కిటికీలు వికసిస్తాయి
వెలుగుతో రంగులతో
జీవం నిండిన ప్రపంచంతో
********
పుస్తకంలో అక్షరాలు
అడవి పూలు లాంటివి
ఎవరో చూస్తారనీ వికసించవు
పరిమళాలు వెదజల్లవు
కాలానికి అవే పూస్తుంటాయి
విత్తనాలై వెదజల్లబడతాయి
ఏదో వొకనాడు ఎవరో వొకరి
అరచేతుల మధ్య ప్రేమగా
పాత పుస్తకమై జీవిస్తాయి
*****
జీవితం ఇస్తుంది ఎన్నో అవకాశాలు
ఆ అవకాశాలు ఉపయోగించుకుని
అవే తప్పులు మళ్ళీ చేయకు
పరిణామాలు ఎదురుచూస్తుంటాయి
దండిచడానికి.
-వనజ తాతినేని

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి