5, జనవరి 2026, సోమవారం

సంభాషణలు

 సంభాషణ 1

చలికి ముడుచుకుని పడుకుని వున్న సహచరుణ్ణి రెక్కతో తట్టింది. 

నేనొక విషయం చెప్పనా.. అంది. 

పక్కకి తిరిగాడు విముఖంగా.. 

తన ధోరణిలో తాను చెప్పుకుపోయింది.. 

రంగులు ఒకొరినొకరు ప్రశంసించుకుంటున్నాయి. నేనూ ప్రశంసించాను. చేతులు చూడు ఇనబింబం లా కందిపోయాయి అని అనగానే.. 

అతను చప్పున కళ్ళు విప్పి దగ్గరకు జరిగి ఆమె చేతులను ముక్కు తో చుంబించాడు ప్రేమగా.. 


నీ అనుభవాలతో నువ్వు గాయపడితే.. 

నీ గాయానికి లేపనం అద్దేది అసలైన తోడు.


****************

సంభాషణ 2


ప్రియతమా! 

ఈ చిన్ని తోట చెవులు రిక్కించి నీ పద ధ్వని కోసం ఎదురు చూసింది. 

నీవు రావటం ఆలస్యం కాలేదు. 

మంచు తెర మన మధ్య తెరసెల్లా పట్టింది. 

సిగ్గుతో తలదించుకునే వొడలంతా కనులు చేసుకుని  ఓర కంట నిను చూస్తున్నాను. 

నీ దరహాస ధ్వని వినబడుతుందిలే ! 

వేచి చూడటానికి ఓరిమి ని ఇచ్చిందిలే!!


******************

 సంభాషణ 3


ఈ ఉదయకాలం మరింత సఫలం అయింది అన్నాను పువ్వులతో. 

నా మాట వినిపించుకోకుండా.. 

“చలిగాలికి వణికిపోతున్నా.. ఒళ్ళు వెచ్చబెట్టుకుందామంటే ఈ మంచుతెర వొకటి అడ్డం గా వుంది” అని విసుక్కుంది. 

నేను అన్నాను.. 

“నీ సౌందర్యం చూద్దామనుకుంటే కాఫీ కప్ లో ఆవిరి నాకళ్ళద్దాలను మసక చేసింది మరి”.


#వనజతాతినేని #follower #hilights #mobileclicks #mobilephotography


కామెంట్‌లు లేవు: