ఇటీవల మీడియాకి కనబడిన రాజేష్ ఖన్నా రూపం చూసి చాలా మంది అభిమానులు బాధపడ్డారు. మన రొమాంటిక్ హీరో రాజేష్ ఖన్నా యేనా!? అని ఆశ్చర్యపోయారు కూడా!
అవును మరి "రాజేష్ ఖన్నా " అంటే కవ్వించే కళ్ళు, కళ్ళతోనే గిలిగింతలు పెట్టె సైగలు, గడ్డం నొక్కుతో.. హీరోయిన్ ల కళ్ళలో నిజమైన హీరో..అని పేరు.
వారి చిత్రాలలో పాటలలో పేరెన్నిక గల ఈ పాట చూడండి 'ఆరాధన" చిత్రం లోని పాట. ఇది. "షర్మిల టాగోర్ " జోడీగా నటించిన ఈ చిత్రం మన తెలుగు చిత్రం "కన్నవారి కలలు" కథ కి చాలా దగ్గరగా ఉంటుంది.
"రూప్ తేరా మస్తానా" మేరె సపనోం కి రాణీ ,గున్ గునా రహే,చందా హై తూ..లాటి హిట్ సాంగ్స్ ఉన్నాయి.
ఈ పాట ని నేను దూరదర్శన్ లో మొదటి సారి చూసినప్పుడు ..ఇలా అనుకున్నాను.
ye gaanaa dhekhane per ..mera Dil mujse poochane laga ki kisiko pyaar kare tho achcha hone ka aaise hi hum bhi gaane gaane vaale hai
నేను కూడా ఎవరినైనా ప్రేమించి ఉండి ఉంటే బాగుండును.ఇలా పాట పాడుకుని ఉండేవాళ్ళం కదా ..అని :))
అప్పుడు నా వయసు పద్దెనిమిది.పెళ్లి అయిపొయింది కూడా:))
అప్పుడు,ఎప్పుడూ.. ఆ పాట చూస్తే అలాగే అనిపిస్తుంది. థట్స్ గ్రేట్ రొమాంటిక్ హీరో..రాజేష్ ఖన్నా.. ఆ లుక్స్. ఆ స్టైల్ అదరహో!
హిందీ మూలం కి తెలుగు అనువాదం ఇలా ఉంటుంది.
అతను: తెల్ల కాగితం లాటిది నా ఈ మనసు ..
రాశాను అందులో నీ పేరు
తెల్లని కాగితం లాంటి నా ఈ మనసులో వ్రాసాను నీ (ఈ)పేరు
ఆమె:
నిస్సారమైన నా ఈజీవితంలో నిండి పోయింది నీ ప్రేమతో..
అతను:
కలలు చెదిరిపోకూడదని..భయపడతాను నేను
రాత్రి పగలు కలల్లో చూస్తుంటాను
కాటుక నిండిన కళ్ళు ,వాటి సైగలు మత్తెక్కిస్తూ
ఏ నీడ లేని అద్దం లాంటి నా మనసు
చిత్రించుకుంది (రచించుకుంది) ఇందులో నీ ప్రతిబింబం
ఆమె:
తెల్లని కాగితం నా ఈ మనసు అందులో వ్రాసాను నీ పేరు .
విశ్రాంతి పోగొట్టుకున్నా..నేను నిద్రను పోగొట్టుకున్నా
పూర్తి రాత్రి మెలుకువగా ఉన్నా ..నేను ప్రార్ధనలు చేయడానికి {2 సార్లు)
ఇంతకన్నా నీకేం చెప్పగలను ..ఎలా చెప్పగలను ?
నాలో ఉన్న కోరికను ,ప్రేమను..మనసు లాగగా..
అజ్ఞాత శత్రువైన ఈ నామనసు వెళ్లి మారింది
అతను
తెల్ల కాగితం నా ఈ మనసు అందులో లిఖించాను నీ పేరు.
తోటల్లో పూలు వికశించడానికి ముందు (2 సార్లు)
ఆమె:
నా నీ కళ్ళు కలుసుకోవడానికి ముందు (2 సార్లు)
అతను:
చెప్పుకోబడ్డ ఈ మాటలు
ఆమె:
కలయికలు
అతను:
ఇలాటి రాత్రులు
ఆమె :
రాలిపడిన నక్షత్రం లాంటి నా ఈ మనసు
అతను:
మారి తయారైంది నీ చందమామలా ..
అతను &ఆమె :
తెల్లని కాగితం నా ఈ మనసు లిఖించాను అందులో నీ పేరు.
ఈ పాటకి సాహిత్యం:ఆనంద్ బక్షీ.
సంగీతం:ఎస్.డి.బర్మన్.
గళం: కిషోర్ కుమార్,లతా మంగేష్కర్
చిత్రం:ఆరాధన
ఈ పాట you tube లో చూడండి
10 కామెంట్లు:
చాలా చక్కగా అనువదించారు పాటని...చాలా అర్ధవంతంగా ఉంది
ఈ పాటతో అల్లుకున్న స్మృతులెన్నో .. మంచి పాటని గుర్తు చేసారు.
nice song andee
నేను చిన్నప్పుడు ఈ పాట విని, చాలా అభిమానముగా ఎప్పుడూ ఈ పాట పాడుకొనేవాడిని.
అద్భుతమైన పాట మరొకసారి వినిపించారు. ధన్యవాదాలు. వేలకు వేలు.
నాకు కూడా బాగా ఇష్టం ఈ పాట వనజగారు
శశి..మీరు ఓపికగా ఈ పోస్ట్ చదివి సాహిత్యం మెచ్చి..పాట విని స్పందించినందుకు ధన్యవాదములు.
@mhsgremspet రామకృష్ణ గారు.. మీ కున్న చక్కని పాటల అభిరుచికి ..నేను పరిచయం చేసిన పాటలని మెచ్చుకున్నందుకు సంతోషం. ధన్యవాదములు.
@చిన్ని గారు.. మంచి పాట పై మీరునూ స్పందించినందుకు ధన్యవాదములు.
@రాజ్..గారు..ఓహ్..మీరు ఈ పాట పాడుకున్నారా? చాలా సంతోషం. థాంక్ యు వెరీ మచ్!!
@కృష్ణ గారు.. చాలా సంతోషం. మీ వ్యాఖ్యకి ఆనందం. ఈ పాట ని నచ్చిన ఇంతమంది మిత్రుల ఆనందం ని చూసి నాకు సంతోషంగా ఉంది. థాంక్ యు వెరీమచ్!!
@జలతారు వెన్నెల గారు.. ఎంత మంచి పాటో..కదండీ.. నాకైతే ఎప్పుడు ఈ పాట విన్నా.. ఊహు..నేను చెప్పాను..ఈ పోస్ట్ లోనే చెప్పాను.మీరే చూడండి:) థాంక్ యు వేరి మచ్.
ఎన్ని కొత్త పాటలు వచ్చినా...ఈ పాటలు రేడియోలొ వస్తూనే ఉండేవి...ఆల్ మోస్ట్ 1994 వరకూ...అల్ టైం హిట్స్ కదండీ....వివిద భారతి...రేడియో సిలోన్ నుంచి ఎక్కడ పాటలు వినబడితే అక్కడ ఆ స్టేషన్ దగ్గర ఆగిపోయే వాళ్ళం...ఇరవై నాలుగ్గంటలూ రేడియో కి అతుక్కుపోయే వాళ్ళం ఇలాంటి పాటలు వింటూ......రేడియో వెళ్ళిపోయాక అది మన జీవితాల్ని కూడా తీసుకుపోయిందనిపిస్తుంది...థాంక్సండీ మళ్లీ మంచి పాటతో పాటు గతాన్ని గుర్తు చేసి నందుకు...
కే వి ఎస్ వి గారు .. పాటపై స్పందించినందుకు ధన్యవాదములు.
వివిధ భారతి ముబి నుండి ప్రసారమయ్యే ఆప్ కి పర్మాయిష్, సఖి - సహేలి వింటూ ఉండండి. ఇప్పటికి మంచి పాటలే ప్రసారం అవుతూ ఉంటాయి. చాయా గీత్ లో మంచి పాటలు వినండి. రేడియో ని నేను ఇంకా వింటూనే ఉన్నాను. నాకు రేడియో దూరం దగ్గరగానే ఉంది.
ధన్యవాదములు.
baagundi vanja gaaroo!
@sri
కామెంట్‌ను పోస్ట్ చేయండి