తుమ్మెద మంత్రం చదువుతూ ఉంటే.. కోయిల మేళం వాయిస్తుంటే.. చిలకమ్మా పెళ్లి కూతురాయేనే..గోరింక పెళ్లి కొడుకాయెనే..
అంటూ .. ఓ.. ఆత్మీయ ఆహ్వానం అందుకున్నాను.
ఈ శుభలేఖ చూడండి..ఎంత బాగుందో..!! నాకు బాగా నచ్చింది.
చక్కని వాతావరణం ఆత్మీయమైన కుశల ప్రశ్నలు, ప్రేమ పూర్వక ఆహ్వానం..
అలాగే.. శుభలేఖ వెనుకవైపున ..
మన వంశ అభివృద్దికి మూలమైన పెద్దవారిని స్మరించుకుంటూ..
మంచి.. పద్యమును.. అందించారు.
ఎంత చక్కని అర్ధం ఉన్న పద్యమో..!
".........ప్రేమ
పెన్నిదిగాని, ఇంటను నేర్ప
రీ కళ, ఒజ్జలెవ్వరు లేరు
శాస్త్రము లిందు గూరిచి తాల్చే
మౌనము.."
" ...సతుల సౌరను
కమలవనమునకు పతుల ప్రేమయే
నే వెలుగు ప్రేమ కలుగక బ్రతుకు
చీకటి"
(ప్రేమ విద్దెకు వోనమాలిని)
"మరులు ప్రేమని మది దలంచకు
మరులు మరులును వయసు తోడనే
మాయామర్మంలేని నేస్తము
మగువలకు మగవారికి కొక్కటే
బతుకు సుకమునకు రాజమార్గము
ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమ నిలిచిన ప్రేమ నిలుచును.
(గురజాడ అప్పారావు గారు)
8 కామెంట్‌లు:
ఎంత బాగుందో!!! sahre చేసుకున్నందుకు Thank you so much
మన సంస్కృతిని కాపాడుకునేందుకు దీనిని ఉపయోగించుకోవడం బాగుంది. దానిని పోస్టుగా మలచి అందరికీ పంచడం కూడా బాగుంది వనజ గారూ !
సాంప్రదాయానికి అద్దం పట్టే శుభలేఖ చాలా బావుంది వనజ గారూ..
చాలా బాగుంది!మాకందించినందుకు ధన్యవాదాలు!
ఎద్దుల బళ్ళు, అందమైన పొలాలు, ఇళ్ళు, మనుషులు ఈనాడు ఏవీ?
ఇప్పుడంతా SMS పిలుపులే, కేటరింగ్ వడ్డనలు, ఒకపూట రెసెప్షన్లే. ప్చ్.. పెళ్ళి పత్రికలు బాగున్నాయండి.
బాగుంది వనజ గారూ!
పెళ్లి పత్రికపై గ్రామీణ వాతావరణపు పెళ్లిపిలుపుల దృశ్యం...
@శ్రీ
వనజ గారింట, యువరాజు తన బాబు పెళ్లి పిలుపు అల్లా ఉండాలని కోరుకుంటున్నాము. బాగుంది వనజగారూ,
ఆనందమానంద మాయెనే
కామెంట్‌ను పోస్ట్ చేయండి