10, జూన్ 2011, శుక్రవారం

ఋణం తీర్చుతరుణం వస్తే



నాకు.. చాల..ఇష్టమైన పాట...కే.బాలచందర్ అపూర్వ  సృష్టి.. "రుద్రవీణ" చిత్రం...లో..పాట

ఒక మనిషిని..మార్చడానికి.. సంవత్సరాలు.. పట్టవు..ఒక..చిన్న సంఘటన చాలు..లేదా..ఓ..పాట ..ఓ..మాట చాలు.  

పిల్లలకి.. లోకం పోకడ తెలియని స్వచ్చమైన మనసు ఉన్నప్పుడు.. పడిన ముద్ర.. వారిని..జీవితంలో..చాలా ప్రభావాలకి..గురిచేస్తుంది. పిల్లల మనసు.. మనం నట్టింట్లో..కట్టే పాలవెల్లి.. అందులో.. మనం ఏం పెడతామో..అవే.. ఇంటికి వెచ్చిన నలుగురికి..కన్పిస్తాయి.  పిల్లల మనసులో..నాటుకున్న భావాలు అంతే..! 


రుద్రవీణ చిత్రం ప్రారంభమే..చాంధస  సంస్కృతి సంప్రదాయాల  పై  మానవత వాదం ఎక్కుపెట్టిన విల్లంబు.  "చుట్టుపక్కల చూడరా చిన్నవాడా.".అనే  పాట ద్వారానే.. బాలచందర్.. చిత్రం మొత్తం సూక్ష్మాతి సూక్ష్మం గా చెప్పేశారు.. "మానవ సేవే..మాధవసేవ " అన్నది మరచి.. సంప్రదాయం పేరిట మనుషులని..అంటరానివారిని చేసి.. కష్టాలు  ఎదురైనా స్పందించక గిరిగీసుకుని కూర్చుని.. చోద్యం చూసే కరకు గుండెల కసాయి తనం.. మారక తప్పదని..ఒక వాస్తవాన్ని.. ఎంత హృద్యంగా.. బాలచందర్ చిత్రీకరించారు.



 మన చుట్టూ  ..ఉన్న సమాజాన్ని చూసి మన వంతు  కర్తవ్యంగా..   ఏమైనా చేయవలసి వస్తే.. చెయ్యకుండా.. ఎస్కేప్ అయ్యే మనుషులు..కోకొల్లలు.. వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే..అన్న అలసత్వ ధోరణి  వల్ల.. ఇచ్చి-పుచ్చుకునే మనస్తత్వం కొరవ  అయి..  తాము మాత్రం అందలం ఎక్కాలనుకుంటారు. 

సమాజ శ్రేయస్సు కాంక్షించని.. ఎంత గొప్ప సంప్రదాయమైనా  అది అల్పమైనదే !   

ఈ విషయాన్నీ "సిరివెన్నెల"  ఈ పాటలో ఎంత గొప్పగా.. వ్యక్తీకరించారో  ..! 

విశ్వ మానవ శ్రేయస్సుని కాంక్షించని.. ఏ కళ యినా..కళాకారుడైనా.. మనసు లేని  మట్టి ముద్దలు.. ప్రాణం లేని..శిలలు..

ఒక బాలుడి  మనసులో.. శత  కోటి   ప్రశ్నలు  ..ఉధయింప జేసి  .. సమాజములో మార్పుకి,  మనుగడకి..ప్రాణం పోసిన పాట.. చాలా..స్పూర్తికరమైన  పాట.  ఈ..పాట..ప్రభావం..అనంతం. అందుకే....నేను.. మనీషి గా.. కాకపోయినా.. మనిషిగా..ఉన్నాను.. భాద్యత గల పౌరురాలుని అని..చెప్పడం.. కూడా..అందుకే.. మనిషిగా..స్పందించడం.. చేతనైన సాయం చేయడం ..నా కర్తవ్యం.. అనుకుంటూ.. దేవుడి గుడికి..వెళ్ళినప్పుడు..ఎంత భక్తితో..ఉంటానో  .. సమాజమనే..అనే దేవాలయం లోను..అంత..భక్తిగా..ఉండాలన్నది..నా.. ఈ..  సమాలోచన తో..ఈ పాట..పంచుకుంటూ..  సమాజమనే సముద్రపు  ఒడ్డున .. ఓ.. ఆలోచనా కెరటం ...  సిరివెన్నెల..అక్షర ఉద్దీపనం.       


చుట్టూ పక్కల చూడరా చినవాడ 
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ  - 2
కళ్ళ ముందు కటిక నిజం కనలేని గుడ్డి జపం 
సహించదు ఆ పరమార్దం బ్రతుకుని కానీయకు వ్యర్దం  - 2
చుట్టూ పక్కల చూడరా చినవాడ 
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 

స్వర్గాలని అందుకొనాలని వడిగా గుడి మెట్లు ఎక్కేవు   
సాటి మనిచి వేదన చూస్తూ జాలి లేని శిలవినావు 
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే 
గుండె బండగ మార్చేదా సాంప్రధాయమంటే   
చుట్టూ పక్కల చూడరా చినవాడ 
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది 
గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే వలచింది 
ఋణం తీర్చుతరుణం వస్తే తప్పించుకుపోతున్నావా 
తెప్ప తగలపెట్టేస్తావ యేరు దాటగానే 
చుట్టూ పక్కల చూడరా చినవాడ  
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 
కళ్ళ ముందు కటిక నిజం కనలేని గుడ్డి జపం 
సహించదు ఆ పరమార్దం..బ్రతుకుని కానీయకు వ్యర్దం 
చుట్టూ పక్కల చూడరా చినవాడ  
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 

9, జూన్ 2011, గురువారం

మత మౌఢ్యం, కుల మౌఢ్యం, దురభిమానం..కళ్ళకు కమ్మిన మైకం.

అభిమానం అనేది వెర్రి తలలు వేస్తే మెదడు ఆలోచించడం ఎందుకు మానేస్తుందో నాకు అర్ధమైన సందర్భం ఒకటి చెప్పదలచాను. ఎక్కడైనా ఏమో నాకు తెలియదు కానీ.. విజయవాడలో చదువుకునే పిల్లలకి చాల మందికి కమ్యూనిటీ పిచ్చి బాగానే ఉంటుంది. అది అంతా పిల్లలకి మనసు సరిగా వికశించని దశలో అయితే.. పెద్దలు అర్ధమయ్యే రీతిలో పిల్లలకి చెప్పి వారి మనసుకి కమ్మిన మబ్బులని పారద్రోలవచ్చు. కానీ  వాళ్ళు..డిగ్రీ స్థాయిలో చదివే పిల్లలే! వారితో మనం వాదించగలమా ? నేను ఇలాగే ఒకసారి మా అబ్బాయి నుండి చాలా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాను       .

అసలు ఎనిమిది,తొమ్మిది తరగతులు చదివేటప్పుడే.. పిల్లలు కమ్యూనిటీల వారిగా గ్రూప్ లు  కడతారని తెలిసి నేను ఆశ్చర్య పోయాను. మా అబ్బాయి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదివేటప్పుడే కొంతమంది పిల్లలతో కలసి గ్రూప్ గా  ఉండేవారు. వీళ్ళది.."సి" కమ్యూనిటీ. అంటే..మీదికాదా? అని సందేహించకండి. నాకు అలాటివి నచ్చవు కనుక అలా అన్నాను. పిల్లలలో ఇలాటి గ్రూప్ లని  ప్రోత్శ హించేది గురువులే అంటే ఆశ్చర్య పడనవసరం లేదు కూడా!   ఈ.."సి" అనేవాళ్ళు వేరేవాళ్ళతో గొడవపడి స్కూల్ బయట కొట్టుకున్నారు. విషయం తెలిసాకా  తప్పు ఎవరిదైనా మా అబ్బాయి ఫ్రెండ్స్ తల్లిదండ్రులు మేము కలసి పిల్లలకి తెలియకుండా మాట్లాడుకుని ఇంటర్మీడియట్ లో.. అందరిని కలవనీయకుండా వేరు వేరు కాలేజీల్లో  జాయిన్ చేసాం.  అయినా అక్కడా అలాటి..గ్రూప్ లే! 

పిల్లలతో వాదిస్తే ఎడ్డెం అంటే తెడ్డం  అంటారని ఎదిఎదగని వారి మనసులని కలుషితం కాకుండా ఉండాలని మౌనం వహించి ఊరుకున్నాం. అంటరానితనం నేరం అని పాఠ్య పుస్తకాల్లో వెనుక పేజీపై వేసి మరీ చూపిస్తున్నారు. అది చూసి అయినా నేర్చుకోండి. మనుషుల్లో భేదాలు వద్దనే కదా అంటే.."అది మీ కాలం అప్పుడు, ఇప్పుడు కాదు.  ఎవరి కమ్యునిటీ వారికి కావాలి మీకేం తెలియదు,మీరు  ఊర్కోండి" అని అనడం కద్దు.  రోజూ ఇలాటి వాదనలతో తల బొప్పికట్టడం అటుంచి ఏం గొడవలు కొని తెచ్చుకుంటారో అని భయం. ఎలాగోలా ఇంటర్ మీడియట్ హాస్టల్ చదువు కనుక గొడవలు లేకుండా పూర్తి అయింది. కొంత మంది నాన్..సి.లతో..మా అబ్బాయి ఫ్రెండ్ షిప్  చేశాక హమ్మయ్య అనుకున్నాను.

తర్వాత ఇంజినీరింగ్ కాలేజ్ లో  మళ్లీ మొదలు.
 విజయవాడ లోనే.. "సి" గ్రూప్ కి..ప్రత్యేకమైన కళాశాలలో మా అబ్బాయి చదవడం మళ్ళీ అక్కడా..కమ్యూనిటి  ల పిచ్చి మొదలయింది. నేను  అనుక్షణం భయపడుతూ ఉండేదాన్ని. ఒక రోజు మా అబ్బాయికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను.  బుద్ధిగా చదువుకునే వాళ్లకి ఇలాటివి పట్టవు. కాలక్షేపపు చదువులు,పనిపాట లేని వారికే ఈ..పిచ్చి. అలాటి వాటిల్లో తలదూర్చావు అంటే..ఊరుకోను అన్నాక కొంచెం ఆలోచించడం మొదలెట్టాడు. క్లాస్ లో అందరితో కలవడం, మాట్లాడటం, వాళ్ళ ప్రక్కన కూర్చుని..లంచ్ చేయడం, ఫ్రెండ్ షిప్ చేయడం  ఇలాటివి  చేస్తుండటం తో.. "సి" కమ్యూనిటీ వాళ్ళందరు మన కమ్యూనిటీ పరువు తీస్తున్నావు అని మా అబ్బాయిని వెలివేశారట. ఆ విషయం చెప్పి  బాధపడినప్పుడు  తనకి ఏది బాగుందో ఆలోచించుకోమని చెప్పాను. కమ్యూనిటీ పేరిట అధికారం చలాయించడం అహంకారం ప్రదర్శించడం మిస్ బిహేవియర్  ఆడపిల్లలను ఏడిపించడం ఇవ్వన్నీ గమనించి అవన్నీ నచ్చక తనే దూరం జరిగి తనకి నచ్చినవాళ్ళతో  స్నేహం చేయడం ప్రారంభించాడు. అయితే అంతర్లీనంగా మా అబ్బాయికి.. కమ్యూనిటి పిచ్చి..ఉంది. "సి" పార్టీల పేరిట వేలకి వేలు తగలెయ్యడం, మళ్ళీ కమ్యూనిటిల్లోనే పేద, బైక్ ల,కార్ల కేటగిరీ లు.. భేదాలు, వాదాలు అన్నీఅక్కడే! వాటికి..సాక్ష్యాలు కళాశాలలే!   ..  .. 

 సిని హీరోల అభిమాన సంఘాలు, వారి చిత్రాల విడుదలప్పుడు చేసే హంగామా కొన్ని అల్లాగే ఉన్నాయి..
మనిషి లో కుల మౌడ్యం  అయితే మరీ పేరుకోలేదు కదా అని ఊరుకునేదాన్ని నేను  చిరంజీవి గార్కి..వీరాభిమానిని. ఎందుకంటే.. క్రమశిక్షణ, కష్టపడి పట్టుదలతో ఒక రేంజ్ కి చేరుకోవడం, నటన డాన్స్  అన్నీ ఇష్టం.  చిరంజీవి.పాటలు ఇంట్లో వినవడితే టక్కున టి.వి.అయినా రేడియో అయినా ఆఫ్..చేయడం, నాపై..చిర్రు బుర్రులాడటం "సిగ్గుండాలి.. మన వాళ్ళు కాని వారిని ఇష్టపడటానికి"  అని అంటూ ఉండేవాడు.. నాకు విపరీత మైన కోపం వచ్చేది. అయినా..శాంతం  శాంతం అనుకుని నన్ను నేను సముదాయించుకునేదాన్ని..

ఒక రోజు..చాలా సీరియస్గా కాలేజి  నుంచి ఇంటికి వచ్చి.. "అమ్మా! నువ్వు చిరంజీవి గురించి పొగడటం ఆపేస్తావా లేదా! "అన్నాడు.  "ఏమైంది.. నాన్నా.." అన్నాను లాలనగా. నువ్వు రేడియోలో.. లైవ్ ప్రోగ్రాం  లో చిరంజీవిని పొగుడుతున్నావ్. అది విన్న మా  ఫ్రెండ్స్  హేళన చేస్తున్నారు. నువ్వు ఇక్కడ నందమూరి వంశస్తులని మోసుకొస్తావు. అక్కడ మీ అమ్మ.చిరంజీవి..ఫ్యాన్..అట అని గేలి చేస్తారు అన్నాడు. "అయితే " అన్నాను..చాలా కూల్ గా. నువ్వు వెంటనే అలా పొగడటం మానేయాలి అన్నాడు. నేను మళ్ళీ మౌనం. అప్పటికి ఆ  గొడవ సర్దుమణిగింది. చిరంజీవికి..పద్మభూషణ్ అవార్డు  వచ్చినప్పుడు..ఎఫ్.ఎమ్..లైవ్ లో మాట్లాడినప్పుడు గొడవ అది. అదేమిటో..!? మా అబ్బాయి తప్ప వాళ్ళ ఫ్రెండ్స్   అందరూ రేడియో వినడం  నేను..ఏం మాట్లాడానో.. చెప్పడం ఎక్కువైపోయింది అప్పట్లో.  అమ్మో! ఈ పిల్లలలో  ఇదెక్కడ  దురభిమానం  అనుకునేదాన్ని. 

ఒక రోజు..ఒక క్లిష్ట సమస్య రానే వచ్చింది. టి.వి లో చిరంజీవి నటించిన సినిమా వస్తుంది. మంచి బీట్ సాంగ్  కాబట్టి వాల్యూం పెంచి అందులో లీనమై ఆనందంతో తలమునకలై ఉన్నాను. మా అబ్బాయి బయట నుండి వచ్చి.. "అమ్మా"నీకు నేనంటే ఏమాత్రం ఇష్టం ఉన్నా వెంటనే టివి.కట్టేయి”అన్నాడు. నాకు  కోపం నషాళానికి అంటింది. నీ మీద ఇష్టానికి చిరంజీవి సినిమా చూడటానికి పోలిక ఏమిటి నాన్నా!?  ఇష్టాలు-అభిరుచులు అవి ఒకరి కోసం రావు మారవు.ఎవరి ఇష్టం వారిది..నువ్వు ఎప్పుడు నన్ను ఈ విషయంలో బలవంతం చేయకు అన్నాను. అంతేనా!? అన్నాడు. "అవును..అంతే.".అన్నాను. తను విసురుగా  వెళ్ళిపోయాడు. నా ఆనందం అంతా ఆవిరి అయిపోయింది.  "ఏమిటి ఈ  పిల్లాడు ఇలా తయారు  అవుతున్నాడు. అచ్చంగా వాళ్ళ నాన్నగారు..ఇంతే! ఇంట్లోకి రాగానే టక్కున రేడియో కట్టి పడేసేవారు. పేపర్ కానీ, పుస్తకం కానీ ఆయన లేనప్పుడే చదవాలి.అంతా  వాళ్ళ ఇష్టప్రకారం నడుచుకొవాలంటే ఎలా.? ఒకరు ఇష్టపడినదాన్ని  మనం ఇష్టపడాలి అంటే.. చచ్చేంత ప్రేమ అయినా ఉండాలి.లేకపోతే  మనకంటూ ఒక సొంత ఇష్టం లేకుండా ఉండాలి, వ్యక్తిత్వం లేకుండా అయినా ఉండాలి..అని నా నిశ్చితాభిప్రాయం కూడా! 

స్వతహాగా  నేను మొండిదాన్ని కావడం మూలంగా ఆ అగ్ని అంత త్వరగా చల్లార లేదు. ఒక గంట తర్వాత మా అబ్బాయి దగ్గరకి వెళ్లి కూర్చున్నాను. కదిలిస్తే కస్సు మంటున్నాడు. తను రెండు మూడు సార్లు కసురుకున్నా అక్కడే కూర్చుని.. తనకి..మంచిని ఓపికగా భోదించడం ఎప్పుడూ నా పని. అలాగే  కూర్చున్న నన్ను చూసి.. "చెప్పు" అన్నాడు. మళ్ళీ   అడిగేదాక  మాట్లాడ కూడదనుకుని  బెట్టు చేశాను. " చెప్పమ్మా?" అన్నాడు. " ఏం చెప్పాలి?" నా ప్రశ్న. "ఏదో..చెప్పాలనేగా   వచ్చావు." అన్నాడు. ఇప్పుడు  దొరికాడు , ఇక చెప్పింది వింటాడు అని నమ్మకం కుదిరి అప్పుడు..మొదలెట్టాను.

చిన్నీ! మన ఇంట్లో  స్టీరియో రికార్డర్  ఎప్పుడు  కొన్నాం?  అని అడిగాను. నాన్న గారు శబరిమలై వెళ్ళినప్పుడు అన్నాడు.. (ఆ వస్తువుని.  నేను నా కొడుకు వెళ్లి కొనుక్కొచ్చాం. ఎందుకు అప్పుడే కొన్నాం? నాన్నగారు ఉన్నప్పుడు.. ఎందుకు  కొనలేదు అంటే ఆయనకీ ఇష్టం ఉండదు కనుక.  ఆయనకీ ఇష్టం లేదని మనం ఆయన కోసం మనం పాటలు వినాలి అనే  ఇష్టాన్ని    చంపుపుకున్నామా? లేదు కదా? అలాగే ఇంకో విషయం. ఎంతో.. ప్రేస్టేజేస్ అయిన వి.ఆర్.ఎస్.సి.లో నీకు  సి.ఎస్.ఈ  లో సీట్ వస్తే  నాకు "సి"..అంటే ఇష్టం లేదంటే  ఆ బ్రాంచ్  లోనే జాయిన్ అవమని బలవంత పెట్టానా? అప్పుడు లక్షలకి లక్షలు పోసి కొందామన్న ఎవరికి రాని సీట్ ని  నువ్వు వద్దనుకుని నీకు ఆ సబ్జక్ట్ పై ఇష్టం లేదని వేరే బ్రాంచ్ ఎన్నుకున్నప్పుడు నేను నిన్ను ఆ బ్రాంచే  తీసుకోమని బలవంత పెట్టానా! లేదు కదా? అన్నాను. అయితే ఏమిటట? అని మొండిగా వాదించడం మొదలెట్టాడు. ఇక  లాభం లేదు సీరియస్  గా క్లాస్స్ తీసుకున్నాను. 

 ప్రతి మనిషికి..ఇష్టా ఇష్టాలు ఉంటాయి. వాటిని మన కోసం మార్చుకోమని అడగ కూడదు.  నన్నే కాదు ఎవరిని కూడా. రేపు నీకు పెళ్లి అయితే  భార్య వస్తుంది. ఆమెని కూడా ఇలా ఆజ్ఞాపించకూడదు.  నీకు  నచ్చని ఇష్టం లేని విషయాన్నీ ఎందుకు ఇతరలుకి నచ్చకూడదో అని నువ్వు చెప్పలేవు కదా! నీకు ఎలాటి  ఇష్టాలయితే ఉంటాయో.. ఇతరులకి అలాగే ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి. నీకు నచ్చకపోతే మౌనంగా ఉండు. అంతే కానీ.. వాళ్ళని హోల్డ్  చేయాలనుకోవడం  చాలా తప్పు.. అలాగే బ్లాక్మైలింగ్  కూడా! నీకన్నా  నాకు చిరంజీవి అంటే.. ఇష్టం అని అంటే నువ్వు జీర్ణం చేసుకోలేవు. నేను అలా అనలేను కూడా! అన్నాను. మా అబ్బాయి సైలెంట్ గా ఉండిపోయాడు.  తర్వాత ఎప్పుడూ మా అబ్బాయి  మరొకసారి అలా మాట్లాడలేదు కూడా.  తర్వాత  కొన్నాళ్ళకి చిరంజీవి హిట్ సాంగ్స్ అన్నీ డౌన్లోడ్ చేసి నాకు మెమరి కార్డు లోకి సేవ్  చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇంజినీరింగ్ చదువు పూర్తయ్యేటప్పటికి తనకి  ఏది మంచో ఏది చెడో ఆలోచించే జ్ఞానం  అబ్బినందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఇప్పుడు మా బంగారు కొండ నిజంగా బంగారు కొండే!! వాడికి ఇప్పుడు ఏ పిచ్చి లేవు. 

కమ్యూనిటీల పిచ్చిలో అభిమాన హీరోల పిచ్చిలో పడి  రియలైజ్  కాలేని..పిల్లల్లో ఒకప్పటి నా కొడుకే కనపడతాడు నాకు. వాళ్లకి ఏది సబబో చెపుతూనే ఉంటాను నేను. మత మౌఢ్యం, కుల మౌఢ్యం, దురభిమానం కళ్ళకు కమ్మిన మైకం లాంటిదని నా అభిప్రాయం. అది మనుషుల నుండి వారిని విడదీస్తుంది.  ఇవ్వన్నీ లేని సమాజం ఆరోగ్యంగా పచ్చగా వుంటుంది.                       

4, జూన్ 2011, శనివారం

నా దృష్టిలో..కవిత్వమంటే..

 ప్రతి మనిషి..అనుక్షణం ఏదో..తలపుల తో..సతమతవుతుంటాడు.ఆ తలపుల అన్నిటికి  అక్షర రూపం  కల్పించలేరు.. ఒకొకరు అందంగా మాట్లాడగలరు..ఒకోకరు శ్రుతిబద్దంగా పాడగలరు. ఒకొకరు.. అందంగా వ్రాయగలరు.. మాట్లాడేవారు వక్తలు,వ్రాసేవారు కవులు,రచయితలు, పాడే వారు గాయకులుగా .. ముద్ర వేసుకుంటారు.  ప్రదర్శించే ప్రతిభని బట్టి.. వారు ..కీర్తిప్రతిష్టలు కైవసం చేసుకుంటారు. కవిత్వమంటే..బ్రాంతి అని,  కవులంటే.. ఉబుసుపోక వ్రాసే వారని అభిప్రాయం ఉన్నవారికి..కవిత్వాన్నిప్రేమించేవారి సమాధానం.. ఇది.

క్రౌంచ పక్షి దుఃఖం చూసి  వాల్మీకి గళం విప్పారింది..ఆది కావ్యం అవతరించింది..అది కవిత్వమునకు  నాంది.. అయితే..
     
ఉన్నదానిని ఉన్నట్టుగా..చెప్పేవాడు..వార్తాహరి  అవుతాడు.. ఉన్నదానిని అందంగా చెప్పేవాడు కవి.. 
కవిత్వమంటే.. ప్రముఖ  కవి  కే.శివారెడ్డి గారి మాటలలో.. " గుండెకి.. ఎండ తగలకుండా ఉంటె మనిషికి  కష్టం విలువ ఎట్టా తెలిసేది..!? అనడమే.. కవిత్వం.
 హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభించదు..ఉదయం వినా  నా కంటికి.. ఏ దృశ్యం గోచరించదు.. అంటారు దాశరధి.. తన "అగ్నిధార " కావ్యంలో.. 

చిరుగాలిలో ,చిరుజల్లులో 
పూల పరిమళం లో.. గుభాళిస్తుంది  కవిత్వం.
 ఎగసిపడే తరంగంలో,ఎగిరే విహంగంలో..
మదనపడే అంతరంగంలో ప్రకాశిస్తుంది కవిత్వం.
కురిసే మేఘంలో..ఆడే మయూరంలో..
విరిసిన ఇంద్రచాపంలో..ప్రవహిస్తుంది కవిత్వం.
భానుడి చైతన్యంలో..దీనుడి దైన్యంలో..
తెలుగుతల్లి స్తన్యంలో పరవళ్ళు త్రోక్కుతుంది కవిత్వం.
నింగిన మొలిచిన చుక్కల్లో ,నేలను చీల్చుకు వచ్చిన మొక్కలలో..
పేదవాడి కన్నీటి చుక్కల్లో పొంగిపోర్లుతుంది కవిత్వం.
ప్రియురాలి అధరంలో..విప్లవవాది రుదిరంలో..
కష్టజీవి ఉదరంలో..ప్రజ్వరిల్లుతుంది కవిత్వం.    

ఇది ఓ.. నవ కవి..కవితావేశం..
ఇందులో కూడా బ్రాంతి.. కనబడుతుందా ?  వస్తువు,అభివ్యక్తీకరణ ,శైలి,సందర్భం ..ఇవి నాలుగు..మంచి కవితకి..ప్రాణం పోస్తాయి. రవీంద్రుని కవీంద్రుని చదవండి..ఒక దేవులపల్లిని, ఒక తిలక్ ని..ఒక శ్రీ శ్రీ ని ..అనిశెట్టి ప్తభాకర్ నో.. చూడండి.. గాలిబ్ గీతాల్లో  ..సూఫీ కవిత్వం నో.. చదవండి.. కవిత్వంకి  అర్ధం.. తెలియకపోతే.. కవిత్వమనే  ఒక ప్రక్రియ ఉందని మర్చిపోండి. అంతే కానీ  మానసిక రోగి లక్షణం కవిత్వం   వ్రాయడం అని.. నిర్ధారణ  చేసే  వ్యాఖ్య  వ్తాయకండి. 
హృదయం తో..స్పందించి  ..మనసులో.. మదించి..  ఆలోచన అగ్నికణం రగిలించి.. తేట తేనియ భాషతో.. అక్షర లక్షలతో సుమాలతో....నవరస కదంబమాలికలు..అల్లడమే.. కవిత్వం.