ఒకప్పుడు మసక మసక చీకట్లో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో.. మనసైనది దొరుకుతుంది ..దొరుకుతుంది..ఆ పాటలో ఒక అర్ధం ఉంది..వింటుంటే ఉత్సాహంగా ఉండేది .
అలాగే చిత్ర కథలో భాగంగా జానపదగీత శైలిలో ఒక పాట ఉంటే అది ఎంతగా అలరించేదో చెప్పనవసరం లేదు. "ఆకులు పోకలు ఇవ్వద్దు..నా నోరు ఎర్రగ చేయొద్దు.. ఆశలు నాలో నాలో రేపొద్దు " పాట కానివ్వండి... "మావా..మావా.. ఏమే ఏమే భామా.. పట్టు కుంటే కందిపోవు.." అనే పాట ..ఇలా ఆ తరహా పాటల హవా చెల్లిపోయి.. క్లబ్ డాన్సు పాటలు..అవీ మొహం మొత్తి.. హీరోయినే క్లబ్ డాన్సర్ లాగా మూరెడు ముక్కలు చుట్టుకుని వాళ్ళ స్థానాన్ని ఆక్రమించుకుని.. నీ కావాల్సింది..నా దగ్గర ఉంది,ఆకుందా వక్కిస్తా..సున్నంతో పోక్కిస్తా.. తరహా పాటలు రాజ్యం యేలి.. అయిదా రేళ్ళు బాగానే మురిపించాయి. తర్వాత దాదాపు పదేళ్లుగా ఐటం సాంగ్స్.
ఐటం సాంగ్ అంటే ..అమ్మో.. అశ్లీల సాహిత్యం .. వినడానికే భయం వేస్తుంటే.. ఎఫ్ ఎమ్ ల పుణ్యమా అని.. ,చిన్ని తెర మీద వెగటు వేసే డాన్సు ప్రోగ్రాం ల పుణ్యమా అని ఊదరగొట్టిన పాటలు విన్న మూడేళ్ళ పిల్ల కూడా ఐటం సాంగ్ నేర్చుకుని పాడుతుంటే.. అర్ధం తెలిసిన పెద్ద వాళ్ళు పరుగులెత్తి ఆ పిల్లల నోర్లు మూయాల్సిన పరిస్థితి.
అసలు ఐటం సాంగ్స్ లో నటించే పేరొందిన తారలకి అసలు సిగ్గే లేదు. కాసుల కోసం రెండు కర్చీఫ్ ల్లాంటి పొదుపైన బట్టలతో.. వళ్ళు ఆరేసుకుంటుంటే.. మనం సినిమా చూడటం లేదుగా.. మనపిల్లలని చూడనీయకుండా కాస్త జాగ్రత్త పడాలి అనుకున్నా..కుదిరి చావదు. ట్రైల్స్ లో ముందుగా చూపేది ఆ ఐటం సాంగ్ లే ..కదా! ఆ పాటలకి సాహిత్యం అందించే రచయితలకి అవకాశం దొరకడమే తరువాయి..దర్శక,నిర్మాత,నటున్ని మెప్పించే రీతిలో..అశ్లీల సాహిత్యం ని ఒలికిన్చేయడమే!
నేను గత నాలుగు మూడేళ్లగా గమనించింది ఏమిటంటే.. పూరి జగన్నాథ్ ప్రతి చిత్రంలోనూ.. ఒక ఐటం సాంగ్ అశ్లీల సాహిత్యం తో గుప్పించి జనాల మీదకు వదలడం అలవాటు అయిపొయింది.
ఆ పాటలు వింటూ తిట్టుకోవడం లేకపోతే..వినకుండా కట్టి పడేసుకోవడం... ఇది ఎలాగు నాలాంటి వినలేని వాళ్ళు చేసే పని. కానీ ..సినిమాలని చూసి..అందులోని ద్వందార్ధ మాటలు, వెగటైన హాస్యం, అశ్లీల దృశ్యాలు మాటేమిటీ!?
ఇప్పుడు వచ్చిన "బిజినెస్ మెన్" లో ఈ పాట చూడండీ!
గీత రచన : భాస్కర భట్ల
ఆయనకీ అవకాశం దొరికింది కదా అనుకుని.. ఈ తరం అమ్మాయిల ఆలోచన క్యాచ్ చేసాను అనుకుని.. ఈ పాట వ్రాసి.. పూరి జగన్నాథ్ ని మెప్పించి ఉండవచ్చు.
ఈ పాట సాహిత్యం గమనిస్తే.. స్త్రీల మనోభావాలని కించ పరచే విధంగా ఉన్నాయి .ఎలాంటి భర్త కావాలో..లేదా సహచరుడు కావాలో అమ్మాయిలకి వెల్లడించే స్వేచ్చ ఉండ వచ్చు. పరిణితి ఉందనుకోవచ్చు. కానీ.. అందరి వైపునా వకల్తా పుచ్చుకుని మాత్రం.. భాస్కరభట్ల వ్రాయడం.. అది పాటగా ఊరేగడం.. ఒక సారి ఆ పాట చూడండి..!? అమ్మాయిల ఆలోచనలు ఇలా ఉన్నాయని ఒక పాట రూపంలో చెపుతుంటే.. ఆడ పిల్లలు అమాయకులు అంటారు ఏమిటీ.. ?అని ఒకరు నన్నుఅడిగారు. ఆనక అదేపనిగా మ్రోగించి ఆ పాటని హిట్ కూడా చేసేసారు.
ఒక చరణంలో ఇలా ఉంది..
"పొద్దునే లేపేసి .. మడి కట్టు కట్టేసి ..పూజ గదిలో కుర్చోబెట్టే వాడు మాకొద్దు ...
బికిని యేసి బీచ్ లో వదిలేసే వాడు కావాలి"
ఇంత పచ్చిగా స్త్రీల ఇష్టాల స్థాయి దిగజార్చే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు? పోనీ అలాటి వర్గాన్ని వీళ్ళు దృష్టిలోకి తీసుకుంటే.. ఆ చిత్రం ని వారు మాత్రమె చూడరు. ఆ సినిమా చూసి..ఆ సాహిత్యాన్ని గమనించి యెంత మంది బహిరంగంగా ఆ పాట పాడుతూ.. తమ పరిసరాలలోని ఆడవాళ్ళని చులకన చేస్తున్నారు అన్నది చూస్తే గాని తెలియదు..అది యెంత అవమానకరంగా ఉంటుందో..పాట రాసిన వాళ్లకి ,తీసిన వాళ్లకి ,సిగ్గు ఎగ్గు లేకుండా నటించినవారికి తెలుస్తుందా?
చలన చిత్ర సీమలో గీత రచయితలు అందరు..దాదాపు పురుషులే! ఆడవారి మనోభావాలని వారు అనుభవించి.. పరకాయ ప్రవేశం చేసి వారి మనస్పందనలు కనుగొని వ్రాసారా అనిపించేరీతిలో వ్రాసిన పాటలు ఎన్నెన్నో..
నెల తప్పేనమ్మ.. నెలత ఎన్నాళ్ళకి నెలవంక పుడతాడు కొన్నాళ్ళకి.. అనే పాటలో .. డా :సి.నా.రె.. స్త్రీల భావనల్ని యెంత చక్కగా వ్యక్తీకరించారో.. అలాగే.. శ్రీవారి కి ప్రేమ లేఖ చిత్రంలో.. మనసా తుళ్ళి పడకే .. ఇలాటి పాటలు చాలా స్త్రీల భావనలకి అద్దం పట్టేటట్లు వ్రాసారు.
ఇదేమి ఖర్మమో..సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం ఎలాగు ఆశించడం లేదు..నానాటికి ఈ దిగజార్చడం మితిమీరి పోతుంది.
భాస్కరభట్ల గారు.. మీ ఎరుకలో.. ఎవరైనా మీరు ఈ పాటలో రాసిననట్లు వారు తారసపడి..మీకు వారి ఆలోచనలు ఇలా ఉన్నాయనివ్యక్తీకరించారా ? కనీసం మీ ఇంటి ఆడవాల్లకైనా ఆ స్వేచ్చ ఇచ్చి మనసులో భావాలు ఇలా ఉన్నాయని చెప్పించగలరా !? అది మీరు హర్షించి,అంగీకరించి..పబ్లిక్ గా వ్యక్తీకరించడం చాలా గొప్ప విషయం అనుకుంటాను. సాహిత్యం ప్రయోజనం ఇతరులని రంజింపజేయడం,ఆలోచింపజేయడం.. మరి మీరు అలాగే భావించి ఈ పాట రాసారా? మీకు భారతీయ స్త్రీ సమాజం మొత్తం మీరు ఉదహరించిన రీతిలో బాడ్ బోయ్స్ ని ఇష్టపడుతుందా!? కాస్త తెలుసుకుని చెప్పండి?
పూరి జగన్నాథ్ గారు.. మీరు జగన్నాదుడిలా.. కమర్షియల్ సినిమా రథ చక్రాలపై..నడవండి. ఎవరికి అభ్యంతరం లేదు. ఒక వేళ ఆ చిత్రం అపజయం పాలు అయితే.. నిర్మాతకి మాత్రమే నష్టం. మీరు దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలోని ఐటం సాంగ్స్ సాహిత్యం, బూతు డైలాగులు,అపహాస్యం చేష్టలు.. ముందు మీ ఇంట్లో స్త్రీలకి నచ్చుతాయేమో..వాళ్ళు ఆమోద ముద్ర వేస్తారేమో చూడండి.అప్పుడు.. ఈ సమాజం పైకి మీ వికృతమైన ఆలోచనలు విసరండి. ఎందుకండి.. స్త్రీలపై అంత చిన్న చూపు. ? సమాజానికి వినోదం తో పాటు విలువలు,వలువలు ..కావాలి. అన్ని విప్పేసాక ,ఒగ్గేసాక..మిగలడానికి ఏముంది...!? కేవలం మగవారిని రంజింపజేయడమే మీ కళాత్మక దృష్టి కావచ్చు. స్త్రీలకి కనీసం కాస్త గౌరవాన్ని ఉంచి,ఇచ్చి సినిమాలు తీయండి అని మనవి.
బ్లాగ్ మిత్రు ల్లారా! వీలయితే.. "ప్రజా సాహితి " మర్చి సంచికలో ."బిజినెస్ మెన్ " పై సినిమా సమీక్ష చూడండి. 21 & 22 పేజీలలో.
ఇక నేను ఇంతగా చీత్కరించుకున్న ఈ పాట సాహిత్యం ..చూడండి.
శ్రీ రాముడు లాంటి గుణవంతుడు ..సౌమ్యుడు ..ఏక పత్ని వ్రతుడు మాకక్కర్లేదు ..
కసుక్కున బుగ్గ గిల్లేసి ..చీర కొంగు లాగేసి ..నడుం మీద పంటి గాటు పెట్టె చిలిపి కృష్ణుడే కావాలి ..
వుయ్ లవ్ ...వుయ్ లవ్ ..వుయ్ లవ్ ..
బాడ్ బోయ్స్ ..బాడ్ బోయ్స్ ..బాడ్ బోయ్స్స్ ....
వుయ్ లవ్ బాడ్ బోయస్స్స్స్ ...ఉయ్య్యయ్య్య్యి
వుయ్ వన్నా వన్నా బాడ్ బోయ్స్ ...ఉయ్య్యయ్యి
వుయ్ లవ్ బాడ్ బోయస్స్స్స్
వుయ్ వన్నా బాడ్ బోయ్స్ .
మామ్మడ గిచ్చి ఈడ గిచ్చి ..పిచేక్కించే పెనిమిటే కావాలీ ........
వుయ్ లవ్ బాడ్ బోయ్స్
వుయ్ వన్నా వన్నా బాడ్ బోయ్స్ .
పొద్దునే లేపేసి .. మడి కట్టు కట్టేసి ..పూజ గదిలో కుర్చోబెట్టే వాడు మాకొద్దు ...
బికిని యేసి బీచ్ లో వదిలేసే వాడు కావాలి
వంటలు వార్పులు వద్దని చెప్పలే ..
ఐ మాక్స్ లు ..పబ్ లు తిప్పేస్తున్దాలే ..
హేయ్యి ....అ నుదుటిన బొట్టేట్టు ..వాకిట్లో ముగ్గెట్టు ..అని ఆర్డర్లేసి అరిచేవాడు ..మంచోడైన సారీ మాకొద్దే ..
వుయ్ లవ్ బాడ్ బోయ్స్ ......
వుయ్ లవ్ ..లవ్ బాడ్ బోయ్స్ ...
ఒరే రే ... బబ్బ్లీ ..మేరే బిజిలి ..
అరె బల్బ్ లు పేలతాయి షాక్ లు తగిలి ..
ఒరే రే ...బబ్బ్లీ ..మేరే ఇమిలి ..
పులిహరే చేస్కొనిలీ....
పప్పు టొమాటో బేచ్ మాకేందుకయ్య ...
నాటు కోడి కాలు ..నా కాలు పట్టుకు లాగేసే వాడే కావాలి ..
ఆఫీసు లో OT లే చేసే వాడోద్దె
పడకింట్లో ఓవర్ టైం డ్యూటీ చెయ్యాలే ..
నా దేవత నువ్వంటూ ..పూజించే వాడొద్దు
ఆ రంభ ఊర్వశి నువ్వేనంటు మీదడిపోయే రకమే కావలె ....
వుయ్ లవ్ బాడ్ బోయ్స్ ........
ఇదండీ.. వారి పైత్యం.