నాకు ఈ మద్య మొబైల్ పోన్ వాడకం పట్ల విరక్తి పెరిగిపోయింది. ఎక్కడికైనా వెళుతున్నా మొబైల్ పోన్ వెంట తీసుకుని వెళ్ళడం మానేసాను. ఏమి అయి పోయావ్? ఆ మొబైల్ పోన్ ఎందుకు నీకు? ఆ బందరు కాలవలో పడేయి .. అని విసుక్కుంటున్న ఫ్రెండ్స్ కి .. బిజీ తల్లి.. అని నైస్ గా తప్పుకుంటాను. ఎందుకు అంత విరక్తి అంటారా? ఒకప్పుడు తెగ మోజు పడి కొనుక్కుని తెగవాడి పడేసి ..ఇప్పుడు మనుషులతో మాట్లాడటమే విసుగేసి..ఇలా..
నేను ఒక సంవత్సరం నుండి ఒక నియమం పెట్టుకున్నాను. రాత్రి 8 గంటల తర్వాత పోన్ మాటలాడ కూడదని. ఎందుకంటారా!? ఆ పోన్ మ్రోగిందంటే ఇంట్లో అందరితో కలసి భోజనం చేయడం కి..నీళ్ళు ఒదులుకొవాల్సిందే.! ఆఖరికి స్నానం చేసే టైములో..కూడా..నాలుగు సార్లు మ్రోగి.. ఏదో కొంపలంటుకు పోయినట్లు.. ఎక్కడికి వెళ్ళావ్ ఇంత సేపు అనే ప్రశ్న వినగానే చిర్రెత్తుకొస్తుంది. చేసిన వాళ్ళు కస్టమర్స్ కావచ్చు. ఫ్రెండ్స్ కావచ్చు,బందువులు కావచ్చు. ఇక పెళ్లి,పేరంటాల్లకి,జనన మరణాలకి..అన్నిటి కబుర్లు మోసుకొస్తుంది. నేను వీలు కుదరక వెళ్ళ లేని స్థితులు. మళ్ళీ రాలేదు ఎందుకని ప్రశ్నలు,నిష్టూరాలు. ఒకోసారి కొందరు పరిచయస్తులు,ఖాతాదారులు అయితే.. ఏదైనా పని బడితే.. ఒకటే విసిగించేస్తారు.అందుకే పోన్ మాట్లాడుతుంటే కస్టమర్స్ వచ్చారని ,కస్టమర్స్ అయితే పోన్ వచ్చిందని తప్పించుకుంటాను.అందుకు..కొన్ని రహస్య క్రియలు ఉన్నాయి లెండి. ఒకోసారి మా వర్కర్స్ తో పోన్ తీయించి "మేడం బయటకి వెళ్ళారండి అని చెప్పిస్తాను". అంతగా విసిగి పోయాను.
ఏదైనా ముఖ్యమైన పోన్ అయితే ఎవరికి తెలియకుండా ఉన్న నెంబర్ కి మాత్రం కాల్స్ వచ్చే టట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటె రాత్రి సమయాల్లో వచ్చే పోన్ ల వల్ల నిద్ర చేటు.ఫ్రీ కాల్స్ వల్ల అనవసరం అయిన విషయాలు కూడా విని విని చెవులు దిబ్బడ వేస్తున్నాయి. రాత్రి సమయంలో అయితే ఫ్రీగా ఉంటామని ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఇక మెసేజెస్ సంగతి సరే సరి. నేనైతే.. కొన్ని మెసేజెస్ చదవను కూడా చదవను.వెంటనే డిలేట్ చేసి పడేస్తాను. అవి చదివి,రిప్లై ఇచ్చే ఓపిక కూడా నాకు లేదు.ఒకప్పుడైతే "నొక్కింది చాల్లెమ్మా ..ఇక పడుకో!అని కసురుకునే వరకు.. మెసేజ్ లతో చాట్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మెసేజెస్ హింస తాకిడికి మొబైల్ పోనే వద్దు బాబు అనుకునే స్థితికి నేను వచ్చేసాను.
ఇక యువతరం అయితే మొబైల్ ఫోన్ వాడకంలోకి వచ్చాక మనుషులు సాటి వారితో..మాట్లాడం అరుదైపోయింది. ఎక్కడెక్కడో ఉన్న దూర ప్రాంతం వారితో.. గంటల తరబడి మాట్లాడుతూ..చుట్టూ ఉన్న మనుషుల గురించే పట్టించుకోరు. ముఖ్యమైన విషయం చెప్పటానికి కూడా దగ్గరి వారికి అందుబాటులోకి ఉండరు.
ఇప్పటి యువతరమే కాదు.. మద్య వయస్కులకి కూడా మొబైల్ ఫోన్ ఒక వ్యసనం అయిపొయింది. ఫ్రీ కాల్స్ ,నైట్ కాల్స్ ,ఫ్రీ మెసేజెస్ ..వీటన్నిటి హవా .. నడుస్తుంది. ఏ వస్తువు అయినా అవసరం మేర వాడుకోవడం మంచిది. అవసరానికి మించి వాడటం వ్యసనం అయితే..దానివల్ల వచ్చిన పర్యవసానం ఎలా ఉంటుందో.. ఈ చిన్ని చిత్రం లో చూడండీ!

5 కామెంట్లు:
మొబైల్ కొంచెం మితంగా వాడితే మంచిదేమో..మనకు దగ్గర వాళ్లకు మాత్రమే మన మొబైల్ నెంబర్ ఇవ్వడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
చాలా చక్కగా, సున్నితంగా, నిశితంగా పరిశీలించి వ్రాశారు! అందుకే నేను హాస్టలుకి వెళ్ళేదాకా నాకు మొబైల్ వద్దన్నాను. ఇంటికి వెళ్ళినప్పుడల్లా స్విచ్ ఆఫ్ చేసేసేదానిని. స్నేహితులడిగితే అబ్బా అక్కడ కూడా మీ నస దేనికి మా వాళ్ళతో గడపనివ్వండి అని చెప్పేసేదానిని. వాళ్ళు కూడా అర్ధం చేసుకునే వాళ్ళు లెండి! ఈ వీడియోలో మాత్రం చాలా బాధాకరమయిన ముగింపు ఇచ్చారు!
వనజవనమాలి గారు పోస్ట్ బాగుంది, మొబైల్ వచ్చాక మనకి మనకి కావలసిన వారికీ మద్య చాలాదూరం తగ్గిపోయింది , హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాన్నగారు నెలకు ఒకసారి ఉత్తరం రాసేవారు ఆ ఉత్తరం కోసం నేను చాలా ఎదురుచుశేవాడిని,మొబైల్ వచ్చాక ఉత్తరాలు ఆగిపోయాయి రోజు మాట్లాడుకుంటున్నాం, కానీ నాన్నగారు రాసిన ఉత్తరాలు నేను చాలా జాగర్త గా దాసుకున్నాను. అవి చూసినప్పుడు గడిసిన మదురజ్ఞాపకాలు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి.. మొబైల్ ని ఎంతవరకు వాడలో అంతలో ఉంచితే మంచిది కానీ మొబైల్ నే జీవితం లాగా ఈ మద్య చాలామంది మారినారు,వారు ఒకసారి ఆలోచించితే మంచిది...
నేటి తరుణంలో మొబైల్ ఫోన్ ఫ్యాషన్ అయినప్పటికీ, మితంగా ఉంటేనే మంచిది.
ఈ మొబైల్ ఫోన్ ఎంత తొందరగా మనుషులను కలుపుతుందో అదే రెట్టింపు వేగంతో మనుషుల,మనసుల మధ్య విడదీస్తుంది,,, ఒక రకంగా చెప్పాలంటే దీని గురించి క్యాటగిరి వైజ్ గా ఓ పెద్ద స్టోరీ అవుతుంది. ఎవరి గోస వారిది.
Shabbu, KNR
జ్యోతిర్మయి.. గారు @ రసజ్ఞ .. ధన్యవాదములు.
@ షబ్బు..మొబైల్ పోన్ ల వల్ల ఎంతో దూరంలో ఉన్న వారు ఆత్మీయులు అయినారు. అలాగే కొంత మంది స్నేహం చేసినట్లు చేసి విసిగించిన వారు ఉన్నారు. నాకు ఎదురైనా కొన్ని చేదు అనుభవాలు..బహుశా ఎవరికి రాకూడదు కూడా! స్నేహం ముసుగులో " మూసే చీకటి ముసుగుల్లో దాగినవిఎన్నెన్నో, వేసే మాయల వేషం వెనుక దాచినవి ఏవేవో "..కదా..
@ బాలు గారు..ఎన్ని సార్లు పోన్లలో మాట్లాడుకున్న ఉత్తరం అనుభూతి ఉండదు కదా! మనసుని తడిమే అక్షర కెరటం "ఉత్తరం". ఈ పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి