29, నవంబర్ 2011, మంగళవారం

పాతికేళ్ళ నా కల నెరవేరినరోజు

సిరి వెన్నెల .. చందమామ  రావే !జాబిల్లి రావే .. ఈ పాట వింటూ ..ఈ పాట వ్రాసిన గీత రచయితని చూడాలని..వారితో  చాలా  మాట్లాడాలని  పాతికేళ్ళు గా కలలు కన్నాను. ఆ కల నెరవేరిన సందర్భం ..ఏమనగా

నాకు చంద్రుడన్నా వెన్నెలన్నా..అమిత మైన ఇష్టం. (చంద్రుడు వెన్నెల అంటే ఎవరికి ఇష్టం ఉండదు అనకండి..)  అందుకే కూడా మా అబ్బాయికి కూడా "చంద్ర" కలిసేలా పేరు పెట్టడం జరిగింది.

"సిరివెన్నెల"  చిత్రం .. అంటేనే.. ఒక కలికితురాయి. ఆ చిత్రంలో.. ఏం బాగుండదో   ..చెప్పడం చాలా కష్టం. ఆ చిత్రం చూసి పాటలు విపరీతంగా నచ్చి.. "సీతారామశాస్త్రి" గారి అభిమానులుగా మారిన లక్షల   మందిలో..నేనోకరిని.
సీతారామశాస్త్రి గారిని కలసి వారితో..మాట్లాడాలని అనుకున్నాను. ఆయన విజయవాడ చాలా సార్లు వచ్చారు.కానీ ఎప్పుడు ఏదో అవాంతరం వచ్చేది. వారినిదురదృష్టవశాత్తు  కలవడం వీలుపడలేదు. కానీ..

నిన్న "మా ఎక్సెరే  సాహితీ సంస్థ" తెలుగు సినిమా పాట చరిత్ర ..డా:పైడిపాల గారి పరిశోదన గ్రంధం ..తృతీయ ముద్రణ ..ఆవిష్కరణ + డా: పైడిపాల గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది.  ఆ కార్యక్రమానికి పద్మ విభూషణ్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు,సిరివెన్నెల  సీతారామ శాస్త్రి   గారు, నిర్మాత కే.మురారి గారు అతిధిలుగా విచ్చేశారు. సభా కార్యక్రమం ని గేయ రచయిత వెన్నెలకంటి నిర్వహించారు.

సిరివెన్నెల గారికి ఆహ్వానం పలకడం ..వారితో..మాట్లాడటం..వారి ఆటోగ్రాఫ్ తీసుకోవడం .. నాకు చాలా సంతోషం కల్గించింది. నేను  జీవితంలో రెండవసారి ఆటోగ్రాఫ్ తీసుకున్నసందర్భం నిన్ననే.. జరిగింది. మొదటి సారి నాకు పదకొండేళ్ళ  వయసప్పుడు జయసుధ గారి వద్ద ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. వ్యక్తులు యెంత ఉన్నతులైనా నేను ఆటోగ్రాఫ్ తీసుకోవడం..వారిని అనుసరించడం ..వారిని అనుకరించడం .. నాకు ఇష్టం లేని సంగతులు.

నేను ఎంతో స్పూర్తికరం పొందిన రచయితలలో.. సిరివెన్నెల గారికి పూజ్యస్థానం. వారితో..మాట్లాడిన రెండు నిమిషాలు నాకు చాలా అపురూపం. అలాగే "ఎక్సరే "అధ్యక్షులు 'కొల్లూరి గారు"   "సిరివెన్నెల'' గారికి పరిచయం చేస్తూ.. మా నెల నెల వెన్నెల వెలుగు.. ఈ మేడం ..అని చెప్పారు. వారు ఆసక్తిగా చూస్తుంటే.. ముప్పై ఏళ్ళ క్రితం అమలాపురంలో.. మనం ఏర్పరచుకున్న "నెల నెల వెన్నెల "కవిత్వపు వేదిక ఇక్కడ విజయవాడలో మేము నిర్వహిస్తాము...అని ..వివరంగా చెప్పారు. "మళ్ళీ   మాట్లాడదాం అమ్మా.. అన్నారు." ఆయన.
కానీ మా కార్యక్రమం అయ్యే టప్పటికి 10 :36  రాత్రి అయింది. రైలు అందుకోవాల్సిన  సమయం దగ్గర పడుతుందని  అందరు  వెళ్ళిపోయారు.మా సంస్థ సభ్యులందరూ వారితో కలసి ఫోటో దిగాలనుకున్న కోరిక అలాగే మిగిలిపోయింది. సిరివెన్నెల గారితో..మాట్లాడిన విషయాలు మరొక పోస్ట్ లో వ్రాస్తాను. ఎందుకంటే
చాలా ఫోటోలు..  ఇంకా రావాలి . ఆ ఫోటోలు,ఆ కార్యక్రమ వివరాలు మరలా వ్రాస్తాను.


ఇంతకీ ఈ పాట ఎందుకంటే.. చిన్న పాపకి చందమామ చేతికందిన ఫీలింగ్ ఎలా ఉంటుందో.. అలా టి ఫీలింగ్ తోనే.. అక్షర వెన్నెల కురిపించిన "  సిరివెన్నెల  "   చేతికందిన రోజు.నాకు ఇష్టమైన పాట తో..ఈ మాట      

చందమామ  రావే  జాబిల్లి  రావే 
కొండెక్కి  రావే  గోగుపూలు  తేవే 
చందమామ  రావే  జాబిల్లి  రావే 
కొండెక్కి  రావే  గోగుపూలు  తేవే 

చలువ  చందనములు పూయ  చందమామ  రావే 
జాజిపూల  తావినియ్య  జాబిల్లి  రావే 
చలువ  చందనములుపూయ  చందమామ  రావే 
జాజిపూల  తావినియ్య  జాబిల్లి  రావే 
కలువ  చెలువ  కలలు  విరియ  కొండనెక్కి  రావే 
కలువ  చెలువ  కలలు  విరియ  కొండనెక్కి  రావే 
గగనపు  విరితోటలోని  గోగుపూలు  తేవే 

చందమామ  రావే  జాబిల్లి  రావే 
కొండెక్కి  రావే  గోగుపూలు  తేవే 
చందమామ  రావే  జాబిల్లి  రావే 

మునిజన  మానస మోహిని    యోగిని  బృందా వనం     
మురళి రవళికి    ఆడిన  నాగిని  బృందా వనం    || మునిజన  ||

రాధామాధవ  గాథల  రంజిలు  బృందా వనం   
గోపాలుని  మృదుపద  మంజీరము  బృందా వనం  (2)
బృందావనం  బృందావనం 

హే  కృష్ణా , ముకుందా , మురారి !
  కృష్ణా  ముకుందామురారి , కృష్ణా ! ముకుందా ! మురారి !

జయ   జయ  కృష్ణా  ముకుందా  మురారి 
జయ  జయ  కృష్ణా  ముకుందా  మురారి 

చందమామ  రావే  జాబిల్లి  రావే 
కొండెక్కి  రావే  గోగుపూలు  తేవే 
చందమామ  రావే  జాబిల్లి  రావే 

వెన్నెల కార్తీకం అంతా వెలుగుల జిలుగులు.

కార్తీకం .. శరదృతువులో వచ్చే కార్తీకం ... ఎంత హాయిగా ఉంటుందో!వర్షాలకి తెరిపి ఇచ్చి.. తెల్లని పిల్ల మేఘాలు కుదురుగా ఉండక  చక్కర్లు కొడుతూ ఆకాశం అంతా తామే అయినట్లు  తిరుగుతుండగా ప్రకృతి అంతా పచ్చగా,     వెన్నెల చల్లగా .. వీస్తున్న గాలి చల్లగా సృశిస్తూ  సంగతులేవో.. చెపుతున్నట్లు .. ఉండే ఈ కార్తీకం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి! ఈ కార్తీకం ఎలా గడిచిందంటే..  ....నేలంతా.. దీపాల వెలుగులు..ఆకాశం అంతా వెన్నెల వెలుగులు.. కార్తీకం..అంతా వెలుగుల జిలుగులు.


నాకైతే కార్తీకం అంటే చాలా ఇష్టం. ఎంచక్కా నా బద్ధకం ని బూజు దులిపినట్లు దులిపెస్తుంది.. నాలుగు గంటలకన్నా ముందుగానే నిద్ర లేవడం..ఇల్లు వాకిలి శుభ్రం   చేసుకుని ముగ్గులు పెట్టడం  ఆ చిరు చలిలో..చన్నీళ్ళ తలారా స్నానం  చేసి.. ఇంట్లో దీపం పెట్టి గుడికి వెళ్ళడం అక్కడ కార్తీక దీపం పెట్టి రావడం ..నక్తం ఉండటం సాయంత్రం తులసి కోట దగ్గర దీపం పెట్టి కానీ భోజనం చేయడం .. భూ శయనం ..వీటన్నిటితో..బిజీ అయిపోతాను.  ఈ పనులన్నీ ఇష్టంగా చేస్తాను. ఈ సంవత్సరం అయితే ఎంచక్కా.. యూ ట్యూబ్ లో... అనేక క్షేత్రాలు,భక్తి గీతాలు వింటూ చూడటం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు చూడటం.. ఆఖరికి కార్తీక పురాణం కూడా చూస్తూ వినేశాను.  కార్తీకంలో..శివకేశవులని బేధం లేకుండా పూజించాలని చెపుతుంటారు కదా! నేనైతే..నాకు అదృష్టవ శాత్తు ఇద్దరు పరివేష్టించిన గుడికే వెళుతుంటాను. అంటే శివ పంచాయతనమ్  ని ధర్శించుకుంటాను..అన్నమాట. మా వూరి గుడి అలా ప్రత్యేకం కూడా . ..  నమక,చమకాలతో.. మహాదేవుని కి జరిగే అభిషేకాలు,, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చూడటం యెంత భక్తీ పారవశ్యమో..అనుభూతి స్వయంగా పొందాల్సిందే తప్ప చెప్పడం సాద్యపడదేమో! నేను నిత్యం వెళ్ళే గుడిలో పూజారి శర్మ గారు ఎంత బాగా దేవునికి సేవ చేస్తారో!



 నిజం చెప్పొద్దూ.. ఒకోసారి బద్ధకం వచ్చేసి మనసులో తలుచుకుంటే చాలదా?  రోజు ఇలా గుడికి వెళ్ళాలా!?అని వెర్రిమొర్రి  ఆలోచనలు చేస్తూ ఉంటాను కూడా.. మళ్ళీ అంతలోనే.. అలా అనుకోకూడదని గుర్తుకు వచ్చి లెంపలు వేసుకుంటాను. ఏమైనా నాస్తికులకి  ఉన్నంత ధీమా ఆస్తికులకి ఉండదు. ప్రతి చిన్న  విషయంకి..  పాప పుణ్యం లు  బేరీజు వేసుకుని..సంశయములతో నడుచుకుంటారు కదా..అనిపిస్తుంటుంది. అలాగే మనకి సాద్యం కాదు అనుకున్న పనులని భగవంతుడి అనుగ్రహంతో.. లభిస్తాయనే పాజిటివ్ థింకింగ్ తో.. ప్రశాంతంగా ఉంటాం. ఒక విధంగా అది కూడా పలాయనవాదమే కూడా.. చాలా మంది తాము చేయవలసిన పని కూడా చేయకుండా.. భగవంతుని దయ అంటారు కదా ! నేనైతే.. తొంబై తొమ్మిదిశాతం మనం చేయవలసినది చేసి ఆ ఒక శాతం మాత్రం అదృష్టమో, లేక భగవంతుని కృప కూడా ఉండటం వల్ల మనకి లభించడం అని నమ్ముతాను. వీటన్నిటికన్నా . భగవత్ సాన్నిద్యం మనసుకి ప్రశాంత ని ఇస్తుంది. అందుకోసమైనా నేను గుడికి వెళుతుంటాను. నిత్యం ఎన్నో చికాకులు..ఒత్తిడులు తట్టుకోవాలంటే.. గుడికి వెళ్ళడం,సంగీతం వినడం,ఆత్మీయులతో..కొద్ది సేపైనా ముచ్చటించుకోవడం తో..మనం బాగుండవచ్చు అనుకుంటాను.

ఇక కార్తీకం లో.. చేసే పూజలకి, దాన ధర్మాలకి..రెట్టింపు ఫలితాలు ఉంటాయట. అందుకనేమో.. ఈ మాసంలో..ఎక్కడ  గుడులు చూసినా కిట కిట లాడుతూ ఉంటాయి.  ఇక శివాలయంలో.. అయితే..అభిషేక ప్రియుడైన మహాదేవునికి అభిషేకంలు చేయించడం పరిపాటి కదా! సోమవారాలు ,ఏకాదశి,పౌర్ణమి,చతుర్దశి తిదులలో.. భక్తులందరూ.. తెచ్చే పూజా ద్రవ్యాలు పాలు పెరుగు తేనే,పళ్ళరసాలు ఇవన్నీ సమర్పించడం చూస్తుంటే.. తమ కోరికలు తీరడం కోసం భగవంతునికి అన్ని సమర్పించే భక్తులు ..అదే గుడి ముందు అమ్మా, అయ్యా అని అర్దించే  భిక్షకులని తెగ విసుక్కుంటారు. భిక్షకులు మనని  అర్దిస్తుంటే .. మనం వెళ్లి భగవంతుడిని గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటాం. అయినా ఈ కోరికలు తీరుతూ ఉంటె.. మళ్ళీ క్రొత్తవి పుడుతూనే ఉంటాయి.. కదా! ప్రపంచం అంతా..అర్ధం కోసం,ఆడదాని కోసమే.. తిరుగుతూనే ఉంటుందనేది..నిజం కదా! ఎంతో మంది పసి పిల్లలు, వృద్దులు సరి అయిన ఆహారం దొరకక ఇబ్బంది పడుతుంటే.. అభిషేకాలు పేరిట మనం ఇలా చేయడం సబబేనా.అనిపిస్తూ ఉంటుంది కానీ.. మళ్ళీ పాప భయం ..తో లెంపలు వేసుకుంటాను.ఇంకా చెప్పాలంటే..గత రెండు సంవత్సరాలనుండి  ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయం లో.. నాకెంతో..ఇష్టమైన శివుని సన్నిధిలో.. జ్వాలాతోరణం వెలిగించడం,నూట ఎనిమిది దీపాలు స్వయంగా వెలిగించడం చేస్తుంటాను. అలాగే సమాంతరంగా..బలహీనులకి.. నా శక్తి మేర సాయం చేస్తుంటాను. ఇంకా సాయం చేసే శక్తి నాకు ప్రసాదించమని కోరుకుంటాను. ఇతరుల కోసం ప్రార్ధిస్తూ ఉంటాను. ఇలా కార్తీకం గడచి పోయింది.




ఇంకో విషయం చెప్పడం మరచాను. కొంత మంది భక్తులు అయితే.. విరివిగా పూజా ద్రవ్యాలు తీసుకుని వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటారు. భగవంతుని ముందు అందరూ..సమానమే కదా.. దేవునికి సేవ చేయడం కూడా నామోషీతనం అనుకుంటారు. శివునికి చాలా ఇష్టమైన గంగా జలం,బిల్వ దళం, త్రయంబకం కన్నా వేరోకటి  ఏముంటాయి చెప్పండి? అభిషేకం సమయంలో.. జలపాత్రలలో నీళ్ళు నిండుకుని ఇంకా అభిషేకం పూర్తి కానపుడు.. జలం పట్టుకొచ్చి ఇమ్మంటే  కూర్చున్న చోటు నుండి ఒక్కరు కూడా కదలరు. ఖరీదైన పూజా ద్రవ్యాలతో..పూజ చేయించు కుంటున్నాం. పంపు కొట్టి బిందె తో  నీళ్ళు ఎవరు తెస్తారు..అన్నట్టు చూస్తారు. మా పూజారి గారు నా వైపు చూస్తారు.అదే మహా భాగ్యం అనుకుని ప్రతి నిత్యం..ఓ..బిందెడు గంగా జలం.. అయిదు మారేడు దళములు..కొన్ని తులసి దళములు..స్వామికి సమర్పించడం చేస్తుంటాను.. అలా చేయకుంటే నాకు చాలా వెలితి కూడా..

అర్చనకాలే రూపగతా, సంస్తుతి కాలే శబ్ద గతా
చింతన కాలే ప్రాణ గతా ,తత్వ విచారే సర్వ గతా..
అని ఉమా సహస్రంలో.. చెప్పబడింది కదా!

అంటే ..పూజ సమయంలో.."రూపం "లోను ,స్తోత్రం చేసేటప్పుడు 'శబ్దం "లోను , చింతన చేసేటప్పుడు "ప్రాణం' లోను, తత్వ విచార స్థితిలో.."సర్వత్రా" దైవం సాక్షాత్కారించును... అని అర్ధం .
ఈ దేహం సందేహం కాబట్టి .. నా సందేహాలని విడిచి పెట్టేసి..




                                                          అనంతానంద భోదాంబు
                                                          నిధిం, అనంత విక్రమమ్
                                                          అంబికా పతిం ఈశానం
                                                          అనిశం ప్రణమామ్యాహమ్ .. అనుకుంటూ.. ఉంటాను.
                                                          ఓం..నమః శివాయ.

ఇంకో పోస్ట్ లో..వనభోజనాలు విశేషాలు వ్రాస్తాను.  ఈ పాట చూడండీ!!!!





27, నవంబర్ 2011, ఆదివారం

గౌతమి

వెలిగింది  నా  ప్రాణ  దీపం   పాట       "గౌతమి "  చిత్రం గుర్తుందా? ఒకప్పుడు మనమందరం ప్లాస్టిక్ సర్జరీ గురించి కొత్తగా చెప్పుకునే కాలంలో.. గౌతమి నర్మద గా   మారి తనని చంపి తనపేరిట ఉన్న ఆస్తిపాస్తుల్ని కైవసం చేసుకోవాలనుకున్న వారి భరతం పట్టిన వైనం ఆ చిత్రం లో చూడ వచ్చు.


మనకి ఇప్పుడైతే  సీరియల్స్ లో తెల్లవారేటప్పటికే రూపాలు మారిపోయి కొత్త ముఖాలని ఆమోదిస్తూ.. ప్లాస్టిక్ సర్జరీని జీవితంలో కూడా  అత్యంత ఆమోదయోగ్యం చేసుకుని  చప్పిడి ముక్కులని ,వంకర పెదవులని తీర్చి దిద్దుకోవడం అలవాటు అయిపోయినది కానీ ఆ "గౌతమి " చిత్రం నాకైతే యెంత బాగా నచ్చిందో! కథ కాదు కానీ ఆ చిత్రంలో ఓ..పాట..అంతే! వెలిగింది నా ప్రాణ దీపం అనే పాట. గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ౧౯౮౭ లో వచ్చిన ఈ చిత్రానికి క్రాంతి కుమార్ దర్శకత్వం  వహించారు. .

ఈ పాటని వింటూ సాహిత్యం చూడండి.. యెంత బాగుంటుందో! నినిద భారతిలో.. కృష్ణవేణి రెయిన్ బో ఎఫ్.ఏం లో..నేను తరచూ వింటూ ఉంటాను.. నాకు నచ్చిన పాట ఇది.

వెలిగింది   నా   ప్రాణ   దీపం 

చీకటి కాటుక కాగాలు చెంపలు వాకిట రాసిన కన్నీటి అమవాసలో 
చిగురాశల వేకువ రేఖలు కెంపులు ముగ్గులు వేసిన నీ చూపు కిరణాలలో 
వెలిగింది నా ప్రాణ దీపం 
జన్మంతా  నీపూజ   కోసం 
నీ  నీడ దేవాలయం మది నీకు నీరాజనం 
ప్రతి అణువు పూల హారం (వె)

నలుపైన మేఘాలలోనే ఇలా నిలిపేటి జలధార లేదా? 
వసివాడు అందాలకన్నానీ సుగుణాల సిరి నాకు మిన్న (వ)
తీయని ఊహల తీరం చేరువ చేసిన  స్నేహం
ఏనాటి సౌభాగ్యమో (వె) 

నూరేళ్ళ బ్రతుకీయమంటూ ఆ దైవాన్ని నే కోరుకుంటా (నూ)
ప్రతిరోజు విరిమాల చేసి నీ పదాలు అర్పించుకుంటా (ప్ర)
మాయని మమతల తావులు నిండిన జీవన వాహిని 
ప్రతి రోజు మధుమాసమే (వె) 

youtube లో పాటను చూడవచ్చు . 

24, నవంబర్ 2011, గురువారం

మా"నిఖిల్ చంద్రుడికి" పుట్టినరోజు శుభాకాంక్షలు





మా ఇంటి దీపం -నా కంటి వెలుగు  మా"నిఖిల్ చంద్రుడికి"     






24  వ పుట్టిన రోజు జరుపుకుంటున్న"నిఖిల్ చంద్ర"కి 
    

చిన్ని బంగారం .. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా! ఇలాంటి  పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని,నీవు ఆశించినవన్నీ భగవంతుని కరుణా కృపా కటాక్షాలతో నీకు లభించాలని, ఆయురారోగ్యములతో, సుఖసంతోషాలతో, యశస్వి భవగా  పదహారు  కళల  "చంద్రుడిలా"  వెలుగొందాలని  దీవిస్తూ  ప్రేమతో.... అమ్మ.

23, నవంబర్ 2011, బుధవారం

అసలైన బహుమతి

హృదయపూర్వకమైన బహుమతిని నేను తొలిసారిగా  అందుకున్న రోజు..

నాకు లభించిన బహుమతి లోకెల్లా విలువైన బహుమతి అందుకున్న రోజుని నేను మరువలేను. అది అతి పేద బహుమతి..ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అతి విలువైన బహుమతి.  ప్రపంచంలో  అతి ఖరీదైన బహుమతి... ఆత్మీయమైన బహుమతి.. అసలైన బహుమతి

అది ఏమంటే...

మా అబ్బాయి ఈ మధ్య ఇంటికి వచ్చినప్పుడు  నేను వంట ఇంట్లో వంట చేసుకుంటుంటే..సడన్గా వచ్చి.. ఇలా ..అచ్చు ఇలాగే  ప్రేమగా, ఆత్మీయంగా  అతి ఖరీదైన   బహుమతి..(ముద్దు)ప్రేమగా ఇస్తూ.. 

అంటూ.. ఇదిగో ఈ గిఫ్ట్ నీకోసం .. అమ్మా!..అంటూ నాచేతికి ఓ..గిఫ్ట్ ఇచ్చాడు. అక్కడే ఉన్న మా చెల్లి ఆసక్తిగా .. చిన్ని ! మీ అమ్మ కోసం  ఏం తెచ్చావ్? 
..నాకు చూపించు అంటూ వెంట బడినా ..సరే..
..సారీ..పిన్నీ! నీకు చూపించను..అమ్మకి ఇచ్చాక చూద్దువు కానీ,,అంటూ.. నాకు అరచేతిని తెరచి  ..ఆ  చేతిలో ఈ గిఫ్ట్  ఉంచాడు.. చాలా సంతోషంగా తీసి చూసాను.. 


ఎంతో..క్యూట్ గా ఉన్న రెండు చిన్ని చిన్ని హాన్గింగ్ పీసెస్. వాటి కున్న అనంతమైన అర్ధం..నాకు అర్ధమై.. (సంతోషమో..దుఃఖమో..తెలియదు. హార్ట్ వాష్ ) కన్నీళ్లు తో..  
నేను ఇలా.. 

నా సంతోషాన్ని ప్రకటించాను. 

ఆ బహుమతితో పాటు ఇంకా చాలా బహుమతులు తెచ్చినా సరే.. ఆ విలువైన బహుమతి ముందు ఇంకేది నాకు విలువైనది కాదు.  

ఇవన్నీ మా అబ్బాయి ఇచ్చిన బహుమతులే! 


ఒక తల్లికి ప్రేమ పూర్వకముగా బిడ్డ ఇచ్చే బహుమతికన్నా వేరొక విలువైన  బహుమతి ఉంటుందా? 

22, నవంబర్ 2011, మంగళవారం

విషాదం - నిషాదం

విషాదం  - నిషాదం


జీవితం మొత్తాన్ని ..
ఓ..విషాద మేఘం కమ్మి వేసినా..
ఒకానొక హృదయ రాగాలాపనకి
మేఘం  కరిగి ప్రవహించి
ఆ హృదయాన్ని చిత్తడి చేస్తుంది. .


హృదయం ..మోడు రెండు ఒకటే !
అడ్డుగోడలని  బ్రద్దలించుకుని మొలకెత్త డానికో  ..
మోడుని చిగిర్చడానికో
తగిన సమయం రావాలంతే!


జీవితం అంటే..ఓ..విషాదం ..ఓ..నిషాదం కదా!

21, నవంబర్ 2011, సోమవారం

"వనజ వనమాలికి " కి .. ఓ.. సంవత్సరం

సరిగ్గా ఓ.. సంవత్సరం క్రిందట ఇదే రోజు ..నేను ఓ..కొత్త లోకంలో అడుగు పెట్టాను. ఆ లోకం అందమైనదే కాదు..విజ్ఞాన,వినోద,ఆలోచనాహ్లాద భరితమైన లోకం. నేను ఇలా వస్తానని అనుకోలేదు. నా రేడియో ఫ్రెండ్ ఒకరు మా ఇంటికి వచ్చి ఇలా వాకిలి తెరుచుకుని  గూగులమ్మ ఇంట్లో అడుగు పెట్టి తన బ్లాగ్ చెక్ చేసుకుంటున్నారు. ఏమిటది ..ఆసక్తిగా అడిగాను.బ్లాగ్.. అని ..ఓ..లోకం. మీరు ..బ్లాగర్ కావచ్చుగా అంది. దానికేం భాగ్యం !? ఓపెన్ చేయండి..అన్నాను. తన స్వహస్తాలతో.. బ్లాగ్ ఓపెన్ చేసారు.  బ్లాగ్  పేరు కోసం నేను అనుకున్న రెండు పేర్లు లభ్యం కాలేదు. ఇక  ఆలోచించవద్దు,వెనుకాడ వద్దు ..పెట్టేయండి నా పేరు తో..అన్నాను నా ఆర్.జే ఫ్రెండ్ తో..

వెంటనే "వనజ వనమాలి" పేరు ఖరారు అయిపొయింది. ఎంత గట్స్ ఉంటే మాత్రం  మీ పేరు తోనే మీ  బ్లాగ్ నేమ్ + యు ఆర్ ఎల్  పెట్టుకుంటారు. క్లిక్ అవదేమో అన్నారు కొంచెం అనుమానంగా.నేనైతే ఒకసారి ఒక అడుగు ముందుకు వేస్తే..వెనుకడుగు వేసే అలవాటే లేదు కాబట్టి..అసలు పునరాలోచించే పనే  లేదు.ఉండనీ అలాగే ..అన్నాను.  అలా నా బ్లాగ్ పేరు స్థిరపడింది.  ఆమె నాకు బ్లాగ్ లో పోస్ట్  ఎలా వ్రాయాలో చూపి తను వెళ్ళిపోయారు.   ఆ రోజు ఈ రోజు అన్నమాట. 21 -11 -2010 .

ఇక నా ప్రతాపం అంతా చూపిస్తూ.. ముందుగా నా కవితలు వ్రాసుకుని పోస్ట్ చేసాను. నాకు అసలు ఇంటర్నెట్ క్రొత్త.
మా అబ్బాయి తను యుఎస్ వెళ్ళే రోజు  skype ఓపెన్   చేసి  ఇచ్చి ఆన్ లైన్ చాట్ లోకి రామ్మా..నేను కనబడతాను. చక్కగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి వెళ్ళాక ..అది ఒకటి మాత్రం నేర్చుకుని.. అప్పుడప్పుడు సాంగ్స్ ప్లే చేసుకుని వినడమే తెలుసు. కానీ ఇప్పుడు  బ్లాగ్  లోకం లోకి వచ్చానా.. అ .ఆ ..ఇ..ఈ లు కూడా రాని నేను ఏకంగా పోస్ట్లు వ్రాయడం గమ్మత్తుగా అనిపించింది.తెలుగు భాషని చూసి చాలా సంతోషము వేసింది.

మొదటగా "తెలుగు కళ" గారి బ్లాగ్ చూసాను. తర్వాత భూమిక సత్యవతి గారి బ్లాగ్ చూసాను.  నా అదృష్టం అక్కడ నుండే మొదలైంది. అన్నీ  అక్కడ నుండే నేర్చుకోవడం మొదలెట్టాను. హారం,సమూహం,జల్లెడ,కూడలి గురించి తెలుసుకుని .. సంకలినిల  ద్వారా.. బ్లాగర్స్   అందరికి కొంచెం పరిచయం కావడానికి దాదాపు మూడు నెలలు పట్టింది.
మొదట మూడు నెలలు ..నేను వ్రాసిన కవితలు,నాకు నచ్చిన పాటలు ఇవే పోస్ట్ చేసాను. ఇవి బ్లాగర్ల దృష్టికి అందక పోవడం నిరాశ కల్గి.. నాలో ఉన్న మరో కోణం బయటి తీశాను.అలా నా పోస్ట్ లు కొందరైనా చదవడం మొదలైంది.
ఇలా బ్లాగ్ వ్రాయడం లింక్లు ఇవ్వడం ఏమి తెలియని నేను అన్నీ ఎవరు నేర్ప కుండానే స్వయంగా నేర్చుకోవడం కోసం ఆరు నెలలు సమయం పట్టింది. నాకు నేర్చుకోవడం అన్నది చాలా ప్రహసనం అయింది. నాకు ఇంగ్లిష్ అంతగా రాదు.అయినా సరే నాకున్న అతి తక్కువ తీరిక సమయంలో అన్నీ శ్రద్దగా నేర్చుకుని ..ఫిబ్రవరి నెల నుండి లైవ్ ట్రాఫిక్ ఫీడ్,అమేజింగ్ కౌంటర్ సెట్టింగ్స్ అమర్చుకుని ఒక  బ్లాగర్  గా నా బ్లాగ్ ని ఎంత మంది వీక్షిస్తున్నారో సమీక్షించు కుంటున్నాను. . ఫిబ్రవరి నెల నుండి  దాదాపు 15 ,400  పై చిలుకు బ్లాగర్ ఫ్రెండ్స్ నా బ్లాగ్ ని దర్శించి,దగ్గర దగ్గర 30 ,000  పేజీలు  వీక్షించారు. 500  వందలు కామెంట్స్ ఇచ్చారు. ఓన్లీ  కామెంట్స్ మాత్రమే నండీ..! కామెంట్స్ ఇచ్చే చోట చాట్ మాత్రం చేయలేదండీ! నేను కామెంట్స్ ఇచ్చిన వారందరికీ ధన్యవాదములు కూడా చెప్పలేక పోయినా అందరు స్పందించడం మాత్రం మానలేదు. వారందరికీ  .. హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపు కుంటూ..నాకు విలువైన సూచనలను  ఇచ్చిన మిత్రులందరికీ.. నన్ను ప్రోత్శాహించిన మిత్రులందరికీ ..హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ..


అలాగే నాకు ఫాలోయెర్స్ గా  వచ్చిన మిత్రులందరికీ మరీ మరీ ధన్యవాదములు తెలుపుకుంటూ.. ఫాలోయెర్స్ గాడ్జెట్ కనబడకుండా ఉన్నందుకు నేను ఏమి చేయలేను.. ఆ గాడ్జెట్ ను నేను తొలగించలేదు. కొంత మంది బ్లాగరల గాడ్జెట్   ప్రయోగం లో ఉన్నదని  బ్లాగర్స్  నిర్వహణ అధిపతులు తెలియజేయడం జరిగింది.అందుమూలంగా.. ఫాలోయెర్స్  గాడ్జెట్ నా  బ్లాగ్లో కనబడుట లేదు..అని మనవి చేస్తూ..

సంవత్సర కాలంగా..నా ఆలోచనలని మెచ్చి నన్ను ఆదరించిన వారికి, అలాగే.. నా ఆలోచనలు, నా భావాలు నచ్చక పోయినా నా బ్లాగ్ ని దర్శించి సహేతుక విమర్శలు చేసిన వారందరికీ .. నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ.. నా బ్లాగ్ ని వీక్షకుల దరికి చేర్చిన అగ్రిగ్రేటర్స్ కి  మరీ మరీ ధన్యవాదములు తెలుపుతూ..

నాలో ఉన్న నన్ను వెలికి తీసిన నా ప్రియ నేస్తం .. అదేనండీ ..  నా బ్లాగ్.."వనజ వనమాలి" నా లోకం లో.. నాకొక కొత్త నేస్తం అయిన "వనజ వనమాలికి " కి ఓ.. సంవత్సరం నిండిన సందర్భంగా..



                                                                      విషెస్ ని చెప్పుకుంటూ


ఇక పై కూడా.. నన్ను  నేను  అనుక్షణం తీర్చి దిద్దుకుంటూ ... ఎన్నో.. చెప్పాల్సినవి మిగిలి ఉన్నాయి ..అలాటి  నా ఆలోచనలని, అభిప్రాయాలని, నా ఇష్టాలని .. మీ అందరితో.. పంచుకుంటూ..  బ్లాగ్ ప్రయాణం  సాగించగలనని ఆశిస్తూ..  బ్లాగ్ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములతో..
                           
                             
                                                                వనజ వనమాలి 

20, నవంబర్ 2011, ఆదివారం

యెన్ ఆర్ ఐ నిత్య పెళ్ళి కొడుకుకి దేహ శుద్ధి

యెన్ ఆర్ ఐ నిత్య  పెళ్ళి కొడుకుకి దేహ శుద్ధి.. కొత్త మలుపు తిరుగుతున్న యెన్ ఆర్ ఐ కథ.. అంటూ కొన్ని ప్రముఖ చానల్స్ లో వస్తున్న వార్తా కథనాన్ని దేశ విదేశాలలో చాలా మంది చూస్తున్నారు కదా!  అలాగే వార్తా పత్రికల్లోన్ని కథనాలు చదివి ఉంటారు.

నిజానికి ఈ కథకి ఇలా చేస్తే బాగుండును అని నేను కోపంగా  బాధితులకి   సూచన ఇచ్చి నాలుగైదు నెలలు దాటింది.

ఒక యెన్ ఆర్ ఐ ..నాసా లో సైంటిస్ట్ అయిన ఈమని శివశంకర్ రెడ్డి..అతని మొదటి భార్య విద్యాధికురాలైన విజయ లక్ష్మి.వీరి సంతానం ఇద్దరు నిర్మల, సుజాత. ఈమని శివశంకర్ రెడ్డి విజయ లక్ష్మికి విడాకులు ఇచ్చి   పొన్నూరుకు చెందిన ఔతు విమలకుమారిని 1994   లో   ద్వితీయ వివాహం చేసుకుని కొన్నాళ్ళు ఇక్కడ ఆమెతో గడిపి .. యు .ఎస్ కి వెళ్ళిపోయాడు. వీసా పంపుతానని చెప్పివెళ్ళిన అతను అడ్రెస్స్ లేడు .  తరువాత విమల కుమారిని ఇక్కడ వదిలేసి అక్కడనే  తృతీయ వివాహం చేసుకున్నాడు.  మరలా  మూడవ భార్య ద్వారా అతనికి ఇద్దరు పిల్లలు.
సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన విమల కుమారి  కన్న కలలు కల్లలై పోయాయి. భర్త నుండి పిలుపు వస్తుంది అనుకున్న ఆమెకి అతని నుండి పిలుపు రాక పోగా ..ఈమని శివశంకర్ రెడ్డి తో ఆమెకి జరిగిన వివాహాన్ని రద్దు చేసుకొవాల్సినదిగా కోరుతూ ఆమె పై ఒత్తిడి తీసుకుని వచ్చారు అతని వైపు బంధువులు . తగిన కారణం లేకుండా వివాహాన్ని ఎందుకు రద్దు చేసుకోవాలో అర్ధం కాక కోర్టు ని ఆశ్రయించిన విమలకుమారి 15  సంవత్సరముల నుండి   కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఈమని శివ శంకర్ రెడ్డి  తనకి మారుగా.. కోర్టు వ్యవహారములు చూసుకోనుటకు అతని చెల్లెలి మరిది ఉయ్యూరి ధర్మా రెడ్డి అనే అతని అటార్నీ పవర్ రాసి ఇచ్చి కోర్టు వ్యహారములు నడుపుతూ ఉన్నారు.శివ శంకర్ రెడ్డి తరపు లాయరు ఉయ్యూరు బాపి రెడ్డి స్వయానా అతని చెల్లెలి భర్త.  వీరు విమల కుమారిని అమెరికా శివశంకర్ రెడ్డి దగ్గరికి పంపుతామని ఆమెని బయలదేర దీసి మద్రాస్ ఎయిర్ పోర్ట్ వరకు తీసుకు వెళ్లి అక్కడినుండి వీసా రాలేదు అని చెప్పి ఆమె పాస్ పోర్ట్  ని వారు స్వాదీనం చేసుకుని .. ఆమె  వెంట ఉన్న లగేజ్ ,బంగారం తో సహా అన్నీ  వారే తీసుకుని ఆమెని పుట్టింటికి పంపించి వేసారు.  తర్వాత అవి ఏవీ   ఆమెకి ఇవ్వలేదు సరి కదా.. ఆమె పై ఎన్నో ఆరోపణలు చేసారు. అతను మీడియా ముందు చూపుతున్న ఆధారాలు నిజమైనవి కాదు.వీరికి సంబందించిన కేసు ఇప్పటికి  హై కోర్ట్లులో నడుస్తూ ఉంది. ఈమని శివశంకర్ రెడ్డి తన ద్వితీయ వివాహాన్ని రద్దు చేకోకుండానే మూడవ వివాహం చేసుకుని 14 సంవత్సరాలు అయింది.

 ఈ  ఈమని శివశంకర్ రెడ్డి  చేసిన మోసం ఎలాటిదో చూడండి!. విమల కుమారి విడాకులు ఇవ్వడానికి సిద్దపడక పొతే ఆమెకి అయిదు సంవత్సరముల క్రితం వరకు భరణం చెల్లించమని కోర్ట్ ఆదేశించి నప్పటికీ కోర్ట్ ఆదేశాలను పెడ చెవి పెట్టి..ఈ దేశంలోకి రాకుండా, వచ్చినా ముఖం చాటేసుకుని విమలకుమారికి పరిష్కారం చేయకుండా..వెళ్ళిపోతున్నాడు.  విద్యాదికులు వివాహం పేరిట మోసం చేయడం అమాయుకలని మోసగించడం యెంత   భాదాకరం. ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ద్వితీయ వివాహమైనా మంచి జీవితం గడుపుతుందని అతనికి ఇచ్చి వివాహం చేస్తే.. ఒక వస్తువుని వాడుకున్నట్లు వాడుకుని వదిలేసాడు.పైగా ఆమె ప్రవర్తన మంచిది కాదంటూ.. అభియోగాలు మోపి అవమానకరంగా మాట్లాడటం భరించలేని విమలకుమారి అతను వచ్చి తన ఎదురుగా నిలబడి వివాహం రద్దు పరచుకోవడానికి సహేతుకమైన కారణాలు చూపి విడాకులు కోరమని అడుగుతున్నారు. బీదరికం,ఎక్కువ చదువుకోలేకపోడం,  మోసపూరిత వివాహం వల్ల కోర్టుల  చుట్టూ తిరగ వలసి రావడం,  లాయర్ల ద్వంద వైఖరి ,బంధువుల సూటి పోటీ మాటలు,మానసిక అశాంతి వీటన్నిటి మద్య వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో నాకు తెలుసు.

విమల కుమారి చెల్లెలు "రమ" నాకు ఫ్రెండ్. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒక టైలరింగ్ షాప్ నడుపుకుంటూ..యెంత కష్ట    పడి బ్రతుకుతారో నాకు తెలుసు. ఉన్నఒకే  ఒక సోదరుడు కుటుంబ భాద్యతలు వదిలేసి తన దారి తను చూసుకుంటే..తల్లిదండ్రులని తమ రెక్కల కష్టం పై పోషించుకుంటూ.. బ్రతుకు వెళ్లదీస్తున్నారు.

నాలుగైదు నెలల క్రిందట విమల కుమారి మా ఇంటికి వచ్చినప్పుడు తనకి జరిగిన వివాహం గురించి జరిగిన మోసం గురించి నాకు చెప్పినప్పుడు యెన్ ఆర్ ఐ వివాహాలు -మోసాలు గురించి ఒక ప్రత్యెక కోర్ట్ నడుస్తుందని చెప్పాను. భూమిక హెల్ప్ లైన్ కి కాల్ చేయమని సలహా ఇచ్చి  వెంటనే నేను నెంబర్ తీసి యెంత ట్రై చేసినా కాల్ కనెక్ట్ కాలేదు.కోర్ట్ ద్వారా సత్వరం పరిష్కారం కాలేదు కనుక మీడియాని ఆశ్రయించ మని   చెప్పాను. ఈమని శివశంకర్ రెడ్డి వివరాలు కోసం కూడా నెట్ అంతా గాలించాము కూడా.

ఇప్పుడు ఈమని శివ శంకర్ రెడ్డి సమీప బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు ..అతనిని కలవడానికి వివాహ వేదిక వద్దకు వెళ్ళిన విమలకుమారిని,అతని చెల్లెలిని అడ్డుకుని అతనిని తప్పించ బోతే జరుగుతున్న అన్యాయానికి..ఏళ్ళ తరబడి సాగుతున్న కోర్ట్ కేసుకి సహనం కోల్పోయిన నా ఫ్రెండ్ "రమ" అతనిని విపరీతమైన ఆవేశంలో కాలర్ పట్టుకుని నిలదీసినప్పుడు..అతని బందువులు ఆమె పై దాడి చేసారు. ఆ దృశ్యాలు మీడియాలో వచ్చాయి కూడా. గత పదిహేను ఏళ్ళుగా.. అతని నిర్లక్ష్య వైఖరికి విసిగిపోయిన ఆ కుటుంబం యెంత  నలిపోయిందో!

నా ఫ్రెండ్ "రమ " అయితే వివాహం పట్ల విముఖత వచ్చేసి అవివివాహితగా  మిగిలిపోయింది.  వారికి జీవనాధారం కుట్టుపని మాత్రమే! తల్లి అనార్యోగ్య కారణంగా చాలా డబ్బు ఖర్చు అయితే.. ఫ్రెండ్స్ మేమందరం సహాయం చేసాము.ఇలా చెప్పడం ఆమెని అవమానించడం అవుతుందేమో! కానీ కొన్ని సమయాలలో.. వాస్తవ పరిస్థితులు తెలుపటం కోసం ఈ మాట వ్రాస్తున్నాను. .  అభిమాన వంతులు అయిన వారు ఆ డబ్బుని తిరిగి ఇచ్చే ప్రయత్నంలో..రాత్రింబవళ్ళు కష్ట పడుతున్నారు. అటువంటి  వారు డబ్బు కోసం ఈమని శివ శంకర్ రెడ్డి పై..అబద్దపు ఆరోపణలు చేయడం  లో అర్ధం లేదు.వాళ్లకి జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పమని కోరుతున్నారు. అంతే!

ఈమని శివశంకర్ రెడ్డి ని టై పట్టుకుని లాగి  దాడి చేసి  ప్రశ్నించిన రమ ఆవేశం చూసి నేను ఆశ్చర్య పోయాను. ఏమిటి రమా! అంత ఆవేశం అంటే .. అది ఆవేశం కాదు.. మా మానసిక బాధ కి వెళ్ళ గ్రక్కిన ఆవేదన. ఇప్పుడు  అతను వచ్చాడు..మళ్ళీ  తిరిగి వెళతాడు. కోర్టులో   కేసు తేలదు. ఎన్నేళ్ళు  అని  ఈ మానసిక వ్యధ.?జీవితమంతా.. చేయని తప్పుకి బలైపోయింది.. అక్క కి జీవితం ఎలా వస్తుంది చెప్పండి? అంది.  "రమ" విశ్వ హిందూ పరిషత్ కార్య కర్తగా.. పద్దెనిమిది సంవత్సరాలుగా సేవలు అందించే భాద్యత గల పౌరురాలు..సామాజిక చైతన్యం కల ఆమె అలా ప్రవర్తించిన దనటానికి కారణం ..వారి ఆవేదనే! మొత్తానికి ఈమని శివశంకర్ రెడ్డ్యికి దేహ శుద్ధి చేసి నాలగవ పెళ్లి చేసింది. అందుకు ఆమెకి అభినందలు చెప్పాలో..చట్టం,న్యాయం అందనందుకు విచార పడాలో చెప్పలేను.  నా దృష్టిలో అరబ్ షేక్ లు వచ్చి పెళ్లి పేరిట అమ్మాయిలని  వంచించి కొన్నాళ్ళు జాలీగా గడిపి వెళ్ళిన దానికి   పెళ్లి పేరిట మోసం చేసిన  ఈ ఈమని శివశంకర్ రెడ్డికి ఏమీ తేడా లేదు అనిపించింది.ఏదైనా  విదేశి   పెళ్లి కొడుకుల విషయంలో..  తగిన జాగ్రత్తలు అవసరం కదా!  
  

18, నవంబర్ 2011, శుక్రవారం

ఏమివ్వను నీకేమివ్వను


ఏమివ్వను నీకేమివ్వను  ఏమివ్వను  నీకేమివ్వను
నా  మనసే  నీదైతే ఏమివ్వను..(ఏమివ్వను)

నన్నే వలచి నామేలు తలచి (నన్నే)
లేని కళంకం మోసిన ఓ..చెలి మచ్చలేని జాబిలీ ...(ఏ)

 తారకలే కోరికలై   మెరియగా   కనులు    విరియగా
వెన్నెలలే వేణువులై పలుకగా మధువులోలకగా
యుగ యుగాలు నిన్నే వరియించనా
నా సగము మేన  నిన్నే ధరియించనా

 ఏమివ్వను నీకేమివ్వను
నా మనసే నీదైతే ఏమివ్వను (ఏ)

 ఏమడుగను ఇంకేమడుగను
నీ మనసే నాదైతే ఏమడుగను

నీ కన్నుల వెలుగులే తారకలై  నయన  తారకలై
నీ నవ్వుల జిలుగులే చంద్రికలై కార్తీక చంద్రికలై
జగమంతా నీవే అగుపించగా ..
నీ సగము నేనే నివశించగా

ఏమడుగను ఇంకేమడుగను
నీ మనసే నాదైతే ఏమడుగను
నిన్నే వలచి నీ మేలు తలచి (నిన్నే )

బతుకే నీవై పరవశించే చెలిని ... నీజాబిలిని

ఏమడుగను ఇంకేమడుగను..

 ఈ  పాట  సుపుత్రుడు  చిత్రంలో .. ఘంటసాల  గారు  పి .సుశీల  గారి  గళం  . ఆత్రేయ,కే .వి .మహదేవన్ ల  కాంబినేషన్  లో .. మంచి  పాట. నాకు చాలా చాలా ఇష్టమైన పాట .

  youtube లో విని,చూసి  ఎంజాయ్ చేయండి .


స్త్రీలను స్త్రీలే ఈర్ష్య పడాలా?

స్త్రీకి స్త్రీ యే ప్రధమ శత్రువట...!? అని  మా ఫ్యామిలీ ..ఫ్రెండ్  ఒకరు  నా ముఖంలోకి చూస్తూ.. ఎగతాళిగా  అంటే కోపం వచ్చినా తమాయించుకుని ఎలానో వివరంగా  చెప్పండి..అన్నాను.కాసేపు ఆలోచన ..నా ప్రశ్నకి దీటుగా వివరణ ఇవాలన్నట్టు మౌనం.

ఎప్పుడు పుట్టిందో..ఈ మాట. ఈర్ష్య కి మరో రూపం స్త్రీ అట.

అందరూ   నిజమే  అనుకుంటారేమో! పురుషులకి స్త్రీ అంటే  ఈర్ష్య ,శత్రుత్వం ఉండదా? పురుషులని పురుషులే ఈర్ష పడాలా? స్త్రీలని స్త్రీలే ఈర్ష్య పడాలా? ఈర్ష్య కి కూడా జెండర్   బేధాలు ఉంటాయా? అడిగాను.
:)))) ... అక్కడ మళ్ళీ నవ్వు.

ఏమిటో..ఈ కాలపు స్త్రీల ఎక్స్ ట్రా ఆర్డినరీ స్కిల్ల్స్ చూసి మగవాళ్ళు ఈర్ష్య పడటం లేదా ఏమిటి? అదే స్త్రీని చూసి స్త్రీ కూడా ఈర్ష్య పడినట్లుగానే!  అన్నాను.

ఇక నా ఫ్రెండ్ వివరణ చూడండి.

ఒక మహిళ ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే.. జాలి చూపేది మాత్రం పురుషుడే! అదే స్త్రీ అయితే ..  పైకి  సానుభూతి కురిపిస్తూనే.. లోలోపల బాగా అయిందిలే .. అలా జరిగి తిక్క కుదరాల్సిందే! అని లోలోపల తలపోస్తారు.
ఇక ఇళ్ళల లో  తోడి  కోడళ్ళ మద్య ,ఆడ బిడ్డల మద్య ,అత్తా కోడళ్ళ మద్య, ఆఖరికి అక్క చెల్లెళ్ళ మద్య కూడా  ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. స్త్రీలకి ఉన్న ఆడంబర శైలి పురుషులకి ఉండదు. చీరలకి ,నగలకి ,అలంకరణ లకి  స్త్రీలు ఇచ్చినంత ప్రాధాన్యం పురుషులు ఇవ్వరు.  పురుషుడు ఒక  డ్రెస్ తో పది పంక్షన్ లకి హాజరైతే పది పంక్షనలకి  పది చీరలు ప్రదర్శించడం ఒక ఎత్తయితే.. ఇంకొక స్త్రీ కట్టిన చీర పెట్టిన నగ చూసి..అవి యెంత బాగున్నా సరే  అకారణంగా ద్వేషం ఒలకబోడం స్త్రీలకి పరి పాటి.


అదే పురుషుడైతే.. ఒక కారు కొనుక్కోగానే.. అతని చుట్టూ ఉన్న అతని స్నేహితులు  చేరి మనఃస్పూర్తిగా సంతోషించి.. నేను అలా ఫైనాన్స్ తీసుకున్నాను.ఇలా పైనాన్స్ తీసుకున్నాను.మీరు తీసుకోండి..అని ఎంకరేజ్ చేస్తారు. తనకి రాకున్న వేరొకరికి ప్రమోషన్ వచ్చినా లోపల బాధ ఉన్నా సరే.అభినందిస్తారు. అదే స్త్రీలయితే లోలోపల రగిలిపోతారు.  అసలు స్త్రీల సమస్యలకి స్త్రీలే కారణం. వర కట్న సమస్యలు కానీయండి..వివాహేతర  సంబంధాలు కానీయండి..ఆస్తి తగాదాలకి కానీయండి అన్నింటికీ స్త్రీయే కారణం. పురుషుడుఅన్నింటా నామమాత్రమే.

వరకట్నాల ముసుగులో..అమ్మాయిలు  భర్త మీద నెపం పెట్టి పుట్టింటినుండి అయినకాడికి సొమ్ము గుంజుకున్దామనే చూస్తారు. ఏమి లేదంటే ఆడవాళ్ళకి అలంకారమైన ఆయుధం ఉండనే ఉంది కదా.. ఆ ఏడుపుని అడ్డు పెట్టుకుంటారు.పురుషులని చవటాయిలని చేసి ఆడుకుంటారు.  ఒక ఆర్యోక్తి చూడండి..

కన్యా వరయతే రూపం
మాతా  విత్తం,పితా శ్రుతం
బాంధవః కులమిచ్చంతి
మృష్టాన్న మిత్రే జనాః

కన్య పెళ్లి కొడుకు రూపాన్ని మాత్రమే చూస్తుందట. తల్లి అతని వెనుక ఉన్న డబ్బుని,తండ్రి విద్యా సంస్కారాలని చూస్తారట. బంధువులు వంశం,సంప్రదాయం చూస్తే  జనులు  విందు భోజనం కోసం ఎదురు చూస్తారట.
తమకి లభించనిది ఇతరలుకు లభించినప్పుడు  మండిపోయే స్త్రీలు ..భగ భగ మండిపోయే చెట్టులాటివారట. ఆ చెట్టు పై ఏ పక్షి వాలదన్నట్టు.. ఈర్ష్యా ద్వేషాలతో మండిపోయే స్త్రీ చెంత ఎవరు దరిచేరరు.

అందుకని నేను చెప్పునది ఏమనగా.. స్త్రీ కి స్త్రీ యే శత్రువు. ఈర్శ్యకి మారు పేరు స్త్రీ.. అని ఉద్ఘాటించాక..సమాధానం చెపుదామనుకునే లోపే..నాకు కోపం రాలేదు కానీ..మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడకి విపరీతమైన కోపం వచ్చి.. స్త్ర్రీలని అన్నేసి మాటలు అంటుంటే.. సమాధానం చెప్పరేమిటండి..అని నన్ను కసురుకుంది.

ఆలోచించుకుని రేపు వన భోజనాలు రోజు నాకు సమాధానం చెప్పండి     తప్పైతే నా వాదన,.నా అభిప్రాయం ..  మార్చుకుంటాను..అని సెలవు తీసుకున్నారు.

నేను, ఆమె కలసి ఒక ఇరవై మంది మా గ్రూప్ మెంబర్స్ తో..సీరియస్ గా చర్చించి ..స్త్ర్రీకి స్త్రీ శత్రువు అన్నవారిని, ఈర్ష్యా అసూయ జీవి అన్న వారిని ,అనేవారిని కూడా.. చీల్చి చెండా డా లను కుంటున్నాం. మాటలతోనే లెండి.!

మళ్ళీ ఆ విషయాలు రెండు మూడు రోజుల తర్వాత మోసుకోస్తాను. అందాక నాకు సెలవు ఇచ్చి.. మీరు ఆలోచించండి.        

16, నవంబర్ 2011, బుధవారం

భీమా బాధలు.

ఈ మద్య ఎక్కడికి వెళ్ళినా సరే.. భీమా పాలిట పడి పోతున్నాము. అదేనండి జీవిత భీమా..పాలసీ తీసుకోమని అడిగేవారు,వత్తిడి చేసే వారు , ఇంకాస్త చొరవ ఉంటె.. మొదటి ప్రీమియం కట్టి మరీ ఇంటికి రసీదు తీసుకుని వచ్చే  వారు ఉంటున్నారు.

ప్రతి ఒక్కరికి జీవిత భీమా అవసరం ఎంతైనా ఉంది. కాదనం  కానీ కొంచెం పరిచయం కాగానే పాలసీ తీసుకోండి అని వెంట బడి వేదిస్తూ ఉంటారు. ఇంతకూ క్రితం చేసి ఉన్నామండీ..అన్నా వినిపించుకోరు. యాక్సిడెంట్ బెన్ ఫిట్ ల గురించి, మనీ బ్యాక్  పాలసీ గురించి.. ఇంకా హెల్త్ ఇన్స్యూ రెన్స్ గురించి చెవిలో జోరీగలా చెబుతూనే ఉంటారు.  ఎవరి ఆర్ధిక స్తోమతని బట్టి వారు ముందు చూపుతో..జీవిత భీమా చేసుకోవడం మంచిదే! కానీ తమకి లభించే కమీషన్ కోసం ఇతరులని పాలసీల కోసం ఒత్తిడి చేయడం సబబు కాదేమో!అనిపిస్తూ ఉంటుంది. నేనైతే భీమా ఏజంట్స్ కనబడగానే కాస్త స్ట్రాంగ్ గా   గా ఉండటం నేర్చుకున్నాను. సున్నితంగా పాలసి లు ఉన్న విషయం చెప్పి ... హమ్మయ్య అని తేలికగా బయట పడతాను.

ఇవి కాకుండా   ఛైన్ లింక్ ద్వారా లక్షలకి లక్షలు సంపాదించ వచ్చు అని అందంగాముంచేసే వారు  ఉన్నారు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే బలహీన మనస్కులు..వీరి ఎరకి చిక్కుకుని బోల్తా పడుతూ ఉంటారు. నేను గమనించిన  విషయం ఏమిటంటే.. ఒక విదేశి కంపెని మన దేశంలో ఓ..కంపెనీ తో టై అప్ అయి జీవిత భీమాని ఛైన్ లింక్ సిస్టం లోకి మార్చి జనం ని బాగా మోసగిస్తుంది.

ఇక ఆరోగ్యం పట్ల అవగాహన ఏమో కానీ.. అనారోగ్యం వచ్చినప్పుడు ఆదుకుంటుందని  హెల్త్ పాలసీ తీసుకుంటే బాగుంటుందని చెపుతుండటం మొదలెట్టారు.

అసలే మద్య తరగతి మానవుడు,చదువుల ఖర్చుకి, కార్పోరేట్ హాస్పిటల్ బిల్లులకి భయ పడి చస్తుంటే ఈ  భీమా  ఏజంట్స్  తాకిడి ఒకటి. భీమా చేసుకోడం జీవితం లోను జీవితానంతరం కూడాను మంచిదే..కానీ ఇతరులని ఇబ్బంది పెట్టి పాలసీలు చేయించడం వల్ల ఒక ప్రీమియం కట్టి తరువాత మానుకున్న వారు ఉంటున్నారు.ఏజంట్స్ కి లభించే 25 % కోసం వెంటబడి వేదించి భీమాలు చేయించడం ఎంతవరకు మంచిదో.. ఆలోచించుకుంటే మంచిది కదా!

 భీమా వరమే..కానీ ఇబ్బంది పడుతూ కట్టడం వరం కాదు కదా!  కాళ్ళకి తగిలే తీగలు కొందరు  భీమా  ఏజంట్లు. పట్టుకుంటే వదలరు . . వాళ్ళ టార్గెట్ కోసం ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు కదా!. మొన్న ఈ మద్య ఒకావిడ పోన్ లో మాట్లాడుతూ హెల్త్ పాలసీలు చేయిస్తామని చెప్పి ఓ..అరగంట సమయాన్ని తినేశారు. . కట్టే ముందు ఒకసారి మా వారిని అడిగి చెపుతాను అన్నాను. వెంటనే చెప్పండి లేకపోతె ఇంతలోనే వేరే వారికి  మాట ఇస్తారేమో!మీరు తప్పనిసరిగా మా ద్వారానే హెల్త్ పాలసీ తీసుకోవాలి. నేనే రేపే వస్తాను అని ఇబ్బంది పెట్టారు. అసలు ఈ సమయంలో.. పాలసీ తీసుకునే పరిస్థితిలో  మేము లేము.అది చెపుతున్న వినకుండా  మర్నాడు మా ఇంటి సమీపంలోకి వచ్చి కాల్ చేసారు పాలసీ కోసం వస్తున్నాం అని. నేను వెంటనే.. ఊర్లో లేమండి అని చెప్పి తప్పించుకుని.. అయినా ఇంటి వరకు వచ్చినా వస్తారు అనుకుని.. ఇంట్లోనే  దొంగలా ఉండాల్సి వచ్చింది అంటే అర్ధం చేసుకోండి.. ఈ భీమా ఏజంట్స్ ఎంత ఇబ్బందిపెదతారో..అన్నది. ఇవండీ భీమా బాధలు.

15, నవంబర్ 2011, మంగళవారం

మొబైల్ హెల్

నాకు ఈ మద్య మొబైల్ పోన్ వాడకం పట్ల విరక్తి పెరిగిపోయింది. ఎక్కడికైనా వెళుతున్నా మొబైల్  పోన్ వెంట తీసుకుని వెళ్ళడం మానేసాను. ఏమి అయి  పోయావ్? ఆ మొబైల్ పోన్  ఎందుకు నీకు? ఆ  బందరు కాలవలో పడేయి .. అని విసుక్కుంటున్న ఫ్రెండ్స్ కి .. బిజీ తల్లి.. అని నైస్ గా తప్పుకుంటాను. ఎందుకు అంత విరక్తి అంటారా? ఒకప్పుడు తెగ మోజు పడి కొనుక్కుని తెగవాడి పడేసి ..ఇప్పుడు మనుషులతో మాట్లాడటమే  విసుగేసి..ఇలా..

నేను ఒక  సంవత్సరం నుండి ఒక నియమం పెట్టుకున్నాను. రాత్రి 8  గంటల తర్వాత  పోన్  మాటలాడ కూడదని. ఎందుకంటారా!? ఆ పోన్ మ్రోగిందంటే ఇంట్లో అందరితో  కలసి భోజనం చేయడం కి..నీళ్ళు ఒదులుకొవాల్సిందే.!  ఆఖరికి స్నానం చేసే టైములో..కూడా..నాలుగు సార్లు మ్రోగి.. ఏదో కొంపలంటుకు పోయినట్లు.. ఎక్కడికి వెళ్ళావ్ ఇంత సేపు అనే ప్రశ్న వినగానే చిర్రెత్తుకొస్తుంది. చేసిన వాళ్ళు కస్టమర్స్ కావచ్చు. ఫ్రెండ్స్ కావచ్చు,బందువులు కావచ్చు.  ఇక పెళ్లి,పేరంటాల్లకి,జనన మరణాలకి..అన్నిటి కబుర్లు మోసుకొస్తుంది. నేను వీలు కుదరక  వెళ్ళ లేని స్థితులు. మళ్ళీ రాలేదు ఎందుకని ప్రశ్నలు,నిష్టూరాలు. ఒకోసారి కొందరు  పరిచయస్తులు,ఖాతాదారులు  అయితే.. ఏదైనా పని బడితే.. ఒకటే విసిగించేస్తారు.అందుకే పోన్ మాట్లాడుతుంటే కస్టమర్స్ వచ్చారని ,కస్టమర్స్ అయితే పోన్ వచ్చిందని తప్పించుకుంటాను.అందుకు..కొన్ని రహస్య  క్రియలు ఉన్నాయి లెండి.  ఒకోసారి మా వర్కర్స్  తో పోన్ తీయించి "మేడం బయటకి వెళ్ళారండి అని చెప్పిస్తాను". అంతగా విసిగి పోయాను.  

ఏదైనా ముఖ్యమైన పోన్ అయితే ఎవరికి  తెలియకుండా ఉన్న నెంబర్ కి మాత్రం కాల్స్ వచ్చే టట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటె  రాత్రి సమయాల్లో   వచ్చే పోన్ ల వల్ల నిద్ర చేటు.ఫ్రీ కాల్స్ వల్ల అనవసరం అయిన విషయాలు కూడా విని విని చెవులు దిబ్బడ వేస్తున్నాయి. రాత్రి సమయంలో అయితే ఫ్రీగా ఉంటామని ఫ్రెండ్స్  వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఇక మెసేజెస్ సంగతి సరే సరి. నేనైతే.. కొన్ని మెసేజెస్ చదవను కూడా చదవను.వెంటనే డిలేట్ చేసి పడేస్తాను. అవి చదివి,రిప్లై ఇచ్చే ఓపిక కూడా నాకు లేదు.ఒకప్పుడైతే "నొక్కింది చాల్లెమ్మా ..ఇక పడుకో!అని కసురుకునే వరకు.. మెసేజ్ లతో చాట్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మెసేజెస్ హింస తాకిడికి మొబైల్ పోనే వద్దు బాబు అనుకునే స్థితికి నేను వచ్చేసాను.

ఇక యువతరం అయితే మొబైల్ ఫోన్ వాడకంలోకి వచ్చాక మనుషులు సాటి వారితో..మాట్లాడం అరుదైపోయింది. ఎక్కడెక్కడో  ఉన్న దూర ప్రాంతం వారితో.. గంటల తరబడి మాట్లాడుతూ..చుట్టూ ఉన్న మనుషుల  గురించే పట్టించుకోరు. ముఖ్యమైన విషయం చెప్పటానికి కూడా దగ్గరి వారికి అందుబాటులోకి ఉండరు.
ఇప్పటి యువతరమే కాదు.. మద్య వయస్కులకి కూడా మొబైల్ ఫోన్ ఒక వ్యసనం అయిపొయింది. ఫ్రీ కాల్స్ ,నైట్ కాల్స్ ,ఫ్రీ మెసేజెస్ ..వీటన్నిటి హవా .. నడుస్తుంది. ఏ వస్తువు అయినా అవసరం మేర వాడుకోవడం మంచిది. అవసరానికి మించి వాడటం వ్యసనం అయితే..దానివల్ల వచ్చిన పర్యవసానం ఎలా ఉంటుందో.. ఈ చిన్ని చిత్రం లో చూడండీ!

13, నవంబర్ 2011, ఆదివారం

డాలర్ ల ఆకలి...


నిఖిల్


జ్యోతిర్మయి గారి అన్నదాత సుఖీ భవ పోస్ట్ చూసిన తర్వాత చాలా భాద కల్గింది.

మన వాళ్ళు అనుకోవడంలో.. ఆత్మబలం పెంచుకుంటాం. ఆ అనుకోవడంకి అలవాటు అవ్వకపోతే.. పరాయి దేశాలలో అయిన వాళ్ళందరికీ    దూరంగా నివసించే వారందరికీ  ఒంటరితనం వరదలా ముంచేస్తుంది.

నిద్ర లేచినది మొదలు హడావిడి బ్రతుకులు డాలర్ కై ఆరాటాలు.   మన తిండి తినక, మన వాళ్ళు కానరాక .. మన పలకరింపు కూడా విసుగ్గా   తోచి ఒకసారి.. పలకరింపుకై ఎదురు చూసే కొన్ని సార్లు. ఎన్ని జీవన పోరాటాలు.

వివాహితులు అయితే పర్వాలేదు..ఒకరికొకరు తోడు ఉంటారు.

అప్పుడే ఎల్లలు దాటి వెళ్ళిన యువత ఫీలింగ్స్ యెలాఉంటాయో.. అర్ధమైతే.. తల్లిదండ్రులు యెవరూ వారి పిల్లలని.. ఖండాలు దాటించరు కూడా.. తిండికి,నిద్రకి, అన్నీ  కరువే! అభద్రతా భావం వెంటాడే చోట పిల్లలు ఎలా మనుగడ సాగిస్తారో తెలిస్తే.. మనసు సంద్రమే అవుతుంది.  వాళ్ళది   డాలర్ ల  ఆకలి ఆనాలేమో!

రెండు నెలల క్రిందట మా అబ్బాయి "నిఖిల్ చంద్ర " వచ్చి కొన్నాళ్ళున్నాక తిరిగి వెళ్ళేటప్పుడు.. తన ఫ్రెండ్ ని ఫోన్ లో ఏం తీసుకుని రమ్మంటావ్!? ..అని అడిగాడు. అందుకు సమాధానంగా "ఒరేయ్ బావా ! వేడి వేడి ఇడ్లీలు కొబ్బరి పచ్చడి ప్యాక్ చేయించుకుని  రారా..అని అడిగాడు. అవి నేను తెచ్చి ఇచ్చేటప్పటికి ఉండవు కదరా, పాడైపోతాయి అని నవ్వుకుంటూ..చెప్పుకున్నా.. ఆ మాటలు విని నాకు మనసు యెంత కలుక్కుమందో! పిల్లలు ఇష్టమైన తిండికి యెంత మొహం వాచిపోయి వున్నారు..అనిపించి.. వెంటనే "నిన్న అయినా చెప్పి ఉంటే.. ఇనెస్టంట్   ఇడ్లి  పిండి తయారుచేసి ఇచ్చేదాన్ని కదా"  అన్నాను. ఎందుకంటే మా అబ్బాయి అప్పుడు..తన క్లాస్మేట్ ఫ్రెండ్ కోసం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇచ్చిన  ఇడ్లీ పాత్ర.ఇడ్లీ తయారీ స్టాండ్ కూడా  తీసుకుని వెళుతున్నాడు తన కూడా.


నా కైతే.. ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా, బంగాళదుంప ప్రై చేసినా పప్పుచారు పెట్టినా.. రసం వాసన చూసినా.. మా అబ్బాయి గుర్తుకు వచ్చి వాటిని తినలేను కూడా. అందుకే  ఆ కూరలు చేయడమే మానేసాను. వంట చేయడం అంతగా రాని మా అబ్బాయి ఇన్ టైం లో తినడం వీలవక ఆలస్యంగా తింటే అది నచ్చక ఆకలి చంపుకోవడం, ఓ..కప్ కాఫీ కోసం మొహం వాచి పోవడం.. ఎక్కువగా పచ్చళ్ళతో సరి పెట్టుకోవడం..నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం లేకపోవడం ఇలాటి కారణాలతో యెంత ఆకలిని చంపుకుంటూ వున్నాడో అర్ధం అవుతూ వుంటే..కన్నీళ్లు వచ్చేస్తాయి. 

మా అబ్బాయి వీడియో   చాట్ లో కనబడుతూ వుంటే  గంటల తరబడి మాట్లాడుతున్నా కూడా కాఫీ కూడా త్రాగలేను. "ఎందుకంటే కన్నబిడ్డ ఎదురుగా ఉండి బిడ్డకి  తాగడానికి తినడానికి ఇవ్వలేని అసహాయస్థితిలో.. గ్రుక్క మింగుడు పడదు. ముద్ద క్రిందికి దిగదు. మాట వరసకి కూడా ఏం తిన్నావ్ ? అని అడగకూడదు. వాళ్ళు చెప్పే మాటలు దుఖం తెప్పిస్తాయి. మా అబ్బాయి అయితే ఒకసారి నాలుగు రోజులైయింది అన్నం తిని అంటే..నేను యెంత ఏడ్చానో! 
మనవాళ్ళు ప్రక్కనే వున్నా పలకరించడం కూడా చేయని వారు అక్కడే ఉంటారు. మన వాళ్ళు కానివారు మనకి ఏమి కాని వారు మనకి ఎంతో సాయంగా ఉండే వాళ్ళు ఉంటారు. అది నా అనుభవం కూడా. ఆర్ధిక సంబంధాలు   తప్ప హార్దిక సంబందాలు లేని  రక్త సంబంధాలు  వెగటు పుడతాయి.


మా ఇంటికి దగ్గరలోనే వున్న మా అబ్బాయి రూమ్మేట్ కి చెయ్యి ప్రాక్చార్ అయితే  ఇంట్లో వాళ్లకి కూడా తెలియనివ్వలేదు. ఎందుకంటే ఇంట్లో తెలిస్తే చాలా బాధపడతారు అని. ఇంకొక  అబ్బాయి అయితే ( ఆస్ట్రేలియా లొ ఉంటాడు) మా  అబ్బాయికి  సీనియర్. ఫీజు కట్టలేదంటూ డబ్బు అడిగి తీసుకుని ..ఫోన్ నెంబర్ కూడా మార్చుసుకుని యెంత ఇబ్బంది పెడుతున్నాడో! 1600  డాలర్ లు చేట్టుకేం కాయలేదు కదా తెంపి ఇవ్వడానికి. విజయవాడలో ఉన్న అతని తల్లిదండ్రులకి ఆ విషయం  తెలుసో తెలియదో! కానీ మా అబ్బాయి మాత్రం చాలా  ఓపిక పడుతున్నాడు. సున్నిత మనస్కులకి,సహాయము చేసే  తత్వం వున్న వారికి చాలా కష్టాలు కూడా. అలాటి చోటనే ఇలాటి  అవకాశవాద ఫ్రెండ్స్ కూడా 


ఇలా పిల్లలు ఎలాటి ఇబ్బందులు ఎదుర్కుంటూ   పోరాటం .చేస్తుంటారో! ఇక్కడ ఉన్నవారికి డాలర్ తప్ప  ఏమి కనబడదు. మీకేమిటమ్మా! మీకు డాలర్లే డాలర్ లు అంటారు. అందని ద్రాక్ష పుల్లనో తీయనో..అందితే కదా తెలిసేది.  నేనేయితే ఎవరైయినా విదేశాలు అంటే .. ఆర్ధికంగా  ఒక రకంగా ఉన్నవారికి వెళ్ళడం వద్దనే చెపుతున్నాను. దిగితేనే కదా లోతు తెలిసేది.


మాకు పరిచయం ఉన్న ఒక పెద్దావిడ వాళ్ళ  అబ్బాయి ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి తినలేదని ఎంత బాధ  పడుతుందో! ఎవరైనా తెలిసినవారు వెళుతుంటే..ఆ పచ్చడి చేసి పంపాలని యెంత తాపత్రయ పడుతుందో, ఆ తల్లి ప్రేమను చూస్తే  నాకు యెంత అబ్బురంగా తోచిందో! అంతే కదా.. తల్లి మనసంటే!!  ఇప్పుడు మా అబ్బాయి కోపంగా నా వైపు చూస్తూ ఏమంటాడంటే.. అమ్మా! నీకు వ్రాసుకోవడానికి ఏమి లేక పొతే..నీ బ్లాగ్ మూసి పడేయి..ఇలా నా + నా ఫ్రెండ్స్ వంట పరువు తీయకు అని అంటున్నాడు. చూడండీ! :)

12, నవంబర్ 2011, శనివారం

స్నేహం



జీవితం  చాలా  చిన్నది   ఎవరో ఎక్కడో..ఏమిటో.. తెలియ కుండానే.. కలసి నాలుగడుగులు వేస్తె చాలు స్నేహం కుదిరే రోజులు. ఓ..గంట కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటే చాలు సన్నిహితులు అయిపోతుంటారు.కలసి ఓ..రోజు గడిచిందంటే పాత బడి పోతుంటారు.

రోజు కొత్తదనం ముంగిట్లోకి వచ్చి కొత్త ముగ్గు వేసి తెల్లవారేసరికి ఇంకో కొత్త ముగ్గు కోసం వేదికినట్లు.. స్నేహం మారిపోవాలి.. వీలయితే నిన్నటి స్నేహం మర్చి పోవాలి.

ఈ స్నేహాల పిచ్చి ముదిరిపోతుంది. "నా" అని చెప్పుకోవడానికి ఓ..నలుగురు  అయినా లేని వందలమంది స్నేహితులు ఉంటున్న రోజులివి. ఏదో ..ఒక నాడు..  మనమంటూ..మనని మనంగా ఏ బేషజాలు లేకుండా బహిర్గతం చేసుకునేది స్నేహితుల వద్ద మాత్రమే.. మనిషి కి,మనసుకి ఆశ్రయం లభిచేంది స్నేహితుని ఇల్లే నట. ఆటువంటి చోటు స్వర్గ ధామమని నానుడి.


ఇటీవల కాలంలో..నేను చూడగానే ..నాకు బాగా నచ్చిన  పోయెం  పిక్చర్ ఇది .. ఇలా మీ అందరితో పంచుకుంటూ ...   (ఈ చిత్రం కూల్ కేటగిరీస్.కాం నుండి సేకరించినది).

9, నవంబర్ 2011, బుధవారం

వారణాస్యం తు విశ్వేశం

నవరసాలలో భక్తి రసం అనుభవిస్తే కానీ అవగతం కాదు కదా! నోరారా ఆ భగవంతుని పిలుస్తున్నప్పుడు..ఆ ఆర్తికి సంగీతం జత కూడితే యెంత మధురంగా ఉంటుందో.. చూడండీ! 

అనంతానంద  భోదాంబు 
నిధిం, అనంత విక్రమమ్ 
అంబికా పతిం  ఈశానం 
అనిశం ప్రణమామ్యాహమ్ 

అని ధ్యానించుకుంటాం...    ఓం ..నమః శివాయ .. ఓం నమః శివాయ ఓం నమః శివాయ  ఓం నమః శివాయ ..ఓం నమః శివాయ ..ఓం నమః శివాయ నమః 
ఈ పాట చూడండి .. 

చిత్రం: Banaras - A Mystic Love Story లో ఒక పాట సాహిత్యం చాలా నచ్చుతుంది నాకు . ఇది చూడండి . 

సాహిత్యం: సమీర్


తూర్పు నుండి సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో..
ఆ కిరణాల వెలుగు సింధూరవర్ణ రంజితమైన మేఘములుగా దట్టంగా పరచుకుంటుంది.
గాలి గమనంలో మువ్వల రవళి వినిపించగా
నా నెమలి లాంటి హృదయం పాడుతుంది..
నా హృదయం పాడింది..
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

నిన్ను పూజించడానికి పళ్ళెరం నిండా పూల దండలు తెస్తాను.
గంగా జలాన్ని కలశంలో నింపి తెస్తాను
తొమ్మిది జ్యోతుల దీపాన్ని వెలిగిస్తాను
నిత్యం శివ చరణముల ముందు శిరస్సు వంచుతాను
తన్మయత్వంతో,భక్తి పారవశ్యంతో..
నా ఆణువణువూ పులకరిస్తుంది
నా హృదయం పాడింది
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

నశ్వరం కాని అభయమిచ్చే శంకరా ..
నేను నీ దర్శనాభిలాషిని
జన్మ జన్మల నుండి నీ పూజ చేయుటలో దప్పిక గొన్న దానిని
నా మీద కొంచెం దయ చూపు
నీ కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు
నా ప్రాణాలు కేవలం నీ కోసమే !
నా హృదయం పాడింది ..ఓం నమః శివాయ
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ  




                                                     పితా యధా రక్షతి పుత్రమీశ 
                                                     జగత్పితా త్వం  జగతః సహాయః 
                                                     కృతాపరాధం తవ సర్వ కార్యే 
                                                     కృపానిధే మాం శివపాహి శంభో 

                                                     పితా యధా రక్షతి పుత్రమీశ 
                                                     జగత్పితా త్వం  జగతః సహాయః 
                                                     కృతాపరాధం తవ సర్వ కార్యే 
                                                     కృపానిధే మాం శివపాహి శంభో 



8, నవంబర్ 2011, మంగళవారం

ఆడపిల్లలవి భద్రత లేని బతుకులు

ఈ రోజు ఒక సంఘటన జరిగింది. మా వర్క్ షాప్ లో పని నేర్చుకునే లక్ష్మి ఒక విషయం చెప్పగానే భయం వేసింది .ఏమిటీ ఈ పరిస్తితి?  ఆడపిల్లల కి ఏ మాత్రం భద్రతా లేదనిపించింది. అసలు విషయం ఏమిటంటే ..

కొంత నా సోది అనుకోండి.. ఇది చెప్పడం ఇప్పుడు అవసరమా అని విసుక్కోకండి. ప్లీజ్!


మా వర్క్ షాప్ లో వర్క్ నేర్చుకుని మళ్ళీ వాళ్ళే మాకు వర్కర్స్  గా మారుతుంటారు. నేను అయితే వర్క్ నేర్పేందుకు ఏమి తీసుకొను. వర్క్ నేర్చుకునే వాళ్ళందరూ ఆసక్తి కన్నా ఎక్కువ అవసరం మేరకే ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకోవడానికి వస్తారు కాబట్టి వారికి ఒక పని ఆసరా కల్గించడమే .. ఒక సేవ అనుకుని నేను ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలకే పని నేర్పి..మళ్ళీ వాళ్ళనే పనిలోకి తీసుకుని ఫినిషింగ్   వర్క్  వచ్చేవరకు మొట్టికాయలు వేసి మరీ నేర్పుతుంటాను. పని నేర్చుకోవడం దగ్గర,చేసే దగ్గర నేను యెంత క్రమశిక్షణ గా   ఉంటానో.. వాళ్ళ ఇబ్బందులు కుటుంబ సమస్యలు వినడం వాళ్ళకి మంచి మాటలు చెప్పడం,సరదాగా ఉండటం వల్ల పిల్లలకి   నా దగ్గర చనువు బాగానే ఉంటుంది. కొంత మంది పెళ్లి చేసుకుని వెల్లిపోయేటప్పుడు వాళ్ళ సొంత ఇంటిని వదిలే టప్పటి కన్నా     ఇక్కడ వదిలి వెళ్ళడమే భాదగా ఉందని కళ్ళ నీళ్ళతో చెపుతుంటే ..వాళ్ళతో పాటు నేను కన్నీళ్లు పెట్టుకుంటాను. అలా మా ఇంటితో మమేకం అయ్యే పిల్లల భాద్యత నా భాద్యతగా భావించి  పిల్లలు ఉదయం పూట వర్క్ కి  వచ్చేటప్పుడు  వాళ్ళు ఇంటికి పంపేటప్పుడుజాగ్రత్త తీసుకుంటూనే ఉంటాను.

మా వూరిలో బందర్ రోడ్డుని ఆనుకునే ఇప్పుడు రెండు మూడు బార్లు .. కల్లు  పాకలు దగ్గర మందు బాబులు తిష్ట వేసి ఆడవాళ్ళు నడచి వెళ్లేందుకు భయపడే అంతగా అభివృద్ధి చెందింది.పోనీ బస్ ఎక్కి ప్రయాణించుదాం   అంటే  అరకిలోమీటర్ కూడా లేని దూరానికి నాలుగు రూపాయలు చార్జీ. రాను పోను కలుపుకుని ఎనిమిది రూపాయలు ..పాపం వాళ్ళ  పరిస్థితికి  అది ఎక్కువే కూడా.. 

పోనీ సర్వీస్ ఆటో ఎక్కి ప్రయాణించడం అంటే అదీ భయం గా మారింది...ఇలాటి ఇబ్బందికర వాతావరణంలో.. ఆడపిల్లన్దరిని ఆరు గంటలికి అంతా ఇంటికి పంపించి వేస్తాను.

ఈ రోజు జరిగిన సంఘటన ఏమిటంటే ,, లక్ష్మి అనే అమ్మాయి ఇల్లు దగ్గరే కాబట్టి ..లంచ్ కి ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయిని ఎప్పుడు నుండి వాచ్   చేస్తున్నారో తెలియదు కానీ.. ఆ అమ్మాయి లంచ్ చేసి తిరిగి వచ్చేటప్పుడుఅది పెద్దగా జన సంచారం లేని ప్రాంతం కాబట్టి ఆటోలో  ఆమె వెనుకనే ..వెంబడించుతూ  ..వచ్చారట. ఆమెని దాటి ఎదురుగా ఆటో .నిలబెట్టి..మొబైల్ ఫోన్ లోని కెమెరా   ఉపయోగించి  ఫోటో..తీయడం ..అది  ఆ అమ్మాయికి అర్ధమై తేరుకునే లోపు గా మళ్ళి ఆ అమ్మాయిని క్రాస్ చేసి ఆగి మరొక సారి ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంట్లోకి రాగానే ఆ అమ్మాయి నాకు చెప్పడం నేను వెంటనే బయటికి వెళ్ళగానే వాళ్ళు ఆటోలో.. స్పీడ్గా వెళ్ళిపోవడం చేసారు. కనీసం ఆటో నంబర్ కూడా చూడలేదు.

టెక్నాలజీ పుణ్యమా అని వ్యక్తులకి ప్రైవసీ లేకుండా పోతుంది. ఎవడో ఒకడు .. ఇలా అమ్మాయిలని ఫోటోలు తీసి వాటిని దుర్వినియాగం చేయడం చేస్తున్నారని వింటూ ఉన్నాం. అలాగే షాపింగ్ కి వెళ్ళినప్పుడు.. ట్రయల్ రూమ్లో..రహస్య కెమరా ఏర్పాటు చేసి ..తరువాత బ్లాకు మెయిల్ చేయడం గురించి వింటూ ఉన్నాం.

ఇక అమ్మయిలు నెట్ సెంటర్ లకి వెళ్ళడం అంత మంచిది కాదని నా అభిప్రాయం.అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పనిచేసే చోట కూడా  ఆడపిల్లకి చాలా ఇబ్బందులు ఉంటాయని పదేళ్ళ నా అనుభవం లో తెలుసుకున్నాను. అలా అనుచిత ప్రవర్తన నాకు కనబడితే..నిర్ధాక్షిణ్యం గా  పనిలో నుండి తీసి వేసాను.

కేరళ నుండి వచ్చిన  సరస్వతి అనే ఆవిడ మాకు వర్క్ చేసేవారు .ఆవిడ భర్త మరణించారు. ఇద్దరు పిల్లలు. పాపం ఇంత దూరం పని కోసమే వచ్చారు. చాలా స్పీడ్ గా, నీట్ గా ఒకరి పని ని రెట్టింపుగా  పని చేసేది. ఆమెని అలాగే తోటి పురుష వర్కర్లే ఇబ్బంది పెట్టడం గమనించి.. తనకి వేరే షెల్టర్ కల్పించి.. ఆ పురుషులందరినీ పనిలో నుంచి తీసి వేసాను.అయినా ఆమెని ఫోనులో వేదిస్తుంటే ఆ నెంబర్ మార్చేసి.. స్థిమితంగా ఉందామనుకున్నా కుదరలేదు. ఆఖరికి ఆమె తన వూరు వెళ్ళిపోయారు
.
ఇంటి గడప దాటితే చాలు ..ఆడది అయితే చాలు  వేధింపులు మామూలు అయిపోయాయి. ఈవ్ టీజింగ్..అంటూ యువతులనే టీజ్ చేస్తారు   అనుకోవడం తప్పు.వయసు తో నిమిత్తం లేదు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిన్చడంని సి .సి.  కెమెరా లని ఏర్పాటుచేసి జరిమానా తాకీదులని వాహన స్వంత దారునికి  పంపినట్లు బస్సు స్టాప్ ల దగ్గర ..సి.సి.కేమేరాలని ఏర్పాటు చేసి ఈవ్ టీజర్స్ నుండి అమ్మాయిలకి,.మహిళలకి రక్షణ ఇస్తే బాగుండును అనుకుంటాను నేను. ముఖ పరిచయం లేని వ్యక్తులు కూడా చొరవ చేసి మాట్లాడి ఫోన్ నెంబర్ లు అడగటడం పరిపాటి అయిపొయింది. యెక్కడని కాపాడుకోగలం చెప్పండి.  నాకైతే అమ్మాయిలని కాపాడుకోవడం చాలా క్లిష్టతరం అనిపిస్తుంది.

               

7, నవంబర్ 2011, సోమవారం

మూగబోయిన ‘ భూపేన్ ’ రాగం

భూపేన్ హజారిక ఆలపించిన   గీతాలు 
నేను ఎంతగానో ఇష్టపడే ఓ..సంగీత దిగ్గజం. వారి మరణం చాలా బాధ కల్గించింది. వారి పాటలు ఒక నాలుగు పరిచయం తో పాటు మరింత వివరంగా ఇక్కడ లింక్ లో.
మూగబోయిన ‘ భూపేన్ ’ రాగం
సంగీత దిగ్గజం భూపేన్ హజారికా కన్నుమూత
ముంబై: అపురూప స్వరఝరి ఆగిపోయింది. స్వాతిముత్యపు మెరుపులాంటి సాహిత్య పుష్పం నేలరాలింది. అస్సాం అడవుల నుంచి మహానగరాల దాకా సాగి, కోట్లాది గుండెల్లో పులకరింతలు రేపిన శ్రుతిలయల బాటసారి ప్రస్థానం ముగిసింది. సంగీత, సాహిత్య దిగ్గజం భూపేన్ హజారికా జీవనగానం అస్తమించింది. ఆయన శనివారమిక్కడి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. నాలుగు నెలలకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ల హజారికా సాయంత్రం 4.30 ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. నిమోనియా కారణంగా పలు అవయవాలు పనిచేయకపోవడంతో ఆయన చనిపోయారని ఆస్పత్రి ప్రతినిధి జయంత నారాయణ్ సాహా చెప్పారు. నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని, వెంటిలేటర్, డయాలసిస్‌పై ఉన్నారని ఆస్పత్రి సీఈవో డాక్టర్ రామ్ నారాయణ్ చెప్పారు. హజారికా అంతిమ క్షణాల్లో ఆయన జీవిత సహచరి, దర్శకురాలు కల్పనా లాజ్మీ ఆయన పక్కనే ఉన్నారు. హజారికా శ్వాస సమస్యతో జూన్ నెలాఖర్లో ఈ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే ఐసీయూ గదిలో ఉన్నారు. డయాసిస్ చికిత్స పొందారు. గత నెల 23న ఆరోగ్యం బాగా క్షీణించి, నిమోనియా సోకింది. చిన్న శస్త్రచికిత్స కూడా జరిగింది. సెప్టెంబర్ 8న ఆయన ఆస్పత్రిలోనే అభిమానుల గీతాలాపన మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు జరుపుకున్నారు. హజారికా కెన్యాలో జన్మించిన భారత జాతీయురాలు ప్రియమ్‌ను పెళ్లాడారు. వారి సంసారం కొన్నేళ్లే సాగింది. వారికి తేజ్ హజారికా అనే కుమారుడు జన్మించాడు. తర్వాత హజారికా కళాత్మక చిత్రాల దర్శకురాలు కల్పనా లాజ్మీకి దగ్గరయ్యారు. మరణించేదాకా ఆమెతోనే ఉన్నారు. వారిది మూడు దశాబ్దాల అనుబంధం.
స్వరలోక సంచారి..: బహుముఖ ప్రజ్ఞశాలికి అచ్చమైన ఉదాహరణ హజారికా. ఆయన గాయకుడు, సంగీతకారుడు, కవి, పాత్రికేయుడు, నటుడు, రచయిత, సినీనిర్మాత. ‘దిల్ హూమ్ హూమ్ కరే..’, ‘ఓ గంగా బెహతీ హో..’ లాంటి మరపురాని గీతాలు ఆలపించిన ఆయన సాహిత్య, సినీ రంగాల్లో కూడా తనదైన ముద్ర చూపారు. మంద్ర, ఉచ్ఛ స్వరాల మధ్యన ఉండే విలక్షణ స్వరంతో సాగే ఆయన గానం గురించి చెప్పాలంటే పదాలు చాలవు. ఆయన సుసంపన్న అస్సామీ సంప్రదాయ, గిరిజన సంగీతాల నుంచి అద్భుతం, అపురూపమైన స్వరజగతిని సృష్టించి శ్రోతల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. దక్షిణాసియా కళారంగానికి ఆయన విశిష్ట ప్రతినిధి, అస్సామీ రచయితల్లో ప్రముఖుడు. ఆ భాషలో వెయ్యికిపైగా గీతాలు రాశారు. కథలు, వ్యాసాలు, యాత్రారచనలు, కవితలు, పిల్లల పాటలు కూడా రచించారు. పిల్లాపెద్దలు ఆయన్ను ఆప్యాయంగా ‘భూపేంద్ర’ అని పిలుచుకుంటారు. అస్సాంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి గుర్తుగా ఆయనను ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’ అని అంటారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా ఆయన వీరాభిమాని. ఓ సభలో హజారికాతో తనకిష్టమైన పాట ‘మోయ్ ఎతి జజాబోర్’ను పాడించుకున్నారు.
గిరి‘జానపదమే’ ప్రేరణ.. 

హజారికా తనను తాను సంచారి(జజాబోర్)గా అభివర్ణించుకునేవారు. ఆ సంచారమే ఆయనను కళావేత్తగా తీర్చిదిద్దింది. గిరిజన జానపద సంగీతం తనకు ప్రేరణ అని ఆయన చెప్పేవారు. ‘గిరిజన సంగీతం వింటూ పెరిగా. నాకు గానకళా వారసత్వం మా అమ్మనుంచి వచ్చింది. ఆమె నన్ను నిద్రపుచ్చడానికి జోలపాటలు పాడేది. అందులో ఓ పాటను ‘రుదాలి’ చిత్రంలో వాడుకున్నా’ అని తెలిపారు. ఆయన అమెరికాలో చదువుకుంటున్నప్పుడు ప్రఖ్యాత నల్లజాతి గాయకుడు పాల్ రాబ్సన్‌తో పరిచయమేర్పడింది. రాబ్సన్ పాట ‘ఓల్డ్ మేన్ రివర్’ స్ఫూర్తితో హజారికా ‘బిస్త్రినో పరోరే’(హిందీలో ఓ గంగా బెహతీ హో) గీతాన్ని స్వరపరిచారు. ఇది వామపక్షాల కార్యకర్తలకు దాదాపు జాతీయగీతమైంది. విద్యాభ్యాసం తర్వాత హజారికా ఇండియన్ పీపుల్స్ థియేటర్ మూవ్‌మెంట్(ఇప్టా)లో పనిచేయడానికి ముంబై చేరుకున్నారు. సలీల్ చౌధురీ, బలరాజ్ సాహ్నీ ఇతర మార్క్సిస్టు మేధావులతో కలిసి పనిచేశారు. ఆ నగరంతో మమేకమయ్యారు. 

సినిమాల్లో..:హజారికా అస్సామీ, బెంగాలీ, హిందీ సినిమాలకు వందలాది పాటలు రాసి, స్వరకల్పన చేశారు. శకుంతల,ప్రతిధ్వని తదితర అస్సామీ చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. వాటికి సంగీతమూ అందించారు. పాటలూ పాడారు. కల్పనా లాజ్మీతో కలిసి రూపొందించిన రుదాలి, ఏక్‌పల్, దార్మియాన్, దామన్, క్యోన్ వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చాయి. 
తీరని లోటు:హజారికా మృతిపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కళారంగానికి చేసిన సేవలు మరపురానివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. మృణాల్‌సేన్, మహేశ్‌భట్ తదితర సినీ ప్రముఖులు హజారికాతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 
దుఃఖసంద్రంలో కల్పనా లాజ్మీ..
హజారికా అస్తమయంతో ఆయన జీవిత సహచరి కల్పనా లాజ్మీ విషాదంలో మునిగిపోయారు. కన్నీళ్ల పర్యంతమవుతూ ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘నా తండ్రిని, సోదరుడిని, ప్రేమికుడిని, భర్తను, స్నేహితుడిని కోల్పాయా.. ఆయన కళాకారుడే కాదు సంఘ సంస్కర్త కూడా’ అని చెప్పారు. 
జీవిత విశేషాలు..
జననం: అస్సాంలోని సాదియాలో 1926 సెప్టెంబర్ 8. ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించారు. 
విద్యాభ్యాసం: 1942లో గువాహటిలో ఇంటర్మీడియెట్, 1944లో బెనారస్ హిందూ వర్సిటీ నుంచి బీఏ, 1946లో పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ. తర్వాత కొలంబియా వర్సిటీలో మాస్‌కమ్యూనికేషన్స్‌లో పీహెచ్‌డీ. 
తొలిపాట: 12 ఏళ్లప్పుడు అస్సామీ చిత్రం ఇంద్రమాలతి(1939)లో
చివరి పాట: ఈ ఏడాది విడుదలైన ‘గాంధీ టు హిట్లర్’ సినిమాలో ‘వైష్ణవ జన్..’
అవార్డులు, పదవులు: జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడు(1976లో.. చమేలీ మేమ్‌సాబ్ చిత్రానికి), అంతకుముందు కొన్ని చిత్రాలకు రాష్ట్రపతి పతకాలు. 1977లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 1992లో దాదా ఫాల్కే అవార్డులు.1967-72 మధ్య ఎమ్మెల్యే(అస్సాం)గా.1999-2004 మధ్య సంగీత నాటక అకాడమీ చైర్మన్.
అరుదైన ‘ఆవిష్కరణ’: జీవించి ఉండగా తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్నారు. అఖిల అస్సాం విద్యార్థి సంఘం గువాహటిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆయన 2009లో ఆవిష్కరించారు.
"సాక్షి"వార్తా  పత్రిక  లో  ప్రచురించిన  భాగం  ఇది

ఎల్లలెరుగని మానవత్వం


మనిషి లోని మానవత్వం  మృ గ్యమవుతున్నది అని మనం కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు అనిపించక తప్పదు. ఇటీ వల కాలంలో.. నడుస్తున్న రైళ్ళలో కేవలం ఆడపిల్లలని అది పసి కందులని  నిర్దాక్షిన్యంగా వదిలి వెళ్లిన వార్తలని చూసాము. ఏ చీకటి తప్పులకో బలవంతంగా మోసి ఆనక  ఆ చీకట్లోనే మురుగు కాలువలు,చెత్తకుండీల పాల్జేసిన  తల్లులని చూస్తున్నాము.తల్లి తనం అనేది అపహాస్యం అవుతున్న తరుణంలో.. అమ్మతనానికి అర్ధం చెపుతున్న అనేక మాతృ మూర్తులని చూస్తున్నాం. అలాగే మథర్ బాటలో నడిచే ఒక స్త్రీ మూర్తి ని ఇక్కడ చూడండి. స్పూర్తివంతంగా ఉంది.వారు మనకి స్వయంగా తెలియకపోవచ్చు. కానీ వారి బాట స్పూర్తికరం కదా.. అందుకే ఈ విషయం అందరితో..పంచుకుంటూ..   



4, నవంబర్ 2011, శుక్రవారం

"చిత్రలేఖ" నవల పై సమీక్ష

వివాహిత స్త్రీలలో భర్త మరణం తర్వాత  లేదా వివిధ కారణాల వల్ల మరొక పురుషుడి పై ప్రేమ చిగురిస్తుందా!? 


మానవ స్వభావానికి అతీతంగా.. ఏ కథ కానీ నవల కానీ రచించలేదన్నది సత్యం.
స్వభావ చిత్రణలో..కొంత స్వేచ్చ ఉండవచ్చునేమో కానీ..పూర్తి కల్పితం గా చేసే రచనలు ఉండవేమో ! తప్పొప్పులు  ఎంచకుండా.. రచయిత చెప్పిన పాత్ర స్వభావాన్ని పాఠకుడిగా కాకుండా.. సమకాలీన వ్యక్తిగా ఆ పాత్రల వెంట నడుస్తూ.. పాత్రలని అర్ధం చేసుకుంటూ..ఆ రచనని చదవడం వల్ల సమాజాన్ని  దార్శనీయకత తో చూసి ఒక అభిప్రాయానికి  రాగల్గుతామన్నది నా అభిప్రాయం. 
అందుకే ..ఈ చంద్రలేఖ నవల నాకు నచ్చింది. 

పదే పదే ప్రేమించడం,ప్రేమించబడటాన్ని  నైతిక విలువుల దృష్టిలో.. చాలా పెద్ద తప్పిదంగా గోచరించవచ్చు. బలహీనత,ఆకర్షణ అనేవాటిని మనిషి, మనసు గనుక నియంత్రణ చేయగల్గితే.. ఇలాటి రచనలు అవసరం లేదు కూడా..

ఇదే బ్లాగ్ లో నేను పోస్ట్ చేసిన మరో రాజేశ్వరి చచ్చిపోయింది.. పై.. చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ తరుణం లోనే .. నేను "చినుకు "మాస పత్రికలో.. ఈ వ్యాసం చూసాను. అనేక ముద్రణ లతో.. సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసిన ఈ నవలలో ఏం ఉందో ..తెలుసుకోవడం  కోసమైనా ఈ "చిత్ర లేఖ" అనువాద నవల చదవాలని అనుకుంటూ.. నాకు నచ్చిన ఈ సమీక్ష . ..

చిత్రలేఖ నవల పై సమీక్ష ..శ్రీమతి వాడ్రేవు వీర లక్ష్మి దేవి







ఈ వ్యాసం ని చినుకు మాస పత్రిక 2011 సంచిక లో .. చూడండి.

3, నవంబర్ 2011, గురువారం

అందమైన అబద్దం అందరికి నచ్చుతుంది

అందమైన అబద్దం చాలా బాగుంటుంది. నిజ జీవితంలో అయితే ఏమిటి ..తెర పై ఏమిటీ..అబద్డంకి బోల్తా పడటం పెద్ద కష్టమేమి కాదు.

నేను ఒక పాట వింటూ.. ఆ పాట సాహిత్యాన్ని,సంగీతాన్ని ఆస్వాదిస్తూనే ..అబద్దం అంతా అబద్దం అనుకుంటూ ఉంటాను.

ఈ పాటలో.. ఆమెను అతడు .."రాధా! గుడిలో దేవుడిని ఏమి కోరుకున్నావ్? అని అడుగుతాడు.. అప్పుడు ఆమె చెప్పే సమాదానం .. అందరికి నచ్చుతుంది

ఈ .. పాట నీ కౌగిలిలో తలదాచి ... నీ చేతులలో కనుమూసి.. జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ.. (నీ కౌగిలిలో) చల్లగా కాసే పాల వెన్నెల నా మనసేదో వివరించు అల్లరి చేసే ఓ..చిరు గాలి నా కోరికనే వినిపించూ నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగా వెలిగించు (నీ కౌగిలిలో ) అందుకు అతడి సమాధానం అంతా అబద్దం.. ఎందుకంటె హీరో గారు అప్పటికే వివాహితుడు ..ఓ..బిడ్డ తండ్రి కూడా.. అయినా కూడా ఏమంటున్నాడో చూడండీ ! నింగి సాక్షి నేల సాక్షి నిను వలచిన నా మనసే సాక్షి మనసులోన మనుగడలోన నాలో నీవే సగ పాలు వేడుకలోను వేదనలోను పాలు తేనెగా ఉందాం ... (నీ కౌగిలో) .. సరే ఇన్ని అబద్దాలు చెప్పి .. నా .. ఆ సినిమాని అభిమానించి ఆదరించి దిగ్విజయం చేసిన ప్రేక్షకులకి జోహార్లు అనుకుంటాను. "కార్తీక దీపం " చిత్రం ని నాకొక పదకొండు ఏళ్ళు అనుకుంటాను అప్పుడు అమ్మతో కలసి చూసి ..ఛీ నాకు ఈ సినిమా ఏం నచ్చలేదు అన్నాను అనుకుంటాను. ఆడవాళ్ళ త్యాగాలు,సర్దుబాట్లు నిజ జీవితంలో కూడా తక్కువేం కాదు కదా.. అన్న అనుభవం వచ్చాక ఆ చిత్రం అసలు నచ్చదు. ఆ అందమైన అబద్దం కి "మైలవరపు గోపి "గారి సాహిత్యం యెంత అందంగా ఉంటుందో! భార్య భర్తల అనుబంధం అలా ఉండాలి కదా! అని అనిపిస్తుంది.

 
ఇక జానకమ్మ ,,ఆ పాట రికార్డింగ్ సమయంలో .. ఆమె భర్త గారు ప్రాణాపాయ స్థితిలో ఇంటెన్సివ్ కేర్ లో పడి ఉంటే..ఈ పాట రికార్డింగ్ కి హాజరయ్యి పాట పాడాల్సి రావడం .. ఆ సమయంలో ఆమె మానసిక స్థితి ..ఆ పాటకి జీవం పోశాయి..అని జానకమ్మ స్వయంగా చాలా సార్లు చెప్పుకున్నారు.
కొన్ని పాటలు కొన్నిసమయాలలో..జీవితాలకి అన్వయిన్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అన్నట్లు. ఇక ఈపాటలో బాలు గారి గళం ..అంటే నేను ఒప్పుకోను.శోభన్ బాబు స్వయంగా పాడినట్లు ఉంటుంది.అంతగా శోభన్ వాయిస్ ని ఒదిగింప జేసిన బాలు ఎవెర్ గ్రేట్.
పాటని చూడండీ!

ఇది నాకు నచ్చిన పాట..నచ్చని అంశం కూడా..

2, నవంబర్ 2011, బుధవారం

ఓ..వచన కావ్యం స్త్రీ.. .

ప్రపంచంలో శ్రామిక వర్గం కన్నా  అతిదారుణంగా దోచుకోబడుతుంది స్త్రీ
                                                                                                  _లెనిన్  


"కన్నీటిలో   తడిసిన కరుణ కావ్యం స్త్రీ .జీవన రంగులన్నిటిలోను గుండె ముంచి గీసిన సన్నిహిత చిత్రం స్త్రీ.
బాలిక నుండి భార్య వరకు నడచిన జీవన గాధ స్త్రీ. ఈ సృష్టిలో ఆమె స్వేచ్చగా బ్రతికింది తల్లి కడుపులో మాత్రమే.." అని వ్రాసిన చరమ పంక్తి ఈ కావ్యం కార్చే చివరిభాష్పం..అంటూ .. ఓ..వచన కావ్యం స్త్రీ.. .
 ఆ వచన కావ్యం లో..కొంత భాగం ఇది.

స్త్రీని .. పౌరాణిక యుగం నుండి 
నేటి సాహిత్య,సినీ ప్రపంచం వరకు 
ఆదిశక్తి, పరాశక్తి ,పవిత్ర మూర్తి 
పతివ్రత,జగన్మాత,అగ్ని పునీత అంటూనే..
పురుష ప్రపంచపు కంటి రెటీనాకు
భాగ వస్తువుగా,విలాస వస్తువుగా 
వివస్త్రను చేసి చిత్రిస్తూ
మత్తెక్కిన కళ్ళ నిషాలో నంజుకు తింటూనే ఉన్నారు 
ఆమె నాజూకు తనాన్ని నలిపెస్తూనే ఉన్నారు..
ఆమె తుళ్ళినా,కుళ్ళినా,సోమ్మసిల్లినా
ఆమె సొగసుని,వయసుని 
పిండుకుని తాగుతూనే ఉన్నారు.
ఆమెకు ..
అందాలన్నీ ఉండాలి ..హక్కులు తప్ప
సొగసులన్నీ ఉండాలి.స్వేచ్చ తప్ప
తిట్టినా,కొట్టినా,దుమ్మెత్తి పోసినా 
నోరెత్తి మాట్లాడకూడదు 
బానిసత్వం-నీరసత్వం
ఆమె వారసత్వగా..అనుభవించాలి...
అంటూ.. వ్రాసిన  వచన కావ్యం..ఏ స్త్రీ ..వ్రాసినదో..అయితే.. స్త్రీ వాద కవిత్వం అంటారు .
పురుష ప్రపంచాన్ని అన్యాయంగా ఆది పోసుకుంటున్నారు అనగలరు  అనిపించింది. 
ఎందుకంటె ఆడవారి ఆక్రోశాన్ని తిట్టు కవిత్వంగా.. వర్గీకరించిన వారు ఉన్నారు కదా!
  నేడు ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ధన దాహంలో..
విదేశి నాగరికత మత్తుమందులకు బలైపోతూ .. ఈ దేశం నుండి 
ఎగుమతి కాబడుతున్న 
రబ్బరు,కాఫీ ,తేయాకుల మద్య 
భోగ వస్తువుగా-రహస్యంగా 
ఈ కుష్టు వ్యవస్థలో 
అనేక కోణాల మద్య
ఇంత దారుణంగా ,నగ్నం గా నీచంగా 
వంచింపబడుతున్నా
ఆమెకు ఈ అరాచకాలు,బలాత్కారాలు
చాలవన్నట్లు 
విదేశాలకు అమ్ముడుపోతుంది అక్కడ జీవితాంతం 
ఖైదీగా,బానిసగా 
ఖుషీ అందించే మెషీనుగా
ఈమె మార్చ బడుతుంది...
ఇలా దీర్ఘంగా సాగిన వచన కావ్యం తెలుగు విశ్వ విద్యాలయం వారి సహకారంతో.ప్రచురించి.. ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది.ఇప్పటికి మూడు ముద్రణలు వచ్చాయి. 
ఈ వచన కావ్యం రచయిత.."కొల్లూరి" 
ప్రతులకు..ఎక్సరే సాహితీ సంస్థ .. అరండల్ పేట,విజయవాడ-2.
  

1, నవంబర్ 2011, మంగళవారం

గీత రచయిత్రి జ్యోతిర్మయి అంటే విద్వాన్ విశ్వం గారు


మన తెలుగు సినీ సాహిత్యకారులలో అందరూ పురుషులే కనబడతారు కాదు పురుషులే రాజ్యం ఏలుతున్నారు. 
నేను గమనించిన ఒక సినీ గేయ రచయిత్రి ఉన్నారు. ఆమె శ్రీమతి జ్యోతిర్మయి. 
ఆమె రచించిన లేత చలి గాలులు అన్న పాట..యెంత రొమాంటిక్ గా ఉంటుందో!ఆమె గురించిన వివరాలు అంతగా తెలియవు కానీ పాట సాహిత్యం మాత్రం లభ్యం . ఇక్కడ చూడండి.
 చిత్రం:మూడు ముళ్ళు 
గానం: ఎస్.పి.బాలు,పి.సుశీల
సంగీతం:రాజన్-నాగేంద్ర
గీత రచన:శ్రీమతి.జ్యోతిర్మయి

లేత చలిగాలులూ..హొయ్ .దోచుకోరాదురా.
చలివెలుగు వెన్నెలలూ నిను తాకగా తగవురా 
లేత చలిగాలులూ ..హొయ్ దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగా లేవులే (లేత)

అందాల నా కురులతో వింజామరలు వీచనా (అందాల)
రాగం,భావం,స్నేహం,మొహం నిన్నే వేడనా
నీ కురుల వీవేనలకు నా హృదయమర్పించనా 
రూపం,దీపం,శిల్పం,నాట్యం నీలో చూడనా 
కనుల భాష్పాలు ఆహా ..కలల భాష్యాలు లా..లా..ఓహో ..ఓ ..
వలపులా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా (లేత)

ఆధారాల కావ్యాలకూ ఆవేశ మందించనా
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా 
మందార ముకులాళతో పాదాలు పూజించనా (మందార )
అలనై,కలనై,విరినై,ఝురినై నిన్నే కోరనా 
హృదయ నాదాల..ఆహా ..మధుర భావాల..ఆహా హ ల ల లా 
చిగురు స్వరసాల నవ వసంతాల విరులెన్నో అందించగా (లేత) 


 పాట  కూడా చూసి లీనమయి పోయారు కదా!
ఇలాటి పాటలు ఏమిటి అవకాశం ఇస్తే చాలా సందర్భాలకి తగినట్లు గీత రచనలు చేయ గల రచయితలు ఉన్నారు. అలా స్త్రీలకి అవకాశం రావాలని కోరుకుందాం.  గీత రచయిత్రి  జ్యోతిర్మయి  ..మన బ్లాగర్ జ్యోతిర్మయి గారే నని నాకనిపిస్తుంది. (శర్కరి..బ్లాగ్ )   వేచి చూద్దాం ..  ఎవరైనా జ్యోతిర్మయి గారి వివరాలు అందిస్తారేమో..!

ఈ పోస్ట్ కి వచ్చిన వ్యాఖ్యలలో వొకరు వివరాలు అందించారు. విద్వాన్ విశ్వం గారు  జ్యోతిర్మయి అనే కలం పేరుతో సినిమా పాటలు వ్రాసారని చెప్పారు. 
ఈ పాటకు సాహిత్యం విద్వాన్ విశ్వం గారు అని చెప్పుకుందాం.