28, ఫిబ్రవరి 2026, శనివారం

జీవశక్తి


జీవశక్తి  - వనజ తాతినేని. 


ఈ రాత్రి యెంతకీ కరగడం లేదు. 

నా చుట్టూ నిశ్శబ్దంగా వుంది

కాదు కాదు. నిశ్శబ్దం కూడా తన పని 

తాను చేసుకుంటుంది. 

దానికి తోడు మిణుగురులు కీచురాళ్ళు. 


నిద్ర లేని వాళ్ళు నిద్ర పోతున్న వాళ్ళను

ఏమని చెప్పి మేల్కొలపగలరు!? 

అవతల నిద్రపోని రుద్రుడిని భస్మహారతికి

ముస్తాబు చేస్తున్నారు

అది కూడా నాలాంటి నిద్ర లేని వాళ్ళు చేసే పనే.

కృతజ్ఞతలు తెలుపకపోతే సేవలు చేయకపోతే 

వారికి ఏమీ తోచదు. 


నిద్రాణంలో వున్న జీవశక్తి పొరల్ని చీల్చుకొని 

బయటకు రావడం అంటే అంతేనా!? 

ఏదైనా అది నీలో నుంచి రావాలి. 

అది నీదై ఉండాలి. 

జీవశక్తి కృతజ్ఞత కూడా. 

28 Feb 2026. 03:33 pm.

©️Vanaja Tatineni

కామెంట్‌లు లేవు: