ముకద్దర్ కా సికిందర్
ముకద్దర్ కా సికిందర్ .. ఈ చిత్రం లో "సలాం ఎ ఇష్క్ మేరి జాన్ " పాటంటే నాకు చాలా ఇష్టం.
పాత్ర పరంగా రేఖ గణేషన్.. పాత్ర ఒక వేశ్య పాత్ర.ఆట పాటలతో అలరించే ఆ గృహానికి ..అమితాబ్ తొలిసారి తన మిత్రుని తో కలసి వెళతాడు.
అప్పుడు వచ్చే పాట ఇది. ఈ పాట సాహిత్యం చాలా బాగుంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఇది
రేఖ ప్రవేశం ఇలా ఉంటుంది ఈ పాటతో.
ప్రేమించే వారిని అడగవద్దు.వారి రాత్రి రారాజు యొక్క ఒంటరి తనం ఎలా గడుస్తుందో..అని
జీవన ప్రయాణం లో తోడుగా నడిచేవారు దూరమైనప్పుడు ఆ సమయంలో ఒంటరితనం ని గుర్తు చేసుకుంటారు
అలా దూరం అయినవారు కలవాలని విన్నపం చేసుకుంటారో..
అని చెపుతూ..
అభివాదములు ! ఓ.. నా ప్రియతమా!!
కొంచెం కనికరించి నీవు నన్ను ప్రేమించే ఓ.తప్పు చేయడానికి ఒప్పుకో..
.. నన్ను స్వీకరించు
నా ఈ హృదయం అశాంతి లో ఉంది నా హృదయం అశాంతి తో ఉంది తోడుగా ఉండే వారి కోసం
ఓర్పు లేకుండా ఉన్నాను.కారణం కలసి ప్రయాణించే వారి కోసం(జీవిత భాగస్వామి కోసం)
నీకు ఒక విషయం వినిపించనా..
వినిపించనా రాత్రికి సంబంధించిన ఓ..విషయం
చందమామ కూడా పూర్తి శోభతో ఉన్నాడు.హృదయంలో కల్లోలం ఉంది
కోరిక ఉంది హృదయం తూపానులోనే ప్రయాణం కొనసాగిస్తుంది.
ఒక మేఘం అకస్మాత్తుగా కదులుతూ అన్నివైపులనుండి చుట్టేసి చందమామపై కమ్మేసింది.
చందమామ కూడా ఆ నీడలో ఒదిగిపోయింది ( కరిగిపోయింది )
ఓహ్..ఏమైంది కదా! ఈ హుషారులో నా హృదయం కొట్టుకుంటుంది.
నా హృదయం తపించింది ఎవరి చూపు కోసమో!
అభివాదములు ...ఓ..నా ప్రియతమా!
కొంచెం కనికరించి నన్ను ప్రేమించే ఓ.తప్పు చేయడానికి ఒప్పుకో..
నీవు నన్ను స్వీకరించు
అప్పుడు..అతను కల్పించుకుని ఇలా చెపుతాడు.
దీని తర్వాత కథ ఏమయి ఉంటుందో..నేను చెపుతాను విను.
వింటుంటే నీ కళ్ళు మెరుస్తాయి.ఆశ్చర్యంతో..పెద్దవి అవుతాయి (టప టపా కొట్టుకుంటాయి)
విషయం హృదయానిది.ఏదైతే ఇప్పటిదాకా నీ హృదయంలో ఉన్నది నాకు ఈ పిలుపుతో పెదాలమీదకి వచ్చేస్తుంది..
దేవతా.. ఓ.. దేవతా.. (దేవదూతా)
ప్రేమలో పరాజయం పొందినవారికి, ప్రేమలో గాయపడినవారికి దారి చూపే దీపానివి నీవు..
మేమునీ గురించి విని వచ్చాము,నీకై వచ్చాము.
ఇప్పుడు మందు ఇస్తావో.లేక విషం అయినా ఇస్తావో..
నీ ఈ నివాసానికి మండిన హృదయం వచ్చి ఉంది.
ఒక్క ఉపకారం చేయి
ఒక్క ఉపకారం చేయి..
ఈ నీ ఆతిదికి ఒక్క ఉపకారం చేయి
నీవు జీవితాంతం సంతోషంగా ఉండాలని మేము ప్రార్దిస్తాము ఆశ్వీరదిస్తాము.
అభివాదములు ! ! ఓ.. నా ప్రియతమా!!
కొంచెము కనికరించి నీవు నన్ను స్వీకరించు
చిత్రం : ముకద్దర్ కా సికిందర్.
ఈ పాటకి సాహిత్యం:అంజాన్
సంగీతం:కళ్యాణ్ జీ-ఆనంద్ జీ.
గాయనీ-గాయకుడు :లతా మంగేష్కర్,కిషోర్ కుమార్.
హిందీ సాహిత్యం:
5 కామెంట్లు:
vanajaa dear, entha vivarana manchi paata baagundi.
నాకు చాలా చాలా ఇష్టం వనజ గారు ఈ పాట!
Rekha at her best!
మంచి పాట..
చక్కటి తర్జుమా...
బాగుంది వనజ గారూ!
అందులో ఓ సాథీ రే...కూడా చాలా బాగుంటుంది..
అభినందనలు మీకు...
@శ్రీ
maseehaao ka mahathav maanana hi padega.mohabbath ka jaal chalatha hi rahega. aapko shukriya adha karthe hy_ aur ek baar ishq me padaane ke liye.
shukriya..ji. hum aapse hamesha pyaar karthe rahenge..
కామెంట్‌ను పోస్ట్ చేయండి