1, డిసెంబర్ 2010, బుధవారం

నీవు వచ్చే చోట


నాకు చాలా ఇష్టమైన పాట  మల్లెపువ్వు  చిత్రంలో వాణీజయరాం  ఆలపించిన పాట.
నువ్వు వస్తావని  బృందావని ఆశగా చూసేనయ్యా  కృష్ణయ్యా.. అనే పాట.

ఆ పాటని ఆ చిత్రంలో  పండరీబాయి పై చిత్రీకరించారు.  కథానుగుణంగా చిత్ర నాయిక  నాయకుడిపై ఆరాధన భావం  పెంచుకుని అతని  దరి చేరాలని  ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఈ పాటని  ఆరుద్ర గారు రచించారు.

ఎంతో  ఘాడమైన  భావనతో  మధుర భక్తితో మమేకమై  ఆద్యంతం గొప్ప అనుభూతిని  అందించే పాట.

"నీవు వచ్చే చోట, నీవు నడిచే బాట  మమతల దీపాలు వెలిగించాను.
కుశలం అడగాలని పదములు కడగాలని 
కన్నీటి కెరటాలు  తరలించాను నీ పద   రేణువు నైనా  పెదవుల వేణువు నైనా  బ్రతుకే  ధన్యమని భావించాను
నిన్నే చేరాలని  నీలో కరగాలని  నా మనసే  హారతిగా వెలిగించాను  "

ఎంత గాఢత ఎంత స్వచ్ఛత! ఈ మంచి పాటకి చక్రవర్తి గారు స్వరాలు అందించారు.

ఈ మల్లెపువ్వు  సినిమా  నేను చాలా చిన్నప్పుడు చూసాను. ఈ సినిమా  చూసి శోభన్ బాబు  గారి తల్లి బాగా ఏడ్చారట. ఊరిలో చెప్పుకునే విషయం ఇది. శోభన్ బాబు గారి మూలాలు మా ఊరివే మరి.

ప్రతి రోజు నేను విని పరవశించి  వనమాలికి అన్వనయించుకుని మధుర భక్తిలో తేలియడుతుంటాను.

రేడియోలో  మరీ మరి  కోరి నేను వింటూ  ఇతరులకి  విసుగు కల్గిస్తాను  కూడా. ఇంత మంచి పాటని మీరు వీలైనప్పుడు   వినండోయ్!   వింటారు కదా !

“ నువ్వువస్తావని  బృందాన్ని” పాట   ఇదిగో వినేసేయండి.

                    

1 కామెంట్‌:

సామాన్య చెప్పారు...

పాట ఎంత బాగుందో ! చాలా కృతజ్ఞతలు మీకు వినిపించినందుకు !