19, జులై 2012, గురువారం

అంటే అన్నారంటారు..కానీ ..

అంటే అన్నామంటారు కానీ..ఇలాటి విషయాలు విన్నప్పుడు, ప్రత్యక్షంగా కొందరు చూస్తున్నప్పుడూ .. మనకి ఏమి అనిపిస్తుంది..

ఇంకా ఆటవిక యుగంలో ఉన్నట్లు లేదు.

ఏ పదాలు ఉపయోగించి తిట్టగలం చెప్పండి? స్త్రీలు బాహ్య ప్రపంచం కి తెలియని ఎన్నో రాక్షస ప్రవృత్తులని భరిస్తూ ఉన్నారు.

కనబడటం లేదా!? ఇక్కడ మానవ మృగ క్రూరత్వం. !?

ఇలాటి చోట్ల కూడా పెమినిజం కనబడుతుందా?

ఈ క్లిప్పింగ్ చూడండి.. ఇది ఈ నాటి దిన పత్రికలో వచ్చింది. (ఆంద్ర జ్యోతి ..దిన పత్రికలో.. )

కళ్ళు ఉండి చూడలేని గుడ్డి లోకంలో ప్రతిదానికి స్త్రీలని ఆడిపోసుకుంటున్న పురుష ప్రపంచమా! ఓ..అబల దుస్థితి చూసాక అయినా మనం ఇంకా ఆటవిక యుగంలోనే ఉన్నామని నిర్ధారించుకోండి.

ఉబుసుపోక, పురుష ద్వేషం తో.. స్త్రీలు రచనలు చేయడం లేదని తెలుసుకోండి. మంచికి-చెడుకి రెండింటికి స్పందించండి.

ఆ వాదమో, ఈ వాదమో మోయడం .. సమంజసం కాదు.

తప్పిదం ఎక్కడ, ఎవరికీ జరిగినా స్పందించండి. స్త్రీ ల సాహిత్యంని నిందించకండి అని మనవి.

15 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

ఎంత అమానుషం కదా !

nsmurty చెప్పారు...

వనజగారూ, మాలా కుమార్ గారూ,
అమానుషం అన్నది చిన్న మాట. నాగరికుడైన ప్రతిపురుషుడూ సిగ్గుతో తలవంచుకోవాలిసిన స్థితి.
అభివాదములతో

శ్యామలీయం చెప్పారు...

ఎంత రాక్షసత్వం!

ప్రస్తుత కాలంలో‌ కొన్ని వింత పోకడలు కనిపిస్తున్నాయి.

దేవుళ్ళ రాబడి పెరిగింది. కాస్త పేరున్న ప్రతి గుడికీ కనకవర్షం‌ కురుస్తోంది అక్షరాలా. మనుషుల్లో నైతికత పెరిగిందని భక్తి పెరిగిందని అర్థమా? కాదు.

మనుషుల్లో డబ్బు పట్ల యింత వెంపరలాట చూస్తుంటే భవిష్యత్తును తలుచుకుంటేనే భయం వేస్తున్నది.

న్యూక్లియర్ ఫామిలీ ప్రభంజనంలో ఉమ్మడికుటుంబం అనేది వింత విషయం అయిపోయింది. నెలపిల్లలకూ‌ క్రెష్ పెంపకమే! తప్పని సరి పరిస్థితులా? అందులో మనం చివరికి desensitize అయిపోయామా?

నేరాలూ ఘోరాలూ కనీవినీ‌యెరుగని రీతిలో ఉన్నాయి. ఏ విధమైన ఉఛ్ఛనీచాలూ లేవు.

నాకు మానవత్వం కూడా మసకబారిపోయి నట్లుగా అనిపించి నిరాశ కలుగుతోంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాలా కుమార్ గారు, @nsmurty గారు ,శ్యామలీయం గారు..
నేను ఈ వార్త చదువుతున్నప్పుడు.. చాలా సిగ్గు పడ్డాను,బాధపడ్డాను.
మానవజాతి అనాగరిక చర్యలకి అంతే లేదా? అనిపించింది.
గొప్ప సంస్కృతీ సంప్రదాయమైన దేశం అని డబ్బాలు కొట్టుకునే మనం నిత్యం సిగ్గుపడే విధంగా అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
నాగరికత ముసుగులో అనాగరికంగా,హేయంగా ప్రవర్తిస్తున్న తీరుకి గర్హించాలి కదా!
ఈ రోజు నేను ఒక బ్లాగ్ లో కామెంట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను వెలిబుచ్చిన అభిప్రాయం కి నా వాదనకి కట్టుబడి ఉన్నాను. ఇలాటి సంఘటనలు నిరూపణగా కనిపిస్తుంటే. మహిళల పై అమానుష చర్యలు లేవని అడ్డంగా వాదిస్తున్న వాళ్ళని ఏమనగలం?
విచారించడం తప్ప!
మీ అందరి స్పందన కి ధన్యవాదములు అండీ!

Raj చెప్పారు...

ఇవన్నీ చూస్తుంటే ఇంకా పాత అనాగరికుల కాలములోనే ఉన్నామా అనిపిస్తుంది..

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

దీనితో స్పష్టం అయింది ఒక్కటే మనిషిలో రాక్షసుడున్నాడు అని .అత్యంత హేయం.

భాస్కర్ కె చెప్పారు...

ఆ వాదమో, ఈ వాదమో మోయడం .. సమంజసం కాదు.తప్పిదం ఎక్కడ, ఎవరికీ జరిగినా స్పందించండి.
good words,

Pavani చెప్పారు...

ఇది మూర్ఖత్వం and వెర్రితనం. వాడెవడో చదువు సంస్కారం లేని హీనుడే అయ్యుంటాడు.
అయితే...స్త్రీలపై అమానుష చర్యలు లేవని ఎవరైనా అన్నారా అండి? అనుంటే తప్పే.
నాకు తెల్సినంత వరకు, స్త్రీ పురుష బేధం లేకుండా చట్టం తప్పు చేసిన ఎవరినైనా సమంగా శిక్షించాల్సిందే అనేవాళ్ళు మాత్రం ఉన్నారు. నాతో సహా.
I do not think there is any need to consider gender in this case.

అజ్ఞాత చెప్పారు...

ఆడ మగ తేడా లేదండి. అత్యాచారం చేసేవాళ్ళెవరయినా ఒకటే, దుర్మార్గులు.

అజ్ఞాత చెప్పారు...

స్త్రీ పురుషుల బేధభావాలకతీతంగా ఇది అమానుషం. ఇలాంటి మానసిక రోగులకు నిర్భందోచిత వైద్యం చేయించాల్సిన కర్తవ్యం ప్రభుత్వానికి వుంది.

హితైషి చెప్పారు...

vaaram kritham e topic gurinchi na friend tho maatladatam jarigindhi. nijam kaadhemo, na friend apohalo undhemo ani anukunna. kaani mi post chusaaka shock iyaanu. yelaanti samaajamlo unnaa nenu? ani bhayamesthondhi..

జలతారు వెన్నెల చెప్పారు...

నెనైతే అంత కాలం ఆ భార్య అలా బాధ అనుభవిస్తూ మౌనం గా ఉండడాన్ని ఖండిస్తున్నాను...అత్యాచారాన్ని సహించకూడదు.. అది కూడా ఒక జబ్బే!

శ్రీ చెప్పారు...

గాంధీ గారు చెప్పినట్లు..
హింసని ఎదిరించక పోవడం కూడా తప్పే..
అలంటి వార్తలు చదివినపుడు ఆడ,మగ అని తేడా లేకుండా..
స్పందిస్తాం.
నారిని పూజించే చోటే ఇలాంటి అకృత్యాలు...
శర్మ గారు చెప్పినట్లుగా
"ఆడ మగ తేడా లేదండి. అత్యాచారం చేసేవాళ్ళెవరయినా ఒకటే, దుర్మార్గులు."
దీనితో నేను ఏకీభవిస్తాను...
@శ్రీ

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజ్..గారు..
@ఒద్దుల రవి శేఖర్ గారు..
@ ది ట్రీ భాస్కర్ గారు..
@పావని గారు..
@కష్టేఫలె ..గారు..
మీ అందరి స్పందన మనలో మిగిలిన మానవత్వం కి చిహ్నం.
ఎక్కడ అవాంచనీయ సంఘటన జరిగినా పదుగురు కలసి ఎదుర్కుంటే.. కనీసం ఒకే రోజు మారకపోయినా క్రమేపి మార్పు సాధ్యం అవుతుంది కదా!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

SNKR గారు మీరు అన్నట్లు ఆ వ్యక్తీ మానసిక రోగి కావచ్చు.చాలా మంది మానసిక ఆరోగ్యం బాగుండి కూడా చాలా అకృత్యాలు చేస్తుంటారు. వారిని ఏమి చేయగలం చెప్పండి.ముఖ్యంగా నోరు పారేసుకునే వాళ్ళని.
@హితైషి.. మీ స్పందనకి ధన్యవాదములు. మీ ఫ్రెండ్ కి మెదడులో గుజ్జే ఉంటుంది. మట్టి ఉండడని అర్ధం అయిందా!:) జస్ట్ కిడ్ అండీ.
@జలతారు వెన్నెల గారు అసలు తలచుకుంటేనే వళ్ళు గగుర్పొడుస్తుంది. మీ స్పందనకి ధన్యవాదములు.
@ శ్రీ గారు.. మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తుంటే బలహీనులకి అరవడానికి గొంతే ఉండదు కదండీ..
దుర్మార్గులను శిక్షించాల్సిందే! స్పందనకి ధన్యవాదములు.