మృదువుగా మాట్లాడండి
మృదువుగా మాట్లాడండి.
భయపెట్టటం కంటే ప్రేమతో పరిపాలించడం చాలా ఉత్తమం
మనం ఇక్కడ చేసే మంచి పనిని..
ఏ కఠినమైన మాట కూడా పాడుచేయకుండా ఉండనివ్వండి.
చిన్న పిల్లలతో మృదువుగా మాట్లాడండి;
వారి ప్రేమను తప్పకుండా పొందండి;
మృదువైన, సున్నితమైన స్వరంతో వారికి బోధించండి;
వారు ఎక్కువ కాలం చిన్నపిల్లలుగా ఉండకపోవచ్చు.
యువకులతో మృదువుగా మాట్లాడండి,
ఎందుకంటే వారు భరించడానికి సరిపడా అనేక కష్టాలు ఉంటాయి;
వారి మనసు ఆందోళనకరమైన ఆలోచనలతో నిండి ఉంది.
వారికి మృదుత్వాన్ని అందిస్తే
జీవితంలో వారు సాధ్యమైనంత ఉత్తమంగా జీవిస్తారు,
వృద్ధులతో మృదువుగా మాట్లాడండి,
జీవిత సారం అంతా దాదాపుగా ఖాళీ అయిన దశలో
చింతలతో నిండిన వారి హృదయాన్ని బాధపెట్టవద్దు
అలాంటి వారిని శాంతితో నిష్క్రమించనివ్వండి.
తప్పు చేసిన వారితో మృదువుగా మాట్లాడండి
వారు వ్యర్థంగా శ్రమించారని తెలుసుకోనివ్వండి
బహుశా దయలేనితనం వారిని అలా చేసి ఉండవచ్చు;
ఓహ్, తిరిగి వారి మనసుని గెలుచుకోనివ్వండి.
మృదువుగా మాట్లాడండి
అది హృదయం యొక్క లోతైన బావిలో
వేయబడిన ఒక చిన్న సంగతి
అది తీసుకురాగల మంచిని, ఆనందాన్ని
శాశ్వతత్వం చేస్తుంది.
(అజ్ఞాత ఆంగ్ల కవిత కు స్వేచ్ఛానువాదం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి