30, డిసెంబర్ 2010, గురువారం

చాలా..పాటలు మనలోని కాల్పనిక భావనలకి..రూపాలేమో!



కొన్ని పాటలు వినడానికి బాగుంటాయి.. కొన్ని పాటలు.. చూడటానికి.. బాగుంటాయి..వినడానికి,చూడటానికి    సాహిత్యపరంగా  కూడా మేలేన్నికగల పాట.. నువ్వు వస్తావని.. చిత్రంలో..  కొమ్మ కొమ్మ.. విన్నారమ్మా  ..కోయిల వస్తుంది.. అనే..పాట.

 ఆపాట.. నాకు ఇష్టమైన పాటలలో.. టాప్ ౩ గా.. చెప్పుకుంటాను..
ఈ..పాట.. సాహిత్యం.  ఈ.ఎస్.  మూర్తి.
సంగీతం.. ఎస్.ఎ .రాజ్ కుమార్.
ఎందుకో.. చెప్పలేను.. ఈ..పాటంటే.. చాలా చాలా చాలా ఇష్టం.
నేను తెలిసిన వారందరికీ ఈ పాట వినగానే నేనే గుర్తుకు వస్తానని చెపుతారు..
ఈ..పాట వస్తున్నా ఏదైనా.. ఛానల్ లో మూవీ.. వస్తున్నా నాకు  కాల్ చేసి మరీ.. చెపుతారు.
ఈ..పాట సాహిత్యం.. కారణం కావచ్చు..

నా.. అంతరాలలో దాగి ఉన్న భావాన్ని..బలంగా  సూచిస్తుంది.. బహుశా .. అది తీరని కోరిక
కావచ్చు
చాలా పాటలు మనలోని  కాల్పనిక  భావనలకి..రూపాలేమో.!
అందుకే.. పాటలు మనలని.. ఆకర్షిస్తాయి. కాసేపైనా మనని  కలల్లో.. విహరింపజేస్తాయి అనుకుంటాను నేను..

ఇక పాట విషయానికి వస్తే..  ప్రకృతిలోని.. వస్తువులతోనే.. పాట సాహిత్యం ఆసాంతం.. సాగుతుంది.. బహుశా.. రచయిత.. భావకవిత్వ ప్రేమికుడేమో.!.

ఇక ఎస్. ఏ రాజ్ కుమార్  సంగీతం.. బాగా అలరిస్తుంది.. ఇళయరాజా.- కీరవాణి ల తర్వాత  మణిశర్మతో..  దీటుగా.. స్వరాలు.. అందించిన..ఘనత. కానీ.. అన్ని పాటలకి. ఎక్కడో   ట్యూన్స్ కలుస్తుంటాయి..
అది అప్రస్తుతమనుకోండి. పాట  సాహిత్యం..ఇదిగోండి...

కొమ్మ.. కొమ్మా.. విన్నారమ్మ.. కోయిల వస్తుంది..
వస్తూ.. వస్తూ.. తనతో.. వెన్నెల వెలుగులు తెస్తుంది..
ఏమమ్మా.. మరుమల్లి.. తోరణాలు కడతావా..
చిలకమ్మా.. యిదురేగి.. స్వాగతాలు చెబుతావా..
పూల పొదరిల్లె .. రా..రమ్మంది..
విన్నానమ్మా ! తీయని వేణువు రమ్మని పిలుపులని..
చూసానమ్మా.. స్వాగతమంటూ.. తెరచిన తలుపుల్ని.. (కొ)
పగలు రాత్రి అంటూ.. తేడా లేనేలేని..
పసిపాప నవ్వులని చూడని..
తోడు..నీడ నువ్వై.. నాతో.. నడిచే.. నీతో..
ఏనాటి రుణముందో..అడగనీ..
చేదు చేదు కలలన్నీ..కరిగి తేనె వరదవని..
కానుకైన  స్నేహాన్ని గుండెలోన దాచుకుని.
ప్రతి జన్మకి.. ఈ..నేస్తమే.. కావాలని..
కోరుకుంటానమ్మ దేవుళ్ళని   (కొ)

ఇదిగో.. నిన్నే..అంటూ.. ప్రేమే.. ఎదురై వస్తే..
ఏ ..పూలు.. తేవాలి పూజకి..
నీతో..జతగా.. ఉండే వరమే..నువ్వే ఇస్తే..
ఇంకేమి కావాలి జన్మకి..
మచ్చ లేని చంద్రుడిని మాటరాక చూస్తున్నా..
వరుసకాని బంధువుని  చొరవచేసి.. అంటున్నా..
ఇంకెప్పుడు ఒంటరినని.. అనరాదని..
నీకు సొంతం అంటే.. నేనేనని.. (కొ)

ఇదండీ.. సాహిత్యం..

నాగార్జున సిమ్రాన్ జంట.. కళ్ళల్లో.. కాపురం పెట్టేస్తుంది.. చూసినంత సేపు.. కూడా.. ఈ..పాటలో.. హంపీ.. మండపాన్ని.. చూడవచ్చు..ఇంకొక మాట చెప్పడం మరచాను. జెమిని మ్యూజిక్  చానల్ కి.. నేను.. ఎప్పుడు కాల్ చేసినా.. ఆ రోజు ఆ పాట ప్లే.. అవ్వకుండా..ఉంటె కనుక  రెడీగా  ఉంటారు..ప్లే చేసేందుకు కి. నాకు ఈ పాట  అంటే ..అంత ఇష్టమని  పేరు పడిపోయిన్దండీ.. అందుకే.. నా టేస్ట్  పై నమ్మకం కల్గితే.. మీరు వినండి.. లేక పోతే.. వదిలేయండి.. ప్లీజ్!  అలాటి స్నేహం తోడు ఉండాలని కోరుకొండీ.! వోదార్పుగా ,నిబ్బరంగా.. ఉంటారు.. ఇది నిజం.. సుమండీ..!


29, డిసెంబర్ 2010, బుధవారం

మువ్వన్నెల మీద ఆన మన బంధం మీద ఆన



పైనున్న  ఈ పిక్. చూస్తుంటే మీ మనసుకి ఏమనిపిస్తుందీ!? 

 అరె  మీరు చెప్పినా  నాకు తెలియదు కదా ! ఫ్రెండ్స్  నేనే.. చెప్పేస్తానులే..ఎంత బాగుంది. ప్రేమ స్నేహం కలయికల్.. తో ఈ..పిక్ అనుకుంటారు కదా!  

 నేను చెప్పబోయే పాట వింటే  మీకు అలానే అనిపిస్తుంది.
 అనిపించకపోతే అది  మీ ఇష్టం అనుకోండి.  ఒక సినిమాలో ఒక పాట హిట్ అయితే అందరు అదే పాట వింటుంటారు. కానీ.. నా చూపు వేరే అని  తర్వాత నేను వినే పాటలని బట్టి అందరూ తీర్మానించుకుని నన్నుపొగిడేసి నాకు కొమ్ములు తగిలిస్తూ ఉంటారు . పెడుతుంటారు నా.. మిత్రబృందం రేడియో వ్యాఖ్యాతలు కూడా !

నాకు బాగా నచ్చిన పాట "సుబాష్ చంద్రబోస్"  చిత్రంలో పాట ను నేను కోరుకుని వింటున్నప్పుడు ఇలాంటి ప్రక్రుతి దృశ్యాలను చూసిన ఆనందమే కల్గుతుంది . 

ఈ పాట సాహిత్యం విన్నాక సాహితీ  ప్రియులకు చంద్రబోస్  కలం వారే..వ్వా  అనిపించక మానదు.

2 వ చరణం ఆఖరిలో "బ్రహ్మ రాత మీద ఆన భరతమాత మీద ఆన మువ్వన్నెల మీద ఆన మన బంధం మీద ఆన నలుపున మనమే గెలుపున మనమే" ఎంత ఉత్కృష్టమైన భావం. 

"పచ్చబొట్టు  మీద ఆన పసుపు కొమ్ము మీద ఆన పరమాత్ముని మీద ఆన పరువాల పైన ఆన"
 ఇలాటి ఉన్నత వాగ్దానాలు వున్నాయి. ఆస్వాదిస్తే మీరు ఆ  భావంలో నుండి బయటపడటం అంత తేలిక కాదు.
ఎన్ని జనమలకైనా ఎంకి నాయుడు బావలు మీరే అవుతారు.. 

"నువ్వు లేక ఉండలేని ప్రాణాల మీద ఆన 
నేను నువ్వే నువ్వు.. నేనే."
 
అంటూ ఎంత గాఢ౦గా   చెప్పడం చాలా బావుంది.  ఇంతలా ఆకట్టుకునేలా  వ్రాయడం అంటే మాటలు కాదు.  హృదయ స్పందనకి అక్షర రూపం కల్పించే కవి కలానికే ఇది  సాద్యం కదా!. పాటల రచయిత చంద్రబోస్ గారికి చాలా చాలా అభినందనలు చెప్పాలి.  ఈ పాటకి స్వర కల్పన 'మణి శర్మ"

వింటూ అలా ప్రపంచాన్ని మర్చి పోవచ్చు. అణువు అణువు రస స్పందనతో ఊగిసలాడక మానదు..

 సాంగ్ రేటింగ్ 5 స్టార్ కి  లిమిట్ పెట్టకుండా ఉంటే నేను 10  స్టార్ రేటింగ్ ఇచ్చేదాన్ని. అంత బాగుంటుంది.

పధం కదిపి నర్తించకుండా ఉండలేరు.

పాట ప్రారంభం  ఒక అందమైన ఎత్తుగడ.

ఇన్ని మంచి గుణాలున్న ఈ పాటని మనం రోజూ వినే పాటల పొదికలో   పెట్టుకోక పోతే అస్సలు  బాగోదు అనిపించింది . రాగా లో లభ్యం . మీరు వినండీ. నేను వింటూనే ఉన్నాననుకోండి.  పాట ఏమిటో.. చెప్పా లేదు కదూ! 

జాజిరి.. జాజిరి.. మావా! ఎన్ని జనమలకైన నువ్వే నాజత మావా.

ఈ పాట విన్నాక "నలుపున మనమే " అనే శీర్షికతో ఒక కథ రాసాను. ప్రచురితం కాలేదు కానీ ..ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. 

పాట సాహిత్యం:

 ఓ మావా ఆ ఓ మావా ఆ
ఓ మై లవు ఓ మై లవు
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి

జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా

పచ్చనాకు మీద ఆన పసుపు కొమ్ము మీద ఆన
పరమాత్ముని మీద ఆన పరువాల మీద ఆన
ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా

జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా
ఓ మై లవు ఓ మై లవు

సుక్కా పొద్దు ఆరతిలో సిరుముద్దు పూజలలో నా సామివి నువ్వే వడి గుడిలో
సల్లాగాలి మేళం లో సరసాల తాళం లో నాదానివి నువ్వే గుండెలలో
హా ఉన్న సొగసు మీద ఆన లేని నడుము మీద ఆన
నువు లేక ఉండలేని ప్రాణాల మీద ఆన నేను నువ్వే నావీ నీవే మావా
ఓ భామా ఆ ఓ భామా ఆ

జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా

కుంకుమబొట్టే నలుపాయే నా కాటుక ఎరుపాయే కరగాలని నీ బిగి కౌగిలిలో
సీకటి సెట్టే సిగురైతే సిగురంతా ఎలుగైతే నిలవాలిక ఎలుగుల సీమలలో
హా బ్రహ్మరాత మీద ఆన భరతమాత మీద ఆన మువ్వన్నెల మీద ఆన
మన బంధం మీద ఆన నలుపులు మనవే గెలుపులు మనవే మావా
ఓ భామా ఆ ఓ భామా ఆ

జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా


అక్షరశిఖరం

Posted by Picasa నిన్న  ఒక  గుర్తు.. నేడు  ఒక కల.. రేపు.. ఒక ఆశ  . యుగ యుగాలే కాలగర్భంలో.. కలిసిపోతుంటే..  మనిషి ఎంత..  మనిషి తన తరతరాల జ్ఞానాన్ని.. విజ్ఞానాన్ని.. అక్షర రూపంలో.. నిక్షిప్తం చేసుకుని.. కాలం సాగిపోతూనే ఉంది.. కాలంతో .. కవిత్వం పరుగు తీస్తుంది..  కవిత్వంతో.. తరతరాలు.. పరుగులు తీయాలి.. ఈ..నవ కవితా పథంలో. . నేను..  వాస్తవికతకి.. దర్పణం ఈ.. కవిత.


     అక్షరశిఖరం 

అతనొక అక్షర శిఖరం  ..
సదృశ్యమైన రూపంతో..
మనల్ని.. ఊరిస్తూ..ఉంటాడు..
అతనొక అక్షర తరంగం..
 భావ కెరటాలతో.. మనల్నిముంచెత్తి  ..
 తనలో మమేకం చేసుకుంటాడు..
 అతనొక.. అక్షర సవ్యసాచి.
లోపాలని. వాస్తవాలని  పాఠకులపై..
అస్త్రాలుగా .. సంధిస్తాడు
అతనొక  అక్షర పిపాసి
తను వ్రాయకుండా..
మనలని చదవనీయకుండా
ఉండనీయ లేడు..
సామాజిక రుగ్మతలని
ఔపాసన పట్టిన అతని కలం
అప్రతిహతంగా. నడక సాగిస్తూనే ఉంటుంది..
అతని అక్షరం ప్రవర్ధమానంగా..
బహుమతుల పల్లకి పై..
ఊరేగుతూనే ఉంటుంది..
అతను మాత్రం ఎన్నటికి వర్ధమాన రచయితగా..
మిగిలిపోతూనే ఉంటాడు...
రోజు కోక ఉత్తమ కథ,
కవిత  మద్యం సీసాకి అమ్ముడై..
ఆర్తిగా.. అతనిని హత్తుకుని
 సేద తీరుస్తూనే ఉంటుంది..