8, జనవరి 2026, గురువారం

ఆహ్వానం


 






ఆహ్వానం -వనజ తాతినేని


పుష్యమాసపు ఉదయకాంతి పై  

పొగమంచు అలుముకుంది. 

తూరుపుగాలులు మరింత వణికిస్తున్నాయి. 

చెట్టు మీద పక్షి నాకు మల్లే 

సూర్యకాంతికై ఎదురుచూస్తుంది. 

ఆహ్వానించి బొగ్గుల పొయ్యి వద్ద 

చలి కాచుకోమంటాను. 

పొగలు కక్కతున్న కాఫీ రుచి 

ఆస్వాదించమంటాను. 

కాసిని గింజల విందు 

ఆరగించమంటాను. 

        

©️Vanaja Tatineni

కామెంట్‌లు లేవు: