24, డిసెంబర్ 2010, శుక్రవారం

సంగీత రసజ్ఞత సాహిత్య రమణీయత



తెలుగు  భక్తి రస చిత్రాలోలో మకుటాయమానంగా  విలసిల్లె చిత్రం  అన్నమయ్య.

సంకీర్తనాచార్యుడిగా మనకి అపూర్వ పెన్నిధి అందించిన స్వరకర్త పదకర్త..


ఆయన జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం ఒక.. ట్రెండ్ సెట్టర్.  

నాగార్జునకి నటనాజీవితంలో ఒక  కలికితురాయిగా మిగిలిన  చిత్రం.


ఈ చిత్రం విజయానికి ఎమ్.ఎమ్.కీరవాణి.. సంగీతం ముఖ్య భూమిక వహించింది. మరకతమణి .అద్భుత  స్వరకల్పన వలన  ఆ  చిత్రం  విజయం సాధించింది అంటారు.


 ఇక దర్శకేంద్రుడి ప్రతిభ  ఏలాటిదంటే.. భక్తి రస చిత్రంలో కూడా..  మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా.. దట్టించి భక్తి రసంలో శృంగార  రసాన్ని  ఆవిష్కృతం కావించారు. కామి కానివాడు మోక్షగామి కాడు  అన్న దానికి  తార్కాణంగా మన అన్నమయ్యతో ఆయన మరదళ్ళతో.. సరససల్లాపాల్లో  ముంచి తేలియాడించి ఆహా!  దర్శకేంద్రా!  ఏమి చతురత అని అనిపించుకున్నారు. అన్నమయ్య చిత్రం అంతా భక్తి సంగీత రచన బాగుంటుంది.


కానీ .. అందులో   అన్నిట్లో నా ప్రత్యేకమైన  చూపు మాత్రం పదహారు కళలతో  పాట. 

అక్కడ ఏడుకొండలపై స్వామివారికి భూసురులు  షోడపచారములతో పూజాదికాలు  నిర్వహిస్తుంటే.. ఇక్కడ మన అన్నమయ్య  మరదళ్ళతో..  వారి  సొగసులకి దాసోహం అయి వారికీ  వారి మనసుకి ఇంపైన సేవలు చేస్తూ.. మురిపిస్తూ ఉంటాడు. ఏమి వైయుక్తి కదా! సూపర్బ్! అందుకే.. రసికులైన ప్రేక్షకుల మనసులో పట్టం కట్టేసి మురిపించి మైమరపించింది.  


జీవితంలో.. రక్తి-అనురక్తి కలిగి  ఉంటేనే భక్తికి  ముక్తికి కూడా సులభ మార్గం లభిస్తుందని చెప్పడం కద్దు కావచ్చు.  అందుకే నా ఓటు   ఈ పాటకే.. 


శ్రీ పద్మావతి భూదేవి   సమేతస్య శ్రీ మద్వేంకట నాయకస్య 

నిత్య షోడోపచార   పూజాం కరిష్యే ఆవాహయామి


పదహారు కళలకు   ప్రాణాలైన

నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం


ఓం ఆసనం సమర్ప యామి 


పరువాలు హోయలకు పయ్యధలైన  

నా ఊహల లలనలకు ఊరువుల ఆసనం. 


ఓం..స్నానం సమర్పయామి


చిత్తడి చిరు చెమటలతో.. చిందు లోలికే పద్మిని భామనిలకు    

 పన్నీటి  స్నానం.


ఓం..గంధం సమర్పయామి  


ఘలం ఘలన నడల వలన అలసిన 

నీ గగన జఘన సొబగులకు  శీతల గంధం..  


ఓం..నైవేద్యం సమర్పయామి


రతి వేద వేద్యులైన రమణులకు.. 

అనుభవైకవేద్యమైన  నైవేద్యం. 


ఓం తాంబూలం సమర్పయామి


నీ..తహతహలకు  తపనలకు.. తాకిళ్ళకు 

ఈ కొసరు  కొసరు తాంబూలం  ‘


ఓం సాష్టాంగ వందనం సమర్పయామి 


అనంగ రంగ  భంగిమలకు.. సర్వాంగ చుంబనాల వందనం.


ఆవాహనం,ఆసనం, స్నానం, గంధం, నైవేద్యం, తాంబూలం, వందనం భక్తికి రక్తికి కూడా. 


నా.. అభిమాన సంగీత దర్శకుడి స్వర ఝరి, అలౌకిక అనుభూతితో వర్ణింపరాని భావ పరంపరలో తడిసిపోయే పాట “మనో” గళంలో మధురాలు ఊరించిన పాట.. 

సంగీత రసజ్ఞత మాత్రమే కాదు, సాహిత్య రమణీయత తోడైతే అమృతం ఎందుకు!?  అమృతం కన్నా కావ్యం మధురిమ మిన్న అని తెలిస్తే.. 


దేవతలు, రాక్షసులు యుద్దాలు మానేసి కావ్యామృతాలు సేవించేవారని చతురోక్తి నిజం  అయ్యేదేమో మరి.


ఇక సరి సరి. ఈ అర్ధ వివరణకి. మరి సెలవు.  కవికి వందనం🙏  స్వామి చరణారవిందాలకు..  ఆత్మాభివందనం.  🙏🙏 ఈ సారి నవ్య దృష్టితో మీరూ ఈ పాట వినండి, చూడండి. 



23, డిసెంబర్ 2010, గురువారం

కనులలో.. నీ..రూపం.. మనసులో.. నీ..గీతం.. .



నాకిష్టమైన  పాట మరొకటి మీతో.. పంచుకోవాలనిపిస్తుంది..
వేణువు.. అనగానే.. మరో  .. పాట.. మనసులో.. మెదిలింది..
జీ.కే. వెంకటేష్.. స్వరపరచిన పాటే.. ఇది.

పద కర్త  డా.సి.నా.రెడ్డి గారు.  పాటల చిత్రీకరణలో..  ఓ' ట్రెండ్ సెట్టర్..  చిత్రం.. రావణుడే రాముడైతే.. కి..  దాసరి  దర్శకత్వం వహించారు..

అప్పటి హీరోయిన్స్ లో..జయ త్రయం లోని.. జయచిత్రని..  మేఘమాలికలపై  .. నడిపించి..  పాటకి.. అందమైన రూపం కల్పించారు..  ఎందుకో.. ఆ పాటంటే.. నాకు.. చాలా.. ఇష్టం.

కనులలో.. నీ..రూపం.. మనసులో.. నీ..గీతం.. .. కదలాడే.. నేడే ..  హే..హే..హే.. .. (క )

నీ.. గీతి నేనై.. నా.. అనుభూతి.. నీవైతే.. చాలు..  అంతే.. చాలు..
పదివేలు.. కోరుకోను..ఇక..యే.. నందనాలు..
 యే.. జన్మకైనా.. నీవు నాకు.. తోడుంటే..చాలు..
అంతే చాలు..
ఎదలో.. కోటి రసమందిరాలు.. ఆ..ఆ.. ఆ..ఆహా..హా..ఓ..హో.. హో.. (క)...

ఆ కొండపైనే.. ఆగే మబ్బు.. తానే.. ఏమంది..?
ఏమంటుంది.. !?
కొండ ఒడిలోనే.. ఉండాలంటుంది..

నీ.. కళ్ళలో.. ఒదిగే బొమ్మ.. ఏమంది.. ఏమంటుంది ?
పదికాలాలు.. ఉండాలంటుంది..(క)

అతడు-ఆమె.. కలిసి.. ఇలా.. పాడుకుంటూ ఉంటే.. మనం ఏమంటాం..!
తధాస్తు..!! అంటాము.. కదా..!
ఒక మంచి అనుభూతిని అందించే.. సంగీత.. గీతిక.. అందుకే.. నా..కు.. ఇష్టమైనది..
మీరు వినండీ!!!      కనులలో  నీ  రూపం  -- రావణుడే  రాముడైతే 

22, డిసెంబర్ 2010, బుధవారం

వేణువు అనురాగ గీతీక.

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
నేను.. చాలా చిన్నప్పుడు కాన్వెంట్ కి  డుమ్మా కొట్టి రోడ్డు మీద షికార్లు చేస్తూ మా మైలవరంలో.. తెగ బిజీగా తిరిగేస్తున్నా.

అప్పుడు ఎక్కడ నుండో గాలి  అలలపై అల్లనల్లగా తేలుతూ మంద్రంగా ప్రవహిస్తూ ఒక తీయని స్వరం నన్ను తాకింది.

అప్పుడు అదొక వేణు గానమని పాటలో భాగమని నాకు తెలియదు.

వెంటనే.. వెళ్ళిపోయి ఎక్కడనుండి విన వస్తుందో ఆ ఇంటి గుమ్మం ముందు నిలుచున్నా.. అక్కడ అంతా మనుషుల కోలాహలం .

ఒక నాలుగు పలకల పెట్టె చుట్టూ  కూర్చుని అందులో వచ్చే బొమ్మలని చూస్తూ పాట వింటూ ఉన్నారు. ఇంతలో నన్ను చూసి లొపలకి పిలిచి కూర్చోమన్నారు.

నేను ఎమా ధైర్యంగా కూర్చుని ఆ సినిమాని అంతా చూసాను.

తర్వాత చెప్పారు ఆ ఇల్లు మా నాన్నగారి స్నేహితుడి ఇల్లని. ఆయన అన్నయ్య అమెరికా లో ఉంటాడని ఇక్కడికి వస్తూ టి.వి. అనబడు సాధనాన్ని, అమెరికా అమ్మాయి అనే తెలుగు సినిమా కేసెట్టు  తెచ్చి అందరికి గొప్పగా చూపిస్తున్నాడని ..

నాకైతే.. బోలెడంత ఆశ్చర్యం తో పాటు.. ఒక వేణువు వినిపించెను పాట తెగ నచ్చేసింది.
తర్వాత తర్వాత రేడియోలో ఆ.. పాట వింటూ తెగ ఆనంద పడేదాన్ని.
ఇప్పటికి అంతే అనుకోండి.
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఆపాట కోరే ఏకైక శ్రోతని నేనే అని మా అనౌన్సర్లకి మా ఆర్ .జే. లకి గట్టిగా తెలుసు.
అందుకే ఎస్. ఎం ఎస్ ల కోటాలో కూడా  పూర్తిగా పాట వినిపించి నేను నొచ్చుకోకుండా నా అభిమానాన్ని గెలుచుకుంటారు అనుకోండి అది వేరే విషయం
అసలు విషయానికి వస్తే ఆపాట అప్పుడు విన్నది మొదలు

వేణుగానం విన్నానంటే చాలు ఒడలు మరచిపోతాను. చెవులు ఊరగా వింటూ ప్రపంచాన్నే మరుస్తాను.వేణు గానానికి అంత శక్తి ఉంది..

కాబట్టే సంగీతంలో అగ్రతాబూలం వేణువుది. అలసిన మనసుని సేదతీరుస్తూ జీవశక్తిని ఇచ్చే మంత్రజాలం వేణు గానం. అందుకే అంత ఘాడమైన ముద్రతో.. .మనందరిని ఎప్పుడూ తన వైపుకు లాక్కుంటుంది.

అసలు కృష్ణుడికి వేలమంది గొపికలని ఆకర్షించే శక్తి వేణువుదే కదా కాదంటారా! అలాటి వేణువు అనురాగ గీతీక వినిపిస్తే ఎవరికి నచ్చదు చెప్పండి.. అందుకే.. ఆ పాట నాకు చాలా ఇష్టం.

ఆపాట సాహిత్యం మైలవరపు గోపి, సంగీతం జి.కే. వెంకటేష్ ఇక గాయకుడు. ఆనంద్ గొంతులో.. ఎంత మత్తు ఉందో!

ప్రకృతిలోని అందమైన వాటితో తన చెలి సొగసును పోలుస్తూ  అంతకన్నా మిన్న అని.. అతిశయంగా కీర్తిస్తూ పాడిన పాట. నాకైతే..ఎవరికైనా ఇలాటి ప్రేమికుడు.. ఒకే ఒక్కరు.. ఉండాలనిపిస్తుంది. అంత బాగుంటుంది మరి.

సాహిత్యం ఇదిగో.. అందుకోండి..లీనమైపొండీ!

ఒక వేణువు..వినిపించెను అనురాగ గీతిక..
ఒక రాధిక అందించెను.. నవరాగమాలిక..
సిరివెన్నెల తెలబోయను జవరాలి చూపులో.. (2 )

నవమల్లిక చినబోయెను చిరునవ్వుసోగసులో.. (2 )(ఒక )

వనరాణియే .. అలివేణికి సిగపూలు తురిమేను..(వన )
రేరాణియే.. నా రాణికి పారాణి పూసెను.. (రే ) (ఒక )

ఏ నింగికి ప్రభవించెనో.. నీలాల తారక.. (ఏ నింగికి )
నా గుండెలో.. వెలిగించెను.. శృంగారదీపిక (నా ) (ఒక ) 

ఇక చెప్పలేనండి.. ఇంత చెప్పాక. ఒక్కసారి అయినా మీరు వింటారు అనుకోండి..

తర్వాత.. వినేది లేనిదీ మీ ఇష్టం..ఇక పడుకుంటా.. వార్నింగ్స్.. వస్తున్నాయి మరి.. బై .. ఫ్రెండ్స్..
.ఒక వేణువు వినిపించెను అమెరికా ఆమ్మాయి ఈ.. పాట ఈ లింక్ లో వినండి.

ఇక్కడ చూడండీ!