(ఓటుకు ఐదు వేలు అడగండి అన్నమాటకు స్పందన )
****************
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
గురజాడ అప్పారావు గారు ఈ గేయం వ్రాసేనాటికి ఈ దేశంలో మతవిద్వేషాలు లేవు. కానీ ఈనాడు ఆ గేయరచయితను కులదృష్టితో చూస్తున్న సూడో మేధావులను చూస్తే అసహ్యాన్ని మించి వేరే ఏదో కల్గుతుంది. కాశ్మీర్ కాశీరులదే. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. దానిని కాపాడుకోవడానికి దేశం ఎంతో ఖర్చు పెడుతుంది. ముస్లిమ్స్ ఎక్కువున్నారు కాబట్టి అది పాకిస్థాన్ కి సంబంధించింది అయిపోదు. శతాబ్దాల చరిత్ర తవ్వి చూస్తే కాశ్మీర్ ఎవరిదో అర్ధమవుతుంది. కాశ్మీర్ ని విడగొట్టి ఇచ్చినంత మాత్రాన ఈ దేశంలో ఉగ్రవాద దాడులు జరగకుండా ఆగుతాయా అని ఎవరైనా నమ్మకంగా చెప్పగలరా ? ఈ దేశంలోకి ఎవెరెవరు ఎక్కడినుండి వచ్చినా ఇప్పుడు ఉన్నవారందరూ భారతీయులు.
ఒక ఉదాహరణ ఏమిటంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేశద్రోహం మొదలు పెడితే ఆ కుటుంబం మొత్తం విచారణ ఎదుర్కోవలసి రావడం చట్టపరమైన విచారణ. కాశ్మీర్ లో జరుగుతుంది అదే.
మనం వంటింట్లో చాకు తీసినప్పుడల్లా ఇంట్లో ఎవరినో ఒకరిని పొడవడానికి కాదని పచ్చి మిరపకాయని చీల్చి గింజలు రాల్చి చేసుకునే వంటల్లో వేసుకోవడానికని కూడా అర్ధం చేసుకోవాలి. సాత్విక ఆహారం తినడం కూడా మన హక్కు కాదంటారా?
(కాశ్మీర్ ప్రజలను అనుమానించి హింసిస్తుంది రాజ్యం అందుకే ఉగ్రవాదం పెరుగుతుంది అనే మేధావుల మాటలకు )
ఒక ఉగ్రవాది దాడికి 43 మంది సైనికులు మరణం నేపథ్యంలో ..కొందరి మాటలకు నా స్పందన
పొగలు గ్రక్కడం సామాన్యుడికి వచ్చు. ఇది సామాన్యుడి వ్యాఖ్య.

