2, జులై 2012, సోమవారం

ఆశ్చర్యం !!?



వేయి పడగల మీద కోటి మడుగుల నేల మోసి అలసిన స్వామి ..మోపిదేవి స్వామి..
హరుని కంఠం వీడి హరిని నిదుర లేపి కదలిరా..

అన్నది మన తెలుగు పాట..

పై చిత్రం లో చూసిన బహుముఖ నాగరాజులని అప్పుడప్పుడు.. యూ ట్యూబ్ లో చూస్తుంటాను.

అవన్నీ మనిషి కల్పిత చిత్రాలు అనుకున్నాను. వివరంగా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు.

ఈ రోజు ఈ చిత్రం చూసి ఆశ్చర్య పోయాను. నమ్మలేకపోయాను. కానీ ఇంత స్పష్టమైన ఆధారాలు కనబడుతుంటే నమ్మాలి కదా!

శ్రీశైలం ఘాట్ రోడ్ లో .. కనిపించిన ఈ నాగరాజుని ఆసక్తిగాను,ఆశ్చర్యం గాను చూడటానికి, కెమెరాలలో బంధించడానికి
ఇంత మంది ప్రత్యక్ష్య సాక్ష్యం కనబడుతుంటే!

మాకు తెలిసిన వారి మిత్రులు ఇటీవల "శ్రీశైలం"వెళ్ళినప్పుడు కనబడిన విశేషం ఇది.
వారు కెమెరాలో బంధించి తీసుకుని వచ్చిన చిత్రం ని .. ఇలా షేర్ చేసుకుంటున్నాను.
శ్రీశైల శిఖరం అంతా శివమయం.

ఆ నాగా భరుణుడి కంఠం వీడి.. ఆ భుజంగ భూషణుడి..దేహమును వీడి.. నన్ను చూడండీ అంటూ.. జనులకు దర్శన భాగ్యం కల్గించావా.. నాగ రాజా.. !? అన్నట్లు లేదు. ఈ పిక్ లో నిజమెంతో..అబద్దమేంతో..నాకు తెలియదు కాని.. చాలా ఆసక్తిగా ఉంది.

ఇలా షేర్ చేసుకోవడం కూడా ఆ ఆసక్తిలో భాగమే! మన మిత్రులెవరైనా.. ఇలాటి నాగ జాతుల గురించి చెపుతారేమో..చూద్దాం.


12 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
మన్నించాలి...
ఇది కేవలం ఫోటోషాప్ నుంచి చేసిన ఎడిటింగ్...
నేనొక లింక్ ఇస్తున్నాను చూడండి
https://www.facebook.com/photo.php?fbid=375853642477252&set=a.133026270093325.24156.100001578593973&type=3&theater
పది తలలున్న పాము ఫోటో ఇది...
కేవలం మనలను మోసం చేసే trick photography ఇది.
నేనిలా వ్రాసానని అపార్ధం చేసుకోకండి....
@శ్రీ

అజ్ఞాత చెప్పారు...

క్షమించాలి. ఇది ట్రిక్ అని ఫేసుబూక్ లో చూసాను.
మొదట నేను కూడా అలానే అనుకున్నాను. కాని ఇలా చేయడం చాలా ఈజీ అని , అక్కడ ఒక తల మాత్రమే ఉందని, దానిని ఇలా మార్చవచ్చు అని ఎవరో వివరించారు. అంతే కాదు ఇంకా చాలా తలలు పెట్టారు దానికి గుండ్రంగా ఉండేటట్టు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఈ ఫోటో వివరాలు లభించలేదు.వివరాలు గనుక ఉంటే.!?
నాకు సందేహం ఉంది.. ఒక ఫోటో తీస్తే ప్లేస్,డేట్,టైం.. అన్ని కెమెరా వివరాలు అన్ని తెలుసుకోవచ్చును కదా! ఇప్పుడు గూగుల్ ద్వారా స్థలం ని గుర్తించే సౌలభ్యం ఉంది కదా! ట్రిక్ ఫోటో గ్రఫీ..గురించి నేను విన్నాను.
సన్నాయి రాగాలు గారు @ శ్రీ గారు స్పందించి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు.

భాస్కర్ కె చెప్పారు...

trick ina, verity photo choopincharandi.
thank you.

అజ్ఞాత చెప్పారు...

ఫోటో ఆశ్చర్యంగా బాగుందండి, పట్టి జూలో పెడితే టికెట్ 50రూ పెట్టినా దేశవిదేశాలనుంచి చూట్టానికి క్యూలు కడతారు. ఇది చూపిస్తే మా అబ్బాయికి వచ్చిన డౌట్లు... మీరే తీర్చాలి:
1. ఒక నోటికే తిండి దొరకడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో పాపం ఆ నాగన్నకు 7నోళ్ళు ఎలా నిండుతున్నాయి?
2. కాటేయాలంటే ఒక జత కోరలు చాలా? లేదా అన్ని కోరలకు పని చెప్పాల?
3. తలలు బేసి సంఖ్యలే వుండాలనే రూల్ వుందా? సరి సంఖ్యలు కూడా వుండొచ్చా?
4. తలనొప్పి వస్తే ... ఓ జండుబామ్ సీసా ఖాళీ కావాల్సిందేనా?

:)))) :))))))

రసజ్ఞ చెప్పారు...

మీరు పెట్టిన చిత్రం నిజమో కాదో నాకయితే తెలియదు కానీ జెనెటిక్స్ లో "పాలీసెఫాలీ" (ఒక మొండేనికి ఒకటి కన్నా ఎక్కువ తలలు ఉండటం) అని ఒక డిసార్డర్ ఉంది. దాని ప్రకారం ఈ రకమయిన పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి.

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
నా స్పందనకి ధనాత్మకంగా ప్రతిస్పందించినందుకు ధన్యవాదాలు...
సన్నాయిరాగాలు గారు చెప్పింది ఫేస్ బుక్ లో ఇదివరకు చూసాను..
ఇద్దామని వెదికితే ఆ లింక్ దొరకలేదు నాకు.
పాము ఉన్న చోటు అది కాదు...ఎక్కడ కావాలంటే పాముని అక్కడ పెట్టి ఈ
ఎఫెక్ట్ చూపించవచ్చు...
మీ ఫ్రెండ్స్ కెమెరాలో తీసిన చిత్రమైతే దాని ప్రాపర్టీస్ లోకి వెడితే తెలిసిపోతుంది అసలు నిజం :-)
...@శ్రీ

జలతారు వెన్నెల చెప్పారు...

అయ్యో ..ఏడు తలల పాముని చూసాననుకున్నానే! ప్చ్!! ట్రిక్ అని అనుకోలేదు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

ఈ ఫోటొ ఎంతవరకు నిజమో నాకూ అనుమానంగనే ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి బహుముఖ పాములున్నాయని తెలిస్తే పాములపై ఆసక్తితో రిసర్చ్ చేసే ఎందరో మేధావులు వాటిని అకాడెమిక్ అవసరాలకు ట్రేస్ చేసి వెలుగులోకి తెచ్చుంటారు. రసజ్ఞ గారన్నట్టు సైంటిఫిక్ గా అలాంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ బహుముఖ పాముల ప్రస్తాపన ప్రాచీనకాలం నాటి కథల్లోనూ, ఇతిహాసాల్లోనూ మాత్రమే చెప్పబడి ఉంది; కాబట్టి ఏదో ఒక కాలంలో ఇలాంటి పాములు ఉండే ఉంటాయేమో. క్రమేనా పాముజాతి genes లో జరిగిన వివిధ mutations కారణంగా అలాంటి బహుముఖ పాములు అంతరించాయేమో. ఒక విషయం మనం చూడలేదన్నంత మాత్రాన అది ఉండదు అని నేను అనుకోను. ఉండుంటాయని మాత్రం నమ్ముతాను.

ఎంత మంచి పాట వినిపించారు వనజ గారూ! థ్యాంక్యూ సో మచ్.

సీత చెప్పారు...

వనజ గారు,
మొదట భయం వేసింది ఆ చిత్రం చూడగానే...
ట్రిక్ అని తెలుసుకొని హమ్మయ్య అనుకున్నాను ..
మంచిపాట వినిపించారు....

శ్రీ చెప్పారు...

vanaja gaaroo!
andaroo emanukunnaa verandi...
manam chaduvukunna vaallam..
mosapokoodadekkadaa!

ee link choodandi..
http://youtu.be/_czlKY0jDK4
meeru intlo koorchoni
paamuki kaavaalsinanni padagalu petteyavachchu..
@sri

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఈ పోస్ట్ పై స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదములు.
నిజంగా బహుముఖ నాగ రాజు ఉన్నాడో లేదో తెలియదు ..కానీ ట్రిక్ ఫోటోగ్రఫి లో అలా చేయడం సాద్యం అని చెపుతున్నారు. చేస్తున్నారు కూడా. ఈ పోస్ట్ పెట్టిన తర్వాత నాకు చాలా మంది వారి దగ్గర ఉన్న చిత్రాన్ని చూపించారు.
@ది ట్రీ భాస్కర్ గారు..థాంక్ యు వేరి మచ్!
@అవినేని భాస్కర్ గారు..నేను మీ అభిప్రాయంతో..ఏకీభవిస్తున్నాను. ధన్యవాదములు. "చిన్ను జనసమూహం కి కనబడుతున్నాడే!" :)
@రసజ్ఞ ..మీరు అందించిన వివరాలకి ధన్యవాదములు.
@SNKR గారు మీ అబ్బాయికి వచ్చిన డౌట్ నేను తీర్చాలా? అయ్యబాబోయ్! చిచ్చుర పిడుగు..మీ అబ్బాయి. నాకు అసలు ఇన్ని డౌట్ లు రాలేదేమితబ్బా..అని ఒకటే దిగులుగా ఉంది.:))
మీ కామెంట్ ని చాలా ఎంజాయ్ చేసాను. చాలా చాలా థాంక్స్ అండీ!
@జలతారు వెన్నెల..గారు..అదేపనిగా చూసేయండి. రాత్రి కలలో కనబడుతుంది. చూసేద్దురు గాని :)
@సీత గారు.. థాంక్ యు!థాంక్ యు!!
@శ్రీ గారు..మీ ఓపికకి వివరణ కి చాలా చాలా ధన్యవాదములు.
నేను నమ్మను. కానీ మనం చూడలేదు కదా అని నమ్మక పోవడం కూడా ఒప్పుకోలెం. కానీ ఇది ట్రిక్ ఫోటోగ్రఫీ అని వివరంగా చెప్పారు. థాంక్ యు వేరి మచ్! విజ్ఞానం వైపు పయనించేవారికి ఇలాటివి తోసేసి ముందుకు సాగడం మంచిది కదండీ! థాంక్ యు!