12, మే 2012, శనివారం

అమ్మ ప్రేమ


జగమే తలవంచి..మాతృమూర్తికి అభివందనం చేస్తున్న రోజు..ఈ రోజు.
మనది కాని సంస్కృతి అనుకుంటున్నా మనం కూడా ఈ సంస్కృతి ఉచ్చులో పడిపోయాం.
అది మంచిదా, కాదా? అని యెంచి చూసే కన్నా.. ఓ..మంచి సందేశాన్ని  ఆచరణాత్మకంగా చూపితే తప్పు ఏముంది. పోయేది  ఏముంది..?
"అమ్మ" కి అభినందనలు,కృతజ్ఞతలు,బహుమతులు ఇవ్వడమే కదా!
నేనయితే..ఓ..మంచి జ్ఞాపకాన్ని మోసుకుని వచ్చాను.
మా అబ్బాయికి మూడేళ్ళ వయసులో ఉన్నప్పుడు అనుకుంటాను.. నెల్లూరు టౌన్ కి వెళ్ళాం.
అప్పటికి "చంటి" సినిమా రిలీజ్ అయి బాగుంది అనే టాక్ వినవస్తుంది.మా అబ్బాయికి వెంకటేష్ డాన్సు పిచ్చి ఉన్న రోజులు. మూడేళ్లకే అనకండి.."ఏక్ దో తీన్" పాట తెలుగులో కూడా చెవులు తుప్పు వదిలేలా మ్రోగే వేళల్లో..ఆ పాటకి వీరావేశం తో డాన్స్ చేసేవాడు అన్నమాట.
సరే తనకి ఇష్టమైన హీరో..సినిమా చూపించుదామనుకుని..నేను,మా చిన్ని ఇద్దరం కలసి "మూడు హాళ్ళు" అనబడే కాంప్లెక్స్ లో..(కావేరి దియేటర్ అని గుర్తు). చంటి సినిమాకి వెళ్ళాము. ఇక అంతే ..ఆ సినిమా ఆంతా రెప్ప వాల్చకుండా చూసేసాడు. పాటలు చూసి డాన్స్ నేర్చుకుని అలా డాన్స్ వేస్తాడేమో అని చూసేదాన్ని. దానికి భిన్నంగా "చంటి" పాడిన అమ్మ పాట పాడేవాడు..బాగానే తప్పులు తో..కూడా కలిపి.
పదే పదే సరి చేయడం నాకు వచ్చేది కాదు. చిత్రం చూసిన ఒకసారికే పాట సాహిత్యం ఆంతా గుర్తు ఉండదు కదా! తర్వాత ఆడియో కేసెట్ కొనుక్కొచ్చి వేసి మరీ మరీ వింటూ అరిగేదాక వినేవాళ్ళం.
మా అబ్బాయికి బాగా నచ్చిన పాట..ఈ పాట అన్నమాట. ఈ ఆమధ్య కూడా గుర్తుచేసుకున్నాడు.
ఇదిగో..ఇక్కడ వినేయండి..



తర్వాత కాలంలో వచ్చిన ఏ పాట అంత బాగా నచ్చేది కాదు.
ఏమిటి..చంద్రబాబూ..పద్దాక ఆపాట తప్ప ఇంకే పాట వినవా..అని యెగతాళి చేసినా సరే ..ఆ పాట అంటేనే ఇష్టం అని అనేవాడు.
నాకు అప్పుడు ఒకటి అర్ధమయ్యింది. ఒక దృశ్యం తాలూకూ గాఢముద్ర పసి మనసులపై యెంత ముద్ర వేస్తుందో..అన్నది.
ఇరవయ్యి నాలుగేళ్ళలో ..నేను మా అబ్బాయిని..నాలుసార్లు కొట్టి ఉంటాను. కొట్టినప్పుడలా.. ఈ చంటి చిత్రం లో పాటే ఇద్దరికీ గుర్తు వస్తుంటుంది. ఎప్పుడైనా తప్పు అనిపించినప్పుడు నీకు దెబ్బలు పడాలి అని నవ్వుతూ అనగానే .."చంటి" సినిమా చూపించావు కదా అంటాడు.
అది మా మధ్య ఓ..కోడ్.. ఇలా మా అబ్బాయి గురించిన విషయాలలో మునిగి తేలుతూనే ..నేను "అమ్మ" గురించి తలచుకుంటాను.
"అమ్మంటే."
ఊహు..చెప్పలేను.. నాకు తెలిసిన భా ష చాలదు. యెంత నింపినా ఏదో తక్కువైన భావం. . అందుకే..చెప్పలేను ఇక్కడ వినండీ!


"అమ్మ" లందరికి శిరసా నమామి..
కురూపులైన తల్లి ఉంది అనుకోగల బిడ్డలు ఉంటారు. కాని..కూరూపి అయిన బిడ్డ ఉండదు..
అది అమ్మ హృదయ సౌందర్యం.

మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

17 కామెంట్‌లు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

nice andi

పూర్ణప్రజ్ఞాభారతి చెప్పారు...

//కురూపులైన తల్లి ఉంది అనుకోగల బిడ్డలు ఉంటారు. కాని..కూరూపి అయిన బిడ్డ ఉండదు..
అది అమ్మ హృదయ సౌందర్యం.//

సౌందర్యమయమైన హృదయమే దేవుని నివాసం. అందుకే అమ్మ హృదయ సౌందర్యం శంకరుని చేతిలో సౌందర్యలహరి అయ్యింది.
మీ ముగింపు వాక్యాలు సూర్యోదయమంత శాశ్వతాలు.

pragnabharathy.blogspot.in

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు, మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు! మీ అబ్బాయి జ్ణాపకాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!మీ అబ్బాయికి ఆశీస్సులు.

పల్లా కొండల రావు చెప్పారు...

వనజ గారూ ! మీకు , అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"వనజవనమాలి" గారూ..
మీ మంచిజ్ఞాపకం బాగుండండీ..
మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

కాయల నాగేంద్ర చెప్పారు...

వనజ గారు, మంచి పాటలు వినిపించి అమ్మను గుర్తు చేసారు.
'అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూట'
మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

సి.ఉమాదేవి చెప్పారు...

అమ్మ గురించి రాయాలంటే జీవితం సరిపోదు. కరుణ,ప్రేమ,సౌజన్యం,ఓర్పు,నేర్పు అన్నీఅమ్మకు మారుపేర్లే!చక్కటి పాటలతో అలరించారు.మీ బాబుకు శుభాశీస్సులు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Baalu gaaru.
@ poornaprajnabharathi gaaru
@Jalataaru vennela gaaru
@Palla kondalarao gaaru
@raajee gaaru
@kayala nagendra gaaru
@c.umadevi gaaru..
@Meraj Fhatima gaaru..

All of you Thank you veru much.

శ్రీనివాసరావు చెప్పారు...

వనజవనమాలిగారు
ముందుగా మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
కాని మీ పోస్ట్స్ అన్నీ రెగ్యులర్ గా చదివే వ్యక్తిగా మీకు వట్టి శుభాకాంక్షలు మాత్రామే చెపితే సరిపోదని నా అభిప్రాయం.
అన్ని బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించే మహోన్నతమైన మహిళగా మీకు శతకోటి వందనాలు.

Hima bindu చెప్పారు...

బాగుందండీ .మంచి పాట (జాబిలికి)గుర్తుచేశారు .

Unknown చెప్పారు...

అమ్మ - సృష్టిలో అన్ని అద్భుతాల్లోకెల్లా ఇదే అద్భుతం. పాశ్చాత్య దేశాలనుంచి మన దేశం నేర్చుకున్న మంచి వాటిలో ఇదే ప్రధమంగా ఉంటుంది, అమ్మకి ఏ బిడ్డా కృతజ్ఞతలు చెప్పదు, అమ్మ మనసూ అది ఎన్నడూ ఆశించదు. కానీ సంవత్సరానికి ఒక్క రోజుని అమ్మకై వినియోగించి అమ్మతో గడిపి, అమ్మ ప్రేమని మనసారా పొందగలిగితే...అది ఏ వయసులోనైనా ఇలలో లభించే పుణ్యమే.
ఈ రోజున మీ అబ్బాయి బాల్యం గుర్తుచేసుకుంటూ...చివరిలో మీరు అమ్మ హృదయ సౌందర్యం చెప్పిన మాటలు అద్భుతం. తల్లికి ప్రేమ ఇవ్వలేని బిడ్డలు సృష్టిలో కోకొల్లలు, బిడ్డకి ప్రేమ ఇవ్వలేని జీవి సృష్టి ఎంతా మారినా ఉండదు. అదే సృష్టి రహశ్యం!
మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

నైస్ పోస్ట్! మీక్కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు, వనజ గారు.

sandeep చెప్పారు...

Happy mothers Day!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీనివాస రావు గారు.. మీ విషెస్ కి చాలా సంతోషం కల్గింది. మరీ మరీ కృతజ్ఞతలు.
@చిన్ని గారు బాగున్నారా?అమ్మాయి నుండి "ఆడ నుండి విషెస్ అందుకుని ఉంటారు" మీ మదిలో కూడా మరపు రాని గుర్తులు ఉంటాయి. :))) మాతో పంచుకోండి మేడం.
@చిన్ని ఆశ గారు ధన్యవాదములు. "అమ్మ"కృతజ్ఞతలు,బహుమతులు ఆశించాడు. కాని అవి మనం ఇస్తే.. ఆమె అమితంగా సంతసిస్తుంది. ఇవ్వక పోయినా కరుణిస్తుంది. అమ్మ..అమ్మే కదా! మీ స్పదనకి & విషెస్ కి మరిన్ని ధన్యవాదములు.
@భాస్కర్ గారు ధన్యవాదములు. బిడ్డలో ఎన్ని కోణాలుని చూసి ఉంటుంది తల్లి. అవి పంచుకుంటుంటే ఎంతో .మధురంగా ఉంటాయి. అందరు తల్లి దండ్రులు ఆ..జ్ఞాపకాలని బిడ్డలకి భద్రపరచి ఇస్తే చాలా బావుంటుంది .
@సందీప్ గారు..మీ విషెస్ కి ధన్యవాదములు.

నాని.నామాల చెప్పారు...

మీ ఆడియో కాసెట్,పాటలు నేర్పే జ్ఞాపకాలే నాక్కూడా వున్నాయండీ,చాలా బాగా పంచుకున్నారు మీ బాబు చిన్ననాటి జ్ఞాపకాలను..

మీక్కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు, వనజవనమాలి గారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Naani gaaru..Thank you very much!

CHINNAREDDY చెప్పారు...

chaala bagundi andi