27, జనవరి 2011, గురువారం

మినీ మినీ మినీ..కవితలు




1 .విహంగానికి.. ఎంతటి స్వేఛ్చో!
ఆకాశంలో ఎగురుతున్నందుకు కాదు  
రెక్కలు విరిచి పంజరాన బంధించ నందులకు....

2.శిఖరానికి ఎంత గర్వమో!
మహోన్నతంగా ఉన్నందుకు  కాదు..
అధిరోహకుల ఆత్మ విశ్వాసంకి సవాల్ విసురుతున్నందుకు..

౩.రాగానికి ఎంత అతిశయమో!
రాళ్ళని కరిగిస్తున్నందుకు కాదు
స్వర బంధనం వీడనందుకు....

4.ఆత్మకి  ఎంతటి ఆనందమో!
జన్మజన్మాలని సృశిస్తున్నదుకు కాదు
తన ఉనికి పరమాత్మకి మాత్రమే తెలిసినంధులకు...

5.గరళం గర్వపడుతుంది
హరిస్తున్నందుకు కాదు
హరుని కంటాన భద్రంగా దాగి ఉన్నందుకు...

6.శిశిరం సిగ్గు పడింధీ
వివస్త్రగా మారినంధులకు కాదు
వసంతం తనని తడిమి తడిమి చిగిర్చింప జేసినంధులకు...

7.వెన్నెల రగిలిస్తుంది!
చల్లదనంతొ కాదు..
విరహంతో ....

8: గులాబీలు గుండెల్లో గుచ్చేస్తాయట!
 ముళ్ళతో కాదు అరవిరిసిన అందంతొ..

9.విరిబోణి తనువుని చుట్టేసిన
చీరకి ఎన్ని రంగులో !
విరుల వనంలోఎన్ని కోకలో
చీర రంగులకి   దీటుగా...                                                                                                                                                                                                                                                                                                                                                                                       

ఇన్నర్ లాంప్

దీప దీప్తోభవ

నిండుగానూనెపోసినప్రమిదలోఒదిగిన వత్తినినేను
ఆ వత్తిని వెలిగించి కాంతిని పంచాలనుకునే ఆలోచన ఒకరిది.
మనం ఎక్కడ ఉన్నా.. మన ఆలోచనల్లో నిండుగా ఉండి
మనల్ని అనుక్షణం ప్రోత్శహించి,మనలో స్ఫూర్తి నింపి
మనలని చైతన్యవంతంగా మలచే శక్తి కొందరికే ఉంటుంది.
ఆ శక్తి మనలో.. వెలిగే దీపం లాటిది.
అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.
ఆ దీపం లాంటి మనిషి ఎంత దూరంలో ఉన్నా..కానీ.. మాట ద్వారా.. పాట ద్వారా.. అక్షరం ద్వారా .. మనని ఉత్తేజపరుస్తూ.. ఉంటారు. వారినే ఇన్నర్ లాంప్.. అంటాను నేను.

ప్రతి మనిషిలోను నిబిడీకృతమైన శక్తియుక్తుల్ని గుర్తించి వారికి దిశానిర్దేశం చేసిన వారందరు ఎవరికైనా.. పూజ్యనీయులే.
అలాటి వారందరికీ.. ధన్యవాదములు తెలపటం సంస్కారం అనిపించుకుంటుంది కదా!
అందుకే.. ఈ.. టపా.. మరి మీరు.. మీలో మీరు తొంగి చూసుకుని అలాటివారు ఎవరైనా ఉంటే .. ధన్యవాదములు చెప్పడం మరువకండి.
చెప్పిన తర్వాత. ఎంత సంతోషం గా ఉంటారో.. గమనించుకోండి. ఇది నా అనుభవం కూడా.


25, జనవరి 2011, మంగళవారం

శుభాకాంక్షలు


రవీంద్రుడు జనగణమణతో..జయధ్వనులు పలికించినా..
మహ్మద్ ఇక్బాల్ సారే జహసే అచ్చాహిందు సితాః హమారా అని కీర్తించినా,
బకించంద్ర చటర్జీ వందేమాతరం గీతంతో..ప్రణ మిల్లినా..
నేతాజీ..జైహింద్ నినాదంతో జాతిని ఏక  తాటిన   నడిపించినా..
దేవులపల్లి జయ జయ ప్రియభారత జనయిత్రి అని పూజించినా..
 ఏ.ఆర్ .రహమాన్ "మా..తుజే.. సలాం" అని స్వరపరచినా..
అది మన అందరి హృదయంతరాల భారతీయ భావన.
అశోకుడు  పాటించిన  ధర్మ నిరతితొ,
బాపూజీ..అహింసా మార్గంలో..
మదర్ ప్రేమ భావనతో.. వారసత్వసంపదగా.. దేశ భక్తిని పెంపొందించుకుని..
సామాజిక భాద్యతతో.. నడుచుకుందాం.
అందరికి... గణ తంత్ర దినోత్శవ  శుభాకాంక్షలు..