29, డిసెంబర్ 2010, బుధవారం

కృష్ణాతీరంలో తానా-చైతన్య స్రవంతి - తెలుగు వైభవం

 తానా-చైతన్య   స్రవంతి  - తెలుగు వైభవం.  

కృష్ణాతీరంలో.. డిసెంబర్ 19 న జరిగిన..  ఓ.. కార్యక్రమం గురించి మీ.. అందరితో.. పంచుకోవాలనే .. ఈ.. చిన్ని ప్రయత్నం .

 మాతృ దేశాన్ని  వీడిన మన సహోదరులు  మాతృ బాషపై మమకారంతోను..మన ప్రాచీన జానపద కళారూపాలను.. ఈ తరం కి.. గుర్తు చేయడానికిని  తానా-చైతన్య  స్రవంతి  - తెలుగు వైభవం పేరిట విజయవాడ  పట్టణంలో.. .  అత్యంత పేరెన్నికగన్న   కళారూపాల ప్రదర్శన లను ఏర్పాటు చేసారు.

అంతకు ముందుగానే 18 -25   వయస్సు మద్య ఉన్నవారికి.. వచన కవితలపోటిని.. నిర్వహించారు. ఆ.. పోటీలను మా.. సంస్థ ఎక్సరే  (సాహిత్య,సాంస్కృతిక.సేవా సంస్థ )  నిర్వహించడం జరిగింది.

ముగ్గురు న్యాయనిర్ణేతలతో..కూడిన బృందం.. విజయవాడ  పరిసర   ప్రాంతాలలోని కవులు.. పాల్గొని  సభని పరిపుష్టం చేయడం ఒక వంతు అయితే..  ఆ పోటీలలో.. పాల్గొన్న యువ కవులు గురించి  చెప్పడం.. చాలా అవసరం. కవిత్వం అంటే.. అదేదో అర్ధం కాని బాష అనుకునే వారు ఎవరు లేరు ఇప్పుడు..  ప్రతి ఒక్కరు కవిత్వంని ఆస్వాధించేవారే!   పద్యం నుండి.. వచన కవిత్వంగా.. రూపాంతరం  చెందిన.. 70 వ ధశక  ప్రారంభం నుండి.. వచన కవిత్వానికి వేదికగా.. ఎక్సరే.. పత్రిక  ఉండేది.

అమలాపురం నుండి  మద్రాస్ వెళ్లి.. మళ్లీ .. విజయవాడ.. వచ్చి.. ఇక్కడే స్థిరపడిన.. ఎక్సరే.. సంస్థ.. గత పదమూడు ఏళ్ళుగా .. సాహితీ.. కార్యక్రమాలు.. నిర్వహిస్తుంది.అందులో.. ముఖ్యమైనది... నెల నెల వెన్నెల.. కార్యక్రమం.  గత పదనూడు ఏళ్ళుగా.. ఎంతో మంది కవులను.. తీర్దిదిడ్డింది..  ప్రతి నెల.. మొదటి ఆదివారం ఈ.. కార్యక్రమమని.. నేనే.. నిర్వహిస్తాను.

ఇంతకి.. నేను.. చెప్పొచ్చేది ఏమిటంటే   మాతృ బాషపై.. మమకారం తగ్గుతుంది అని భయపడుతున్న  ఈ..రోజుల్లో.. యువత బాషపై.. తమకి ఎలాటి పట్టు ఉందో.. వాళ్ళ కవిత్వం  ద్వారా.. నిరూపించారు. పైగా.. వాళ్ళు.. ఇంగ్లీష్ మాద్యమం ద్వారా విద్యని.. అవలంబిస్తున్నవారే  ! తెలుగు  వెలుగు  మన నుండి దూరం చేయడం .. ఎవరికి సాద్యం కాదు అని నా.. అభిప్రాయం.

తానా.. నిర్వహిస్తున్న వచన పోటీలు.. అనగానే .. దూర ప్రాంతాలైన   పలమనేరు, కోట, వెంకటగిరి, మంచిర్యాల మొదలగు.. ప్రాతాలనుంది యువ కవులు.. పాల్గొని.. బహుమతులు.. పొందారు..   వారు.. వ్రాసిన  మంచి కవితలు.. సామాజిక వర్తమాన ఆర్ధిక  ,రాజకీయ దృక్పోణంలో.. మేలేన్నికగన్నవి..   నేను.. చాలా సంతోషపడ్డాను..  యువత.. చాలా.. ముందుకు దూసుకేళ్ళుతుంది. ఎటు తిరిగి వారిని .. సరియిన ట్రాక్ పైకి.. మళ్ళించాలి.. సాహిత్యంని వారికి రుచి చూపించాలి.  పాఠ్య  అంశాలలో   .. చదువుకుని  తెలుగుని వదిలేయడం కాదు..  జీవనవిధానంలో.. మాతృ బాషకి.. తగిన గౌరవమని ఇస్తూ.. ముందు  తరాలకి..  మన బాషని.. మన ప్రాచీన కళల్ని..  వారసత్వ సంపదగా.. అందించాలనే ప్రయత్నంతో.. తానా  నిర్వహించిన ఈ..పోటీలు.. చాలా.. స్పూర్తికరం.. తానా చైతన్య స్రవంతికి  మనఃపూర్వక  ధన్యవాదాలు.

 అప్పటి కళారూపాల ప్రదర్శన చూసి.. అందరు.. మురిసిపోయారు  ..  డిసెంబర్  24 -25.. తేదీలలో.. జరిగిన ఈ కార్యక్రమాలు.. విజయవాడ  . పట్టణంలో.. ప్రజలకి.. 20 ఏళ్ళ క్రితం   సంక్రాంతికి..  పుట్టిన ఊర్లికేల్లి . .. గడిపినట్లు ఉంది..  ఇలాటి తెలుగు వైభవాలు.. నిత్యం జరగాలని కోరుకోవడం అత్యాశ  అవుతుందేమో.. కానీ.. ఆర్నెల్లకి   ఒకసారి అయినా జరగాలని కోరుకుందాం.

చివరగా.. ఒక మాట.. ఎక్సరే.. అని ఇంగ్లీష్ పేరు పెట్టారు.. మీ.. సంస్థ పేరు.. అని అడుగుతుంటారు. కోట్ల గుండెల్లో.. రగిలే జ్వాలలను.. చిత్రీకరించి.. హృదయం అనే.. డార్క్ రూంలో   డెవలప్ చేసి.. సమాజం ఆల్బంలో.. ప్రదర్శించడమే..  ఎక్సరే.. పని..  ఆ.. పని.. చేసే యజ్ఞంలో.. మా..సంస్థ.. నడుస్తుంది.. అదన్నమాట ఎక్సరే కి అర్ధం...  ప్రపంచమొక పద్మవ్యూహం .. కవిత్వమొక  తీరని దాహం .. శ్రీ..శ్రీ..  సాక్షిగా.. కవితా  ప్రక్రియలో..  ఆంద్రుల  నాడిని,ఒరవడిని.. చాటి చెప్పడమే పనిగా.. ఈ.. బ్లాగుల.. పరికింత.. నా.. పులకింత.

బ్లాగు లోకంలో.. నవ కవిత్వం విల్లివిరియాలని.. ఆకాంక్ష. యే రకమైన సాహిత్య ప్రక్రియ   అయినా.. అందరిని  అలరింపజేసి   మన మూలాలను  మరువకూడదనే ..అభిలాష .

 సామాన్య చదువరిగా  నేను కోరుకోవడంలో.. తప్పు ఉందంటారా!

27, డిసెంబర్ 2010, సోమవారం

విదేశాలకి వెళ్లి..



మన బ్లాగ్ ఫ్రెండ్  వెలిబుచ్చిన అభిప్రాయం  చూసాను.. చాలా.. మంది తల్లితండ్రులకు  విదేశాలకి వెళ్లి.. డబ్బు సంపాదించడమే.. ద్యేయం కాదు..  వారి వారి కాలంలో.. చేయలేని  పనులు, రాని అవకాశాలు వారి బిడ్డలకి.. లభిస్తున్నాయి. అందుకు సంతోషమే కదా !   అందరు చదువు   విలువ తెలుసుకుని చదువుకుని వ్యక్తి అభివృద్దితో పాటు.. దేశ అబివ్రుద్దిని కోరుకోవడం తప్పుకాదు కదా !  అలా.. నడుచుకోమని సాక్షాత్ మాజీ ప్రధాని  గారే సలహా.. ఇచ్చారు కూడా. 

 మన దేశంలో.. సాధించిన  అభివృద్ధి కన్నా.. విదేశాలలో..  మన నైపుణ్యాన్ని.. అమ్మి.. వారికి మంచి.. అభివృద్ధిని సాధించిపెట్టి.. మాతృదేశ విజయకేతనంని  ఎగురవేస్తుంటే.. మనం గొప్పగా.. చప్పట్లు కొట్టుకోవడంలేదూ ! ఈ.. దేశంలో.. అబివృద్ధి.. కుంటు పడుతూ  ఉందంటే  కారణం.  కుల మత బేధాలు..ఓటు  బ్యాంకు రాజకీయాలు, వేళ్ళూనుకున్న  అవినీతి అని తెలియడం లేదు?  అవినీతిని నిర్మూలించడం ఎవరివల్ల సాద్యం..!?

  వేలంవెర్రి చదువులు వల్ల తగ్గిన  ఉపాధి అవకాశాలు. నిరుద్యోగం తో  నిరాశ నిసృహలతో.. యువత  కొట్టు మిట్టాడుతూ.. విదేశాలకు  పయనమవుతున్నారు. పట్టభద్రులైన.. కొంత మంది యువకులు వారి వారి నైపుణ్యం తో.. పరిశ్రమలని.. స్థాపించి.. మరికొంతమందికి.. ఉపాధి అవకాశాలు.. కల్పించాలనే ఉత్సాహం    ఉన్నా  కూడా ..  వారికి.. తగిన  రీతిలో.. ప్రోత్సాహం లబించడం లేదు.. అడుగడుగునా.. నిరాశ.  పరిశ్రమల స్థాపనకి  లభించే  అనుమతి నుండి  కేటాయించే..  భూమి దగ్గరనుండి..  కరంటు,నీరు.. యంత్రసామాగ్రి.  వరకు.. అడుగడుగునా ఆంక్షలు.  అధికారుల లంచగొండితనం తో  విసిగి వేసారిన యువత ఇక్కడ ఏం చేయాలో తోచక  విదేశాలకి పయనం అవుతున్నారు.   విదేశాలలో.. చదువుకోవడానికి  మాత్రం  అడగగానే లక్షలకి లక్షలు లోనులు ఇచ్చే.. బ్యాంక్లు.. పరిశ్రమల స్థాపనికి.. ఎన్నో రూల్స్.. పెట్టడం గమనించవచ్చు.

ప్రభుత్వాలు.. విదేశి సంస్థలకి.. ఆహ్వానం  పలకడం,. కార్పోరేటులకి .. కొంగు  బంగారంగా.. మారడం..  వీటన్నిటి మద్య యువత  ఏమి   చేయాలి?    పరాయిచోట ..  అదిక చాకిరి  చేస్తూ.. విదేశీ ద్రవ్యంతో.. స్వదేశంలో.. అభివృద్ధి.. చెందామను కుంటున్నారు.  పిల్లలని.. అక్కడికి పంపిన తల్లిదండ్రులు.. కంటి మీద కునుకు లేకుండ.. వారి క్షేమం కోసం  నిత్యం  ఆరాటపడుతున్నారు..

 ఈ.. దేశంలో.. బ్రతకడం ఎంత కష్టతరం  అయిందో.. మండే.. నిత్యావసర ధరలు.. చూస్తే.. అర్ధమవడంలేదూ ..!  విద్యావిధానాలు  మారాలి, ఉపాధి  అవకాశాలు  పెరగాలి.  చిత్త  శుద్ధి  లేని  ప్రభుత్వాలని.. ఎన్నుకుని.. ప్రజలు.. పాట్లు పడుతూ..  దేశ మాత ని.. కీర్తించుకుంటూ.. గుడ్డెద్దు చేలోపడి మేస్తూ.. వెళ్ళినట్లు..  పిల్లల..  అభివృద్ధి కాంచుతూ.. త్రుప్తిపడటం మినహా..  ఈ.. వ్యవస్థని ప్రక్షాళన చేయడం  ఎవరి తరం.. చెప్పండి!   ప్రపంచమే.. ఓ.. కుటీరం.. విశ్వజనీయ భావన పెంపొందించు కున్నామని  తృప్తి పడుతూ..  సంతోషంగా ఉందామని..  చాలా అసహ్యంగా  మొన్ననే.. జోక్.. చేసుకున్నాం  కూడా ! క్షమించాలి..  ఫ్రెండ్స్..  అంత కన్నా ఏం చేయాలో తెలియక .  మాత్రమే !

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని..తరిమేవాళ్ళని హితులగా తలచి ముందు కెల్లాలని


Posted by Picasa ఐ యామ్ అల్ల్వేస్ విత్ యు..
ఇలా.. మీతో.. అనేవారు ఉంటారు కదా!
ఇప్పుడు..ఈ పాట ఏమంటుందో చూడండీ !

చీకటితో వెలుగే చెప్పెను .. నేనున్నానని.. ఎంతో.. స్పూర్తికరమైన పాట.

నా.. లైఫ్ టైం.. ఫేవరేట్ సాంగ్..
చంద్రబోస్.. సాహిత్యం..
చాలా.. లైట్ లైట్.. వర్డ్స్ తో.. అనంత మైన అర్ధాన్ని.. చెప్పిన పాట.

నాకు.. చాలా.. నచ్చిన పాట.

ఎమ్. ఎమ్. కీరవాణి.. స్వీయ సంగీతంలో సునీత తో.. కలసి పాడిన పాట.

కథా.. పరంగా.. మొదటి చరణం .. ఎవరైనా ఎదురు దెబ్బలు.. తింటూ.. ఎదగాలని.. స్ఫూర్తి కల్గిస్తూ.. సాగితే.. ఆ.. వ్యక్తే.. రెండో చరణంలో.. ఇంకొకరికి.. వోధార్పునిస్తూ .. నేనున్నానని .. అండగా.. నిలబడటం.. వ్యక్తి పరిణితికి.. చిహ్నంగా.. నిలుస్తూ.. మనిషికి.. ఇంతకన్నా.. ఇంకా.. ఏమి కావాలి అనిపిస్తుంది..

ఎవరు వింటున్నా.. వారి మనసుకి.. అలాటి అండ -దండ ఉంటే బాగుండును అనిపించే..పాట.

చీకటితో.. వెలుగే చెప్పెను.. నేనున్నానని..
ఓటమితో.. గెలుపే.. చెప్పెను నేనున్నానని..
నేనున్నానని .. నీకేంకాదని.. నిన్నటిరాతని మార్చేస్తానని.. (చీ)

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని..
తరిమేవాళ్ళని హితులగా తలచి ముందు కెల్లాలని..

కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని..
కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి... కాంతిని పంచాలని..

గుండెతో.. ధైర్యం చెప్పెను..
చూపుతో మార్గం చెప్పెను..
అడుగుతో గమ్యం చెప్పెను..
నేనున్నాని . నేనున్నాని . నీకేంకాదని ..
నిన్నటి రాతని మార్చేస్తావని..

ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని..
అందరు ఉన్నా ఆప్తుడు నీవై.. చేరువయ్యావని..
జన్మలకేరుగని అనురాగాన్ని పంచుతున్నావని..
జన్మలుచాలని.. అనుబంధాన్ని.. పెంచుతున్నావని.. ..

శ్వాసతో.. శ్వాసే చెప్పెను..
మనసుతో.. మనసే.. చెప్పెను..
ప్రశ్నతో.. బదులే చెప్పెను..
నేనున్నానని.. నేనున్నానని.. నీకేంకాదని..
నిన్నటి రాతని మార్చేస్తానని.. (చీ)..

వండర్ ఫుల్ .. సాంగ్ కదా.. ప్లూట్ & కీరవాణి.. వయోలిన్.. వాయిద్యం.. మనసుని దోచేస్తుంది..
ఎంతయినా.. మరకతమణి.. స్పెషల్ కదా.. ! ఎన్ని సార్లు విన్నా.. వినాలనిపించదు..

కానీ.. విన్నప్పుడల్లా.. అబ్బ.. ఎంత మంచి పాట అన్పించక మానదు.. మీరూ.. వినండీ..

ఇంతకు.. ముందు.. ఎందరో...... ఈ పాట గురించి.. వాళ్ళ ఫీలింగ్ పంచుకుని ఉండొచ్చు..

నేను.. ఏమైనా.. కొత్తగా.. చెప్పానా! మీరే చెప్పండి...ప్లీజ్!