|| దేహాన్నికప్పండి ||
చిన్ని పాపా!
నిన్ను తెర మీద చూసుకోవాలనుకున్న
ఆత్రుత కల్గిన తల్లి ఉంటే..
నీకు ఈస్ట్రోజెన్
సూది మందు ఇవ్వడం మొదలుఅవుతుంది..
నిన్ను కాసులని పండించే
పంటభూమి అనుకునే
తండ్రి ఉంటే నీ శరీరం
లైపోసక్షన్ ఆపరేషన్లకి సిద్దం చేయ బడుతుంది.
ఎందుకంటే.. ఏ తెర మీదైనా
ఆడతనం నిరూపణకి ఆ రెండూ ముడిసరుకులు మరి.
అర్భకత్వం దేహానికిచ్చి..
అల్పత్వం మనసుకి లేకుండా..
ఉదార హృదయంతో అంతా పరిచేసి
పాకుడు రాళ్ళపై పైకి ఎగబ్రాకుతూ
దేహం అడవిలో
పిచ్చ్ది మొక్కల్లా పెంచుకున్న యవ్వన సంపదంతా..
సంకోచం లేకుండా అచ్చాదనంటూ లేని..
కెమెరా కళ్ళకి చిక్కి గంగవెర్రులెక్కిస్తే అది
దర్శకుడి కళాదృష్టి అయికూర్చుని..
వ్యాకోచాలు మొదలైతే..
తల్లి, చెల్లి,పిల్ల.. అన్ని మరచి..
నేర ప్రవృత్తికి కొత్త ఊపిరి పోస్తున్నాయి..
రసిక హృదయులకీ ఇల్లు నచ్చక
అంగడి బొమ్మలకై వెదుకులాడుతున్నాయి ..
ప్రకృతిలోని వేయి పూవులన్నీ తెచ్చి.
ఒక్క చీరలో చుట్టి..దేహాన్ని చుట్టాలనుకున్నది..
వ్యాపార రహస్యమైనా..
ఏ ప్రారంభానికో విచ్చేసిన తార
ఆ చీర బహుమతిగా కొట్టేసి
త్రీ పీస్ మిడీ, డీప్ నెక్ లేదా బ్యాక్ ఫ్రీ బ్లౌస్ చేసేసి
తెరపై నాయకుడి చేతి నడుం పట్టులో నలిగిపోతుంటే
సంప్రదాయమైన పట్టు వెలవెలా పోతుంది
ప్రపంచం అంతా
పువ్వులాంటి అబల నడుమ చుట్టేగా తిరుగుతుంది..
సంప్రదాయాన్ని గరికలా మిగిల్చి
మనం నాగరికతని వెతుకుతున్నాం..
నాగరికత హై టెక్ పార్టీలలోనూ..
ర్యాంప్ షో పిల్లి నడకల్లోను..
నట్టింట్లో తెరపై కాదు కనిపించేది.
నాగరికతని నేర్చుకున్న ఆది మానవుడిని అడగండి..
మునిమాపు వేల గడ్డిమోపు తలకెత్తుకుని వెళుతూ..
బడిపిల్లని చేతబట్టుకుని వెళుతున్న
పల్లెతల్లిని అడగండి.
" మెదడు అంతా.. మన్నేనా
హృదయం అంతా.. బండేనా .
అయినా శరీరం అంతా..
స్వరజతులే ఉండాలా
మీటితే ఎప్పుడు పడితే అప్పుడు..
అలరిస్తూనే ఉండాలా
మద్యంలాగా.. మగువ కూడా.
తయారు చేసుకున్న వస్తువా!?
నాగరికత భ్రమలో
అనాగరికతకి నిలయమైపోకండి..
మనకే సొంతమైన లంగా -వోణీని
ఫ్యాషన్ అని వక్రీకరించకండి
ఫిజిక్ టైట్.. పరవళ్లుతో
దేహసంపదని బజారున పడవేయకండి..
దేహసంపదని బజారున పడవేయకండి..
పల్చని జార్జెట్ చీరల్లో..
బొడ్డుక్రింది మడతల్లో
అందాలు ఆరబోయకండి
నైట్ గౌన్.. మోతలో
ఆరుగజాల మన సంస్కృతిని ..
మరుగున పడనీయకండి..
పడతులూ భామలూ
అత్తమ్మలూ అమ్మలూ
అమ్మమ్మలూ బామ్మలూ
పైటని చుట్టండి
దేహాన్ని కప్పండి! దేహాన్ని కప్పండి!!
4 కామెంట్లు:
చాలా బాగా రాసారు
Thank you very much.. apparao gaaru.
chakkagaa raasaaru vanaja gaaru... mee ee kavitha raathalalO mana saampradaayapu praadhaanyatanu ento chakkagaa vivarinchaaru..!
mee bhaava sampadaku naa johaarlu..!
సత్యం గడ్డమణుగు.. మీకు ఈ కవిత నచ్చినందుకు సంతోషం . మీ అభిప్రాయానికి ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి