlyrics-pasupuleti.blogspot.com/2011/10/keechurallu-song lyrics   వారి  నుండి సేకరించాను. వారికి ధన్యవాదములతో.. 

4 కామెంట్‌లు:

laddu చెప్పారు...

This was one of my favorite song I used to listen on my old videocon tape recorder when I was a kid.

pradeep చెప్పారు...

ee paata rasindi evaru?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రదీప్ గారు.. ఈ పాట వ్రాసిన వారు.. వేటూరి సుందర రామ మూర్తి గారు. సంగీతం ఇళయరాజా గారు

@వంశీ కృష్ణ ..పాట గురించి..బాగా గుర్తు చేసినట్టు ఉన్నాను కదా! చిన్నప్పుడే కాదు ఇప్పుడూ బాగా వినేయండీ :)))))

మధురవాణి చెప్పారు...

భలే ఉంటుంది కదా ఈవిడ గొంతు అసలు.. Unique voice!
చిన్నప్పటి తర్వాత మళ్ళీ ఈ మధ్యే విన్నా ఈ కీచురాళ్ళు పాట.. :)