జోరున వర్షం. హైదరాబాదీ వాసుల యిక్కట్లు చెప్పనలవి కాదు. నడిరోడ్లపై ప్రవహించే నీటికి దిశా లేదు, పల్లం యెరుగదు. ఎక్కడికక్కడ ఆక్రమించేసుకుని భవన నిర్మాణాలు చేపట్టిన ఫలితం వల్ల తాగడానికి నీళ్ళు లేకపోయినా వానాకాలం మాత్రం నగరం నీళ్ళలో నానుతుంది. జనం విరక్తిలో నానుతారు. ఎప్పటికీ తీరని సమస్య యిది అనుకుంటూ తిట్టు కుంటూ వానలో తడుస్తూనే యెలాగో యింటికి వచ్చి పడింది శాంతి.
కాస్త సేదతీరి తన కొలీగ్ ప్రియ చెప్పిన ఆమె స్వీయ కథని శాంతి వ్రాయడం మొదలెట్టింది
కథ పేరు "ఎవరికీ వారు యమునా తీరే'' అంతేనా "
ఇంటికి వెళ్లేందుకు పార్కింగ్ ప్లేస్ లో నుండి బండి బయటకి తీసాడు రాజేష్. జేబులో సెల్ ఫోన్ మ్రోగింది. రింగ్ టోన్ బట్టి తల్లి ఫోన్ చేసిందని అర్ధమై బండి ఆపేసి ఫోన్ తీసి "అమ్మా, బాగున్నావా, " అనడిగాడు.
నాకేం రోగం, దుత్తలాగా బాగానే వున్నాను. నువ్వెక్కడ వున్నావు? అడిగింది రాజేష్ తల్లి లలిత.
అమ్మకి లలిత అని పేరు యెవరు పెట్టారో కానీ .. యే అంబిక,చండిక అనో పేరు పెడితే సరిపోయేదని మనసులో అనుకుని.. నాకు ఆఫీస్ పని అయిపోయింది. ఇప్పుడే యింటికి బయలదేరబోతున్నాను.
అయితే యెక్కడికి వెళ్ళకుండా త్వరగా యింటికి వచ్చేయి. నేను మీ నాన్నగారు మీ యింటికి దగ్గరలో వున్న మీ నాన్నగారి ఫ్రెండింట్లో జరిగే పంక్షన్ కి వస్తున్నాం అని చెప్పి పోన్ పెట్టీసింది.
రాజేష్ ఆ మాట విని కంగారు పడ్డాడు. అమ్మ యిప్పుడే రావాలా! ఇప్పుడేం చేయాలి అనుకుంటూ వేగంగా పది నిమిషాల లోపే యింటికి చేరుకున్నాడు.
రాజేష్ యింటికి చేరేటప్పటికే.. అతని అమ్మ-నాన్న పార్కింగ్ ప్లేస్ లో యెదురు చూస్తున్నారు.
తలుపులు తెరిచి లోపలకి రండమ్మా అన్నాడు. లలిత లోపలకి అడుగు పెడుతూనే యేమిటి యిల్లంతా యేదో నీచు వాసన వస్తుంది అంది.
రాత్రి వర్షంలో తడవడం వల్ల బట్టలు తడిచి పోయాయి. ఉదయం వాటిని వుతకక పోవడం వల్ల కొంచెం వాసన వేస్తున్నట్లున్నాయి అంటూ కిటికీ తలుపులు తీసి మంచి నీళ్ళు కావాలా నాన్నగారు అని అడిగాడు. నేను తీసుకుని త్రాగుతానులే, అమ్మాయి వచ్చేటప్పటికి యెంత సమయం పడుతుంది అని అడిగారు.
నిన్న వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ . ఆఫీస్ నుండి యింటికి వచ్చే సరికి నాలుగు గంటలు పట్టింది. ఈ రోజు ఎన్ని గంటలు పడుతుందో యేమో
ఈ లోపులో లలిత యిల్లంతా వో చూపు చూసింది.ముఖం చిట్లించి ప్రొద్దున్న యింటి పని యే౦ చేయలేదా, సింక్ నిండా అంట్ల గిన్నెలు, యెక్కడ చూసినా బట్టలు, ప్రక్క బట్టలు కూడా సర్ధకుండా యిల్లంతా శుభ్రం చేసుకోకుండా యే౦ వుద్యోగాలు చేయడం? కోడలు మరీ సాగించుకుంటుంది. వాకిలి తుడచి ముగ్గు కూడా పెట్టినట్లు లేదు.మా కాలం నాడు మేము యిలాగే వుద్యోగం చేసామా, ఇంటా-బయటా చేసుకుని పిల్లలని స్కూల్ కి పంపించుకుని అన్ని సర్దుకుని వుద్యోగం చేయలేదా?
రాజేష్ యేమీ మాట్లాడలేదు. మీ ఆవిడ మరీ సాగించుకుంటుంది.ఇంతకీ వుదయం వంటైనా చేసిందా లేదా అని ఆరాగా అడిగింది.
ఆ.. చేసింది లేమ్మా ! తనకి కొంచెం జ్వరంగా వుండి టైం కి లేవలేకపోయింది.అందుకే అన్ని యెక్కడివి అక్కడ వదిలేసి పరుగులు పెట్టాల్సి వచ్చింది అని సంజాయిషీ యిచ్చుకుని .. ప్రిజ్ లో నుండి పాల పేకెట్ తీసి కాఫీ కలపడానికి పాలు పెట్టి ప్రెష్ అవడానికి బాత్ రూం లోకి వెళ్ళాడు. రాజేష్ బయటకి వచ్చే సరికి స్టవ్ పై వున్న పాలు పొంగి స్టవ్ ఆరిపోయింది.
లలిత అలాగే కూర్చుని పేపర్ చూస్తుంది కాని పాలు పొంగిన వాసన గమనించినా గమనించనట్లే వుండిపోయింది.
రాజేష్ తల్లి వైఖరి గమనించాడు.తన మీద ప్రేమ కన్నా తన భార్య ప్రియ పై వున్న ద్వేష భావం వల్లనే తల్లి అలా మెలుగుతుందని అర్దమైనా యే౦ మాట్లాడలేడు. మళ్ళీ కొన్ని పాలు పోసి స్టవ్ దగ్గరే నిలబడి ఆలోచన చేస్తున్నాడు.
కోడల్ని వుద్యోగం చేయవద్దని గృహ నిర్వహణ చూసుకోమని లలిత గారి అభీష్టం. ఎంతో కష్టపడి చదివి మంచి రాంక్ లు సాధించి వుద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని మరచి పోయి సాధారణ గృహిణిగా వుండటం కుదరదని ప్రియ వాదన.
పైగా అత్తగారు వుద్యోగం చేస్తూ తనని యింటికే పరిమితమయి వుండాలని అనడం ప్రియకి నచ్చలేదు.
ఒక్కడే కొడుకైనా యిద్దరి వుద్యోగాలు పేరిట సొంత యిల్లు వదులుకుని వాళ్ళు వొక మూల వీళ్ళు వొక మూల వేరు కాపురాలతో.. యిరుకు మనసులతో యెవరు యింకొకరితో కలవలేని అహాలతో అడ్డుగోడలు కట్టుకుని బ్రతకడం మామూలు విషయం అయిపొయింది. ఓ.. కప్ కాఫీ ఆతిధ్యంతో యెవరికి వారు యమునా తీరుగా యెవరి బతుకులు వారివి. కనీసం కలసి నప్పుడైనా మనఃస్పూర్తిగా మాట్లాడుకోలేని భేషజాలు.
జీవితం అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరాలకి అనుగుణంగా కుదించుకుని బ్రతికేయడం అన్నమాట ..అనుకుంటూ ..కాఫీ కలిపి తల్లికి,తండ్రికి యిచ్చి తను ఓ..కప్ తెచ్చుకుని కూర్చున్నాడు.
ఆప్యాయంగా మాట్లాడుకోవడానికి మాటలు లేవు. మౌనం మధ్య పది నిమిషాలు గడచిపోయాయి. ఆవిడ యెప్పుడుకి వస్తుందో వెళదాం పదండి.. అంటూ లేచి నిలబడింది లలిత.
అమ్మా, నాన్న గారు మళ్ళీ యిక్కడికే రండి, భోజనం చేసి వెళ్ళవచ్చు అని చెప్పాడు రాజేష్.
గురువారం నేను ఉపవాసం వుంటానుగా. మీ నాన్న గారిని మాత్రమే కోడలి చేతి వంటని తిని తరించమను. అంటూ నడచింది.
వాళ్ళని లిఫ్ట్ వరకు సాగనంపి తల్లి మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ..వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి సింక్‌లో వున్న గిన్నెలన్ని శుభ్రం చేసాడు. బెడ్ షీట్లు మార్చి యిల్లంతా శుభ్రం చేసాడు. డ్రయర్ లో వున్న బట్టలు తీసి తీగలపై ఆరేసాడు.
ప్రిజ్ లో యే౦ కూరలు వున్నాయో చూసాడు. ఏవో నిన్న,మొన్నటి కూరలు రెండు కనిపించాయి.ఆ గిన్నెలు తీసి బయట పడేసి వెజిటేబుల్ ట్రే లో వున్న వంకాయలు తీసి రెండు ఉల్లిపాయలు తీసి వాటిని నీట్ గా కట్ చేసి వంకాయ కూర చేసి అందులో పాలు పోసాడు. పాలు పోసి చేసిన వేడి వేడి కూరంటే తండ్రికి చాలా యిష్టం అని కూడా అనుకున్నాడు.
ఇన్ని పనులు చేసినా ప్రియ యింటికి చేరలేదు. ప్రియ త్వరగా వస్తే బాగుండును. అమ్మ-నాన్న మళ్ళీ వచ్చేసరికి కూడా రాకుంటే అమ్మ ఆనే మాటలు వినడం కష్టం అనుకున్నాడు.
కుక్కర్లో రైస్ పెట్టి ప్రిజ్ లో నుండి తీసిన కూరలని ఆ కుక్కర్ లిడ్ పై జాగ్రత్తగా పెట్టాడు రైస్ అయ్యేటప్పటికి కూరలు వేడి పడతాయి. మూడు కూరలతో నాన్నకి భోజనం పెట్టిన ప్రియని తల్లికి పరిచయం చేయాలని రాజేష్ ఆశ.
ఆ ఆశ నెరవేరదు అన్నట్లు ప్రియకన్నా తల్లి తండ్రి ముందే వచ్చేసారు.
ఇల్లంతా తిరిగి చూసి పని అమ్మాయి కూడా లేదుగా, యింటెడు పనంతా నువ్వే చేసావా అడిగింది ఆరాగా.
ఎంత వుద్యోగం చేసినా నీ చేత ఓ చిన్న పని కూడా చేయించలేదు. ఇప్పుడు పెళ్ళాం కోసం అన్ని పనులు చేస్తున్నావు? నీకు సిగ్గు లేదురా, అదేమన్నా మహా రాణిలా పెరిగి వచ్చిందా, యింత వాజమ్మవి అనుకోలేదు అని రుస రుస లాడింది.
లలితా యేమిటా మాటలు, మన యింట్లో యిలాటి పనులు నేను చేయడం లేదా! ఇప్పుడు కొత్తగా రాజేష్ చేసినది యేముంది? భార్యాభర్తలు వుద్యోగాలు చేస్తుంటే యిలాటి పనులు తప్పవు. నీకు మాత్రం సాగినన్ని రోజులు సాగాలేదా! మా అమ్మ బ్రతికి వున్నంత కాలం నీకు యింటి పని చేసే పని లేకుండా తనే చేసి పెట్టేది. నాన్న మార్కెట్ కి వెళ్లి కూరలు, పచారి తేవడం వల్లనే కదా ముగ్గురు పిల్లలని పెంచి పెద్ద చేసాం అది మర్చిపొతే యెలా అన్నాడాయన.
ఆహా , పెద్ద చేసారు లెండి. వుద్యోగం చేసినా నేను యిలా మీతో యింటి పనులు వంట పనులు చేయించానా, ఈ తరం వాళ్ళు మొగుడిని పెళ్లైన గంటకే కొంగున ముడేసుకుని అడ్డమైన చాకిరి చేయించుకోవడం,కోరినవి సాధించు కోవడం చేస్తున్నారు.కాస్త హద్దు-అదుపు అక్కరలేదా? మగవాడు యింటి పని చేయడం యె౦త నామోషి. కాస్త యింగిత జ్ఞానం వుండవద్దూ . గోల్డ్ మెడల్స్ సాధించగానే సరా అని ఈసడించుకుంది.అయినా మన యింటి పనులతో పోల్చుకుంటే యీ పని వొక లెక్కా! ఈ పని కూడా చేయలేక యెక్కడివి అక్కడ పడేసి వెళ్ళడం హోటల్స్ వెంట పడటం ఈ కాలం వారికి అలవాటై పోయింది. అదేం పద్దతులో యేమిటో, యేమైనా అంటే మేము సంపాదిస్తున్నాం.ఇంటా-బయట చేసే వోపిక లేదు అనడం నేర్చారు..అని ఆపకుండా చదివేసింది.
ఈ మాటలు వింటూనే ప్రియ లోపలికి వచ్చింది.వస్తూనే హోటల్ నుండి తెచ్చిన పేకింగ్ ని టేబుల్ పై పెట్టి అత్తమామాలని పలకరించి.. ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిందని చెప్పింది.
నువ్వు యెప్పుడు వస్తే యేమిటి లేమ్మా.. అరవ చాకిరి చేయడానికి మా పిచ్చి సన్నాసి వున్నాడు కదా! అన్నీ వాడే చేసేసాడు అంది లలిత.
ప్రియ మాట్లాడలేదు. జ్వరం తగ్గిందా, మధ్యాహ్నం భోజనం చేసావా అని అడిగాడు రాజేష్. తల వూపి లోపలకి వెళ్ళింది. వెనుకనే రాజేష్ వెళ్ళాడు. అమ్మ మాటలు పట్టించుకోకు. ప్రెష్ అయి రా, నువ్వే వచ్చి వడ్డించు. లేకపోతే అమ్మ మాటలకి అడ్డుకట్ట వేయలేం అని చెప్పి బయటకి వచ్చేసాడు.
ఓ పావు గంట తర్వాత వచ్చి .. భోజనం చేయండి అని పిలిచింది.లలిత కూర్చున్న చోటు నుండి లేవలేదు. మీ అత్తయ్య యీ పూట వుపవాసం లేమ్మా.. అని చెప్పారు రాజేష్ తండ్రి. అయితే టిఫిన్ చేయండి అత్తయ్యా.. అని అడిగింది. నాకు యేమి సహించదు. మీరు త్వరగా కానిస్తే మాదారిన మేము వెళతాం అంది
ప్రియ మనసు చిన్నబోయింది.
భోజనాలు వడ్డిస్తూ మామగారికి తను తీసుకు వచ్చిన "పరోఠా" లని వడ్డించింది.
రోజు యిలా హోటల్ తిండే తింటున్నారా ఆరాగా అడిగింది లలిత.
లేదత్తయ్య గారు. రాజేష్ కి "పరోఠా" యిష్టం కదా! ఇక్కడ బస్ స్టాప్ దగ్గర హోటల్ లో యీ ఐటం చాలా స్పెషల్. అందుకే తెచ్చాను.
ఇష్టం అని చెప్పి రోజు వంట చేయకుండా తప్పించు కుంటున్నావన్నమాట అంది లలిత.
ఆ మాటకి వొళ్ళు మండిపోయింది ప్రియకి .
అత్తయ్య గారు..యేమీ అనుకోక పొతే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఈ "పరోఠా" మీరు యింత బాగా చేయగలరా, నా సాఫ్ట్ వేర్ వుద్యోగం మీరు చేయగలరా, యెవరి ప్రతిభ వారిది. యెవరి రంగాలు వారివి. ఇంట్లో యెవరు సాయం చేయకుండానే మీరు మీ డ్యూటీస్ సక్రమంగా చేసేసారా? మా పెళ్లి అయి రెండేళ్ళు అవుతున్నా మీరు నన్నింకా పరాయి దానిగానే చూస్తారు.సూటి పోటీ మాటలు అంటారు.భార్య భర్తలు వొకరికొకరు పనులలో సాయం చేసుకోవడాన్ని తప్పుగా అనుకోవడంలో మిమ్మల్నే చూస్తున్నాను. రాజేష్ కి యింటి పనులు చేయడం కొత్తేమి కాదు కదండీ! పెళ్లి కాక ముందు మా అబ్బాయి బంగారం,నాకు కష్టం వుండకూడదని యింటి పనులలో సాయం చేస్తాడు అని మురుసుకున్న మీ అబ్బాయే యివాళ పెళ్ళాంకి సేవలు చేస్తే వాజమ్మ అయిపోయాడా, మీరు ఒక రిటైర్డ్ టీచర్ . కుటుంబ సభ్యులందరినీ బెత్తం పట్టుకుని దండించినట్లే మాట్లాడతారు..మీరిలాగే వుంటే మన మధ్య బంధాలు కొనసాగవు కూడా అని నిర్మొహమాటంగా చెప్పేసింది.
ఎప్పుడు యెదురు మాట్లాడని కోడలు అలా మాట్లాడే సరికి లలిత దిమ్మెర పోయింది.
రాజేష్ తల్లి ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడసాగాడు. విచిత్రంగా లలిత వైపు నుండి సౌండ్ లేదు.
వేగవంతమైన జీవన విధానంలో అన్నీ మారిపోతున్నాయి. ఇంకా మా కాలంలో లాగానే ప్రతి పని మనం అనుకున్నట్టే జరగాలని పొద్దునే లేచి వాకిలి వూడ్చి ముగ్గులు పెట్టాలని,స్నానం చేసే వంట చేయాలని,భర్త తిన్నాకే భార్య తినాలని యిలాటివన్నీ కుదరదని మీకు తెలియదా, మీరు అత్తగారు ఆనే రోల్ నుండి బయటకొచ్చి మరో స్త్రీ లాగా ఆలోచించి చూడండి. మీ అబ్బాయి వెన్నుముక లేకుండా యింటి పనులు చేస్తున్నాడని అనుకోవడం చాలా విచారం. మీ అమ్మాయిలని అయితే మీరు అలా అనగలరా అని అడిగేసింది ప్రియ.
మగవాళ్ళ పెదవులపై బిగబట్టిన నవ్వు.
మీలా ప్రతి అత్త యిలాగే అనుకుంటే వో రెండు తరాల వెనక్కి స్త్రీల జీవితాలు వెళ్ళినట్లే. మనం చదువుకున్నది, సాధిస్తున్నది సమానత్వం కోసం మాత్రమే కాదు కుటుంబం కోసం కూడా. మీరది అర్ధం చేసుకోవాలి.
లలిత మూతి తిప్పి వెళ్ళడానికన్నట్లు లేచి నిలబడింది.
ప్రియ కూడా లేచి నిలబడి "సంవత్సరానికి తొమ్మిది లక్షల జీతాన్నివదులుకుంటే మీలో అత్తరికం శాంతిస్తుందా, నాకు వచ్చిన గోల్డ్ మెడల్స్ అలంకార ప్రాయంగా గోడకి వేలాడుతుంటే మీ పెద్దరికం గౌరవింపబడుతుందనుకుంటున్నారా? నేను యింటి పనులు, వంటపనులకే పరిమితమైతే ఓ అచ్చమైన గృహిణిని అనిపించుకోవడమే అయితే నేను యింత చదువుకోవడం, పనిలో నైపుణ్యం పెంచుకోవడం కోసం యితర దేశాలు వెళ్ళడం అవసరం అంటారా? వుద్యోగం అవసరమో కాదో యెవరికీ వారు ఆలోచించుకోవాలి. అదే వుద్యోగం చేయడం అభిరుచి మాత్రమే అయితే కాదనడం యె౦తవరకు భావ్యమో మీరూ ఆలోచించాలి" అంది ప్రియ.
అంతా వింటున్న రాజేష్ తండ్రి కల్పించుకుని "అమ్మాయి ప్రియా ! మీ యిద్దరు కూడా మీ ఆలోచనలు మార్చుకోవాలి. అప్పుడే మనది వొక కుటుంబం అవుతుంది.లేకపోతే యెవరికీ వారే యమునాతీరే " అని చెప్పారు
ఎవరి ఆలోచనలో వారు.. యెవరి దారిలో వారు నేతిబీరకాయలో నెయ్యంత కుటుంబ అనుబంధాలు .
ఇంతకీ అత్త కోడలు యెవరు యెవరిని మార్చారు?
తెలిసి చెప్పలేకపోతే వెయ్యి అక్షర తిట్లు తప్పవు అని బుర్ర హెచ్చరించింది. ఆ తిట్లుకి సిద్దపడే ఈ కథకి ముగింపు చెప్పడంలేదు శాంతి. తేల్చి వ్రాసేయడానికి అదేమన్నా తేలికైన విషయమా యేమిటీ!?

12 కామెంట్లు:
అంతే!అంతే!!అంతే!!!
అయ్యో.. ముగింపు రాయకుండా టెన్షన్ పెట్టేసారండీ...
కానీ కోడలు మాట్లాడిన మాటల్లో నిజం ఉంది.
అదంతా నిజమే అని అత్తగారికీ తెలుసు (కానీ తను ఇప్పుడు అత్తగారు కదా...)
రాజేష్ తండ్రీ గారు చెప్పింది.కరెక్టే ఇద్దరూ మారాలి అని..
వనజమాలి గారు కాస్త ముగింపు రాయగలరా ?
chaalaa chkkaga raasaarandi,
ప్రస్థుత సాఫ్ట్వేర్ జీవితాలకు అద్దం పడుతోందీ టపా!
ఈ కథలో కోడలు చేసిన తప్పేమీ కనిపించడం లేదండీ. బహుశ కోడలి మాటల వల్ల అత్తగారిలో మార్పు వస్తుందేమో..
వాస్తవ జీవనం కోడలు, సర్డుకోలేని మనస్సు అత్త.
తెలియదా తెలుసు కాని మూర్ఖత్వం, మొండితనం.
అవునవును అది అంత తేలికైనది కాదు.
కానీ గృహిణి అంటే తప్పు కాదు. అన్ని పనులలోకి , ముఖ్యం గా సమాజంలోకి మంచి పౌరులను తీర్చి దిద్దే పాత్రలో తల్లి ని మించిన పాత్ర రాదు. రాబోదు. అది ప్రకృతి సూత్రం.
స్త్రీ గృహిణిగా మాత్రమే ఉండాలని శాసించడం , పురుషహంకార ఆధిపత్య ధోరణి మాత్రం తప్పే కాదు నేరం కూడా.
ఏదైనా , ఏ పని విభజన అయినా ఆధిపత్య 'పైత్యం' కోసం కాక బాధ్యత + అవసరం + ప్రేమ తో మాత్రమే ఉండాలి.
అది పరిస్తితులను బట్టి ఉంటుంది తప్ప జనరలైస్ చేసి చెప్పకూడనిది. జనరలైస్ చేయాలంటే ఎవరు ఏ పని బాగా చేయగలరో అది చేసే మంచి వాతావరణం ఉండాలి.
ఆ వాతావరణాన్ని కలుషితం చేసే ప్రతి అంశం ను కట్టడి చేయాలి. మనుషుల మనస్తత్వాలను సందర్భానుసారం భలే వివరిస్తారండీ వనజ గారూ !
ముగింపు చెప్పకుండా తెలివిగా తప్పించుకున్నారన్నమాట. కథ బాగుందండీ. అభినందనలు.
రంధ్రాన్వేషణ అనుకోకపోతే.... రింగ్‌టోన్ అన్నాక, శబ్దం అనక్కర్లేదు. పునరుక్తి.
కష్టే ఫలే గారు.. స్పందనకి ధన్యవాదములు.
@ సాయి గారు ధన్యవాదములు. ముగింపు చెప్పెయాలంటారా? ఆలోచించి చూడండి. మీకే తడుతుంది మరి.
@ ది ట్రీ గారు..ధన్యవాదములు.
జ్యోతిర్మయి గారు. మీ మాటే నామాట. .. స్పందనకి ధన్యవాదములు.
@ విజయ మోహన్ గారు.. యంత్రంలో యంత్రంలా చేతూ..అలసి పోతున్న వారు ఇలాటి జీవనమే గడుపుతున్నారు. ధన్యవాదములు.
@ఆలపాటి రమేష్ గారు.. స్పందనకి ధన్యవాదములు.
కొండలరావు గారు.. మీ వ్యాఖ్య కి ధన్యవాదములు.
కథని అలా వదిలేయక తప్పలేదు.గృహిణి భాద్యతలు నిస్సందేహంగా చాలా ఉన్నతమైనవి. అలాగే ప్రవ్రుత్తి కూడా ఒకటి ఉంటంది కదండీ! ఆ దిశలో.. తర తరాలుగా అనగి ఉన్న కోరిక తీవ్రతరం దాల్చి స్త్రీలు ఇల్లు మాత్రమే కాకుండా..ప్రపంచంలో తమ ఉనికి ఉండాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నం లోనే..ఉద్యోగ అభిలాష కూడా. ఆ కోణంలో ఆమెకి సహకారం ఉంటే బాగుంటుంది అని.. నా ఆలోచన అంతే!!
@పురాణ పండ ఫణి గారు.. మీ సూక్ష్మ పరిశీలనాశక్తి కి ధన్యవాదములు. ఇలాగే లోపాలు ఉంటే తప్పక సూచన చేస్తే.. సరిదిద్దుకుంటాను. మన తెలుగు వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. ధన్యవాదములు.
చాలా బాగా రాసారు.
నేను మీ కథలో పాత్రని నిజ జీవితం లో చాలా దగ్గరగా చూసాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి