అమ్మా.. నీకు నచ్చినట్టు ఉండమ్మా..!!
అని మీ బిడ్డలు ఎవరైనా మిమ్మల్ని అన్నారా!?
అవును మా అబ్బాయి నాకు ఇదే మాట చెబుతూ ఉంటాడు.
నచ్చినట్లు ఉండటం అంటే అంటాను. ఫ్రీగా నీకు నచ్చినట్లు ఉండమ్మా.. ఎవరో ఏదో అనుకుంటారని నచ్చినవి చేయడం మానకూడదు అంటాడు. స్వేచ్చగా ఎగిరే పక్షికి హద్దులు ఉంటాయి. లేకుంటే రెక్కలు విరిగి..కూలిపోతుంది. నామ రూపాలు లేకుండా నాశనం అయిపోతుంది. అందుకే నచ్చినట్లు మనం ఉండలేం ..అని చెపుతుంటాను.
కానీ ..ఇలా ఆనే కొడుకు నాకు ఉన్నందుకు నాకు చాలా గర్వం కూడా!
నిజంగా అలా ఉండగల్గే స్వేచ్చ ఉన్నప్పటికీ మనకి నచ్చినట్లు మనం ఉండగలమా.. అని ప్రశ్నించుకున్నాను.
అందుకే.. తను చదువు కునేటప్పుడు ..తనలాగే కాలేజ్ కి వెళ్లాలని దూర విద్యా కోర్సెస్ లో జాయిన్ అయి.. క్లాస్ లకి వెళ్ళేదాన్ని.
నాకు నచ్చినట్లు ఉండటం అంటే..పుస్తకాలు చదువుకోవడం,మంచి మంచి పాటలు వినడం,స్నేహితులతో.. ముచ్చట్లు చెప్పుకోవడం, అప్పుడప్పుడు సాహిత్య సభలకి హాజరవడం నాకు చాలా ఇష్టం. కానీ ఒక గృహిణిగా, వర్క్ షాప్ నిర్వహించుకునే నాకు ఉన్న సమయాలు వీలు పడవు. అలాటి సభలకి హాజరైనప్పుడు మన ప్రమేయం లేకుండానే ఘన సమయాలు గడచి పోతుంటాయి. అందువల్ల ఇంటికి రావడం ఆలస్యం అవుతుంటుంది. అందు వల్ల అలాటి కార్యక్రమాలకి వెళ్ళడం పూర్తిగా మానుకున్నాను. అది నాలో పెరిగిన,దాగిన ఒక అసంతృప్తి. అలాగే నేను నిర్వహించే"నెల నెల వెన్నెల కవిత్వ కార్య క్రమం" కి గైరు హాజరు అవుతున్నాను.
కాఫీ త్రాగడం ఇష్టం. కాఫీ త్రాగడం వల్ల బరువు పెరగడం జరుగుతుందని..కాఫీ కి బ్రేక్ ఇచ్చేశాను.
రోజు గుడికి వెళ్ళడం ఇష్టం. దూరం వల్ల వాహనం తీయాలి. మెయిన్ రోడ్డుపై పై పైకి దూసుకువచ్చే అస్తవ్యస్తమైన ట్రాఫిక్..భద్రత, భయమో..వెళ్ళనీయకుండా ఆపేసింది.
ఇలా చాలా చాలా ఇష్టాలు అనేక కారణాలు వల్ల మనసులోనే చంపేసుకుని.. బ్రతికేస్తుంటాను.
నేనే కాదు చాలా మంది అంతేనేమో!
పిల్లలు ఉంటే .. ఎప్పుడు ..పెద్దలని నీకేం తెలియదు నువ్వూరుకో..! అని కసురు కుంటారు అనుకుంటారు కదా!
నిజమే! జనరేషన్ గ్యాప్ అనేది ఒకటి ఉంటుంది కదా! శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం,సాంకేతిక విప్లవం వచ్చిన ఈ కాలంలో..పిల్లలు వారిని వారు అప్ డేట్ చేసుకుంటారు.
పిల్లలతో పోల్చితే పెద్దలకి ఎంత అనుభవం ఉన్నా వారికి చాలా విషయాలు తెలియవు అనుకోవచ్చు. అక్కడక్కడా అరుదుగా పిల్లలతో పాటు పెద్దలకి అన్ని విషయాలు తెలుస్తాయి.
నాకు అలా కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఎలా అంటే ఇప్పటి తరం పిల్లలకి భిన్నంగా మా అబ్బాయి నాకు చాలా విషయాలని వివరంగా చెపుతూ ఉంటాడు.
ఎప్పుడూ ..ఒకటి చెపుతుంటాడు. నీకు నచ్చినట్లు ఉండు ..అమ్మా..! అని .
నేను ఒకే ఒక విషయం లో మాత్రం నాకు నచ్చినట్లు ఉంటూ ఉంటాను.
అది ఏ విషయం అంటే..
నవ్వకండే!
ఇదిగో ఇలా అన్నమాట...
వానలో తడవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం.
జోరున వర్షం కురుస్తున్నప్పుడు.. బయటకి వచ్చేసి సూదుల్లా గుచ్చే వాన చినుకులలో తడుస్తూ.. నడుస్తూ..నీళ్ళతో..ఆడుకుంటూ..డాన్స్ చేస్తూ.. నాతొ ఎవరైనా కలిస్తే.. వారిలో కలసి మళ్ళీ తడుస్తూ.. ఎవరు లేకుంటే.. ఏదో ఒకపని కల్పించుకుని ..బండి పై ..అలా అలా రౌండ్స్ కొడుతూ.. వర్ణ రంజితమైన ప్రకృతిలో తడుస్తూ మనసు రాగ రంజితం..చేసుకుని. చిన్న పిల్లలా సంబరపడిపోవడం ని మాత్రం స్వేచ్చగా నచ్చినట్లు చేయగలను.
ఈ రోజు మధ్యాహ్నం ఓ..చిన్నపాటి కునుకు తీసి లేచి బయటకి వచ్చేటప్పటికి ..సన్నగా చినుకులు..పడుతున్నాయి. జోరు వానగా మారే సమయం కోసం ఎదురు చూసాను. నల్లని మేఘాలు కదిలి కదిలి తేలిపోయాయి.. తెల్లని హంసల వలె! ప్చ్.. నచ్చినట్లు ఉండే అవకాశం మిస్ అయిపోయిందే ..అని బాధపడ్డాను.
అమ్మా..నీకు నచ్చినట్లు ఉండమ్మా..! ఆనే మా అబ్బాయి మాట గుర్తుకు వచ్చింది అప్రయత్నంగా..

అందరిని అడిగి అడిగి నిరాశపడి ఆఖరికి నేనే సాధించాను ..ఇలా వీడియో కూడా చేసాను . చూడండి యిక .. :)
8 కామెంట్లు:
నిఝంగా కాఫీ మానేశారా, తగ్గించారా? :)
vanaja gaaroo, meeku nachhinatlu undatam o adrustam, ardam chesukuni sahakarinche pillau undatam o varam inkemi kaavaali aadavaariki.
అలాంటి కొడుకున్నందుకు మీరదృష్టవంతులు. మీ అబ్బాయికి అభినందనలు.
బ్రతకడానికీ - జీవించడానికీ తేడా ఉంది వనజ గారు.
నచ్చినట్లు ఉండడమంటే మన బాధ్యతలు నెరవేరుస్తూనే, మనకిష్టం వచ్చినట్లుండడం. అది మీరన్నట్లు ఈ వ్యవస్థలో అసాధ్యం.
మనం మాత్రమే బాగుంటే సరిపోదు సమాజం యొక్క చైతన్య స్థాయి కూడా పెరిగినప్పుడే మనకిష్టమొచ్చినట్లుండగలం . ఎందుకంటే మనిషి సంఘ జీవి కనుక.
ఆ ఇన్స్ట్రుమెంట్ నా దగ్గర ఉంది. సిస్టం ఫార్మాట్ చేయాల్సి వచ్చి పోయింది. సీ.డీ ఉండాలి వెతికి ఫార్వార్డ్ చేస్తాను.
వనజవనమాలి గారూ..
మనకి నచ్చినట్లు మనం వుండగలగటం మన అదృష్టమైతే దాన్ని సపోర్ట్ చేసె మనవాళ్ళు వుండటం మరో అదృష్టం..
కానీ ఇది ప్రతిసారీ సాధ్యం కాకపోవటమే కొంచెం బాధ..
వనజమాలి గారు..అలాంటి కొడుకున్నందుకు మీరదృష్టవంతులు...
నాకూ వర్షంలో తడవడం అంటే భలే ఇష్టం అండీ..
మీ కోసం ఆ సాంగ్ ఇక్కడ upload చేసాను అండీ.. ఇదేనేమో download చేసుకోండి..
http://www.ziddu.com/download/19869120/swapnavenu_vedo_sangeetham.mp3.html
--సాయి
"మీ ఇంటి వెలుగు .. మీ కంటి దీపం..చురునవ్వుల చంద్రుడు మీకు కొడుకుగా పుట్టడం నిజంగా మీ అదృష్టం వనజ గారు!
కష్టేఫలె గారు.. నిజంగానే కాఫీ త్యజించాను. కాకపొతే అప్పుడప్పుడు అతిధులు వచ్చినప్పుడు.. అలా నాలుక జిహ్వ ఆపుకోలేక.. ఓ..ఆఫ్ కప్.అంతే!:)) థాంక్ యు వేరి మచ్!!
@మేరేజ్ ఫాతిమా ..థాంక్ యు వేరి మచ్.పిల్లల ఆలోచన ధోరణి వికసించింది అనడానికి మా అబ్బాయి ఉదాహరణ అని అనుకుంటాను.
అంత దూరంలో ఉన్నా ఎప్పుడు అదే చెపుతాడు.అందుకే..నేను ఆ మాట మరువలేను.
@కొండలరావు గారు ధన్యవాదములు. మీరు అన్నది నిజమే నండీ! కొన్ని కట్టుబాట్లుకి-సంప్రదాయాలకి మధ్య మనిషి ఎప్పుడు భాద్యతగా నడచుకోవాలి. ఇష్టాపూర్వకంగా ఎవరు నడవలేరండీ!
మీ స్పందనకి ధన్యవాదములు.
@సాయి ..గారు.. ధన్యవాదములు.
మీరు పాపిన లింక్ లో సాంగ్ ఉంది. అది కాదండీ నేను అడిగింది.
నాగార్జున,అంజలాజవేరి క్రూయిజ్ లో డెక్ పై ఉన్నప్పుడు నాగార్జున శాక్సోపోన్ తో స్వప్న వేణువేదో సాంగ్ స్టార్టింగ్ లో ఉన్న ట్యూన్ ప్లే చేస్తాడు.ఆ బిట్ కావాలని అడిగాను నేను.
జల్లెడేసి వెదికాను దొరకనేలేదు.మళ్ళీ ట్రై చేద్దాం అండీ!
@రాజీ..గారు.. కొన్ని విషయాలలో నేను అదృష్ట వంతురాలినే! థాంక్ యు!
@కాయల నాగేంద్ర గారు.. :) థాంక్ యు వేరి మచ్!! గాడ్ ఈస్ గ్రేట్!!
కాఫీ మానెయ్యటం ఎమీ నచ్చలేదు.
కాని నిజంగానే నిఖిల్ బంగారు కొండ! అంతే!
కామెంట్‌ను పోస్ట్ చేయండి