అప్ డేట్..
ఔద్దత్యం లేనే లేదు
అది నా ఔన్నత్యం అవునో కాదో నాకే తెలియదు.
అందరి దృష్టి ని ఆకర్షించాలని కాదు.
నా వాల్ .. నా ఇష్టం.
కనీసం profile pic పెట్టుకునే స్వాతంత్ర్యం
లేదా.. నాకు !?
మొన్నామధ్య ఇదే శారీ తో వున్న ఫోటో పెట్టుకుంటే.. ఎవరో వచ్చి ఏదో.. వాగుతాడు.
ఫోటో తో సహా డిలీట్ చేసాను కోపంగా.
కథలు కవిత్వం పెడతాను కాబట్టి Public comment చేయవచ్చు అనే option ఇచ్చాను. ఎవడో ఏదో వాగుతాడు. Friends and Friends option లోకి మార్చుకున్నాను.
ఈ Option లో కూడా ఎవడో ఒకడు ఏదో ఒకటి వాగుతున్నాడు. Only Friends వరకూ comment పెట్టే Option లోకి కుదించేసాను.
ఏంటి బాబూ ! అసలు మీ సమస్య! ? అని అడగాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త!!
ఫోటోతో సహా డిలీట్ చేసానని అప్పుడే మా వదిన మళ్ళీ తీసింది ఈ ఫోటో. చేతిలో రెండు Chaco Bar లు ఉన్నాయని నవ్వకండి. నేనసలు తినను. ఫ్యామిలీ మెంబర్స్ వి పట్టుకున్నాను.
14 th న కజిన్ కూతురు పెళ్ళి లో..
ఆ పెళ్ళికి చాలామంది వచ్చారు. మనమేం ఎగబడి ఫోటోలు దిగం వారితో.
రచయితలు కూడా సెలబ్రిటీ లే.. కదా!
PS: జాగ్రత్తగా కామెంట్ చేయండి.
ఎప్పుడో ఒకప్పుడు కాస్త మంచి చీర కట్టుకుని.. సింపుల్ గా ఓ నగ పెట్టుకొని.. కాస్త ఓ ఫోటో తీసుకుని ఇక్కడ పోస్ట్ చేసుకుంటాం. అంతే! అదో సరదా! కట్టిన చీరే కట్టి బిళ్ళ మడతలు పెట్టి కట్టి తిప్పి కట్టి..
అన్నమాట.
ఈ ఫోటో అస్సలు డిలీట్ చేయను. నవ్వకపోయినా బాగానే వున్నాను.. వెనుక వున్న పువ్వుల గుత్తులు వల్ల. 😍❤️😘
ప్రశంసలు ఎన్నైనా స్వీకరిస్తాం. విమర్శ ను కూడా భరిస్తాం. కానీ అవాకులు చెవాకులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు. అది నేను భరించలేని విషయం కాబట్టే.. ఈ బ్లాగ్ లో కూడా కామెంట్ ఆప్షన్ తీసివేయబడింది.
14/03/2026 .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి