ధియేటర్ ఆర్టిస్ట్‌లు
వారు నిత్యం తిరుగుతూనే ఉంటారు
పగలు అలుపెరుగని సూర్యుడిలా
రాత్రి సగం రోజులకి పోరాడే చంద్రుడిలా
రేపు గురించి చింతే లేదు
మార్కెట్ ధరలతో అస్సలు పనే లేదు
ఏది లబిస్తే అదేపరమాన్నం
నిత్యం మూన్ లైట్ డిన్నర్లే
పైరగాలులని శబ్ధవేదనని
దోమకాటులని సమంగా అనుభూతిస్తారు..
వారి ఉనికి మారదు
వూరు మారుతుంది అంతే
వాళ్ళ బ్రతుకులలో నిశ్చలత్వం
వాళ్ళ కన్నులలో నిర్భయత్వం
వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారు.
మాటల గారడీలు చేస్తారు..
పాటలకి పేరడీలు కడుతుంటారు..
ఎదుటివారిని బురిడీలు కొట్టిస్తారు..
కానీ.. అరచేతిలోమహాలక్ష్మి ని చూపి
అరక్షణంలో మాయమయ్యే
బోగస్ చిట్ ఫండ్ కంపెనీ వాడిలా కాదు
వాళ్ళు పగటి వేష గాళ్ళే !
డాబు,దర్పం, హంగు-ఆర్భాటం అన్నికధలికల్లోనే !
మాయలు మంత్రాలు చూపుతారు
మాటల మంత్రదండాలు ప్రయోగిస్తారు
జోలె నింపుకుంటారు
తప్ప పైలా - పచ్చీస్సు వాళ్ళు కాదు
మన కళ్ళకి కనికట్టు కట్టి
నిలువెల్లా ముంచేయరు
అందమైన ప్యాకింగ్ మాయాజాలం
మన మీద విసరరు
ఎవరినైనా అమ్మ, అక్క, తల్లి చెల్లి అంటూ
నాలుగు కాలాలు నల్గురు నోళ్ళ నానుతుంటారు
అదే వారి కమ్యూనికేషన్ స్కిల్
ఆశల వర్తక వాణిజ్యంలో
మన చేత గంగిరెద్దులా తల ఆడింపచేయరు
రాములోరికి దణ్ణం పెట్టిస్తారు..
ఇల్లాలు.. సీతమ్మకి దీవెనలిప్పిస్తారు
విశ్వసిస్తాం కనుక మన గోత్రాలు చెబుతారు
మన మద్య ఉన్న మనుషులని దేవుళ్ళ ని చేయరు
ఒళ్ళు మరచి ఇల్లు గుల్ల చేయించే
మూఢ భక్తికి నిధర్శకులు కారు
మతాల రంగు మార్చే ప్రచారకులు కారు
భవిష్యత్ ని జోస్యంతో చెప్పి
ఆశ కల్గిస్తారు తప్ప 5 ఏళ్ళ కాలాన్ని
వాగ్దానాలతో పూరింపని వారు.
వాళ్ళ పెరఫార్మేన్స్ కి
వేదికలు అక్కరలేదు
ప్రచారం పని అసలే లేదు
వాళ్ళు స్వతహాగా ధియేటర్ ఆర్టిస్ట్‌లు
సహజం గా రాణిస్తారు
ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఉండదు
వారు జీవితాన్నిజీవిస్తారు
జీవనంలో మరణిస్తారు
5 కామెంట్లు:
super.
kavitvam ante emito.. ee kavitalo choostunnaanu.
original poetry.
hats off.
జీవన్నాటకంలోని నటజీవనం కరుణాత్మకంగా కవితలో పొదిగి పాత్రల జీవనశైలి మనసున ఒడుపుగా నాటారు.అభినందనలు వనజగారు.
Hitaishi .. kavita meeku nacchinanduku chaalaa santosham.
Thank you very much!!
@C.Uma devigaaru..mee prashansa ki manhspoorthigaa dhanyavaadamulu.
really good poem
depicting the lives of human beings who are far away to the
so called civilised society ..
They are leading nodoubt happy life
బాల కృష్ణా రెడ్డి గారు ..కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి