20, మే 2012, ఆదివారం

హరివిల్లు














విశ్వమే..ఒక చిత్ర కళా వేదిక (ల్యాండ్ స్కేపు)

మన మనసే తెల్లని కాన్వాసు
వెనుక తెరగా నిశీధినే  యెంచి
భూమికి హరితవర్ణమద్ది..
ఆలోచనలకు నీలాకాశాన్ని ..హద్దుగా జేసి
కలలకు బంగారు వర్ణాన్ని అద్ది ..
ఆకాంక్షలకి ఎఱ్ఱని రంగు పులిమి..
ఆశలని పసుపు పచ్చని పూలతో అలంకరించి..
ఎంపికకి గులాభి గుభాలింపులు రంగరించి..
నారింజతో నగిషీలు దిద్దుకుని..
ఉదారతకు చిహ్నమైన ఊదా రంగు ధరించి
ఊహల పల్లకి పై ఊరేగుతూ..
సప్తవర్ణాల కలయికతో..
"జీవితం" అనే హరివిల్లుని ఆవిష్కృతం .. కావింపాలి.
అవే రంగుల కళలు.. రంగుల కలలు

14 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అద్భుతం ఆవిష్కరించారు

Meraj Fathima చెప్పారు...

vanaja gaaroo kavitha loni anni rangulu kalasi manasuni harivillu chesthunnaei kavitha chala bagundi

Jai Gottimukkala చెప్పారు...

చిత్రం అమోఘం.

భాస్కర్ కె చెప్పారు...

అవే రంగుల కళలు.. రంగుల కలలు-
rangula kavitha,
nice

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

Wow Super Andi Vanja Gaaru

పల్లా కొండల రావు చెప్పారు...

హరివిల్లు లోని ఏడు రంగులు కలిస్తే వచ్చే తెలుపు లా మనసు స్వచ్చంగా ఉంటే అపుడే జీవితం హరివిల్లులా ఆనందం గా వెల్లి విరుస్తుంది. కవిత బాగుంది వనజ గారూ !

జలతారు వెన్నెల చెప్పారు...

Too good!

జ్యోతిర్మయి చెప్పారు...

హరివిల్లులోని వర్ణాలతో జీవనసరళిని కలిపి అందంగా ఆవిష్కరించారు.

సి.ఉమాదేవి చెప్పారు...

సప్తవర్ణాల కళంకారీ అద్దకమలదిన మీ కవితా హరివిల్లున రంగులద్దిన విశేషణాలు సరికొత్త విశేషమే.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

ఒక నిముషం నమ్మలేదు. మీ కవితల్లీ ఆంగ్ల పదాలా అని!

రంగుకోభావం పలికారు; బావుంది. కలర్‌ఫుల్ రెయిన్‌బో లా సూపర్బ్‌గా ఉంది :)

శ్రీ చెప్పారు...

జీవితం ఓ రంగుల ప్రపంచం...
రంగుల హరివిల్లులా తీర్చి దిద్దుకుంటే...
మీ చిత్రం లాగే ఎపుడూ కంటికి ఇంపుగానే ఉంటుంది వనజ గారూ!
@శ్రీ.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలె గారు ..ధన్యవాదములు.
@ Meraj Fhatima ..గారు బావున్నారా? మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదములు.
@ జై గొట్టిముక్కల..గారు..హరివిల్లు ..బాగుంది అని చెప్పినందుకు ధన్యవాదములు.
@ the tree గారు మీ స్పందనకి నా ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రిన్స్ .. థాంక్ యు వేరి మచ్.
@పల్లా కొండలరావు గారు.. ధన్యవాదములు. జీవన హరివిల్లు రంగులు నింపడం మన చేతుల్లో పని కూడా!
@జలతారు వెన్నెల గారు.. ధన్యవాదములు.
@జ్యోతిర్మయి గారు ధన్యవాదములు. బావున్నారా? బిజీ సమయాల్లో కూడా తీరిక చేసుకుని వచ్చి మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఉమా దేవి గారు.. ధన్యవాదములు. రంగులు అద్దుకోవాలి. రంగుల కళలు సృష్టించాలి. రంగుల కలలు కనడం నాకు ఇష్టమైన వ్యాపకం అండీ!
అందుకే మా "హరివిల్లు" అందంగా ఉంటుంది.అండీ :)
@భాస్కర్ గారు. మీరన్నట్లు నాకు ఆశ్చర్యం అనిపించింది. సంభాషణల్లో ,కథ లలో .ఎలాగు ఇంగ్లీష్ తప్పడంలేదు. అప్పుడప్పుడు..ఇంగ్లీష్ పదాలని వాడుతున్నాం.కానీ కవితల్లో రావడం నాకు ఇష్టం ఉండదు. అనంతమైన భాషా సంపద మనకి ఉంది.మన భాషని మనం గౌరవించుకోవాలి . మంచి విషయాన్ని నాకు సున్నితంగా గుర్తు చేసారు. మరి మరే ధన్యవాదములు. సరి చేసాను .
థాంక్ యు వేరి మచ్!!
@ శ్రీ గారు. నమస్తే! అందమైన కవితలు అల్లే మీ కవి హృదయం "హరి విల్లు"ని మెచ్చినందుకు ధన్యవాదములు.