నా కనురెప్పల క్రింద దాగున్న నిదురను ఎవరో దొంగిలించారు.
పోనీ రాత్రి గస్తీ కాస్తున్న జాబిలికైనా బహుమానం ఇచ్చారు కాదు.
వీధి కుక్కలతో మంతనాలు జరుపుతున్నారు దుర్మార్గులు.
వేకువ దయతలచి ఒడిలోకి తీసుకుని
జోల పాడింది. కలల నిదుర కలత నిదుర..
ఏదో తెలియదు.
రోజూ పలకరించే నేను ఇంకా పలకరించలేదని
మిత్రులు కంగారు పడ్డారు. కుశలం అడిగారు.
ఇది చాలు కదా!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి