3, మే 2012, గురువారం

తన్హాయి నవల పై నా సమీక్ష పై.. గూగుల్ + లో జరుగుతున్న చర్చ

సాహిత్య సృజన లో సమకాలీన అంశాలు లేదా..మానవ సంబంధాల లో ముఖ్యంగా వివాహ బంధం లో ఉన్నఒక స్త్రీ,పురుషుడి జీవితాల్లోకి మూడవ వ్యక్తి ప్రవేశం జరిగితే .. ఏది మంచో చెడో..చెప్పగలగడం కత్తి మీద సాము లాంటిందే అని నా అభిప్రాయం.
ఎవరి అభిప్రాయం ఎలా ఉందొ.. ఎవరి స్పందన యెంత విపరీతంగా ఉందొ..
తన్హాయి నవల పై నా సమీక్ష పై.. గూగుల్ + లో జరుగుతున్న చర్చని చూడండి
ఈ లింక్ లో

2, మే 2012, బుధవారం

కౌముది లో నా కథ "ఆనవాలు "

పురిటి గడ్డని నాలుగేళ్ళలో చూస్తున్నాను అనేమో ఎద లయలలో ఎక్కడో రేగుతున్న ఎడతెగని ఉద్వేగపు అలజడి కన్ను మూతపడ నివ్వడం లేదు. పక్క కుదరడం లేదు

ఎన్నో రోజులుగా కోయకుండా రాలిపోయి ఉన్న సన్నజాజులు మనుషులు ఒకరి తర్వాత ఒకరు రాలిపోతున్న విధంకి ప్రతీకగా కనిపించాయి.

నాన్న కొసరి కొసరి వడ్డించాడు. ఇంట్లో నాలుగు రకాల కూరలలో లేని రుచి ఏదో..తగులుతుంది.అది ప్రేమ రుచి అనుకుంటాను.
ఇలా అనుకునే ఓ కొడుకు తన ఆనవాలుని కాపాడాలని తన ఊరికి వెళ్ళాడు

కౌముది లో "ఆనవాలు "..నా కథ తప్పక చూడండి

1, మే 2012, మంగళవారం

విహంగ ..లో "తన్హాయి " పై .. నా సమీక్ష

ఓ..కాంత ..ఏకాంత గాధ.."తన్హాయి"

"ప్రేమయన నొక పంచభూతముల సమాహారమ్ము!అందు కలయికొక్కటేను,ప్రేమికుల ముందున్న దారి!!" అని సాఖీ గీతం. ఇదేమిటి ..వీరు ఇలా విడిపోయారు అన్న బాధ కల్గింది.కన్నీళ్లు వచ్చాయి
మన భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఇంకా బ్రతికి ఉంది అంటే కారణం అదే! ప్రేమ లేకపోయినా పెళ్లి జరిగాక శారీరకమైన సంబంధం ద్వారా పురుషుడు స్త్రీతో అనుబంధం ఏర్పరచుకుంటాడు. ఆ అనుబందాన్ని బలోపేతం చేసుకుంటాడు.ఒకవేళ పురుషుడు వేరొక ఆకర్షణలో పడినా కూడా స్త్రీలు తప్పని సరి అయి సర్దుకుని ఉండే వారు కావడం వల్ల వివాహ వ్యవస్థకి భంగం వాటిల్లలేదు..
ఇలా నేను చేసిన సమీక్ష ..ఇది.
చూడండి..ఈ లింక్ లో