మేల్కొలుపు
అర్ధరాత్రి లో మెలుకువ
అలజడితో కాదు అదో చైతన్యం
మేల్కొలుపు సమయాలు
సందేశాలు మోసుకొస్తాయి.
వీధి దీపాల వెలుతురు
ఛాయలు తాకని
ఆకాశం చాలా నేర్పుతుంది
చెవులతో చూడటం
హృదయంతో వినడం
ఆత్మ ద్వారా గ్రహించి
అనుభవించేదే జీవితం
ఆనందభరితం.
మేల్కొలుపు
అర్ధరాత్రి లో మెలుకువ
అలజడితో కాదు అదో చైతన్యం
మేల్కొలుపు సమయాలు
సందేశాలు మోసుకొస్తాయి.
వీధి దీపాల వెలుతురు
ఛాయలు తాకని
ఆకాశం చాలా నేర్పుతుంది
చెవులతో చూడటం
హృదయంతో వినడం
ఆత్మ ద్వారా గ్రహించి
అనుభవించేదే జీవితం
ఆనందభరితం.
మమకారం -త్రిపురనేని గోపీచంద్
మట్టికి మనిషికి అనుబంధం. మనిషికి సొంత భూమి కల్గివుండాలని ఆరాటం. వ్యవసాయం వృత్తి అయినవారికి మరింత తాపత్రయం. ఈ కథలో జోగయ్య అహోరాత్రాలు శ్రమించి చాలా భూమిని సంపాదించాడు. అతను భూమే తన సర్వస్వం అని భావించాడు. ఆఖరికి చావు బ్రతుకుల్లో వున్న భార్యను పట్టించుకోలేదు.తినే ముద్దను ఆస్వాదించలేదు. అన్ని బంధాలకన్నా మట్టి ముఖ్యం అనుకున్నాడు. అతని శ్వాస ధ్యాస అన్నీ మట్టే! ఆఖరికి ఆ మట్టి వాసనను పీలుస్తూనే ఊపిరి వదిలాడు. కానీ ఆఖరికి మట్టి వాసన ని కూడా ఆఘ్రాణించలేని ఆ మట్టి మనిషి ని చూసి మనం జాలిపడతాం. అబ్బురపడతాం. జీవితం జీవనం తాత్వికత ను అర్దం చేసుకుని చిన్నగా నవ్వుకుంటాం. తప్పక వినండీ..
@VanajaTatineni
బతుకమ్మ ఆడుతున్న ఆడబిడ్డలంతా తాము భూమి మీద కాకుండా..... ఏ స్వర్గలోకంలోనో ఆడుకుంటున్నంత సంబరంగా ఉన్నరు. అందరు ఆడబిడ్డలు అంత సంతోషంగా బతుకమ్మ ఆడుతుంటే....ఆ కాలనీలోనే ఉంటున్న పూలమ్మ మాత్రం...ఇంట్లో ఒక్కతే కుమిలికుమిలి ఏడుస్తున్నది. ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు.
బతుకమ్మ పండగ అంటే ఏ ఆడబిడ్డకైనా పట్టలేని సంబరం. ఎప్పుడెప్పుడు తల్లిగారింటికి పోదామా...పుట్టిన మట్టిని, తన ఊరి మనుషులను పలకరిద్దామా అని ఆరాటపడతరు. పూలమ్మ కూడా తన పుట్టింటికి పోయి బతుకమ్మ పండగ అట్లనే చేసుకోవాలని కలలు కన్నది. కానీ ఈ ఏడాది ఆ అదృష్టం దక్కలేదు.