26, మే 2012, శనివారం

బిచ్చటపు ఎద













తండ్రీ..
ప్రేమ రాహిత్యంలో కొట్టుకుని పోతూ
నన్నే ఊతగా చేసుకుందామని వచ్చిన వారికి
రిక్త హస్తాలతో పంపుతున్న
నావద్ద బిచ్చటపు ఎద మాత్రమే ఉందని నీకు తెలుసు..
వారికి నేనేమివ్వగలను

ప్రేమ-శరీర ద్వంద్వాలు
ప్రకృతి-పురుషులు
మనిషి మనిషికి మధ్య
అత్యంత సన్నిహిత సంబంధపు వంతెన
 ప్రేమ అనే భావన.

స్త్రీ-పురుష స్నేహబంధాన్ని
కేవలం శరీరాల పరిబాషలో చూసే ఈ లోకాన
నీ స్వభావాన్ని
నీవు ఇచ్చినంత గొప్పగా
పంచినంత తీయగా
మేమెలా ఇవ్వగలం

ఎన్నెన్ని అనుమానాలు
ఎన్నెన్ని సంశయాలు

నీ అదృశ్య హస్తంతో..
ప్రేమరాహిత్యంలో కొట్టుకుని పోతున్నవారిని
సేద తీర్చు తండ్రీ

ప్రేమ అనే రెండక్షరాలకున్న
అనంతమైన అర్ధాన్ని
భావ దారిద్ర్యంతో
కొట్టుమిట్టాడుతున్న వారికి
అణు మాత్రమైనా తెలిసేలా
నీ అంశని  ట్రాన్స్ ప్లాంటేషన్ చేయగల వైధ్యుడివి
నీకు సాధ్యం కానిదేముంది

ప్రేమించడం మాత్రమే మాకు తెలిసిన విద్యగా
ప్రేమని బదులు ఇవ్వడమే ఎదుటి వారి  నైజంగా
అద్భుతమైన  ప్రేమ రాగాలని సృష్టించగల
వైణికుడివి నీవే కదా

విశ్వాన్ని కంటి రెప్పలా కాచేది
ఎల్లెడలా సాంత్వన చేకూర్చేది
విశ్వమంత రహస్యం .
విశ్వరహస్యం ప్రేమే కదా

నీ సహజగుణాన్ని
జీవన పర్యంతం మాకు
అరువుగా ఇవ్వు తండ్రీ
అసలు, వడ్డీ ఇక్కడే. చెల్లించి వస్తాను
అదే కదా  ప్రేమ నైజం.

13 కామెంట్‌లు:

భాస్కర్ కె చెప్పారు...

prema gurinchi nenu chadivina kavithalalo, idi, no doubt
chaalaa manchi kavitha.

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

wow very nice andi

మానస.. చెప్పారు...

:) బాగుంది వనజమాలి గారు....

జలతారు వెన్నెల చెప్పారు...

Too good! చాలా బాగుంది వనజ గారు

అజ్ఞాత చెప్పారు...

'బిచ్చటపు ఎద ' అంటే ఏమిటండి?
కాకినాడ పెంటకోస్తు సువార్తకూటములవారి చే కనిపెట్ట బడిన పరిశుద్ధాత్మపదం లా వినిపిస్తోంది. అవునా? :D

కాయల నాగేంద్ర చెప్పారు...

వనజ గారు! 'ప్రేమ నైజం' గురించి చక్కగా చెప్పారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రిన్స్ ..గారు
@ ది ట్రీ భాస్కర్ గారు
@ మానసా గారు
@జలతారు వెన్నెల గారు
@కాయల నాగేంద్ర గారు..అందరికి ఈ "బిచ్చతపు ఎద" నచ్చినందుకు చాలా చాలా సంతోషం. మీ అందరికి మరీ మరీ ధన్యవాదములు.
@SNKR గారు సువార్త కూటమి లలో వినబడే పదం కాదండి.
నాకెంతో ఇష్టమైన దాశరధి గారి కవిత్వం లో ఈ పదం చదివిన గుర్తు. "బిచ్చతపు ఎద ,వెలుతురూ బాకు అన్న రెండు పడాలని నేను వారి కవిత్వం చదవడం ద్వారానే గ్రహించాను.
"బిచ్చటపు ఎద " అంటే ప్రేమ రాహిత్యం తో కొట్టుకొని పోతూ ఇతరుల నుండి ప్రేమని ఆశించే వారు అని అర్ధం.
ఈ కవితలో అర్ధం ..కూడా అదేనండీ!
నేనే ఇతరుల ప్రేమని ఆశించే స్థితిలో ఉన్నాను. నాది బిచ్చ టపు ఎద. నా వద్దకు ప్రేమ నిమ్మని వచ్చే వారి కోసం ఏమి ఇవ్వగలను.
భగవంతుదిల్ని ప్రార్దిస్తూ ..అడగడం ని చెప్పాను. నీలా నేను అందరిని ప్రేమించ గలనా !? అటువంటి ప్రేమని నాకు ఇవ్వు తండ్రీ అని అడుగుతున్నాను.
నా కవితలలో నాకు బాగా నచ్చిన కవిత్వం ..అండీ!
వేరే ప్రేమ తత్వాలని ..ఆ తరహాలో ప్రచారం చేయడం కి నేను దూరం..వ్యతిరేకం . ఇచ్చే గుణం ఉండాలి కాని అది అలాటి చోట్ల కాదు..అనంత విశ్వంలో ఎక్కడైనా ఇవ్వవచ్చు అనుకుంటాను నేను. :))
SNKR గారు ధన్యవాదములు. మీ ప్రశ్న నా చేత ఇంట వివరణ ని ఇప్పించింది.

సి.ఉమాదేవి చెప్పారు...

ప్రేమ శతరూపధారిణి.మన మనసు అన్ని రూపాలను ప్రదర్శించగలదు.కవిత బాగుంది.

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
చాలా బాగుంది కవిత్వంలో మీ మనో భావ వ్యక్తీకరణ.
అభినందనలు...
ప్రేమ రాహిత్యం లాంటి శాపం మనిషికి మరొకటి ఉండదేమో!
@శ్రీ

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

c ఉమాదేవి గారు..
@శ్రీ గారు.. "బిచ్చ టపు ఎద " మెచ్చినందుకు ధన్యవాదములు..

కెక్యూబ్ వర్మ చెప్పారు...

ప్రేమతో కూడిన ప్రార్థనలో మీదైన శైలిలో హృదయాన్ని ఆవిష్కరించి ద్రవింప చేసారు వనజగారూ...అభినందనలు..

Unknown చెప్పారు...

వనజ గారూ,
ప్రేమ నైజం మరచిన మనిషి ని బిచ్చటపు ఎద గా పోలుస్తూ మీరు రాసిన ఈ కవిత ఎంతగానో ఆకట్టుకుంది.
"భావ దారిద్ర్యంతో..కొట్టు మిట్టుఆడుతున్న..." ఇది చాలా చక్కని వర్ణన ... మనిషిని అన్ని జీవాల కన్నా ఉన్నతంగా నిలపగలిగే లక్షణాల్లో భావ స్పందన ఒకటి. కానీ అన్ని జీవాలనీ మనిషికన్నా ఉన్నతంగా నిలపగలిగేది ఒక్క "ప్రేమ స్పందనే". ప్రేమకి స్పందించని జీవి లేదీ లోకంలో...క్రమేపీ మనిషది మరచిపోతే ఇక ఆ దేవుడిని అరువడగక తప్పదు.
బాగుంది ఈ మీ రచనా సరళి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కెక్యూబ్ వర్మ గారు.. కవిత నచ్చినందుకు సంతోషం . ధన్యవాదములు.
@ చిన్ని ఆశ గారు కవిత నాడిని పట్టుకున్నారు. చాలా సంతోషం. ధన్యవాదములు.