21, సెప్టెంబర్ 2026, సోమవారం

Selfies




కవిత్వం కూడా సెల్ఫీ లాంటిదే! 

Poems in English translation 


*1. Namuna / Prototype*


You asked, "Can't you write like Gulzar?"

I said, "I won't write like Gulzar. I will write like myself."

After all, you are the source of my poetry!

And I am your prototype, aren't I?


*2. You and I*


You greet me as the rain,

I blossom as a flower.

It has always been like this,

Since ages and eons!


*3. Nirantaram / Forever*


Humans are born just to experience.

Whether it's pain or pleasure,

Wealth or fame, or even humiliation.

And for these, an endless struggle.


*4. Teda / The Difference*


They think I have become strong,

Not knowing I have frozen.

That's the difference -

Between what eyes see and what touch feels.


*5. Bahumati / The Gift*


For me, things rarely happen as I plan.

You are a gift I received unexpectedly.

Is there any exaggeration in this?


*6. Nidra Lemi / Sleeplessness*


When have I ever slept peacefully?

Some nights in waiting for you,

Some more nights in the torment of you...


*7. Trishanku Swargam / Trishanku's Heaven*


Hanging, holding onto the edge of pain,

Neither you leave me, nor I leave you.

A lifetime of Trishanku's heaven.


*8. Veladi Kathalu / A Thousand Stories*


Thousands of days, thousands of stories.

You are the storyteller, I am the listener!

The ending, someday...



*9. Selfie*


It is the age of selfies.

For decades, you and I

Never took a single selfie together.

So what...


I live in your left half,

You live in my right half.

Of thoughts never thought,

Our selfie is one of blended unions.


*10. Ontari Ratri / A Lonely Night*


For thousands of nights,

Thinking of you, I slip into sleep.

Perhaps you sense it,

You come into my dream,

Caress my head lovingly, and leave.

In a trance that is neither sleep nor waking,

The day comes to an end.


---


#వనజతాతినేని

#vanajatatineni ✨ 

20, సెప్టెంబర్ 2026, ఆదివారం

వేలాది కథలు




కొన్ని చిన్న కవితలు.. 

*****

 నమూనా 


గుల్జార్ లా రాయలేవా నువ్వు అని అడిగావు.

గుల్జార్ లా నేను రాయను. నాలాగే నేను రాస్తాను అన్నాను.

నా కవిత్వానికి మూలం నువ్వే కదా! 

నీ నమూనా నేనే కదా! 


******


నువ్వు నేను


నువ్వు వర్షమై పలకరిస్తావ్ 

నేను పువ్వులా వికసిస్తాను

యుగ యుగాల కాలం నుండి ఇంతే! 


*********

నిరంతరం 


మనుషులు అనుభవించడానికే 

పుడుతుంటారు. కష్టమైనా

సుఖమైనా, సిరిసంపదలైనా

కీర్తిప్రతిష్ఠలైనా, అవమానాలైనా.


వీటి కొరకే నిరంతర యత్నం. 


**********


తేడా


గట్టిపడ్డానని అనుకుంటారు 

ఘనీభవించానని తెలియక

చూపులకు స్పర్శకు వున్నంత తేడా ఇది. 


**********

బహుమతి 


అనుకున్నది అనుకున్నట్టు జరగడం అతి ప్రయాస నాకు. 

అనుకోకుండా లభించిన బహుమతి నువ్వు. 

ఇందులో అతిశయోక్తి ఏముంది? 


******


నిద్ర లేమి


స్థిమితంగా యేనాడు నిద్రపోయానని.. 

కొన్నినాళ్ళు నీ నిరీక్షణలో  

మరి కొన్నినాళ్ళు  నీ హింసలో ..


********


త్రిశంకు స్వర్గం 


నొప్పి కొసన పట్టుకుని వ్రేలాడుతున్నా

నువ్వు నన్ను వదలవో నేను నిన్ను వదలనో 

జన్మంతా త్రిశంకు స్వర్గం. 


*********

వేలాది కథలు


వేలాది రోజులు వేలాది కథలు. 

కథకుడు నువ్వే శ్రోతను నేనే!

ముగింపు ఏదో ఒకనాడు 


*********


సెల్ఫీ 


ఇది సెల్ఫీ ల కాలం. 

దశాబ్దాలుగా నువ్వు నేను

ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు 

అయితేనేం.. 

నీ వామ భాగంలో నేను

నా సవ్య భాగంలో నువ్వు

తలవని తలపుల

కలసిన కలయికల సెల్ఫీ మనది. 


********

ఒంటరి రాత్రి


వేలాది రాత్రులుగా

నిన్ను తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటాను. 

అది తెలుసుకుంటావో ఏమో

కలలోకి వచ్చి ప్రేమగా తల నిమిరి వెళ్తావు 

నిద్ర మెలుకువ కాని భ్రాంతిలో

పగలు ముగుస్తుంది. 



#వనజ తాతినేని



15, సెప్టెంబర్ 2026, మంగళవారం

పాట తోడు



 పాట తోడు    - వనజ తాతినేని 


పగటియాత్ర ముగిసింది. నిరాశలో నిర్ణిద్ర.

నిన్న మొన్నటి ఆశలను గంపగుత్తగా 

వేకువ చీకటిలో గుమ్మరించేసాను. 

వర్తమానంలో కొత్తవాటితో నింపసాగాను. 

ఉత్సాహంతో కొంగ్రొత్త  పల్లవి అందుకుంటాను.


మళ్ళీ చీకటి. నేడైనా..

ఆశ ఏ ఒక్కటైనా నెరవేరిందా? హ్మ్ ! 

ఏ రోజూ.. నీ  ప్రేమ సఫలం కాబోదు 

నా జీవితం నిష్పక్షపాతంగా ముగియబోదు. 

ప్రతి రాత్రి భంగపడిన హృదయాన్ని భయంకరమైన మౌనం 

మరింత గాయపరుస్తుంది. ఆవేదన నిండిన

నా పాటతో ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడతాను.


వ్యక్తిగత ఆనందాన్ని ఎవరు త్యాగం చేయగలరు? 

పాత ఆనందాల గది తాళం కొత్త సంతోషాల గది 

తలుపులను తెరవలేదు. 

నైటింగేల్ పక్షి గడ్డి పూవుల కోసం పాట పాడుతుందా? 

నైరాశ్యంతో నా పాట నే పాడుకుంటాను.

ఎడారి గాలుల్లో  ఒంటరిగా నిలబడిన తాటిచెట్టుకి

మంచు వర్షంలో తడిసి గడ్డకడుతున్న ఓక్ వృక్షం 

తోడు నిలబడగలదా?

నువ్వు నా నీడ నేను నీ నీడ 

ఏ చెట్టు తన నీడను తాను ప్రేమతో హత్తుకోలేదు. 

అమృత స్పర్శను అనుభవించనీయదు

విషాదంతో నా పాట నే పాడుకుంటాను.


కానీ..ఒక పాట నాలో నిద్రించిన వందలాది 

మధుర స్మృతులను మేలుకొల్పుతుంది.

విత్తనం హృదయంలో వుండే విశ్వాసంలా 

ఒక జీవ అద్భుతాన్ని నాకు  వాగ్దానం చేస్తుంది

వెలుగులో మళ్ళీ ఆశల గంపను నెత్తికి ఎత్తుకుని..

నా పాట నే పాడుకుంటాను. 


********(*)********


"పాట తోడు" ఆంగ్ల అనువాదం* 🎶📖


---


*With a Song for Company*

_By Vanaja Tatineni_


The day's journey has ended. Sleepless in despair.

I emptied out the hopes of yesterday and the day before,

in a great heap, into the darkness of dawn.

And began to fill the present with new ones.

With enthusiasm, I will take up a brand-new pallavi.


Darkness again. Did even

one single hope come true today? Hmm!

Never.. your love will never be fulfilled

My life will never end justly.

Every night, the terrifying silence

wounds the broken heart even more.

With my grief-filled song

I will shatter that silence.


Who can sacrifice personal happiness?

The key to the room of old joys

could not open the doors to the room of new happiness.

Does the nightingale sing for the grass flowers?

In despair, I will sing my own song.


Can the oak tree,

frozen and drenched in icy rain,

stand as company to the palm trees

standing alone in the desert winds?

You are my shadow, I am your shadow.

Which tree has ever lovingly embraced its own shadow?

It will not let you experience the touch of nectar.

In sorrow, I will sing my own song.


But.. one song awakens

the hundreds of sweet memories

sleeping within me.

Like the faith that lies within a seed,

it promises me a living miracle.

Into the light, I will lift the basket of hopes

onto my head again..

And I will sing my own song.





11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఆత్మ బంధువు


 ఆత్మ బంధువు  -వనజ తాతినేని


పిలిస్తే ప్రత్యక్షం అవుతానంటావ్

గాలిలాగా సృశిస్తానంటావ్

వర్షం లాగా వస్తానంటావ్

మంచుపూల వర్షమై కురుస్తానంటావ్

కాలిబాటలో పువ్వై పలకరిస్తానంటావ్


నేనూ అదే అనుకుంటాను

ఊహల్లో ఆలోచనల్లో అడుగుల్లో

సదా గుండెల్లో… 

ఉండటం వుండకపోవడం 

సమస్యగా తోచదు నాకసలు

రాకపోకలు ముందు వెనుకలు


బిగించిన గుప్పిటలో..

రహస్యంగా వుండిపో

ఊపిరిగా నిలిచిపో

ద్వారాలు తెరిచే వుంటాయి. 

వర్షం కురుస్తూనే వుంది


 వర్షం కురుస్తూనే వుంది     -వనజ తాతినేని 


సూచనలు ఏవీ లేకుండా వర్షం కురుస్తుంది.

ఎందుకో .. నా గుండెల్లో చాలా చాలా  నొప్పిగా వుంది.


కలలో నుండి మేల్కొన్నాను. 

ఆ కలలో నువ్వు ఎంతగానో ప్రేమించిన భార్య చచ్చిపోయింది అంట. 

కొన్ని నెలలు అయిందంట. నువ్వు ఏడుస్తున్నావంట.


మీ అమ్మ నీకు మరలా పెళ్ళి చేసింది అంట. 

అయ్యో! ఇదంతా నాకెందుకు తెలియలేదు;

నేను విపరీతంగా ఏడుస్తున్నాను. 

నేనెందుకు గుర్తుకు రాలేదసలు?


అవసరాల దృష్ట్యా  పెళ్ళి చేసుకున్నా ఆమెను నువ్వు 

ప్రేమిస్తునే వుంటావని నాకనిపించింది.నిజమే కదా! 

ప్రేమ ఇంత యాంత్రికంగా ఎప్పుడు మారిందో!


కలలో విషయానికి కూడా నేనెందుకిలా కలవరపడుతున్నాను 

ఇంతగా దుఃఖిస్తున్నాను. 

బయట వర్షం కురుస్తూనే వుంది. 

గుండెల్లో చెప్పలేని నొప్పిగా వుంది. 


శుభోదయఫు పలకరింపు వంకతోనైనా

అలసి నిద్రపోతున్న  నిన్ను తట్టి లేపలేను. 

నొప్పి కలిగించే విషయాలకు దూరాలు భౌతికంగానే. 

బయట వర్షం కురుస్తూనే వుంది. 

గుండెల్లో చెప్పలేని నొప్పిగా వుంది.