2, మే 2012, బుధవారం

కౌముది లో నా కథ "ఆనవాలు "

పురిటి గడ్డని నాలుగేళ్ళలో చూస్తున్నాను అనేమో ఎద లయలలో ఎక్కడో రేగుతున్న ఎడతెగని ఉద్వేగపు అలజడి కన్ను మూతపడ నివ్వడం లేదు. పక్క కుదరడం లేదు

ఎన్నో రోజులుగా కోయకుండా రాలిపోయి ఉన్న సన్నజాజులు మనుషులు ఒకరి తర్వాత ఒకరు రాలిపోతున్న విధంకి ప్రతీకగా కనిపించాయి.

నాన్న కొసరి కొసరి వడ్డించాడు. ఇంట్లో నాలుగు రకాల కూరలలో లేని రుచి ఏదో..తగులుతుంది.అది ప్రేమ రుచి అనుకుంటాను.
ఇలా అనుకునే ఓ కొడుకు తన ఆనవాలుని కాపాడాలని తన ఊరికి వెళ్ళాడు

కౌముది లో "ఆనవాలు "..నా కథ తప్పక చూడండి

6 కామెంట్‌లు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ..
సెంటిమెంటల్ ఫూల్స్ ఎప్పుడూ కూడా ఫూల్స్ కారని బాగా చెప్పారండీ..
పల్లెటూరి వాతావరణం, ఆప్యాయతలను,కొందరు కోడళ్ళ ప్రవర్తనలను చక్కగా వర్ణించారు..

మొత్తానికి చివరిలో "ఆనవాలు"ను భలే కాపాడారండీ..
థాంక్యూ !!

జ్యోతిర్మయి చెప్పారు...

అభినందనలు వనజగారూ. ఆలోచింపచేసే కథ, కథనం చాలా బావుంది.

Kottapali చెప్పారు...

అభినందనలు. కథనమూ భాషా బాగున్నాయి.
ఐతే, కథ ఏమి చెప్పదల్చుకున్నదో మాత్రం నాకు అర్ధం కాలేదు!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతిర్మయి గారు..కథ నచ్చినందుకు ధన్యవాదములు.
@రాజీ గారు.. కథ నచ్చినండుకు మరీ మరీ ధన్యవాదములు.సెంటిమెంటల్ పూల్స్ తమ అన్నదానిని కాపాడుకోగల్గడం సాధ్యమే నండీ! అందుకే ఆనవాలు ఇంకా మిగిలి ఉండాలని నా తాపత్రయం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నారాయణ స్వామి గారు.. ధన్యవాదములు.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాయాజాలంలో చిక్కుకోకుండా తన పొలాన్ని కాపాడుకుంటూ.. తద్వారా తమ ఊరివారి ప్రయోజనాలని కాపాడుతూ ..తన "ఆనవాలు" ని మిగుల్చుకోవడానికి చేసే ప్రయత్నం చేయడం లో కథ నడచింది.
పల్లె ఆనవాలుని మిగుల్చుకోవాలని చెప్పే ప్రయత్నం చేసాను అండీ!

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు కథ బాగుంది.ఎప్పటిలాగే బాగా రాసారు.