నిన్నరాత్రి నా ఫ్రెండ్ నాతో మాట్లాడుతూ .. "అమ్మాయిని చదివించడం అనేది తప్పేమో అనిపిస్తుంది " అంది . నాకది నిజమేనేమో ..నని కూడా అనిపించింది
భద్రత లోపించిన సమాజంలో ఆడపిల్లని ఉన్నత విద్యల కోసం,ఉద్యోగాల కోసం బయటకి పంపడం పెను సవాల్ గా మారిందన్నది నిజం కూడా !
నా ఫ్రెండ్ కూతురు ముంబాయి ఐ ఐ టి లో చదువుతుంది. అత్యున్నత స్థాయి విద్యాలయాలో విధ్యార్డులైన పిల్లలు స్త్రీ పురుష బేధం లేకుండా అందరూ కలిసి గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళడం కాంపెయిన్ లు నిర్వహించడం మారుమూల ప్రాంతాలలో ఉన్న సమస్యలని గుర్తించి అవగాహన పెంచుకుంటూ ప్రజల అవసరాలని గుర్తిస్తూ ,వారికి వారి సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ సామాజిక అధ్యయనం చేస్తుండటం చాలా సంతోషకరమైన విషయం కూడా. . నా ఫ్రెండ్ కూతురు తరచూ కాంపెయిన్ లకి వెళ్ళడం వల్ల అలా వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో సంభాషించడంలో అశ్రద్ద ,నిర్లక్ష వైఖరి వల్ల ఇంట్లో భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం జరుగుతున్న చూస్తున్న వింటున్న ఉదంతాలు చూస్తే భయం కల్గుతుంది మరిక నా ఫ్రెండ్ ఇలా మాట్లాడటంలో ఆశ్చర్యం ఏముంది ?

విద్యా, వ్యవసాయ, ఉపాధి , సేవా రంగాలలో శ్రమ శక్తిలో, పూర్తీ స్థాయి గృహ నిర్వహణలో సమాజ ప్రగతిలో స్త్రీల భాగస్వామ్యముంది ఈనాడు అలా భాగస్వామ్యం కాని రంగమంటూ ఏది లేదు . పొట్ట చేతబట్టుకుని ఉన్న ఊరు విడిచి ఒంటరిగా పయనమవుతున్న కాలం ఇది . స్త్రీ జాతి పై చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎక్కడ చూసినా లైంగిక దాడులు జరుగుతున్నాయి .
చేయడానికి పని లేనప్పుడు , ఒకవేళ రేయింబవళ్ళు కష్టించినా కూడా నాలుగువేళ్ళు నోటిదగ్గరకి కూడా వెళ్ళలేని దీన బ్రతుకులు హీనమైన బ్రతుకులు కోట్లానుకోట్లు ఉన్నాయి ధనవంతుడు మరింత ధనవంతుడిగా ,మధ్య తరగతి మానవుడు పేదవాడిగా పేదవాడు మరింత పేదవాడిగా మారుతున్న ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థలో విచ్చినమవుతున్న సాంస్కృతిక జీవనంలో నైతిక విలువలు లోపించి హింసా ప్రవృత్తి హెచ్చిల్లి దొంగతనాలు దోపిడీలు, వ్యభిచారం ,అవినీతి, అరాచకాలు పెరిగి అలజడులు రేగి జన జీవితాలని అభాద్రతాభావంలో ముంచెత్తుతున్నాయి. ఈ నేర ప్రవృత్తిని అరికట్టగల మార్గాలు ఏమయ్యాయి ? అరాచక శక్తుల కనుసైగలలో నగరాలు నిద్రపోతున్నాయి సామాన్యుల ప్రాణమాన రక్షణ చేసే నాధుడే కరువయ్యారనిపిస్తుంది. పాలకుల వద్దకు ప్రజలెళ్ళి మొరపెట్టుకుంటే వాళ్ళు బండరాళ్ళవలె చలనం లేకుండా ఉంటే ఆదుకునే దిక్కెవరు? ఏదైనా స్త్రీ జాతి బతికి బట్టకట్టడం,సమాజంలో మనగల్గడం పెను సవాల్ గా మారిందన్నది నిజం . 63 సంవత్సరాల గణతంత్ర రాజ్యం సాధించిన ప్రగతి ముంజేతి కంకణంలా ఇలా ఉంది . ఏం చేద్దాం చెప్పండి ?
నాకు అప్రయత్నంగా ఈ పాట గుర్తుకు వచ్చింది
ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో
ఈ పాపం కడిగే దిక్కెవ్వరో ఎవ్వరో వారెవ్వరో
శీలానికి శిలువలు, కామానికి కొలువులు
కన్నీటి కలువలు, ఈ చెలువలు
కదులుతున్న ఈ శవాలు, రగులుతున్న శ్మశానాలు
మదమెక్కిన మతితప్పిన, నరజాతికి నందనాలు
ఎప్పుడో ఎప్పుడో ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో
ఈ గాధలు ముగిసేదింకెన్నడో?