4, డిసెంబర్ 2012, మంగళవారం

In ankhon ki masti ke (ఇన్ ఆంకోంకి మస్తీ కే) (600)




In ankhonki masti ke (ఇన్ ఆంకోంకి మస్తీ కే) పాట పరిచయం


ఉమ్రావ్ జాన్ (Umrao Jaan)

రేఖ ప్రధాన పాత్రగా నటించిన నవలా చిత్రం. 1899 వ సంవత్సరంలో మీర్జా హది రుస్వా రాసిన ఉమ్రావ్ జాన్ అడా ఆధారంగా 1981 లో ఈ సినిమా రూపొందింది. ఈ నవల ను తెలుగులో కూడా చదవవచ్చు. దాశరథి రంగాచార్య ఈ నవలను అనువదించారు. నిజం చెప్పాలంటే ఈ నవల చదవడం కంటే సినిమా చూడటం బాగుంటుంది.


లక్నో కోఠాలో, అమీరాన్‌కు ఉమ్రావ్ జాన్ అనే పేరు పెట్టారు. సంవత్సరాల తరువాత, ఉమ్రావ్ పెరిగి పెద్దదై, ఒక నిష్ణాతుడైన కవిగా, అలాగే ఒక అసాధారణమైన తవాయిఫ్‌గా కూడా ఎదిగింది.

తవాయిఫ్ అంటే .. సంగీత నాట్యకళ కవిత్వ కళలతో అందంతో ఆకట్టుకునే స్త్రీ అని అర్థం. వారు పెళ్ళి చేసుకోరు. మనసుకు నచ్చిన వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటారు. తవాయిఫ్ కి వేశ్యలకు చాలా తేడా వుంటుందని చరిత్రకారులు చెబుతారు. 


ఈ చిత్రంలో మనసును కట్టిపడేసే అందమైన పాటలు వున్నాయి. . రేఖ చార్మ్ కి తగిన పాత్ర. ఉమ్రావ్ జాన్ గా నటించిన ఆమె ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు . 'ఉమ్రావ్ జాన్' తెరపై ఒక కవిత్వం లాంటిది. నిర్మాత దర్శకుడు ముజఫర్ అలీ,  19వ శతాబ్దానికి చెందిన ఒక వేశ్య యొక్క సున్నితమైన  విషాద గాథను అద్భుతంగా చిత్రీకరించారు.

ఇన్ ఆకోంకి మస్తీ కే .. అనే ఘజల్ ని  ఆశా బోస్లే పాడారు. దిల్ ఛీజ్ క్యా హై అనే పాటకు ఆశా బోస్లే కు నేపథ్య గాయని గా పురస్కారం లభించింది. సంగీతం అందించిన ఖయ్యాం కి జాతీయ పురస్కారం లభించింది. 

ఈ పాట వినడానికే చాలా బాగుండటమే  కాదు చూడటానికి వేయి కళ్ళు వుండాలి. ముఖ్యంగా రేఖ అభినయాన్ని చూడటానికి. క్రింద లింక్ ఇస్తున్నాను. చూడండి.


**************


ఈ కళ్ళ ఆనందానికి మైమరచి పోయేవారు

 వేలమంది ఉన్నారు.ఈ కళ్ళతో ముడిపడిన వేలాది కథలు ఉన్నాయి. (2)


ఒంటరిగా ఉన్నది నువ్వు ఒక్కడివే కాదు, 

నా ప్రేమ అవమానానికి గురైంది. 

ఈ నగరంలో నీలాంటి ప్రేమికులు(పిచ్చివారు) వేల సంఖ్యలో ఉన్నారు.


ఈ కళ్ళ ఆనందానికి మైమరచి పోయేవారు వేలమంది ఉన్నారు.

ఈ కళ్ళతో ముడిపడిన వేలాది కథలు ఉన్నాయి


మేము మాత్రమే కళ్ళతో మద్యాన్ని వడ్డిస్తాము.

ప్రపంచంలో వేలకొద్దీ మద్యశాలలు ఉన్నాయి.


ఈ కళ్ళ ఆనందానికి మైమరచి పోయేవారు వేలమంది ఉన్నారు.

ఈ కళ్ళతో ముడిపడిన వేలాది కథలు ఉన్నాయి


మీరు ఈ నీలి ఆకుపచ్చ  కొవ్వొత్తిని  తుఫానుతో బెదిరిస్తున్నారు.

ఈ నీలి ఆకుపచ్చ కొవ్వొత్తికి వేలకొద్దీ చిమ్మటలు పట్టాయి.


ఈ కళ్ళ ఆనందానికి మైమరచి పోయేవారు వేలమంది ఉన్నారు.

ఈ కళ్ళతో ముడిపడిన వేలాది కథలు ఉన్నాయి


హిందీ సాహిత్యంం: 


इन आँखों की मस्ती के मस्ताने हज़ारों हैं 


इन आँखों से वाबस्ता अफ़साने हज़ारों हैं

इन आंखों... 


इक तुम ही नहीं तन्हा, उलफ़त में मेरी रुसवा

इस शहर में तुम जैसे दीवाने हज़ारों हैं 

इन आँखों... 


इक सिर्फ़ हम ही मय को आँखों से पिलाते हैं 

कहने को तो दुनिया में मयखाने हज़ारों हैं 

इन आँखों... 


इस शम्म-ए-फ़रोज़ाँ को आंधी से डराते हो 

इस शम्म-ए-फ़रोज़ाँ के परवाने हज़ारों हैं 

इन आँखों…









2, డిసెంబర్ 2012, ఆదివారం

గమనం - గమ్యం

"విహంగ" లో.. నా కవిత    ఈ లింక్ లో 

స్త్రీమూర్తిలోని మాతృ హృదయం ఇగిరిపోయిన వేళ
డబ్బు కోసం తమ పాపలని అమ్ముకునే తల్లులు 
మనిషిలోని
మానవత్వం మంటగలసి
దానవ రూపంలో అభం-శుభం తెలియని
పసిపిల్లలపై అరాచకాలు
పైసల బేరంలో లాభాలార్జించే
అంగడి బొమ్మలుగా మారిపోతున్న అబలలు
వరకట్నపు వేధింపులతో.
అతివకి అత్తింట్లో మృత్యు వేదనాభరిత లోక
సాక్షాత్కారాలు
విషపు స్రావాలు  పుక్కిలి పట్టి
ప్రేమ పేరిట వంచించే పురుషుల పాలిటబడి
సమిధలవుతున్న పడతులు
                 
పతనమైన మానవత్వపు చివరి అంచున నిలబడి
కన్నీరు మున్నేరు అవుతున్న మగువా?
నీ పయనం ఎటు వైపు!?
అఖిలవిశ్వంలో
అర్ధభాగపు ప్రగతి మాదేనంటూ..
ఎలుగెత్తి చాటుతూ..
ఆర్ధిక స్వాతంత్ర్యపు స్వావలంబనలో
హక్కులపోరాటంలో
విశ్రాంతి ఎరుగని యోధురాలివా?
నాగరికత వెల్లవేసుకుని
వలువలూడి నేలజీరాడినట్లు 
మాన మర్యాదలు లుప్తమై ..
కనకపు సింహాసనంపై అందాల రాణివై 
వెలుగొందాలని ఆకాంక్షతో
అజ్ఞాన అంధకారంలో..మునిగి తేలుతున్నావా?  
నీ జాతి మనుగడ మృగ్యమై పోతుంటే..
అది గుర్తించ జాలక
సమానత్వపు బావుటా ఎగరవేయాలని
నీ మహత్తు గొప్పదని ఎంచి
పైకెగురలేక చతికలబడ్డావా .?
కబళించిన కరాళ దంష్ట్రలను తుదముట్టించి
బంధించిన శృంఖలాల్ని చేదించి 
                                            జ్వలితవై, ప్రజ్వలివై,దేదీప్యవై వెలుగొందు*