10, నవంబర్ 2012, శనివారం
9, నవంబర్ 2012, శుక్రవారం
వీణ నాది - తీగ నీది
ఈ పాట వినడం, చూడటం చాలా హృద్యంగా ఉంటుంది కొన్ని యుగళ గీతాలలో చిత్రీకరణ చాలా చాలా బావుంటుంది. అందమైన దృశ్యాల తో చిత్రీకరించిన పాట ఎంత బావుందో..చూడండీ!!
80 వ దశకంలో రేడియోలో మారుమ్రోగిన పాట
కటకటాల రుద్రయ్య చిత్రంలో ఈ పాట నాకు చాలా ఇష్టం. వీణ నాది తీగ నీది.. అనే సాహిత్యమే కాని వీణ పాట కాదు. :)
ఇక సాహిత్యం విషయానికి వస్తే ఒకసారి వినగానే గుర్తుంది పోయే సాహిత్యం.
సాహిత్యం వేటూరి గారు. మొదటి చరణంలో "తొలి చూపు రాపాడగానే" అన్నది కొద్దిగా వెరైటీ గా ఉంటుంది. మొదట్లో నాకు అర్ధమయ్యేది కాదు రాపిడికి పర్యాయంగా రాపాడగానే అని రాసినట్లు ఉన్నారు. ఆ పదం మినహా పాట సాహిత్యం అంతా అరటి పండు ఒలిచి పెట్టినట్లు ఉంటుంది.
సంగీతం :జే.వి .రాఘవులు.
గాయనీ గాయకులు : ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం ,పి .సుశీల.
పాట సాహిత్యం:
వీణ నాది తీగ నీది తీగ చాటు రాగముంది
తీగ చాటు రాగముంది
పువ్వు నాది,పూత నీది,ఆకు చాటు అందముంది ||వీణ నాది ||
తొలిపొద్దు ముద్దాడగానే
ఎరుపెక్కే తూరుపు దిక్కు
తొలి చూపు రాపాడగానే
వలపొక్కటే వయసు దిక్కు
వరదల్లె వాటేసి,మనసల్లే మాటేసి,వయసల్లే కాటేస్తే చిక్కు
తీపి ముద్దిచ్చి తీర్చాలి మొక్కు ||వీణనాది ||
మబ్బుల్లో మెరుపల్లే కాదు
వలపు వాన కురిసి వెలిసిపోదు
మనసంటే మాటలు కాదు
అది మాట ఇస్తే మరచిపోదు
బ్రతుకల్లే జతగూడి,వలపల్లే ఒనగూడి, ఒడిలోనే గుడికట్టే దిక్కు,
నా గుడి దీపమై నాకు దక్కు ||వీణ నాది ||

ఆడియో వినేయండీ! వీడియో చూసేయండి!!
8, నవంబర్ 2012, గురువారం
దేహక్రీడలో తెగిన సగం
ఆడి పాడే అమాయకపు బాల్య దేహం పై..
మొగ్గలా పొడుచుకు వస్తున్నప్పుడు..
బలవంతంగా జొప్పించిన ఆడపిల్లననే జ్ఞానం
పదమూడేళ్ళ ప్రాయంలో..యవ్వనపు దేహం పై..
వసంతం విరిసినప్పుడు వీడని అమాయకత్వం
నువ్వు ఆడదానివే సుమా అన్నట్లు
నఖశిఖ పర్యంతమూ చూపులతో
గుచ్చి గుచ్చి తడిమినప్పుడు
లోలోపల భయం, గగుర్పాటు తో
తనువంతా చుట్టుకునే ముగ్ధత్వం
కాంక్షల కౌగిలిలో నలిగిపోతున్నా
మోహపు పరవశంతో ఉప్పొంగినా
అలంకారమని సగభాగం నిర్ధారించాక
అనంత సృష్టి రహస్యపుఅంచులు తాకే
కేళీ విలాసంలో ముఖ్య భూమిక గా
కామ్య వస్తువుగా..భోగ వస్తువుగా
మారిన కుఛ ద్వయాలకి
అన్నీ గరళమైన అనుభావాలే !
చిన్ని చిన్నిచేతులతో ..తడిమి తడిమి ..
ఆకలికి తడుముకుంటూన్నప్పుడు
ఆ పాలగుండెలు
బిడ్డ ఆకలిని తీర్చేఅమృత భాండా లని...
ఆ గుండెలు పరిపూర్ణ స్త్రీత్వపు చిహ్నాలని
తన్మయత్వం తో..
తెలుసుకున్న క్షణాలు మాత్రం స్వీయానుభవాలు.
అసహజపు అందాలను ఆబగా చూసే వారికి
సహజం అసహజమైనా,అసహజం సహజమైనా..
ఆ దేహం పై క్రీడలాడునది..ఈ నరజాతి వారసుడు
చనుబాలు కుడిచిన నాటిని మరచిన బిడ్డడే కదా..
అసహజంగా పెరిగిన కణ సముదాయాలని కుతికలోకి.. కోసి..
ఓ..సగ భాగాన్ని పనలని పక్కన పడేసినట్లు పడేసాక..
అయ్యో అనే జాలిచూపులు భరించడం,. కన్నా
నువ్విక పనికరావనే..వెలివేతలు..సహించడం కన్నా
ప్రాణం పొతే బాగుండునన్న భావనే అధికం.
అమ్మ - అమృత భాండం, స్త్రీ-సౌందర్యం-ఉద్దీపనం సారూప్యమైనవే !
దేహం నదిలో
ఎత్తు పల్లాలు,ఒంపు సొంపులు ,సొగసులను
ఆబగా కొలుచుకునే కామచిత్తులకి
ప్రవాహించినంత మేరా... పచ్చదనాన్ని నింపే
ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎన్నడు?
పరచిన నగ్న దేహం పై మిగిలిన సగం పై
పరచిన నగ్న దేహం పై మిగిలిన సగం పై
విశృంఖలం చేసిన గాయం స్రవిస్తూనే ఉంది.
అంతః చక్షువుతో .సౌందర్యపు ఝడిని కనలేని
వికృతమైన ఆలోచనల కురుపు
రాచ పుండు కన్నా భయంకర మైనది.
(టాటా మెడికల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కేన్సర్ (ముంబాయి) లో బ్రెస్ట్ కేన్సర్ విభాగంలో కొంతమంది అనుభవాలు విని విచలితమై వ్రాసుకున్న కవిత ఇది.)

( "విహంగ " వెబ్ మేగజైన్ లో ప్రచురితమైన కవిత)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)

.jpg)