31, డిసెంబర్ 2010, శుక్రవారం

అదిగదిగో యమునా తీరం



అదిగదిగో యమునా తీరం మాసం చైత్రం ..
పాట ఎప్పుడైనా విన్నారా..?

నేను చాలాసార్లు..విన్నాను.. ఎందుకంటే కోరేది నేనే కాబట్టి.. ఇపుడు ఎపుడు కావలిస్తే అపుడు వినే సౌలభ్యం వుంది కదా.. 
ఆకాశవాణిలో జనరంజనిలో  ఈ పాటకై చెవులు వూరించుకుని విన్న రోజులని తలచుకుంటే ఎంత ఆనందమో !

ఈ..పాట  “తెల్లగులాబీలు” అనే చిత్రంలో పాట.
“మైలవరపు గోపి”  సాహిత్యం, “శంకర్-గణేష్”. స్వర కల్పన. “ఎస్.పి. బాలు-జానకి” గళం.

నేనీ సినిమా చూడలేదు కాబట్టి తారాగణం తెలియదు. నాకు పాటలు మాత్రమే తెలుసు..
ఎంత మధురమో. అనుకుంటాను. ఈ పాట వినండి..

ఒక..పాట మనపై వేసే ముద్ర  చాలా గాఢమైనది
ఎందుకో ఈ పాటని నేను చాలా ఎంజాయ్  చేస్తాను..
అన్ని సమపాళ్ళలో ఉండి అద్భుతంగా ఉంటుంది. అందునా  యుగళగీతం కాబట్టి  శృంగార భావనలూ అధికమే.

సాహిత్యం ఇదుగోండి..

అదిగదిగో యమునా తీరం మాసం చైత్రం సంద్యాసమయం.. ..
అటు-ఇటు ఎద-పొద అంతా విరహం. విరహం..
మరి మరి వేగిపోతుంది..హృదయం..
అయినా.. ప్రణయం మధురం
ప్రియ ప్రియ జారిపోనీకు తరుణం (అది)

దూరాన యే వాడలోనో..
వేణుగానాలు రవళించ సాగే..
గానాలు వినిపించగానే..
యమునా తీరాలు పులకించి పోయే..
పూల పొదరిల్లు పడకిల్లు కాగా
చిగురు పొత్తిళ్ళు  తల్పాలు కాగ..
ఎన్ని కౌగిళ్లు గుబిలింతలాయే (అది)

విధి లేక పూచింది కాని
ముళ్ళగోరింట వగచింది ఎదలో..

పూచింది యే చోటనైనా పూవు చేరింది పూ మాలనేగా...
యే సుడిగాలికో వోడిపోక..
యే జడివానకి రాలిపోక..
స్వామి పాదాల చేరింది తుదకు (అది) ..

వండర్ పుల్  కదండీ..
ఎంత స్వీట్ సొంగో...  వినండి..
తప్పకుండా వినండీ..

1 కామెంట్‌:

Dantuluri Kishore Varma చెప్పారు...

చాలా బాగుందండి ఈ పాట!