15, జూన్ 2012, శుక్రవారం

ప్రియునికై అన్వేషణ

ఉదయం నుండి ఒకటే వెదుకుతున్నాను. కనబడితే ఒట్టు. నాకు తను లేకుండా.. ఒక గంట కూడా పొద్దు పొతే ఒట్టు వెదుకుతూనే ఉన్నాను విసిగి వేసారి పోయాను. 

అందరిని అడుగుతున్నాను..అతను కనబడ్డాడా? అని ఎవరు అని అడిగారు.

అయ్యో..అతనే! ఏమని చెప్పను..అతను అంటే అతనే..కనబడ్డాడా..?అని అడిగాను. అందరు లేదని సమాధానం ఇచ్చారు. అయ్యో! నా జానేమన్! నీ ఎడబాటు ఎంత దుఃఖం ! నేను ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను .

 "నిధి ఛాలా సుఖమా! నీ పెన్నిధి చాలా సుఖమా!" అంటే..నీ పెన్నిధి చాలా సుఖమని చెప్పనా!? ఎందుకు అలా దాక్కుని నన్ను విసిగిస్తావు? అని తిట్టుకున్నాను కూడా. 

 అతని చల్లని స్పర్శతో..నా దేహపర్యంతం అలముకున్న బాధ అంతా క్షణకాలంలో మాయం అయిపోతుంది. నా నిర్లక్ష్యం తో అతనిని దూరం చేసుకున్న బాధ "ఇంతింతై వటుడింతై" రీతిన నన్ను బాధిస్తుంది.
 

 స్నానపానాదులు అవసరం లేదు,అన్నపానీయాలు సహించడం లేదు.అక్షరం పై దృషి నిలుపలేను..వీనుల విందైన సంగీతాన్ని ఆస్వాదించ లేకున్నాను. మనశ్శరీరాలు అతని జాడ కోసం వెతికి వెతికి డస్సి గొన్నాయి. మావారిని,మా అత్తగారిని,అందరిని అడిగాను నా ప్రియుడు ఎక్కడ ? అని. ఎవరికీ తెలుసు ?..నీ ప్రియుడు నీ ఇష్టం! భద్రంగా ఎక్కడ దాచుకున్నావో,లేక ఎక్కడ చేజార్చుకున్నావో! అని..విసుక్కున్నారు. 


 అసలు నాకు ప్రియుడు అవసరం రాదనుకున్నాను. మా పిన్నికి ప్రియుడు ఉన్నాడు,మా చెల్లికి ప్రియుడు ఉన్నాడు..ఛీ  ఛీ .... నాకు ప్రియుడి అవసరం రానే రాకూడదు అనుకున్నాను. 

 మనం ఏదైతే వద్దనుకుని ద్వేషిస్తామో.. అదే మనలని వెంటాడుతుంది చూడు అని పిన్ని,చెల్లి హెచ్చరించారు. వాళ్ళు అన్నట్లుగానే..ప్రియుని అవసరం నాకు వచ్చి పడనే పడింది. ఒక్కసారి ప్రియుని చెంత సాంత్వన చెందానా.!? ఇక నేను అతన్ని ఒదిలిపెడితే ఒట్టు. అది మొదలు నా ప్రియుడు ఎప్పుడు నన్ను అంటి పెట్టుకుని ఉండాల్సిందే!. 


 నా ప్రియుడు దూరం అవుతాడు అని ముందస్తు సూచనలు కనబడాగానే..అతని ఆచూకి వెతికి వెతికి ..చేజిక్కించుకుని ..గుప్పిట బిగించుకుని విజయగర్వంతో...మురిసి ముక్కలైపోతాను. 

 నా ప్రియుడు నా ప్రక్కన ఉంటే ఏ బాధ, గాధ నన్ను దరిచేరవు అని ఉల్లాసంగా ,ఉత్సాహంగా అధికంగా సామర్ధ్యాన్ని మించి పనులు చేసుకుంటాను. నను అంతలా అలరించే ప్రియుడు ఉంటే..మరి నేను అలా ఉండకుండా నిరుత్సాహముగా ఎలా ఉంటాను చెప్పండి.? 

 పొద్దస్తమాను వెదికాను వెదికాను. నా కళ్ళలో నీళ్ళు ఊరుతున్నాయి. ఎక్కడున్నావు ప్రియా !..ఒక్క సారి కనబడవా!? . నిన్ను రోజు అతిగా ఉపయోగించుకుని ఇబ్బంది పెట్టాను కదా! ప్రామిస్..నన్ను నమ్ము ఇక పై అంతగా నిన్ను ఇబ్బంది పెట్టను సరేనా! అని వేడుకున్నాను. మంచమెక్కి దిగులుగా పడుకున్నాను. 

కాసేపాగేసరికి నాకు ఒక చిన్న ఆచూకి దొరికింది . వెంటనే లేచి వెతికాను. ఆఖరికి .. నా ప్రియుడు నన్ను కనికరించాడు. ఎక్కడ ఉన్నాడో.. కనబడ్డాడు. నాకు దొరికి పోయాడు..మంచానికి బెడ్ కి మద్య దాక్కుని ఉన్నాడు. బయటకి తీసి బెడ్ మీద పడేసి.. అమ్మయ్య .అనుకున్నాను.

 నా.."ఒలిని" జెల్ నాకు దొరికిన్దోచ్! ఇక ఏ నడుము నొప్పులు,బెణుకులు,మెడ నొప్పులు, కీ బోర్డ్ పై టక టక మని నొక్కిన నొక్కులకి వచ్చిన నొప్పులకి సర్వ బాధ నివారిణి .."ఒలిని" రియల్ పెయిన్ రిలీఫ్ .. నా అసలైన ప్రియుడు. 

11 కామెంట్‌లు:

భాస్కర్ కె చెప్పారు...

నా.."ఒలిని" జెల్
meedena andi,
andiri priuda krishnudila.
bhagundandi.

అజ్ఞాత చెప్పారు...

:)

Sai చెప్పారు...

భలే ఉంది అండీ.... ఎమవుతుందా అని ఉత్కంఠతగా చదువుతున్నాను.. చివరి లైనుకొచ్చేసరికి నవ్వు ఆగలేదు... సూపర్..

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

ఓర్నీ..ఒలిని గురించి ఇంత పెద్ద పోస్టా???
చివరి వరకు ఉత్కంఠగా చదివించారు...SOOOOOPER!

సీత చెప్పారు...

హహహహ.........వనజ గారూ.......సూపర్.....
--సీత

జ్యోతిర్మయి చెప్పారు...

జాగ్రత్త౦డోయ్ మరే భామయినా కొంగున కట్టేసుకోగలదు.

బాలకృష్ణా రెడ్డి చెప్పారు...

మీ ప్రియా ! ప్రియతమా రాగాలు
విన్నాను ఇంతలా కంగారు పడాలా పెట్టాలా
వనజ వనమాలీ గారు
మీ రచనకు జోహారు

మాలా కుమార్ చెప్పారు...

:)))

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

the tree gaaru.. Thank you very much.
@puranapandaphani gaaru :) Thank you!!
@Sai gaaru ..Thank you very much!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నిరంతరమూ వసంతం ,,సురేష్ గారు.. ఓర్నిఒలిని ..అనకండి. పవర్ఫుల్ ..ఒలిని..కి కోపం వచ్చేనేమో!:)
థాంక్ యు వేరి మచ్!!
@.. సీట్ ఆగారు.. :) ధన్యవాదములు.
@జ్యోతిర్మయి గారు.. ఎవరు కొంగున ముదేసు కోకుండా జాగ్రత్త పడాలంటారా ? అలాగే నండీ:) థాంక్ యు!!
@ బాల కృష్ణ రెడ్డి గారు. ధన్యవాదములు.
@మాలా కుమార్ గారు థాంక్ యు వేరి మచ్...

జలతారు వెన్నెల చెప్పారు...

:))