మనం చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా కొన్ని విషయాలలో సంస్కార వంతంగా మెలగడం.
మనిషి పుట్టినప్పటి నుండి మరణించిన తర్వాత కూడా పాటించాల్సిన సంస్కారాలు ఇరువది ఏడు అని ఎక్కడో చదివాను. కానీ మనం నేర్చుకోవాల్సిన కొన్ని సంస్కారాలని నాకు అనిపించిన విషయాలని చెపితే బావుంటుందేమో అనుకున్నాను (నేను ఇవన్నీ సాధారణంగా పాటించేవి కూడా!)
మొన్నీ మధ్య మా చెల్లెలు మా వదిన చేతిలో ఉన్న లేటెస్ట్ మోడల్ పోన్ చూడాలని తన చేయి చాచి మా వదిన చేతిలోని పోన్ తీసుకోబోయింది. మా వదిన తన మొబైల్ పీస్ ని మాచేల్లికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కొన్ని సెకనుల కాలంలో జరిగిన ఈ విషయం నా దృష్టి పథం ని దాటి పోలేదు.
ఇప్పుడు మొబైల్ పోన్ అంటే.. అంతరంగం లాటిది. ఒక విధంగా చెప్పాలంటే డైరీ లాటిది.
వ్యక్తిగతమైన ఎన్నో ముఖ్యమైన విషయాలు మెసేజెస్,పిక్స్ వీడియోస్ ద్వారా సేవ్ చేసుకోవడం జరుగుతుంది.ఇతరులు చూడటం,చూడాలనుకోవడం వల్ల వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుంది కదా!
కొంత మంది చాలా చొరవగా మన మొబైల్ ని మోడల్ వివరాలు తెలుసుకుని,పీచర్స్ అన్నీ చూసి తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అది కూడా అభ్యంతరకరం గానే తోస్తుంది నాకు.
ఇతరుల మొబైల్ ని మనం అంటుకోకుండా ఉండటమే మంచిది.
రహస్య గూడాచారి అవతారం ఎత్తి పిల్లల మొబైల్స్ చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన లో మార్పు కనబడినప్పుడు..తల్లిదండ్రులకి అనుమానం రేకెత్తడం సహజం. అలాటప్పుడు మన పిల్లల మొబైల్ పోన్ కూడా మనం చెక్ చేయడం.ఆ విషయం వాళ్లకి తెలియడం వల్ల మనపై వారికి నిరసన భావం తలెత్తుతుంది కూడా!
పిల్లలు వారికి సంబంధించిన వస్తువులని వారి వ్యక్తిగత ఆస్తి గానే పరిగణిస్తారు.కంప్యూటర్ సిస్టం,లేదా లాప్ టాప్..లాటి వ్యక్తిగత మైన వస్తువులని ఇతరులు వాడటం ఇష్టం ఉండదు. ఒకవేళ ఇతర కుటుంబ సభ్యులు ఆ వస్తువులని ఉపయోగించు కుంటారనుకుంటే.. వారి అకౌంట్ ని లాగౌట్ చేసుకోవడం మంచిది.
మాఅబ్బాయి ఆన్ లైన్ ఉన్నట్లు నేను గమనించినా సరే..మాట్లాడి చాలా రోజులవుతున్నా సరే... మన అబ్బాయే కదా..అని ..స్టేటస్ చూడకుండా పింగ్ చేయను. బిజీ అని ఉంటే.. డిస్ట్రబ్ చేయను. ఒక వేళ అలా అత్యవసరంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు .. మెయిల్ పెడతాను.
తల్లిదండ్రులగా మనకి హక్కులు ఉన్నాయని వాళ్ళని మన స్వంత ఆస్తిగా పరిగణించి పిల్లల ప్రైవసీని మనం భంగ పరచలేం కదా! ఇవన్నీ ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోవాల్సిన సంస్కారాలని అనిపిస్తూ ఉంటుంది.
అలాగే పిల్లలు కూడా సభ్యత పాటిస్తూ..సంస్కారవంతంగా ఉండటమే కాదు.. సంస్కారవంతమైన వస్త్రధారణ చేసుకుంటే కూడా తల్లిదండ్రులకి మానసిక క్లేశం తగ్గించిన వాళ్ళు అవుతారు.
మా కొక పరిచయస్తురాలు ఉన్నారు. ఆవిడ సంగతి చెపుతాను. "ఏం చేస్తున్నారు..అంటూ సరాసరి బెడ్ రూమ్‌లోకి వచ్చేస్తారు. అది సంస్కారం కాదని నాలుగు పదులు వయసు దాటినా ఆమెకి తెలియరాదు..
కొంతమంది కబురు కాకరకాయ లేకుండా వచ్చేస్తారు..అతిధి మర్యాదలు బాగా జరపలేక,ముఖ్యమైన పనులు ఉంటే..వాయిదా వేసుకోలేక ఎంత అవస్థ పడతామో..కదా! ముందుగా తెలిపి రావడం సంస్కారం కదా!
"తెరిచి ఉందని వాకిట తలుపు జొర బడతారా ..ఎవరైనా.. " ఓ..పాటలో ఉన్న ఒక లైన్ నాకు బాగా నచ్చుతుంది.
అది హృదయమైనా..గదైనా.. ఇతరులకి సంబంధించిన వస్తువైనా, ఇతరులకి సంబంధించిన విషయమైనా.. చొరవజేసి కల్పించుకోకపోవడం,రహస్య గూడాచారి పాత్ర పోషించక పోవడం అనేది ఉత్తమ సంస్కారం అనిపించు కుంటుంది అని నా అభిప్రాయం. !
మరి మీరేమంటారో !?

11 కామెంట్లు:
చాలా మంచి పోస్ట్. ఫ్రెండ్స్ అయినా సరే, పిల్లలు అయినా సరే, భార్య భర్తలయినా సరే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది. ఆ విషయం అందరు గమనించి నడుచుకుంటే బాగుంటుంది.
నిజమే మనం చాలా నేర్చుకోవాలి ...
చక్కని పోస్ట్ వనజ గారూ..
మనిషి ఎంత ఎదిగినా విలువలు మరువకూడదు...!
సూపర్ గా చెపారు వనజమాలి గారు... అందరూ నేర్చుకోవలసిన విషయాలు చెప్పారు, చక్కని పోస్టు..
వనజ గారూ, మీరు చెప్పిన విషయాలు వినటానికి మామూలుగా ఉన్నా పరమ చిరాకు తెప్పించేవి సుమా, అంతే కాదు మనం హడావిడిగా వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు వీది వాకిట్లో చేరి ఏమిటో హడావిడి మేడం అస్సలు మాట్లాడటమే లేదు అంటారు. మనం విదిలేక ఆగి మరీ వారి సొల్లు వినాలి. గుడ్ పోస్ట్ బాగా రాసారు.
అంతేనండి, మీమాటే నా మాట.
పోస్ట్ బాగుందండి. చక్కటి విషయాలను రాసారు.
ఇది నిజమండి.
నిజమే కొన్ని విషయాలు మనకి పైకి చిన్నవిగా కనబడిన (మొబైల్ ఫోన్ చూడటం ) .. అవి అవతల వాళ్ళకి అలానే అనిపించాలని ఏం లేదు. మీరు చెప్పినవి అందరు పాటించవాల్సినవి కూడా
అవి .
బాగా చెప్పారు వనజా గారు..నేను కూడా మీరు చెప్పింది కరెక్ట్ అంటాను!
మీరు చెప్పిన సంస్కారాలు అందరు నేర్చుకోవలసినవేనండి! Well written.
"ఇప్పుడు మొబైల్ పోన్ అంటే.. అంతరంగం లాటిది. ఒక విధంగా చెప్పాలంటే డైరీ లాటిది."
అక్షర సత్యం, వనజ గారూ!
బాగా చెప్పారు. మనకు (భారతీయులకు) personal space అనే concept సరిగ్గా అర్ధం కాదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి