14, మార్చి 2026, శనివారం

నువ్వు వస్తావని

 



నువ్వు వస్తావని ..    - వనజ తాతినేని.

ఎంతో కాలం వేచి చూడకుండానే నువ్వు వచ్చావు. 

రావలిసిన వారందరూ వచ్చారనుకుని 

నేను తలుపులు మూసి వేసాను. 

నువ్వు  నా గౌరవాన్ని భంగపర్చకుండా 

చప్పుడు చేయకుండా వెనుదిరిగావు. 

ఉదయం వాకిలి చిమ్ముతున్నప్పుడు 

నీ అడుగుల తడి గుర్తించాను. 

కళ్ళాపి చల్లడానికి వేరే నీరు అవసరం లేకపోయింది.  

చుక్కలు పెట్టని ముగ్గు నా హృదయం నుండి జారి

మునివేళ్ల మీదుగా భూమి ని అలంకరించింది. 

అది క్షణంలో రూపు మార్చుకుని నీ ప్రేమ చిహ్నంగా

ఈ చెట్టు పై వికసించింది. కొన్ని రాలు పూలు కనబడ్డాయి. 

నువ్వు రోజూ వస్తావు, వెళతావ్ ! కాలం గడుస్తుంది . 

ప్రేమ హృదయాల వికాసం, ఉపశమనం. 


************************

నా కవిత  #నువ్వువస్తావని  .. ఆంగ్ల అనువాదం లో…
అనువాదకర్త: Simhadramma P .. 
హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్ ❤️🌹🙏

With a hope that you would come....

You had come early 
without  my awaiting for long 
I've closed the doors thinking that all the awaitees have come 
You have turned back quietly 
Without damaging my dignity 

The morning next while sweeping the courtyard 
I found  your wet foot prints on it 
To sprinkle over there, no else water got required 
The undone rangoli slipped off from my heart and decorated the ground 
In the last moment it changed its form and bloomed over the bough as a sign of your love 
Some fallen flowers came into my sight 
Each day you would come and go !
The time passes on.....
Love is the blooming to hearts...
It's too a relaxation.....

A poem from Vanaja Tatineni...

#వనజతాతినేని
#vanajatatineni
#hilights
#follower
#poetry
#నువ్వువస్తావని

                                                           

 




కామెంట్‌లు లేవు: