వినబడని పాట
తలపుల నిషేధం విధించినా సరే ఆజ్ఞలు ఉల్లంఘిస్తూ
వెలుగు లాగానో సవ్వడి లాగానో చీకటి లాగానో లోపలికి జొరబడి పోతావ్
*********
నేను లోలోపల పాడుతున్న పాటలు కూడా
పక్షుల వలె సీతాకోకచిలుకలు కు మల్లే ఎగురుతూ నీ వద్దకు చేరుకుంటాయ్.
*********
నువ్వు నా ప్రపంచాన్ని దోచుకున్నావు.
విస్తరించుకున్నావు. ఆఖరికి నా ఇంటిని కలల ప్రపంచాన్ని కూల్చేసి పోయావ్
*********
విడిపోయి మళ్ళీ కలుసుకునేటప్పుడు లోపాలు నీలో కన్నా నాలోనే ఎక్కువగా
కనబడతాయ్, నువ్వు మగవాడివోయ్.
*********
రాత్రంతా నిన్ను గుర్తుచేసుకుంటూనే వున్నాను.జ్ఞాపకాల చంద్రుడు
నా హృదయంలో అమావాస్య చీకట్లు నింపుతూ,
- వనజ తాతినేని

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి