2, జూన్ 2012, శనివారం

అమ్మంటే - నాన్నంటే


ఈ పాట ఈ రోజు ఉదయం నుండి తరుముతుంది.

ఉదయాన్నే అప్రయత్నంగా " కోటీ"గారి ట్యూన్ మస్తిష్కం పై మీటి వెళ్ళింది.

ఆ ట్యూన్ ఉన్న పాట ఏమై ఉంటుంది అని నా మెమరీ కి పరీక్ష పెట్టాను. ఇదిగో ఈ పాట స్ట్రైక్ అయింది.

పాట వింటూ సాహిత్యం వ్రాసేసుకున్నాను. ఈ పాటకి సాహిత్యం అందించినవారు "చంద్ర బోస్ "

అమ్మంటే -నాన్నంటే ఏమిటో.."మావిడాకులు " చిత్రం లోని ఈ పాట చూడండి.పాటలోని సాహిత్యం ఎంతొ చెప్పింది. మనం ఏం చెప్పినా అంతా కన్నా చాలా తక్కువ,

ఇదిగో..సాహిత్యం...


అమ్మంటే తెలుసుకో ..జన్మంతా కొలుచుకో
ఇలలో వెలిసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ
అమ్మంటే తెలుసుకో ..జన్మంతా కొలుచుకో
ఇలలో వెలిసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ
ఓ..ఓ..ఓ..ఓ... అనుబంధానికి ..ఓ..ఓ..అనురాగానికి
తొలి తొలి రూపం అమ్మంటే

నాన్నంటే తోడురా ..నీ వెంటే నీడరా

అమ్మయిన స్త్రీ జన్మ అరుదైన పుణ్యం
రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం
పేగు చిన్ని ముడత పడిన పొత్తికడుపు చర్మం
స్త్రీ జాతి త్యాగాలు రాసున్న గ్రంధం
మమతెరిగిన మాతృత్వం తరగని అందం
అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం
అతి మధురం తల్లి తండ్రి అయిన క్షణం

అమ్మంటే తెలుసుకో ..జన్మంతా కొలుచుకో
ఇలలో వెలిసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ

పుట్టించ గల్గేది మగ జన్మ అయినా
ప్రతి వారు కాలేరు నిజమైన నాన్న
కన్న తండ్రి అన్న పదం జంతువులకి ఏది
ఆ జ్ఞానం ఉంటే అసలైన తండ్రి
ఇదిగిదిగో ఈ బిడ్డని కన్నది మీరే..... అని
నలుగురు తమనెంతో పొగుడుతూ ఉంటే....
తండ్రి అవడం అంటే అర్ధం అదే కదా ....
నాన్నంటే తోడుగా నీ వెంటే నీడరా
నిను పాలించే మహారాజు పేరు నాన్న

అమ్మంటే తెలుసుకో ..జన్మంతా కొలుచుకో

ఈ పాట వినండీ..కోటి సుస్వరాలు మర్చిపోవడం సాధ్యం కాదు.
పాట సాహిత్యం అంతా నిజం.


7 కామెంట్‌లు:

Alapati Ramesh Babu చెప్పారు...

వనజవనమాలి గారు! ప్రభాతంలో మొదటగా ఓపెన్ చెసినది మీబ్లాగ్ అహా ఎమిభాగ్యము ఓ కమ్మని చక్కని పాట ఆడియో ఫైల్స్ గా ఇచ్చారు.మా నాన్నలకు బ్రహ్మముహుర్త సుప్రభాతములా వున్నది.

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

wow song super gaa undi

బాలకృష్ణా రెడ్డి చెప్పారు...

వనజవనమాలి గారు
మంచి సాహిత్యమున్న గీతాన్ని పరిచయం చేసారు
మీ కవితా హృదయానికి జోహార్లు

జలతారు వెన్నెల చెప్పారు...

ఇంతకు ముందు వినలేదండి. పాట బాగుంది వనజ గారు.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

అద్భుతమైన సాహిత్యం.పాట రచయిత ఎవరండి.మంచి సంగీతం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రమేష్ గారు.. మంచి పాటని సహృదయం తో మెచ్చినందుకు ధన్యవాదములు.
@ప్రిన్స్ ..గారు.. మంచి సాహిత్యం కల పాటలు చాలా ఉన్నాయి . మీ అంతా కాకపోయినా.. నేను కొన్ని పరిచయం చేద్దామని ప్రయత్నం. ధన్యవాదములు.
@బాలకృష్ణ రెడ్డి గారు.. పాట నచ్చినందుకు ధన్యవాదములు. చాలా సంతోషం.
@జలతారు వెన్నెల గారు.. పాటల కోసమే పుట్టినట్లు.. నేను మీరు కూడా..:) వినేయండీ..ధన్యవాదములు.
@రవి శేఖర్ గారు.. ఈ పాటకి "చంద్ర బోస్"గారు సాహిత్యం అందించారు. "కోటి" గారి స్వరకల్పన నాకు చాలా ఇష్టం.
పాట నచ్చినందుకు ధన్యవాదములు.
ఇంకొక విషయం .. క్రింద నేను "డివ్ షేర్ " లో షేర్ చేసిన పాట వినండి. "బిష్మిల్లా ఖాన్" మహనీయుని షెహనాయి స్వరాలు వినవచ్చు.జి కే వెంకటేష్ స్వరకల్పనలో.. వారు స్వరాలు అందించారు. ఆ పాట సాహిత్యం,సంగీతం వండర్ఫుల్ ..

VJ చెప్పారు...

ఈ పాటకి సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి